ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌తో అనుకూలీకరించడం
ప్రివ్యూ విండో నుండే నేరుగా విభాగాలు, బ్లాక్‌లకు నావిగేట్ చేయడానికి, దానికి సంబంధించిన సెట్టింగ్‌లను మరింత వేగంగా, అలాగే సహజంగా కనుగొనడానికి మీరు ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌ను ఉపయోగించవచ్చు. ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌తో, మీరు నేరుగా మీ ప్రివ్యూ విండో నుండి విభాగాలు, బ్లాక్‌లను రీఆర్డర్ చేయవచ్చు, దాచవచ్చు లేదా నకిలీ (డూప్లికేట్) చేయవచ్చు.
ఈ ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్ Shopify అందిస్తున్న అన్ని ఉచిత థీమ్‌లకు అందుబాటులో ఉంటుంది, అలాగే డిఫాల్ట్‌గా యాక్టివేట్ చేయబడి ఉంటుంది.
ఈ పేజీలో
ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌ను యాక్టివేట్ లేదా డియాక్టివేట్ చేయండి
మీ ఎడిటింగ్ సెషన్‌లో ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, మీరు బటన్‌ను క్లిక్ చేయవచ్చు.

ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌ను యాక్టివేట్ చేసినప్పుడు, సంబంధిత సెట్టింగ్‌ను తెరవడానికి మీరు ఆకృతి చేయబడిన (ఔట్‌లైన్డ్) ఏ మూలకాన్నైనా (ఎలిమెంట్) క్లిక్ చేయవచ్చు. మొబైల్ పరికరంలో, ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్ యాక్టివేట్ చేయబడి ఉన్నప్పుడు, సంబంధిత సెట్టింగ్‌ను ఎంచుకోవడానికి మీరు ఏదైనా మూలకాన్ని క్లిక్ చేయవచ్చు. ఎంచుకున్న ఈ సెట్టింగ్ ద్వారా ఎడిట్ చేయడానికి మీరు కింది షీట్‌ను తెరవవచ్చు.

ప్రివ్యూ విండోలో మీ వెబ్‌సైట్‌లోని ఏదైనా భాగాన్ని క్లిక్ చేస్తే, అది మీ సైడ్‌బార్‌లో సంబంధిత సెట్టింగ్‌లను లోడ్ చేస్తుంది. మొబైల్ పరికరంలో, రెండుసార్లు ట్యాప్ చేయడం వల్ల ఒక కస్టమర్ సైట్‌ను నావిగేట్ చేసినట్లుగా నావిగేట్ చేస్తుంది.
ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌లో విభాగాలు, బ్లాక్‌లను జోడించండి
మీరు ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు నేరుగా ప్రివ్యూ విండో నుండే మీ థీమ్‌కు విభాగాలు, బ్లాక్‌లను జోడించవచ్చు. Shopify యాప్ నుండి ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌ను ఉపయోగించడానికి, విభాగాన్ని నిర్వహించడానికి దానిపై లాంగ్ ప్రెస్ చేయండి.


| టూల్ | వివరణ |
|---|---|
| విభాగాన్ని జోడించండి | ఎంచుకున్న విభాగానికి ఎగువన, దిగువన విభాగాన్ని జోడించండి బటన్ ప్రదర్శించబడుతుంది. ఎంచుకున్న విభాగానికి ఎగువన లేదా దిగువన కొత్త విభాగాన్ని ఇన్‌సర్ట్ చేయడానికి విభాగాన్ని జోడించండి బటన్‌ను క్లిక్ చేయండి. |
| బ్లాక్‌ను జోడించండి | మీరు ఇప్పటికే ఉన్న బ్లాక్ మీదకు హోవర్ చేసినప్పుడు బ్లాక్‌ను జోడించండి బటన్ ప్రదర్శించబడుతుంది. ఒక బ్లాక్‌ను జోడించడానికి, మీ కర్సర్‌ను |
ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్ టూల్స్
మీరు ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌తో థీమ్ ఎడిటర్‌లో విభాగాలు, బ్లాక్‌లను తరలించవచ్చు, దాచవచ్చు, నకిలీ చేయవచ్చు లేదా తొలగించవచ్చు.

| టూల్ | చర్య | వివరణ |
|---|---|---|
| మునుపటి స్థానానికి తరలించండి | ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌లోని బాణం (ఆరో) ఐకాన్‌లను ఉపయోగించి, ఒక విభాగాన్ని లేదా బ్లాక్‌ను తర్వాతి స్థానానికి లేదా మునుపటి స్థానానికి తరలించడానికి ఈ బటన్‌ను క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న విభాగం మీ పేజీ ఎగువన ఉన్నట్లయితే, అప్పుడు | |
| తర్వాతి స్థానానికి తరలించండి | ||
| విభాగం లేదా బ్లాక్‌ను డూప్లికేట్ చేయండి | ఒక విభాగాన్ని లేదా బ్లాక్‌ను, దాని కంటెంట్‌ను నకిలీ (డూప్లికేట్) చేయడానికి ఈ బటన్‌ను క్లిక్ చేయండి. | |
| విభాగం లేదా బ్లాక్‌ను దాచండి | ఒక విభాగం లేదా బ్లాక్‌ను దాచడానికి ఈ బటన్‌ను క్లిక్ చేయండి. ఒక విభాగం లేదా బ్లాక్ దాచబడినప్పుడు, మీరు దాన్ని ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్ నుండి మళ్లీ కనిపించేలా చేయలేరు. దాన్ని మళ్లీ కనిపించేలా చేయడానికి, మీరు మెనూ బార్‌లోని | |
| విభాగాన్ని లేదా బ్లాక్‌ను తొలగించండి | ఈ బటన్ ప్రివ్యూ ఇన్‌స్పెక్టర్‌లో ఎంచుకున్న విభాగాన్ని లేదా బ్లాక్‌ను తొలగిస్తుంది. |