బ్లాగ్ పోస్ట్‌లను ఆటోమేటిక్‌గా జెనరేట్ చేయడం
మీరు బ్లాగ్ పోస్ట్‌లను రాయడానికి Sidekickను ఉపయోగించవచ్చు. మీరు ప్రాంప్ట్‌లో అందించే వివరాలను Sidekick తీసుకుంటుంది, అలాగే బ్లాగ్ పోస్ట్‌ను జెనరేట్ చేస్తుంది. బ్లాగ్ పోస్ట్ జెనరేషన్ అనేది Shopify సపోర్ట్ చేసే అన్ని భాషల్లో అందుబాటులో ఉంది. మెరుగైన ఫలితాల కోసం, మీరు ఏ భాషలో అయితే అవుట్‌పుట్ ఉండాలని కోరుకుంటున్నారో అదే భాషలో మీ ప్రాంప్ట్ రాయండి.
మీరు మీ బ్లాగ్ పోస్ట్‌ల కోసం ఆటోమేటిక్ టెక్స్ట్‌ను జెనరేట్ చేయడానికి ముందు, AI-ఆధారిత టూల్స్ ఉపయోగించడానికి సంబంధించిన ఉత్తమ పద్ధతుల గురించి తెలుసుకోండి.
ఒక బ్లాగ్ పోస్ట్‌ను డ్రాఫ్ట్ చేయండి
మీరు ఒక బ్లాగ్ పోస్ట్‌ను సృష్టించినప్పుడు, టైటిల్ అలాగే కంటెంట్‌ను జనరేట్ చేయడానికి మీరు Sidekickను ఉపయోగించవచ్చు.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, కంటెంట్ > బ్లాగ్ పోస్ట్‌లుకు వెళ్లండి.
బ్లాగ్ పోస్ట్‌ను జోడించండి మీద క్లిక్ చేయండి.
వీటిలో ఏదైనా చేయండి:
- బ్లాగ్ టైటిల్‌ను జనరేట్ చేయడానికి, టైటిల్ ఫీల్డ్‌లో,
ఐకాన్ మీద క్లిక్ చేసి, పోస్ట్ దేని గురించి అన్న దాని వివరణను ఎంటర్ చేసి, దాన్ని సమర్పించండి.
- బ్లాగ్ కంటెంట్‌ను జనరేట్ చేయడానికి, కంటెంట్ విభాగంలోని రిచ్ టెక్స్ట్ ఎడిటర్‌లో,
ఐకాన్ మీద క్లిక్ చేసి, మీకు కావాల్సిన కంటెంట్‌ను వివరించే ఒక ప్రాంప్ట్‌ను ఎంటర్ చేసి, ఆపై దాన్ని సమర్పించండి. మీరు ఎంత ఎక్కువ వివరాలను చేరిస్తే, సూచనలు అంత సందర్భోచితంగా ఉంటాయి. మీరు నేరుగా మీ ప్రాంప్ట్‌లో మీకు కావాల్సిన టోన్, స్టైల్ లేదా మరేదైనా సూచనలను చేర్చవచ్చు.
- బ్లాగ్ టైటిల్‌ను జనరేట్ చేయడానికి, టైటిల్ ఫీల్డ్‌లో,
ఐచ్ఛికం: మీ బ్రాండ్‌కు సరిపోయేలా, జనరేట్ అయిన కంటెంట్‌ను ఎడిట్ చేసి, ఫార్మాట్ చేయండి.
సేవ్ చేయండి మీద క్లిక్ చేయండి.
మీరు మీ బ్లాగ్ కంటెంట్‌ను జనరేట్ చేసిన తర్వాత, మీ బ్లాగ్ పోస్ట్ సృష్టింపును పూర్తి చేయడానికి మీ బ్లాగ్‌కు ఒక పోస్ట్‌ను జోడించండిని చూడండి, ఆపై దాన్ని మీ బ్లాగ్‌లో ప్రచురించండి.
మీరు పొందే కంటెంట్ సూచనలను మెరుగుపరచడం
మీ బ్లాగ్ పోస్ట్‌ల కోసం మీరు కంటెంట్ సూచనలను జనరేట్ చేస్తున్నప్పుడు, మీరు సృష్టించాలనుకుంటున్న బ్లాగ్ పోస్ట్ రకాన్ని పరిగణించండి. మీ బ్లాగ్ పోస్ట్ లక్ష్యాలు, మీరు షేర్ చేయాలనుకుంటున్న సమాచార రకం మరియు నిర్దిష్ట కీవర్డ్‌లు వంటి మరిన్ని వివరాలను మీ ప్రాంప్ట్‌లో అందించడం అనేది, జనరేట్ అయ్యే సూచనలను మెరుగుపరచడానికి ఉత్తమ మార్గం.
టెక్స్ట్ జనరేషన్ ఫలితాలను మెరుగుపరచడానికి, మీ బ్లాగ్ పోస్ట్‌లకు కింది రకాల సమాచారాన్ని జోడించడాన్ని పరిగణించండి:
- ఉత్పత్తి కీవర్డ్‌లు: ఒకవేళ మీరు ఒక నిర్దిష్ట ఉత్పత్తి గురించి రాస్తుంటే, ఉత్పత్తి పేరు అలాగే రకాన్ని జోడించడానికి ప్రయత్నించండి. ఉత్పత్తి పేరు అస్పష్టంగా ఉంటే, అప్పుడు
teacupsలేదాcandlesలాంటి ఉత్పత్తి లేదా కేటగిరీని వివరించే కీవర్డ్‌లను అందించండి. ఉత్పత్తి ప్రత్యేకతను లేదా దాన్ని ఎవరైనా ఎందుకు కొనుగోలు చేయాలనుకుంటారు అనేదాన్ని హైలైట్ చేసే డిస్క్రిప్టర్‌లను జోడించండి. కీవర్డ్ ప్రాంప్ట్‌లు సరళంగా లేదా సంక్లిష్టంగా ఉండొచ్చు, ఇంకా మీ ప్రాంప్ట్‌ను ఒక వాక్యంగా కూడా మీరు మార్చవచ్చు లేదా కేవలం కీవర్డ్‌లను ఉపయోగించవచ్చు. మీరు ఎమోజీలను కూడా చేర్చవచ్చు. - ముఖ్యమైన బ్రాండ్ కీవర్డ్‌లు లేదా పదజాలం: మీరు అందించే సమాచారం కోసం కంటెంట్ ఫలితాలలో విభిన్న పదబంధాలు చేర్చినప్పటికీ, బ్రాండ్ పేర్లు లేదా ప్రత్యేకమైన వివరణాత్మక పదాల వంటి ప్రత్యేక పదాలు లేదా పదబంధాలు తరచుగా ఉంచబడతాయి. ఒకవేళ మీరు మీ బ్రాండ్ ట్యాగ్‌లైన్ ప్రాంప్ట్‌లో మీ బ్రాండ్ పేరును చేర్చితే, అప్పుడు అది సాధారణంగా ఫలితాలలో కూడా చేర్చబడుతుంది. ఉదాహరణకు, కీవర్డ్‌లలో మీరు మీ మింట్ లిప్ బామ్‌ను
mint-asticగా వివరిస్తే, అప్పుడు జనరేట్ అయ్యే సూచనలలో ఆ పదం తరచుగా చేర్చబడుతుంది. - ఇతర బ్లాగ్ వివరాలు: మీరు జనరేట్ చేస్తున్న కంటెంట్ రకానికి సంబంధించిన ఏవైనా అదనపు వివరాలు తప్పనిసరిగా అందించాలి.