స్టోర్ వనరులను జోడించండి, ఎడిట్ చేయండి

మీరు నేరుగా థీమ్ ఎడిటర్ నుండి మీ స్టోర్‌లోని కింది వనరులను సృష్టించవచ్చు లేదా ఎడిట్ చేయవచ్చు:

  • రీసోర్స్ పికర్‌లు లేదా టెంప్లేట్‌ల నుండి ఉత్పత్తులు, కలెక్షన్‌లను సృష్టించండి
  • ఉత్పత్తులు, కలెక్షన్‌లను ఎడిట్ చేయండి
  • ఇప్పటికే ఉన్న మార్కెట్‌లను ఎడిట్ చేయండి
  • కొత్త మెటాఆబ్జెక్ట్‌లను సృష్టించండి

థీమ్ ఎడిటర్‌లో మీరు సృష్టించే వనరులు, మీరు వాటిని సృష్టించిన తర్వాత మీ Shopify అడ్మిన్‌లో అందుబాటులో ఉంటాయి. మీరు స్టోర్ వనరులకు చేసే ఎడిట్‌లు, మీ Shopify అడ్మిన్‌లో కూడా ఎడిట్ చేయబడతాయి. ఉదాహరణకు, మీ థీమ్ హోమ్‌పేజీలోని ఉత్పత్తి హైలైట్ విభాగంలో, మీరు ఇప్పటికే ఉన్న ఉత్పత్తి పేరును మార్చినట్లయితే, ఆ ఉత్పత్తి పేరు మీ Shopify అడ్మిన్‌లోని ఉత్పత్తులు విభాగంలో, అలాగే Shopify POS వంటి ఏవైనా ఇతర విక్రయాల ఛానెల్‌లలో కూడా అప్‌డేట్ చేయబడుతుంది.

వనరు
వనరుసృష్టించుఎడిట్
ఉత్పత్తి✔✔
కలెక్షన్✔✔
మార్కెట్✘✔
మెటాఆబ్జెక్ట్‌లు✔✘

పరిగణనలు

థీమ్ ఎడిటర్ నుండి ఆన్‌లైన్ స్టోర్ వనరులను సృష్టించడం, ఎడిట్ చేయడం కోసం కింది పరిగణనలను రివ్యూ చేయండి:

  • థీమ్ ఎడిటర్‌లో మీరు ఒకేసారి ఒక ఉత్పత్తి లేదా కలెక్షన్‌ను మాత్రమే సృష్టించగలరు లేదా ఎడిట్ చేయగలరు. మీరు బహుళ ఉత్పత్తులను ఎడిట్ చేయాలనుకుంటే, మీరు Shopify అడ్మిన్‌లో బల్క్ ఎడిటర్‌ను ఉపయోగించవచ్చు.
  • ఒక ఉత్పత్తి లేదా కలెక్షన్ ముందే ఏదైనా వనరుకు కేటాయించబడి ఉంటే మాత్రమే, దాన్ని మీరు థీమ్ ఎడిటర్ నుండి ఎడిట్ చేయగలరు. మీరు థీమ్ ఎడిటర్ నుండి కొత్త మార్కెట్‌లను సృష్టించలేరు. కొత్త మార్కెట్‌ను సృష్టించడానికి, మీ Shopify అడ్మిన్‌లోని మార్కెట్‌లు పేజీకి వెళ్లండి. కొత్త మార్కెట్‌ను సృష్టించడం గురించి మరింత తెలుసుకోండి.
  • మీరు ఇప్పటికే ఉన్న మెటాఆబ్జెక్ట్‌లను ఎడిట్ చేయలేరు లేదా థీమ్ ఎడిటర్ నుండి కొత్త మెటాఫీల్డ్ డెఫినిషన్‌లను సృష్టించలేరు. మెటాఆబ్జెక్ట్‌లను ఎడిట్ చేయడానికి లేదా మెటాఫీల్డ్ డెఫినిషన్‌లను జోడించడానికి, మీ Shopify అడ్మిన్‌లోని కంటెంట్ > మెటాఆబ్జెక్ట్‌లు పేజీకి వెళ్లండి. మీ ఆన్‌లైన్ స్టోర్‌లో మెటాఆబ్జెక్ట్‌లను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.

ఉత్పత్తి లేదా కలెక్షన్ వనరును నిర్వహించండి

బ్లాక్ లేదా విభాగం సెట్టింగ్ నుండి వనరును నిర్వహించండి

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్‌కు వెళ్లండి.

  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్ పక్కన ఉన్న, థీమ్‌ను ఎడిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వనరును కలిగి ఉన్న విభాగం లేదా బ్లాక్‌ను క్లిక్ చేయండి.

  4. వనరుపై క్లిక్ చేసి, ఆపై ఎడిట్ ఎడిట్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

  5. డైలాగ్‌లో, వనరుకు మార్పులు చేయండి.

  6. సేవ్ క్లిక్ చేయండి.

టెంప్లేట్ నుండి వనరును నిర్వహించండి

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్‌కు వెళ్లండి.

  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్ పక్కన ఉన్న, థీమ్‌ను ఎడిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

  3. హోమ్ పేజీ డ్రాప్-డౌన్ మెనుని క్లిక్ చేసి, ఆపై మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న టెంప్లేట్‌ను ఎంచుకోండి.

  4. సైడ్‌బార్‌లోని ప్రివ్యూ విభాగంలో, ఎడిట్ ఐకాన్‌ను క్లిక్ చేయండి.

  5. డైలాగ్‌లో, వనరుకు మార్పులు చేయండి.

  6. డైలాగ్‌ను మూసివేయడానికి సేవ్ క్లిక్ చేయండి.

మార్కెట్‌ను ఎడిట్ చేయడం

మీరు ఒకటి కంటే ఎక్కువ మార్కెట్ లేదా Shopify B2B ఫీచర్‌లను యాక్టివేట్ చేసి ఉంటే, అప్పుడు మీరు ప్రతి మార్కెట్‌కు అనుగుణంగా మీ థీమ్‌ను మార్చుకోవచ్చు. మీరు థీమ్ ఎడిటర్‌లోని మార్కెట్ సెలెక్టర్ నుండి ఇప్పటికే ఉన్న మార్కెట్‌లను ఎడిట్ చేయవచ్చు.

థీమ్ ఎడిటర్ మెను బార్‌లోని మార్కెట్ మరియు టెంప్లేట్ ఎంపిక మెనూలు

మార్కెట్‌లు లేదా B2Bకి అనుగుణంగా మీ థీమ్‌ను మార్చుకోవడం గురించి మరింత తెలుసుకోండి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్‌కు వెళ్లండి.

  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్ పక్కన ఉన్న, థీమ్‌ను ఎడిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

  3. మెనూ బార్ నుండి మార్కెట్ సెలెక్టర్‌ను క్లిక్ చేయండి.

  4. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న మార్కెట్ పక్కన ఉన్న, ఎడిట్ ఐకాన్‌ను క్లిక్ చేయండి.

  5. డైలాగ్‌లో, వనరుకు మార్పులు చేయండి.

  6. డైలాగ్‌ను మూసివేయడానికి సేవ్ క్లిక్ చేయండి.

మెటాఆబ్జెక్ట్‌ను సృష్టించడం

డైనమిక్ సోర్స్‌ను అంగీకరించే ఏ సెట్టింగ్ కోసమైనా, మీరు కొత్త మెటాఆబ్జెక్ట్ ఎంట్రీని నేరుగా థీమ్ ఎడిటర్ నుండి జోడించవచ్చు.

తిరిగి ఉపయోగించగల, స్ట్రక్చర్డ్ కంటెంట్‌ను సృష్టించడానికి మరియు దానిని మీ ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రదర్శించడానికి, మెటాఆబ్జెక్ట్‌లను సృష్టించడం మరియు మెటాఆబ్జెక్ట్‌లను కనెక్ట్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్‌కు వెళ్లండి.

  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్ పక్కన ఉన్న, థీమ్‌ను ఎడిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

  3. మీరు కొత్త ఎంట్రీని జోడించాలనుకుంటున్న మెటాఆబ్జెక్ట్‌ను కలిగి ఉన్న విభాగం లేదా బ్లాక్‌ను క్లిక్ చేయండి.

  4. సెట్టింగ్ పక్కన ఉన్న, డైనమిక్ సోర్స్‌ను కనెక్ట్ చేయండి ఐకాన్‌ను క్లిక్ చేయండి.

  5. ప్లస్ సర్కిల్ ఎంట్రీని జోడించండి బటన్‌ను క్లిక్ చేయండి.

  6. డైలాగ్‌లో, వనరుకు కొత్త మెటాఆబ్జెక్ట్ ఎంట్రీలను జోడించండి.

  7. డైలాగ్‌ను మూసివేయడానికి సేవ్ క్లిక్ చేయండి.