మీ ఆన్‌లైన్ స్టోర్‌లో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను చూపడం
ఒకే ఉత్పత్తుల కోసం కార్ట్‌కి జోడించండి (Add to cart) బటన్‌కు ప్రత్యామ్నాయంగా యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లు పని చేస్తాయి. యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ల ద్వారా, కస్టమర్‌లు కార్ట్‌ను దాటవేసి నేరుగా చెక్‌అవుట్‌కి వెళ్లవచ్చు. కస్టమర్‌లు Shopify ద్వారా లేదా వారికి సుపరిచితమైన మరొక యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ పద్ధతి ద్వారా చెక్‌అవుట్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. దీని ద్వారా చెల్లింపు ప్రక్రియ వేగవంతం అవుతుంది, అలాగే కస్టమర్‌లు తమకు అనుకూలమైన పద్ధతిని ఉపయోగించి చెక్‌అవుట్ చేయడానికి వీలవుతుంది.

ఈ పేజీలో
- అవలోకనం
- అనుకూలత
- యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ఉపయోగించడానికి మీ థీమ్‌ను అప్‌డేట్ చేయండి
- ఉత్పత్తి పేజీలలో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ప్రదర్శించండి
- ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగంలో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ప్రదర్శించండి
- ఉత్పత్తి పేజీలలో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను దాచండి
- ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగంలో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను దాచండి
- యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను కొన్ని ఉత్పత్తులకే ప్రదర్శించి, మిగతా వాటికి ప్రదర్శించవద్దు
అవలోకనం
మీ థీమ్ మరియు కస్టమర్ పరికరాన్ని బట్టి యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్ అనేది కార్ట్‌కి జోడించండి (Add to cart) బటన్‌కు పక్కన లేదా కింద ప్రదర్శించబడుతుంది. రెండు రకాల యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లు ఉన్నాయి:
- బ్రాండ్ చేయని బటన్‌లు దీన్ని ఇప్పుడే కొనండి (Buy it now) వచనాన్ని ప్రదర్శిస్తాయి. కస్టమర్ బ్రాండ్ చేయని దీన్ని ఇప్పుడే కొనండి (Buy it now) బటన్‌ను క్లిక్ చేస్తే, అప్పుడు వారు కార్ట్‌ను దాటవేసి, చెక్‌అవుట్‌కి వెళ్తారు.

- బ్రాండెడ్ బటన్‌లు థర్డ్-పార్టీ యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ పద్ధతుల లోగోలను కలిగి ఉంటాయి. కస్టమర్ Apple Pay వంటి థర్డ్-పార్టీ యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ పద్ధతికి చెందిన బ్రాండెడ్ బటన్‌ను క్లిక్ చేస్తే, అప్పుడు వారు ముందుగానే నింపబడిన తమ సమాచారంతో ఆ పద్ధతి కోసం చెక్‌అవుట్‌కి వెళ్తారు. వీటి గురించి మరింత తెలుసుకోండి: యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్‌లు. కింది థర్డ్-పార్టీ యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి:
ప్రతి చెల్లింపు పద్ధతి బ్రాండెడ్ బటన్‌గా ప్రదర్శించబడటానికి ముందు దానికి నిర్దిష్ట అవసరాలు ఉంటాయి.
మీ కస్టమర్‌లకు ప్రదర్శించబడే యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్ రకం కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:
- మీ చెల్లింపు సెట్టింగ్‌లు
- Shop Promise యాక్టివ్‌గా ఉందా లేదా అనేది, ఇది ఇతర చెక్‌అవుట్‌ల కంటే Shop Payకి ప్రాధాన్యత ఇస్తుంది
- కస్టమర్ బ్రౌజర్
- కస్టమర్ పరికరం
- కస్టమర్ వ్యక్తిగత చెల్లింపు చరిత్ర
మీరు మీ ఆన్‌లైన్ స్టోర్‌కి యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను జోడించినప్పుడు, మీ ఆప్షన్‌లలో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ప్రదర్శించడం లేదా దాచడం ఉంటుంది, కానీ బ్రాండెడ్ లేదా బ్రాండ్ చేయని యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ప్రదర్శించాలో లేదో మీరు అనుకూలీకరించలేరు. మీ చెల్లింపు సెట్టింగ్‌లలో మీరు యాక్టివేట్ చేసిన చెల్లింపు పద్ధతులను బట్టి బ్రాండెడ్ బటన్‌లు ప్రదర్శించబడతాయి. మీకు యాక్టివేట్ చేయబడిన థర్డ్-పార్టీ యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ పద్ధతి లేకపోతే, అప్పుడు బ్రాండ్ చేయని బటన్ మాత్రమే ప్రదర్శించబడుతుంది. మీరు మీ బ్రాండ్ చేయని యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ల రంగు మరియు ఫాంట్‌లను అనుకూలీకరించవచ్చు, కానీ మీరు బటన్‌ల బ్రాండెడ్ వెర్షన్‌లను అనుకూలీకరించలేరు.
ఒకవేళ మీరు మీ స్టోర్‌లో గిఫ్ట్ కార్డ్‌లు లేదా డిస్కౌంట్ కోడ్‌లను ఉపయోగిస్తుంటే, కస్టమర్‌లు ఇప్పటికీ చెక్‌అవుట్ వద్ద ఆ కోడ్‌లను ఎంటర్ చేయవచ్చు.
మీరు మీ ఆన్‌లైన్ స్టోర్‌కి యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను జోడించిన తర్వాత, మీరు యాక్టివేట్ చేసిన చెల్లింపు పద్ధతుల కోసం యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను పరీక్షించవచ్చు.
అనుకూలత
మీ ఆన్‌లైన్ స్టోర్‌కి యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లు సరిపోని సందర్భాలు కొన్ని ఉన్నాయి. మీ ఆన్‌లైన్ స్టోర్‌లో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను చేర్చే ముందు, కింది ఫీచర్‌లతో వాటి అనుకూలతను పరిగణనలోకి తీసుకోండి:
యాప్‌లు
యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లు కొన్ని యాప్‌లకు విరుద్ధంగా ఉండవచ్చు.
మీరు కింది రకాల యాప్‌లలో దేనినైనా ఉపయోగిస్తే, అప్పుడు యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లు మీ ఆన్‌లైన్ స్టోర్‌కి అనుకూలంగా ఉండకపోవచ్చు:
- కరెన్సీ కన్వర్టర్‌లు
- కార్ట్‌తో ఇంటరాక్ట్ అయ్యే యాప్‌లు
- కస్టమర్‌లను బాహ్య చెక్‌అవుట్‌కి తీసుకువెళ్లే యాప్‌లు
కార్ట్ అట్రిబ్యూట్‌లు
యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లు కార్ట్ అట్రిబ్యూట్‌లకు మద్దతు ఇవ్వవు. కార్ట్ అట్రిబ్యూట్‌లు అనేవి అనుకూల ఫారమ్ ఫీల్డ్‌లు, కార్ట్ పేజీలో మీ కస్టమర్‌ల నుండి అదనపు సమాచారాన్ని సేకరించడానికి మీరు వీటిని ఉపయోగించవచ్చు.
కార్ట్ అట్రిబ్యూట్‌ల ఉదాహరణలలో కార్ట్ పేజీకి చేయబడే కింది జోడింపులు ఉంటాయి:
- నిబంధనలు మరియు షరతుల చెక్‌బాక్స్‌లు
- గిఫ్ట్-ర్యాపింగ్ ఆప్షన్‌లు
- డెలివరీ తేదీ పిక్కర్‌లు
మీరు కార్ట్ అట్రిబ్యూట్‌ల పైన ఆధారపడితే, అప్పుడు యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లు మీ ఆన్‌లైన్ స్టోర్‌కి తగినవి కావు.
ఉత్పత్తులు, చెల్లింపు సెట్టింగ్‌లు మరియు బటన్ వచనం
మీ ఆన్‌లైన్ స్టోర్‌లో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను చేర్చే ముందు, కింది వివరాలను పరిగణనలోకి తీసుకోండి:
- ఉత్పత్తికి సంబంధించిన ఒక వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి మాత్రమే యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లు ఉపయోగించబడతాయి. అయితే, మీరు ఉత్పత్తి పేజీలో పరిమాణ సెలెక్టర్‌ను ప్రదర్శిస్తే, కస్టమర్‌లు ఆ ఉత్పత్తిని ఒకటి కంటే ఎక్కువ కొనుగోలు చేయగలరు. ఉదాహరణకు, కస్టమర్ యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ని ఉపయోగించి ఆక్వా రంగులో ఉన్న మూడు బేకింగ్ కప్‌లను కొనుగోలు చేయవచ్చు, కానీ ఆక్వా రంగులో ఒకటి మరియు పర్పుల్ రంగులో మరొకటి కొనుగోలు చేయలేరు. మీ ఆన్‌లైన్ స్టోర్ ఒకే రకమైన ఉత్పత్తికి ఎక్కువ ఆర్డర్‌లను స్వీకరిస్తే తప్ప, యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లు మీ విక్రయాలకు అంతగా ఉపయోగపడకపోవచ్చు.
- ఒకవేళ మీ చెల్లింపు సెట్టింగ్‌లలో మీకు థర్డ్-పార్టీ యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ పద్ధతి యాక్టివ్‌గా లేకుంటే, యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌కు సంబంధించిన అన్‌బ్రాండెడ్ వెర్షన్ మాత్రమే ప్రదర్శించబడుతుంది.
- యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌కు సంబంధించిన అన్‌బ్రాండెడ్ వెర్షన్‌లో దీన్ని ఇప్పుడే కొనండి టెక్స్ట్ ఉంటుంది. మీ కార్ట్‌కు జోడించండి బటన్ దీన్ని ఇప్పుడే కొనండి లేదా ఇతర అనుకూల టెక్స్ట్‌ను ప్రదర్శిస్తే, కస్టమర్‌లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది.
యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ఉపయోగించడానికి మీ థీమ్‌ను అప్‌డేట్ చేయండి
Shopify Theme Storeలోని అన్ని ప్రస్తుత థీమ్‌ల వెర్షన్‌లలో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు పాత థీమ్ వెర్షన్‌ను ఉపయోగిస్తుంటే, అప్పుడు మీరు యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ఉపయోగించడానికి మీ థీమ్‌ను అప్‌డేట్ చేయవచ్చు. ఒకవేళ మీరు మీ థీమ్‌ను అప్‌డేట్ చేయకూడదనుకుంటే, అప్పుడు మీరు మీ థీమ్ కోడ్‌ను ఎడిట్ చేయవచ్చు.
ఉత్పత్తి పేజీలలో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ప్రదర్శించండి
యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ప్రదర్శించడానికి మీరు థీమ్ ఎడిటర్‌లో మీ థీమ్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయవచ్చు.
మీ థీమ్ వెర్షన్‌ను బట్టి, బటన్‌లు దానికి బదులుగా డైనమిక్ చెక్‌అవుట్ బటన్‌లు అని లేబుల్ చేయబడి ఉండవచ్చు.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్కి వెళ్లండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్ పక్కన ఉన్న థీమ్‌ను ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
హోమ్ పేజీ డ్రాప్-డౌన్ మెనుని క్లిక్ చేయండి.
ఉత్పత్తులు క్లిక్ చేసి, ఆపై మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న టెంప్లేట్‌ను ఎంచుకోండి.
ఉత్పత్తి సమాచారం విభాగంలో, కొనుగోలు బటన్‌లను క్లిక్ చేయండి.
యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను చూపండిని ఎంచుకోండి.
సేవ్ క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
విక్రయ ఛానెల్‌ల విభాగంలో, ఆన్‌లైన్ స్టోర్‌ని ట్యాప్ చేయండి.
థీమ్‌లను నిర్వహించండిని ట్యాప్ చేయండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్‌ను కనుగొని, ఆపై థీమ్‌ను ఎడిట్ చేయండిని ట్యాప్ చేయండి.
టెంప్లేట్‌లను ట్యాప్ చేయండి.
ఉత్పత్తి పేజీలను ఎంచుకోండి.
ఉత్పత్తి పేజీలు లేదా ఉత్పత్తి విభాగాన్ని ట్యాప్ చేయండి.
యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ను చూపండిని చెక్ చేయండి.
సేవ్ ట్యాప్ చేయండి.
ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగంలో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ప్రదర్శించండి
చాలా థీమ్‌లు ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగంలో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను చేర్చడానికి సెట్టింగ్‌ను కలిగి ఉంటాయి.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్కి వెళ్లండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్ పక్కన ఉన్న థీమ్‌ను ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
ఇప్పటికే ఉన్న ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగాన్ని క్లిక్ చేయండి, లేదా కొత్త ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగాన్ని జోడించడానికి విభాగాన్ని జోడించండి > ఫీచర్ చేయబడిన ఉత్పత్తిని క్లిక్ చేయండి.
ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగంలో, కొనుగోలు బటన్‌లను క్లిక్ చేయండి.
యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను చూపండిని ఎంచుకోండి.
సేవ్ క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
విక్రయ ఛానెల్‌ల విభాగంలో, ఆన్‌లైన్ స్టోర్‌ని ట్యాప్ చేయండి.
అన్ని థీమ్‌లను నిర్వహించండిని ట్యాప్ చేయండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్‌ను కనుగొని, ఆపై థీమ్‌ను ఎడిట్ చేయండిని ట్యాప్ చేయండి.
ఎడిట్ ట్యాప్ చేయండి.
ఇప్పటికే ఉన్న ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగాన్ని ట్యాప్ చేయండి, లేదా కొత్త ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగాన్ని జోడించడానికి విభాగాన్ని జోడించండిని ట్యాప్ చేయండి.
మీ ఉత్పత్తి వివరాలను నమోదు చేసి, యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ను చూపండిని చెక్ చేయండి.
సేవ్ ట్యాప్ చేయండి.
ఉత్పత్తి పేజీలలో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను దాచండి
మీ ఉత్పత్తి పేజీలలోని అన్ని యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను మీరు దాచగలరు, కానీ నిర్దిష్ట యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను మీరు దాచలేరు.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్కి వెళ్లండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్ పక్కన ఉన్న థీమ్‌ను ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
హోమ్ పేజీ డ్రాప్-డౌన్ మెనుని క్లిక్ చేయండి.
ఉత్పత్తులు క్లిక్ చేసి, ఆపై మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న టెంప్లేట్‌ను ఎంచుకోండి.
ఉత్పత్తి సమాచారం విభాగంలో, కొనుగోలు బటన్‌లను క్లిక్ చేయండి.
యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను చూపండిని ఎంపిక తీసివేయండి.
సేవ్ క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
విక్రయ ఛానెల్‌ల విభాగంలో, ఆన్‌లైన్ స్టోర్‌ని ట్యాప్ చేయండి.
థీమ్‌లను నిర్వహించండిని ట్యాప్ చేయండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్‌ను కనుగొని, ఆపై థీమ్‌ను ఎడిట్ చేయండిని ట్యాప్ చేయండి.
టెంప్లేట్‌లను ట్యాప్ చేయండి.
ఉత్పత్తి పేజీలను ఎంచుకోండి.
ఉత్పత్తి పేజీలు లేదా ఉత్పత్తి విభాగాన్ని ట్యాప్ చేయండి.
యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ను చూపండిని అన్‌చెక్ చేయండి.
సేవ్ లేదా ✓ను ట్యాప్ చేయండి.
ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగంలో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను దాచండి
మీ ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగాల్లోని అన్ని యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను మీరు దాచగలరు, కానీ నిర్దిష్ట యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను మీరు దాచలేరు.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్కి వెళ్లండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్ పక్కన ఉన్న థీమ్‌ను ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగాన్ని క్లిక్ చేయండి.
యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను చూపండిని ఎంపిక తీసివేయండి.
సేవ్ క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
విక్రయ ఛానెల్‌ల విభాగంలో, ఆన్‌లైన్ స్టోర్‌ని ట్యాప్ చేయండి.
అన్ని థీమ్‌లను నిర్వహించండిని ట్యాప్ చేయండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్‌ను కనుగొని, ఆపై థీమ్‌ను ఎడిట్ చేయండిని ట్యాప్ చేయండి.
ఎడిట్ ట్యాప్ చేయండి.
ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగాన్ని ట్యాప్ చేయండి.
యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ను చూపండిని అన్‌చెక్ చేయండి.
సేవ్ లేదా ✓ను ట్యాప్ చేయండి.
కొన్ని ఉత్పత్తులకు యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ప్రదర్శించండి, ఇతరులకు కాదు
మీరు కొన్ని ఉత్పత్తులకు యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ప్రదర్శించి, మిగిలిన వాటికి ప్రదర్శించకూడదనుకుంటే, మీరు ప్రత్యామ్నాయ టెంప్లేట్‌ను సృష్టించవచ్చు. ప్రత్యామ్నాయ టెంప్లేట్ అనేది డూప్లికేట్ థీమ్ కోడ్ టెంప్లేట్, మీరు ఒరిజినల్‌కి ఎలాంటి అంతరాయం కలగకుండా దీన్ని ఎడిట్ చేయవచ్చు. ప్రత్యామ్నాయ ఉత్పత్తి టెంప్లేట్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు ఒక టెంప్లేట్‌ను ఉపయోగించే ఉత్పత్తుల కోసం యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ప్రదర్శించవచ్చు మరియు మరొకటి ఉపయోగించే ఉత్పత్తుల కోసం వాటిని దాచవచ్చు.
ప్రత్యామ్నాయ ఉత్పత్తి టెంప్లేట్‌ను సృష్టించడానికి, కొత్త టెంప్లేట్‌ను సృష్టించండిని చూడండి.
మీరు ప్రత్యామ్నాయ ఉత్పత్తి టెంప్లేట్‌ను సృష్టించి, ఒక ఉత్పత్తికి దాన్ని కేటాయించిన తర్వాత, మీరు ఆ ఉత్పత్తి కోసం యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌లను ప్రదర్శించవచ్చు లేదా దాచవచ్చు.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్కి వెళ్లండి.
మీరు ప్రత్యామ్నాయ టెంప్లేట్‌ను సృష్టించిన థీమ్ పక్కన ఉన్న థీమ్‌ను ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
మీరు ప్రత్యామ్నాయ టెంప్లేట్‌ను కేటాయించిన ఉత్పత్తికి సంబంధించిన ఉత్పత్తి పేజీకి వెళ్లండి.
ఉత్పత్తి సమాచారం విభాగంలో, కొనుగోలు బటన్‌లను క్లిక్ చేయండి.
ప్రత్యామ్నాయ టెంప్లేట్‌ను ఉపయోగించే ఉత్పత్తుల కోసం యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ను ప్రదర్శించడానికి, యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ను చూపండిని ఎంచుకోండి. ప్రత్యామ్నాయ టెంప్లేట్‌ను ఉపయోగించే ఉత్పత్తుల కోసం యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ను దాచడానికి, యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ను చూపండి ఎంపికను తీసివేయండి.
సేవ్ క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయ టెంప్లేట్‌ను ఉపయోగించే ఏ ఉత్పత్తికైనా మార్పులు వర్తించబడతాయి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
విక్రయ ఛానెల్‌ల విభాగంలో, ఆన్‌లైన్ స్టోర్‌ని ట్యాప్ చేయండి.
థీమ్‌లను నిర్వహించండిని ట్యాప్ చేయండి.
మీరు ప్రత్యామ్నాయ టెంప్లేట్‌ను సృష్టించిన థీమ్‌ను కనుగొని, ఆపై థీమ్‌ను ఎడిట్ చేయండిని ట్యాప్ చేయండి.
థీమ్ ఎడిటర్‌లో, మీరు ప్రత్యామ్నాయ టెంప్లేట్‌ను కేటాయించిన ఉత్పత్తికి సంబంధించిన ఉత్పత్తి పేజీకి వెళ్లండి.
ఉత్పత్తి పేజీలు లేదా ఉత్పత్తి విభాగాన్ని ట్యాప్ చేయండి.
ప్రత్యామ్నాయ టెంప్లేట్‌ను ఉపయోగించే ఉత్పత్తుల కోసం యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ను ప్రదర్శించడానికి, యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ను చూపండిని చెక్ చేయండి. ప్రత్యామ్నాయ టెంప్లేట్‌ను ఉపయోగించే ఉత్పత్తుల కోసం యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ను దాచడానికి, యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ బటన్‌ను చూపండిని అన్‌చెక్ చేయండి.
సేవ్ ట్యాప్ చేయండి. ప్రత్యామ్నాయ టెంప్లేట్‌ను ఉపయోగించే ఏ ఉత్పత్తికైనా మార్పులు వర్తించబడతాయి.