Shopify లోగో మేకర్
Shopify లోగో మేకర్ అనేది మీ స్వంత లోగోను రూపొందించుకోవడానికి మిమ్మల్ని అనుమతించే ఒక ఉచిత Shopify టూల్. మీ స్టోర్ బ్రాండింగ్‌లో లోగోలు ముఖ్యమైన భాగం. మీ కస్టమర్‌లకు సమన్వయ అనుభవాన్ని అందించడంలో ఇవి సహాయపడతాయి.
లోగో మేకర్‌ను ఉపయోగించడానికి మీకు గ్రాఫిక్ డిజైన్ అనుభవం అవసరం లేదు. లోగో విజువల్ స్టైల్‌పై ఆధారపడి, లోగో ఎడిటర్‌లో అనుకూలీకరించడానికి మీకు వివిధ రకాల ఆప్షన్‌లు ఉన్నాయి:
- పేరు, స్లోగన్
- ఫాంట్
- రంగుల ప్యాలెట్
- చిహ్నం
- లేఅవుట్
లోగో డిజైన్ ఆధారంగా కొన్ని ఎంపికలు అందుబాటులో ఉండవు. ఉదాహరణకు, డిజైన్‌లో చిహ్నం చేర్చబడని లోగోలకు లోగో ఎడిటర్‌లో చిహ్నాన్ని అనుకూలీకరించే ఎంపిక ఉండదు.
మీ కొత్త లోగోను సృష్టించిన తర్వాత, దాన్ని మీ థీమ్, ఆర్డర్ నోటిఫికేషన్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌ల లాంటి పలు ప్రదేశాలలో మీరు ఉపయోగించవచ్చు.
ఈ పేజీలో
లోగోను సృష్టించండి
మీరు మీ పరికరం వెబ్ బ్రౌజర్‌లో Shopifyకి చెందిన లోగో మేకర్‌ను యాక్సెస్ చేయవచ్చు, అలాగే ఈ టూల్‌ని ఉపయోగించడానికి ఎలాంటి అదనపు ప్రోగ్రామ్‌లు అవసరం లేదు.
దశలు:
- Shopify లోగో మేకర్ టూల్‌ని తెరవండి.
- మీ బ్రాండ్ పేరు ఏమిటి? ఫీల్డ్‌లో, మీ వ్యాపారం పేరును జోడించండి.
- డిజైనింగ్ ప్రారంభించండిని క్లిక్ చేయండి.
- మీ స్టోర్‌కు బాగా సరిపోయే పరిశ్రమ రకాన్ని ఎంచుకుని, ఆపై కొనసాగించండిని క్లిక్ చేయండి.
- మీ లోగో కోసం మీకు కావాల్సిన ప్రధాన విజువల్ స్టైల్‌ను ఎంచుకోండి. మీకు నచ్చిన స్టైల్ దొరికినప్పుడు, లోగోను ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
- మీ లోగో డిజైన్‌ను మరింతగా అనుకూలీకరించడానికి లోగో ఎడిటర్‌ని ఉపయోగించండి:
- పదాలు, ఫాంట్‌లు, రంగులు వంటి మీ లోగోలోని అంశాలను ఎడిట్ చేయడానికి సైడ్‌బార్‌లో ఉన్న ట్యాబ్‌లను ఉపయోగించండి.
- ఐచ్ఛికం: అందుబాటులో ఉన్న లోగో డిజైన్‌ల జాబితాకు తిరిగి రావడానికి, మీరు ఎప్పుడైనా ఫలితాలకు తిరిగి వెళ్లండిని క్లిక్ చేయవచ్చు.
- మీ లోగో డిజైన్‌పై మీరు సంతృప్తి చెందిన తర్వాత, ఫైనలైజ్ చేయండిని క్లిక్ చేయండి.
- డైలాగ్‌లో, మీ ఇమెయిల్ చిరునామాను ఎంటర్ చేసి, ఆపై లోగోను పంపండిని క్లిక్ చేయండి.
మీ లోగో మీ ఇమెయిల్ ఇన్‌బాక్స్‌కి పంపబడుతుంది, అక్కడ మీరు ZIP ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ బ్రౌజర్ నుండి మీ స్థానిక పరికరానికి లోగో ZIP ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మీరు ఇక్కడే డౌన్‌లోడ్ చేసుకోండిని కూడా క్లిక్ చేయవచ్చు. కంప్రెస్ చేసిన ఈ ఫోల్డర్‌లో మీ లోగోకు చెందిన బహుళ ఫార్మాట్‌ల PNG ఫైల్‌లు ఉంటాయి:
- అడ్డంగా (హెడర్‌లు, బ్యానర్‌లకు అనువైనది)
- నేపథ్యంతో
- పారదర్శక నేపథ్యంతో
- నిలువుగా (మొబైల్, సోషల్ మీడియా "స్టోరీ" ఫార్మాట్‌లకు అనువైనది)
మీరు మీ లోగోను సృష్టించిన తర్వాత, దాన్ని మీ స్టోర్ అంతటా ఉపయోగించడానికి మీ Shopify స్టోర్‌లోని బ్రాండ్ అసెట్స్‌కు ఆ లోగోను అప్‌లోడ్ చేయవచ్చు. మీ బ్రాండ్ అసెట్స్‌ని మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.