URL దారిమళ్లింపులను సృష్టించడం మరియు నిర్వహించడం
ఒక వెబ్‌పేజీ నుండి మరొక వెబ్‌పేజీకి ట్రాఫిక్‌ను దారి మళ్లించడానికి URL దారిమళ్లింపులను ఉపయోగించవచ్చు. మీరు మీ Shopify స్టోర్‌లో URLని మార్చినప్పుడు, మీ కస్టమర్‌లు తాము వెతుకుతున్న వాటిని ఇంకా కనుగొనగలరని నిర్ధారించడానికి మీరు ఒక URL దారిమళ్లింపును సృష్టించవచ్చు.
ఉదాహరణకు, మీరు ఒక ఉత్పత్తిని తొలగిస్తే, మీరు URL దారిమళ్లింపును సెటప్ చేయవచ్చు, తద్వారా కస్టమర్‌లు ఆ ఉత్పత్తికి చెందిన URLని ఎంటర్ చేసినప్పుడు, వారు మీ స్టోర్‌లోని ఇలాంటి మరో ఉత్పత్తికి మళ్లించబడతారు.
ఈ పేజీలో
URL దారిమళ్లింపులను సృష్టించేందుకు పరిగణించాల్సిన అంశాలు
మీరు ఏవైనా URL దారిమళ్లింపులను సృష్టించడానికి ముందు, ఈ కింద పేర్కొన్న అంశాలను సమీక్షించండి:
- మీరు కింది ప్రిఫిక్స్‌లతో ప్రారంభమయ్యే URLలను దారి మళ్లించలేరు:
/apps,/application,/cart,/carts,/orders,/servicesలేదా/shop. - మీరు నిర్ణీత Shopify పాత్‌లను ఉపయోగించే URLలను దారి మళ్లించలేరు:
/products,/collections,/collections/all. - మీరు కేవలం పని చేయని (బ్రోకెన్) URLల నుండి మాత్రమే దారి మళ్లించగలరు. పని చేయని URLలు, పేజీలో లేదా పేజీ టైటిల్‌లో Page not found లేదా 404 లాంటి ఎర్రర్ మెసేజ్‌లను డిస్‌ప్లే చేస్తాయి. ఒకవేళ URL అనేది చెల్లుబాటు అయ్యే వెబ్‌పేజీని ఇప్పటికీ లోడ్ చేస్తున్నట్లయితే, అప్పుడు URL దారిమళ్లింపు పని చేయదు.
- మీ స్టోర్ అనేది గరిష్టంగా 2,00,00,000 URL దారిమళ్లింపులకు అవకాశం ఉన్న Plus ప్లాన్‌లో ఉంటే మినహా, మీరు గరిష్టంగా 1,00,000 URL దారిమళ్లింపులను సృష్టించగలరు.
- కస్టమర్ ఖాతా మెనూలలో URL దారిమళ్లింపులకు సపోర్ట్ లేదు.
సాధారణంగా దారి మళ్లించే సందర్భాలు
ఈ సందర్భాలను అర్థం చేసుకోవడం వలన మీరు మరింత సమర్థవంతంగా దారిమళ్లింపులను సెటప్ చేయవచ్చు.
అదనపు URL దారిమళ్లింపు పరిమితులు
URL దారిమళ్లింపు పనితీరుపై ప్రభావం చూపగల ఈ అదనపు పరిమితులను సమీక్షించండి:
రిజర్వ్ చేయబడిన URL పాత్‌లు
కొన్ని URL పాత్‌లు Shopify ద్వారా రిజర్వ్ చేయబడ్డాయి మరియు వాటిని దారిమళ్లింపుల కోసం ఉపయోగించలేము:
/collections/vendors,/collections/types,/collections/all/apps/,/a/,/community/,/tools//shopలేదా/servicesతో ముగిసే MyShopify డొమైన్ పాత్‌లు
కలెక్షన్ ట్యాగ్ ఫిల్టరింగ్
మీరు కలెక్షన్ ట్యాగ్ ఫిల్టరింగ్ (అంటే, yourstore.com/collections/collection-name/tag-name) ఉపయోగించే URLల కోసం దారిమళ్లింపులను సృష్టించలేరు. ఆ ట్యాగ్‌లో ఏ ఉత్పత్తులు లేనప్పటికీ కూడా, ఆ URL పాత్ ఇప్పటికీ చెల్లుబాటు అయ్యేదిగానే పరిగణించబడుతుంది మరియు దానిని దారి మళ్లించలేరు.
HTML ఫైల్ ఎక్స్‌టెన్షన్‌లు
.htmlతో ముగిసే URLలను .html లేకుండా ఉన్న అదే URLకు దారి మళ్లించలేరు. సులభంగా అర్థమయ్యే URLల కోసం ప్లాట్‌ఫారమ్ ఆటోమేటిక్‌గా HTML ఫార్మాటింగ్‌ను హ్యాండిల్ చేయడం వల్ల Shopify వీటిని ఒకే URL లాగా పరిగణిస్తుంది.
క్వెరీ స్ట్రింగ్‌లు మరియు ప్రత్యేక అక్షరాలు
క్వెరీ స్ట్రింగ్‌లు ఉన్న URLలు (ఉదాహరణకు /brands/dell.html?_bc_fsnf=1&interface=interface_type) URL దారిమళ్లింపులతో ఆశించిన విధంగా పని చేయకపోవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్‌లు మరియు సబ్‌ఫోల్డర్‌లు
అన్ని మార్కెట్ సబ్‌ఫోల్డర్‌లకు URL దారిమళ్లింపులు ఆటోమేటిక్‌గా వర్తించవు. మీరు నిర్దిష్ట లొకేల్‌లను దారి మళ్లించవలసి వస్తే (అంటే yourstore.com/en-ca/old-page నుండి yourstore.com/en-fr/new-pageకి), ప్రతి సబ్‌ఫోల్డర్‌కు మీరు విడివిడిగా దారిమళ్లింపులను సృష్టించాలి.
301 దారిమళ్లింపు క్యాషింగ్
301 దారిమళ్లింపులు బ్రౌజర్‌లు మరియు సెర్చ్ ఇంజిన్‌ల ద్వారా క్యాష్ (cache) చేయబడతాయి. కస్టమర్‌లు దారిమళ్లింపును యాక్సెస్ చేసిన తర్వాత మీరు దాన్ని తీసివేస్తే, క్యాష్ (cache) గడువు ముగిసే వరకు వారి బ్రౌజర్‌లలో ఆ దారిమళ్లింపు పని చేస్తూనే ఉండవచ్చు.
ఒక URL దారిమళ్లింపును సృష్టించండి
మీరు URL దారిమళ్లింపును సృష్టించవచ్చు. దారిమళ్లింపును సృష్టిస్తున్నప్పుడు, కొత్త URL అనేది /collection/shirts లాంటి సంబంధిత URL, లేదా http://www.example.com/collection/shirts లాంటి పూర్తి URL అయి ఉండవచ్చు. మీ ప్రాథమిక డొమైన్ లోపలే ట్రాఫిక్‌ను దారి మళ్లించడానికి, సంబంధిత URLను ఉపయోగించండి. మీ ప్రాథమిక డొమైన్ వెలుపలికి దారి మళ్లించడానికి, పూర్తి URLను ఉపయోగించండి. URL దారిమళ్లింపులు వెంటనే పని చేయడం ప్రారంభిస్తాయి.
మీరు దీని నుండి దారి మళ్లించండి మరియు దీనికి దారి మళ్లించండి ఫీల్డ్‌లకు Liquidను కూడా జోడించవచ్చు. మీ పాత్‌లలో Liquidను ఉపయోగిస్తున్నప్పుడు పూర్తి ఫీల్డ్ ధృవీకరణ (వాలిడేషన్) చేయలేరు.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, కంటెంట్ > మెనూలు ఆప్షన్‌కు వెళ్లండి.
URL దారిమళ్లింపులను చూడండి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
URL దారిమళ్లింపును సృష్టించండి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
దీని నుండి దారి మళ్లించండి ఫీల్డ్‌లో, మీరు సందర్శకులను దేని నుండి దారి మళ్లించాలనుకుంటున్నారో ఆ పాత URLను ఎంటర్ చేయండి.
దీనికి దారి మళ్లించండి ఫీల్డ్‌లో, మీరు సందర్శకులను దేనికి దారి మళ్లించాలనుకుంటున్నారో ఆ కొత్త URLను ఎంటర్ చేయండి. మీ స్టోర్ హోమ్ పేజీకి దారి మళ్లించడానికి, /ను ఎంటర్ చేయండి.
దారిమళ్లింపును సేవ్ చేయండి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
URL దారిమళ్లింపుల ట్రబుల్షూటింగ్
URL దారిమళ్లింపులు వెంటనే పని చేయడం ప్రారంభిస్తాయి. మీ దారిమళ్లింపు వెంటనే పని చేయకపోతే, మీరు ఈ కింద పేర్కొన్న ట్రబుల్షూటింగ్ దశలను ప్రయత్నించవచ్చు:
- ఏవైనా స్పెల్లింగ్ తప్పుల కోసం దీని నుండి దారి మళ్లించండి మరియు దీనికి దారి మళ్లించండి URLలు రెండింటినీ సమీక్షించండి.
- దీని నుండి దారి మళ్లించండి URLకు యాక్టివ్‌గా ఉన్న పేజీ లేదని నిర్ధారించుకోండి.
- దీని నుండి దారి మళ్లించండి URL అనేది ఒక నిర్ణీత పాత్ కాదని లేదా మీరు దారి మళ్లించలేని ఒక ప్రిఫిక్స్‌ను కలిగి లేదని నిర్ధారించుకోండి.
- మీ బ్రౌజర్ క్యాష్ (cache)ను క్లియర్ చేసి దారిమళ్లింపును మళ్లీ టెస్ట్ చేయండి లేదా మరొక పరికరంలో ప్రయత్నించండి.
అదనపు దారిమళ్లింపు ట్రబుల్షూటింగ్
థీమ్ ఎడిటర్‌లో 404 పేజీ హోమ్ పేజీకి దారి మళ్లుతుంది
థీమ్ ఎడిటర్‌లో మీ 404 పేజీని చూస్తున్నప్పుడు అది హోమ్ పేజీకి దారి మళ్లుతున్నట్లయితే, మీరు /404 నుండి /కి (మీ హోమ్ పేజీకి) ఏదైనా దారిమళ్లింపును సెటప్ చేశారేమో చెక్ చేయండి. ఈ రకమైన దారిమళ్లింపు మీ 404 పేజీని డిస్‌ప్లే చేసే థీమ్ ఎడిటర్ సామర్థ్యానికి అడ్డు తగులుతుంది. సమస్యను పరిష్కరించడానికి ఈ దారిమళ్లింపును తీసివేయండి.
దారిమళ్లింపుల పరిమితి దాటింది (Redirect Limit Exceeded) అన్న API ఎర్రర్‌లు
మీరు Admin APIని ఉపయోగిస్తున్నప్పుడు "Redirect Limit Exceeded" ఎర్రర్‌లు వస్తే, ఆ ఎర్రర్ మీ స్టోర్ URL దారిమళ్లింపుల పరిమితికి (1,00,000 దారిమళ్లింపులు) సంబంధించినది కాదు. దానికి బదులుగా, ఒక API అభ్యర్థన చాలా ఎక్కువ సర్వర్ దారిమళ్లింపులకు కారణమవుతోందని ఇది సూచిస్తుంది. మీరు ఈ ఎర్రర్‌ను ఎదుర్కొంటున్నట్లయితే, Shopify కమ్యూనిటీని సంప్రదించండి లేదా సమస్యకు కారణమవుతున్న ఏవైనా థర్డ్-పార్టీ యాప్‌ల డెవలపర్‌ని కాంటాక్ట్ చేయండి.
URL దారిమళ్లింపులు మరియు ఆన్‌లైన్ స్టోర్ విజిబిలిటీ
కస్టమర్‌లను దాచబడిన కంటెంట్ నుండి యాక్టివ్ కంటెంట్‌కి తాత్కాలికంగా దారి మళ్లించడానికి, మీరు మీ ఆన్‌లైన్ స్టోర్ విజిబిలిటీ సెట్టింగ్‌లతో URL దారిమళ్లింపులను ఉపయోగించవచ్చు.
ఉదాహరణకు, మీరు ఎండాకాలంలో తాత్కాలికంగా దాచిపెట్టి, కస్టమర్‌లను /collections/summerకి దారి మళ్లించాలనుకునే /collections/fall కలెక్షన్‌ను కలిగి ఉంటే, మీరు ఇలా చేయవచ్చు:
- fall కలెక్షన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ స్టోర్ విజిబిలిటీని దాచబడిందికి మార్చండి.
/collections/fallనుండి/collections/summerకి URL దారిమళ్లింపును సృష్టించండి.
fall కలెక్షన్ దాచబడినప్పుడు, /collections/fall URL అనేది 404 పేజీ అవుతుంది, ఇది దారిమళ్లింపు పని చేసేందుకు అనుమతిస్తుంది. /collections/fallను సందర్శించే కస్టమర్‌లు ఆటోమేటిక్‌గా /collections/summerకి దారి మళ్లించబడతారు.
ముఖ్య గమనిక: మీరు తర్వాత కలెక్షన్‌కు చెందిన ఆన్‌లైన్ స్టోర్ విజిబిలిటీని మళ్లీ కనిపించేలాకి మార్చినట్లయితే, 404 ఎర్రర్‌లు వచ్చే URLలకు మాత్రమే దారిమళ్లింపులు పని చేస్తాయి కాబట్టి URL దారిమళ్లింపు ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది. మీరు కలెక్షన్‌ను మళ్లీ దాచినట్లయితే, దారిమళ్లింపును మళ్లీ సృష్టించాల్సి ఉంటుంది.
ఈ ప్రవర్తన ఉత్పత్తులకు కూడా వర్తిస్తుంది. మీరు ఉత్పత్తులను డ్రాఫ్ట్ స్థితికి సెట్ చేయవచ్చు లేదా 404 ఎర్రర్‌లను చూపించేలా చేసి, URL దారిమళ్లింపులకు అర్హత పొందేలా చేయడానికి అన్ని విక్రయ ఛానెల్‌ల నుండి వాటిని తీసివేయవచ్చు.
దారిమళ్లింపులు, సబ్‌ఫోల్డర్‌లు
అంతర్జాతీయ విక్రయ సాధనాలను ఉపయోగించి సెటప్ చేసిన అన్ని భాష లేదా మార్కెట్ సబ్‌ఫోల్డర్‌లకు URL దారిమళ్లింపును సృష్టించడం వర్తిస్తుంది.
ఉదాహరణకు, example.comలో మీ ప్రాథమిక మార్కెట్ యునైటెడ్ స్టేట్స్. అలాగే example.com/en-caలోని ఒక సబ్‌ఫోల్డర్‌లో కెనడా కోసం మీకు ఒక మార్కెట్ ఉంటుంది. మీరు మీ స్టోర్‌లో బ్లూ రంగు టీ-షర్ట్ విక్రయించడం ఆపివేయాలని నిర్ణయించుకున్నందున, మీరు ఆ ఉత్పత్తిని తొలగించి, ఆపై /products/blue-t-shirt నుండి /collections/t-shirtsకు ఒకే URL దారిమళ్లింపును సృష్టిస్తారు.
URL దారిమళ్లింపును సృష్టించిన తర్వాత, /products/blue-t-shirtని సందర్శించడానికి ప్రయత్నించే యునైటెడ్ స్టేట్స్‌లోని కస్టమర్‌లు ఆటోమేటిక్‌గా example.com/collections/t-shirtsకు దారిమళ్లించబడతారు, అలాగే example.com/en-ca/products/blue-t-shirtని సందర్శించడానికి ప్రయత్నించే కెనడాలోని కస్టమర్‌లు ఆటోమేటిక్‌గా example.com/en-ca/collections/t-shirtsకు దారిమళ్లించబడతారు.
ప్రతి మార్కెట్ కోసం వేరే గమ్యానికి కస్టమర్‌లను దారిమళ్లించాలనుకుంటే, మీరు ప్రతి సబ్‌ఫోల్డర్ కోసం వేర్వేరు దారిమళ్లింపులను ఇప్పటికీ సృష్టించవచ్చు.
మీ URL దారిమళ్లింపులను మేనేజ్ చేయడం
మీరు ఈ క్రింది మార్గాల్లో మీ URL దారిమళ్లింపుల లిస్ట్‌ను మేనేజ్ చేయవచ్చు:
- URL దారిమళ్లింపులను తేదీ వారీగా ఫిల్టర్ చేయండి
- URL దారిమళ్లింపు ఫిల్టర్‌ను సేవ్ చేయండి
- URL దారిమళ్లింపు ఫిల్టర్‌ను తొలగించండి
- URL దారిమళ్లింపు ఫిల్టర్ పేరును ఎడిట్ చేయండి
- URL దారిమళ్లింపులను విడివిడిగా ఎడిట్ చేయండి
- ఒకేసారి అనేక URL దారిమళ్లింపులను ఎడిట్ చేయండి
- మీ URL దారిమళ్లింపులను ఎక్స్‌పోర్ట్ చేయండి
- మీ URL దారిమళ్లింపులను ఇంపోర్ట్ చేయండి
- URL దారిమళ్లింపులను తొలగించండి
URL దారిమళ్లింపులను తేదీ వారీగా ఫిల్టర్ చేయండి
మీ Shopify అడ్మిన్ నుండి, కంటెంట్ > మెనూలు ఆప్షన్‌కు వెళ్లండి.
URL దారిమళ్లింపులపై క్లిక్ చేయండి.
జోడించిన తేదీపై క్లిక్ చేయండి.
డ్రాప్-డౌన్ మెను నుండి, మీరు ఫిల్టర్ చేయాలనుకుంటున్న తేదీ కాలాన్ని ఎంచుకోండి.
URL దారిమళ్లింపు ఫిల్టర్‌ను సేవ్ చేయండి
మీ Shopify అడ్మిన్ నుండి, కంటెంట్ > మెనూలు ఆప్షన్‌కు వెళ్లండి.
URL దారిమళ్లింపులపై క్లిక్ చేయండి.
సెర్చ బాక్స్‌ను ఉపయోగించి లేదా URL దారిమళ్లింపులను తేదీ వారీగా ఫిల్టర్ చేయడం ద్వారా ఫిల్టర్‌ను సృష్టించండి.
ఫిల్టర్‌లను సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.
మీ ఫిల్టర్ కోసం ఒక పేరును ఎంచుకోండి.
ఫిల్టర్‌లను సేవ్ చేయండిపై క్లిక్ చేయండి. లిస్ట్ ఎగువన ఫిల్టర్‌లు కొత్త ట్యాబ్‌గా సేవ్ చేయబడతాయి.
URL దారిమళ్లింపు ఫిల్టర్‌ను తొలగించండి
మీ Shopify అడ్మిన్ నుండి, కంటెంట్ > మెనూలు ఆప్షన్‌కు వెళ్లండి.
URL దారిమళ్లింపులపై క్లిక్ చేయండి.
మీరు తొలగించాలనుకుంటున్న ఫిల్టర్‌ను ఎంచుకోండి.
సేవ్ చేయబడినవిపై క్లిక్ చేయండి.
ట్యాబ్‌ను తీసివేయండిపై క్లిక్ చేసి, ఆపై తీసివేయండిపై క్లిక్ చేయండి.
URL దారిమళ్లింపు ఫిల్టర్ పేరును ఎడిట్ చేయండి
మీ Shopify అడ్మిన్ నుండి, కంటెంట్ > మెనూలు ఆప్షన్‌కు వెళ్లండి.
URL దారిమళ్లింపులపై క్లిక్ చేయండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ఫిల్టర్‌ను ఎంచుకోండి.
సేవ్ చేయబడినవిపై క్లిక్ చేయండి.
ట్యాబ్ పేరును ఎడిట్ చేసి, ఆపై ఫిల్టర్‌లను సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.
URL దారిమళ్లింపులను విడివిడిగా ఎడిట్ చేయండి
మీ Shopify అడ్మిన్ నుండి, కంటెంట్ > మెనూలు ఆప్షన్‌కు వెళ్లండి.
URL దారిమళ్లింపులపై క్లిక్ చేయండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న URL దారిమళ్లింపుపై క్లిక్ చేయండి.
మార్పులను నమోదు చేయండి.
దారిమళ్లింపును సేవ్ చేయండి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఒకేసారి అనేక URL దారిమళ్లింపులను ఎడిట్ చేయండి
మీరు URL దారిమళ్లింపులను బల్క్‌లో ఎడిట్ చేయవచ్చు. ఒకేసారి అనేక URL దారిమళ్లింపులను ఎడిట్ చేయడం గురించి మరింత తెలుసుకోవడానికి, బల్క్ యాక్షన్‌లను ఉపయోగించడం గురించి చూడండి.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, కంటెంట్ > మెనూలు ఆప్షన్‌కు వెళ్లండి.
URL దారిమళ్లింపులపై క్లిక్ చేయండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న URL దారిమళ్లింపులను ఎంచుకోండి.
దారిమళ్లింపును ఎడిట్ చేయండిపై క్లిక్ చేయండి.
మార్పులను నమోదు చేయండి.
సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.
మీ URL దారిమళ్లింపులను ఎక్స్‌పోర్ట్ చేయండి
మీ Shopify అడ్మిన్ నుండి, కంటెంట్ > మెనూలు ఆప్షన్‌కు వెళ్లండి.
URL దారిమళ్లింపులపై క్లిక్ చేయండి.
ఎక్స్‌పోర్ట్ చేయండిపై క్లిక్ చేయండి.
మీరు ఏ దారిమళ్లింపులను ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.
మీరు ఏ రకమైన CSV ఫైల్‌ను ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.
URL దారిమళ్లింపులను ఎక్స్‌పోర్ట్ చేయండిపై క్లిక్ చేయండి.
మీ URL దారిమళ్లింపులను ఇంపోర్ట్ చేయండి
మీరు ఇప్పటికే ఉన్న మీ URL దారిమళ్లింపును Shopifyకు ఇంపోర్ట్ చేయవచ్చు. టెంప్లేట్‌గా ఉపయోగించడానికి మీరు నమూనా URL దారిమళ్లింపు CSV ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి చూడవచ్చు.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, కంటెంట్ > మెనూలు ఆప్షన్‌కు వెళ్లండి.
URL దారిమళ్లింపులపై క్లిక్ చేయండి.
ఇంపోర్ట్ చేయండిపై క్లిక్ చేయండి.
ఫైల్‌ను జోడించండిపై క్లిక్ చేసి, CSV ఫైల్‌ను ఎంచుకోండి.
ఫైల్‌ను అప్‌లోడ్ చేయండిపై క్లిక్ చేయండి.
ఇంపోర్ట్‌ను సమీక్షించండి.
దారిమళ్లింపులను ఇంపోర్ట్ చేయండిపై క్లిక్ చేయండి.
మూసివేయండిపై క్లిక్ చేయండి.
URL దారిమళ్లింపులను తొలగించండి
మీరు URL దారిమళ్లింపులను తొలగించవచ్చు. ఒకేసారి అనేక URL దారిమళ్లింపులను తొలగించడం గురించి మరింత తెలుసుకోవడానికి, బల్క్ యాక్షన్‌లను ఉపయోగించడం గురించి చూడండి.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, కంటెంట్ > మెనూలు ఆప్షన్‌కు వెళ్లండి.
URL దారిమళ్లింపులపై క్లిక్ చేయండి.
మీరు తొలగించాలనుకుంటున్న URL దారిమళ్లింపులను ఎంచుకోండి.
ఎంచుకున్న దారిమళ్లింపులను తొలగించండిపై క్లిక్ చేయండి.
మీ నిర్ణయాన్ని నిర్ధారించడానికి తొలగించండిపై క్లిక్ చేయండి.