థీమ్ ఎడిటర్ ఫీచర్‌ల అవలోకనం
రంగుల వంటి మీ థీమ్ ఏరియాలను అనుకూలీకరించడానికి, సెక్షన్‌లు, బ్లాక్‌లతో మీ థీమ్‌లోని కంటెంట్‌ను మేనేజ్ చేయడానికి మీరు థీమ్ ఎడిటర్‌ను ఉపయోగించవచ్చు.
ఈ పేజీలో
థీమ్ ఎడిటర్‌ను యాక్సెస్ చేయడం
మీరు మీ Shopify అడ్మిన్ నుండి థీమ్ ఎడిటర్‌ను యాక్సెస్ చేయవచ్చు. Canvas బ్యాడ్జ్‌ను ప్రదర్శించే థీమ్ అందుకు బదులుగా Canvasలో ఓపెన్ అవుతుంది మరియు దాన్ని మీరు థీమ్ ఎడిటర్‌లో ఎడిట్ చేయలేరు.
మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్కు వెళ్లండి.
మీరు సవరించాలనుకుంటున్న థీమ్ పక్కన, థీమ్‌ను ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
థీమ్ ఎడిటర్ లేఅవుట్ సెక్షన్‌లు
థీమ్ ఎడిటర్‌లో కింది సెక్షన్‌లు ఉంటాయి:
- సెక్షన్‌లు, థీమ్ సెట్టింగ్‌లు, యాప్ ఎంబెడ్‌ల మధ్య మారడానికి మెనూ బార్లో ఎడమవైపు నావిగేషన్ బటన్‌లు ఉంటాయి; మధ్యలో థీమ్ పేరు, మార్కెట్, టెంప్లేట్ మెనూలు ఉంటాయి; కుడి వైపున అనుకూలీకరణ కంట్రోల్స్ ఉంటాయి.
- సైడ్‌బార్ మీరు ప్రస్తుతం వీక్షిస్తున్న టెంప్లేట్‌కు సంబంధించిన మొత్తం కంటెంట్ ట్రీ వ్యూని ప్రదర్శిస్తుంది. మీరు సైడ్‌బార్ నుండి విభాగాలు మరియు బ్లాక్‌లు, యాప్ ఎంబెడ్‌లు మరియు సెట్టింగ్‌లను మేనేజ్ చేయవచ్చు. సైడ్‌బార్‌ను కుదించవచ్చు.
- ప్రివ్యూ విండో మీ థీమ్‌ను ప్రదర్శిస్తుంది, అలాగే మీరు మార్పులు చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. ప్రివ్యూ విండోలో థీమ్ టెంప్లేట్ కంటెంట్‌ను మేనేజ్ చేయడానికి, మీరు మొబైల్ ప్రివ్యూను యాక్టివేట్ చేయవచ్చు లేదా ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌ను ఉపయోగించవచ్చు.
మెనూ బార్
మెనూ బార్ నావిగేషన్, థీమ్ సమాచారం మరియు మీ థీమ్‌ను అనుకూలీకరించడానికి కంట్రోల్‌లను ప్రదర్శిస్తుంది.

సైడ్‌బార్ నావిగేషన్

మెనూ బార్‌కు ఎడమ వైపున, మీరు సైడ్‌బార్‌లో కింది వ్యూల మధ్య టోగుల్ చేయవచ్చు:
- మీ ప్రస్తుత టెంప్లేట్‌లోని విభాగాలు మరియు బ్లాక్‌లను మేనేజ్ చేయడానికి
ను ఉపయోగించండి.
- రంగులు, టైపోగ్రఫీ మరియు లేఅవుట్ లాంటి మీ థీమ్ గ్లోబల్ సెట్టింగ్‌లను మేనేజ్ చేయడానికి
ని ఉపయోగించండి.
- మీ థీమ్‌లో ఎంబెడ్ చేసిన యాప్‌లను మేనేజ్ చేయడానికి
ని ఉపయోగించండి.
సైడ్‌బార్‌ను దాచడానికి మరియు మీ థీమ్ పూర్తి-వెడల్పు ప్రివ్యూను పొందడానికి, యాక్టివ్‌గా ఉన్న బటన్‌ను మళ్లీ క్లిక్ చేసి ఎంపికను తీసివేయండి. రెండు ప్యానెల్‌లు కనిపిస్తుంటే, యాక్టివ్‌గా ఉన్న బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ఒకేసారి రెండింటినీ కుదించవచ్చు.
థీమ్ వివరాలు, మార్కెట్ మరియు టెంప్లేట్ మెనూలు

మెనూ బార్ మధ్యలో, మీరు కింది వాటిని చూడవచ్చు:
- థీమ్ పేరు మరియు దాని స్టేటస్. మీరు పబ్లిష్ చేసిన థీమ్ లైవ్ స్టేటస్ లేబుల్‌ను ప్రదర్శిస్తుంది. పబ్లిష్ చేయని థీమ్‌లు డ్రాఫ్ట్ స్టేటస్ లేబుల్‌ను ప్రదర్శిస్తాయి. కింది ఆప్షన్‌లను యాక్సెస్ చేయడానికి థీమ్ పేరుపై క్లిక్ చేయండి:
- కోడ్ ఎడిటర్‌ను తెరవడానికి
కోడ్‌ను ఎడిట్ చేయండిని ఉపయోగించండి.
- మీ థీమ్‌లోని డిఫాల్ట్ పదాలను ఎడిట్ చేయడానికి,
డిఫాల్ట్ థీమ్ కంటెంట్‌ను ఎడిట్ చేయండి ఆప్షన్‌ను ఉపయోగించండి.
- మీ థీమ్ ప్రివ్యూను తెరవడానికి
ని ఉపయోగించండి.
- మీ థీమ్ డాక్యుమెంటేషన్‌ను తెరవడానికి
డాక్యుమెంటేషన్‌ను చూడండిని ఉపయోగించండి.
- థీమ్ ఎడిటర్ కోసం అందుబాటులో ఉన్న అన్ని కీబోర్డ్ షార్ట్‌కట్‌లను రివ్యూ చేయడానికి
ని ఉపయోగించండి.
- మద్దతు పొందడానికి
మద్దతు పొందండి ఆప్షన్‌ను ఉపయోగించండి.
- కోడ్ ఎడిటర్‌ను తెరవడానికి
- వేర్వేరు మార్కెట్‌ల కోసం మీ థీమ్‌ను ప్రివ్యూ చేయడానికి, అనుకూలీకరించడానికి మార్కెట్ మెనూ ఉపయోగపడుతుంది.
- మీ థీమ్‌లోని వివిధ పేజీ టెంప్లేట్‌ల మధ్య నావిగేట్ చేయడానికి టెంప్లేట్ మెనూ.
అనుకూలీకరణ షార్ట్‌కట్‌లు

మీ థీమ్‌ను అనుకూలీకరించడానికి మరియు మీ మార్పులను మేనేజ్ చేయడానికి మీరు మెనూ బార్‌లోని కింది కంట్రోల్‌లను ఉపయోగించవచ్చు:
- థీమ్ అనుకూలీకరణల్లో మీకు సహాయపడే Sidekickని యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయండి.
- ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌ను యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయండి.
- మీ థీమ్‌ను మొబైల్ స్క్రీన్‌పై ప్రివ్యూ చేయడానికి
ప్రివ్యూ బటన్‌ను టోగుల్ చేయండి.
- అన్‌డూ మరియు రీడూ కంట్రోల్‌లతో మీ ప్రస్తుత అనుకూలీకరణ సెషన్‌ను మేనేజ్ చేయండి.
- మీ మార్పులను సేవ్ చేయడానికి సేవ్ బటన్‌ను ఉపయోగించండి.
రీడూ, అన్‌డూ లేదా రెండూ చేయడానికి సేవ్ చేయని అనుకూలీకరణలు ఏవీ లేకుంటే, దానికి సంబంధించిన బటన్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటుంది.
సైడ్‌బార్
సైడ్‌బార్ మీరు ప్రస్తుతం వీక్షిస్తున్న టెంప్లేట్‌కు సంబంధించిన మొత్తం కంటెంట్ ట్రీ వ్యూని ప్రదర్శిస్తుంది. మీరు సైడ్‌బార్ నుండి విభాగాలు మరియు బ్లాక్‌లను, అలాగే థీమ్ సెట్టింగ్‌లను మేనేజ్ చేయవచ్చు. మెనూ బార్‌లో యాక్టివ్‌గా ఉన్న నావిగేషన్ బటన్‌ను మళ్లీ క్లిక్ చేసి టోగుల్ ఆఫ్ చేయడం ద్వారా మీరు సైడ్‌బార్‌ను కుదించవచ్చు.
ఏ ఇతర సెట్టింగ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయనే దాన్ని బట్టి, సైడ్‌బార్‌లో ప్రదర్శితమయ్యే షరతులతో కూడిన సెట్టింగ్‌లు మీ థీమ్‌లో ఉండవచ్చు. ఉదాహరణకు, వీడియో లేదా ఇమేజ్‌ని జోడించే సెట్టింగ్ ఉన్న బ్లాక్ మీ థీమ్‌లో ఉంటే, మీడియా రకంగా మీరు ఇమేజ్ని ఎంచుకున్న తర్వాత మాత్రమే ఇమేజ్ పికర్ లేదా వీడియో లింక్ అనేది ప్రదర్శించబడే షరతులతో కూడిన సెట్టింగ్ కావచ్చు.
సైడ్‌బార్ మోడ్లు
మీ స్క్రీన్‌పై ఉన్న మొత్తం స్పేస్‌ను ఉపయోగించుకునేందుకు థీమ్ ఎడిటర్ రెండు మోడ్‌లను కలిగి ఉంటుంది.
డబుల్ సైడ్‌బార్ మోడ్ అనేది వెడల్పాటి బ్రౌజర్ విండోలు మరియు పెద్ద స్క్రీన్‌ల కోసం కాగా, సింగిల్ సైడ్‌బార్ మోడ్ సన్నటి బ్రౌజర్ విండోలు మరియు చిన్న స్క్రీన్‌ల కోసం ఉంటుంది. ఎడిటర్‌లో సెట్టింగ్‌ల ప్యానెల్ ఎక్కడ ప్రదర్శించబడాలో సైడ్‌బార్ మోడ్ నిర్ణయిస్తుంది.
డబుల్ సైడ్‌బార్ మోడ్
మీ బ్రౌజర్ విండో కనీసం 1600 పిక్సెల్‌ల వెడల్పు ఉంటే, మీకు రెండు ప్యానెల్‌లు ఉంటాయి. ఎడమ ప్యానెల్ మీ విభాగాలు మరియు బ్లాక్‌లతో పేజీ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, కుడి ప్యానెల్ ఎంచుకున్న విభాగం లేదా బ్లాక్ కోసం సెట్టింగ్‌లను కలిగి ఉంటుంది. విభాగాల ఎంపికను తీసివేయడం ద్వారా మీరు కుడి ప్యానెల్‌ను కుదించవచ్చు.

పెద్ద స్క్రీన్‌పై థీమ్ ఎడిటర్‌ను సింగిల్ సైడ్‌బార్ మోడ్‌లో చూడటానికి, ఎడిటర్ స్టాక్ చేసిన లేఅవుట్‌కు మారే వరకు మీ బ్రౌజర్ విండో పరిమాణాన్ని తగ్గించండి.
సింగిల్ సైడ్‌బార్ మోడ్
చిన్న స్క్రీన్‌లపై, ఎడిటర్ స్టాక్ చేసిన లేఅవుట్‌ను ఉపయోగిస్తుంది. మీరు ఏదైనా విభాగం లేదా బ్లాక్‌ను క్లిక్ చేసినప్పుడు, సెట్టింగ్‌ల ప్యానెల్ మీ పేజీ నిర్మాణాన్ని కప్పి ఉంచకుండా స్క్రీన్ దిగువ నుండి పైకి స్లైడ్ అవుతుంది. ఈ పేజీ నిర్మాణం, సెట్టింగ్‌ల మధ్య విభజనను సర్దుబాటు చేయడానికి మీరు డివైడర్‌ను లాగవచ్చు, దీని వల్ల ఆ రెండు ఎల్లప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి.

మీ థీమ్‌ను ప్రివ్యూ చేయడం
మెనూ బార్‌లోని బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా మీరు మీ థీమ్ మొబైల్ లేఅవుట్‌ను ప్రివ్యూ చేయవచ్చు. డెస్క్‌టాప్ ప్రివ్యూకు తిరిగి వెళ్ళడానికి, మళ్లీ ఆ మొబైల్ బటన్‌ను క్లిక్ చేయండి.
మీ థీమ్‌ను పూర్తి వెడల్పులో ప్రివ్యూ చేయడానికి, సైడ్‌బార్‌ను కుదించడానికి యాక్టివ్‌గా ఉన్న సైడ్‌బార్ నావిగేషన్ బటన్‌ను క్లిక్ చేయండి. రెండు ప్యానెల్‌లు కనిపిస్తున్నట్లయితే, ఇది ఆ రెండింటినీ ఒకేసారి కుదించి, మీ స్టోర్‌ఫ్రంట్‌కు సంబంధించిన పూర్తి-వెడల్పుతో కూడిన ప్రివ్యూని మీకు అందిస్తుంది.
సేవ్ చేయని మార్పులను అన్‌డూ ఇంకా రీడూ చేయడం
సేవ్ చేయని అనుకూలీకరణలను అన్‌డూ లేదా రీడూ చేయడానికి మీరు మరియు
బటన్‌లను ఉపయోగించవచ్చు. మీరు మీ మార్పులను సేవ్ చేసిన తర్వాత, మీరు ఇకపై రీడూ లేదా అన్‌డూ చేయలేరు.
థీమ్ ఎడిటర్‌లో కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించడం
థీమ్ ఎడిటర్‌లో నావిగేట్ చేయడానికి మరియు చర్యలను చేయడానికి మీరు కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు.
| కేటగిరీ | చర్య | Windowsలో షార్ట్‌కట్ | macOSలో షార్ట్‌కట్ |
|---|---|---|---|
| సాధారణం | అన్‌డూ | CTRL + Z | ⌘ + Z |
| రీడూ | CTRL + Y | ⌘ + Y | |
| సేవ్ | CTRL + S | ⌘ + ⇧ + S | |
| అన్ని షార్ట్‌కట్‌లను చూడండి | CTRL + / | ⌘ + / | |
| టూల్స్ | ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్ | CTRL + SHIFT + | | ⌘ + ⇧ + | |
| ప్రివ్యూ మోడ్ | ⊞ + CTRL + | | ⌘ + ⌃ + | | |
| Sidekick | CTRL + . | ⌘ + . | |
| నావిగేషన్ | విభాగాలు | ⊞ + CTRL + Z | ⌘ + ⌃ + 1 |
| థీమ్ సెట్టింగ్‌లు | ⊞ + CTRL + Z | ⌘ + ⌃ + 2 | |
| యాప్ ఎంబెడ్‌లు | ⊞ + CTRL + Z | ⌘ + ⌃ + 3 | |
| విభాగాలు & బ్లాక్‌లు | దాచండి & చూపండి | CTRL + SHIFT + H | ⌘ + ⇧ + H |
| తొలగించండి | SHIFT + ⭠ | ⇧ + ⌫ | |
| మునుపటి దాన్ని ఎంచుకోండి | SHIFT + ← | ⇧ + ▲ | |
| తర్వాతి దాన్ని ఎంచుకోండి | SHIFT + → | ⇧ + ▼ | |
| ఎంచుకున్న ఎలిమెంట్‌ను తెరవండి | SHIFT + ENTER | ⇧ + ▼ | |
| అన్ని విభాగాలను విస్తరించండి | CTRL + SHIFT + O | ⌘ + ⇧ + O | |
| అన్ని విభాగాలను కుదించండి | CTRL + SHIFT + P | ⌘ + ⇧ + P |