థీమ్ ఎడిటర్‌లో కంటెంట్‌ను ఆటోమేటిక్‌గా రూపొందించడం

మీరు అందించే హెడ్డింగ్‌లు మరియు టైటిల్స్ వంటి వివరాల ఆధారంగా, మీ థీమ్ ఎడిటర్లో కంటెంట్ కోసం సూచనలను రూపొందించడానికి మీరు Sidekickని ఉపయోగించవచ్చు. మీ థీమ్ కోసం ఆటోమేటిక్ టెక్స్ట్‌ని రూపొందించే ముందు, AI-ఆధారిత టూల్స్‌ను ఉపయోగించడానికి ఉన్న ఉత్తమ పద్ధతుల గురించి తెలుసుకోండి.

సపోర్ట్ చేసే భాషలు

థీమ్ ఎడిటర్‌లో కంటెంట్‌ను రూపొందించడం అనేది Shopify సపోర్ట్ చేసే అన్ని భాషల్లో అందుబాటులో ఉంది. మీరు మీ ప్రాంప్ట్‌ను ఏ భాషలోనైనా వ్రాయవచ్చు మరియు రూపొందించబడిన కంటెంట్ మీ ప్రాంప్ట్ భాషకు మ్యాచ్ అవుతుంది. ఉత్తమ ఫలితాల కోసం, మీరు మీ థీమ్ కంటెంట్ ఏ భాషలో ఉండాలనుకుంటున్నారో అదే భాషలో మీ ప్రాంప్ట్‌ను వ్రాయండి.

మీ ఆన్‌లైన్ స్టోర్ కోసం కంటెంట్‌ను రూపొందించండి

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్కు వెళ్లండి.

  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్ పక్కన ఉన్న, థీమ్‌ను ఎడిట్ చేయండిపై క్లిక్ చేయండి.

  3. ఇమేజ్ బ్యానర్ హెడ్డింగ్ వంటి మీ థీమ్‌లోని ఒక టెక్స్ట్ ఎలిమెంట్‌ను ఎంచుకోండి.

  4. టెక్స్ట్ బాక్స్‌లో, టూల్‌బార్‌లోని Generate text ఐకాన్‌పై క్లిక్ చేయండి.

  5. headline, title, subtitle, లేదా announcement వంటి మీరు రూపొందించాలనుకుంటున్న కంటెంట్ రకాన్ని వివరిస్తూ ఒక ప్రాంప్ట్‌ను ఎంటర్ చేసి, ఆపై దాన్ని సమర్పించండి. రూపొందించబడిన టెక్స్ట్ నేరుగా ఎంచుకున్న టెక్స్ట్ ఎలిమెంట్‌కి వర్తించబడుతుంది. మీరు ఎన్ని ఎక్కువ వివరాలను జోడిస్తే, సూచించబడిన కంటెంట్ అంత సంబంధితంగా ఉంటుంది. మీరు కోరుకునే టోన్ లేదా మరేవైనా ఇతర సూచనలను నేరుగా మీ ప్రాంప్ట్‌లో చేర్చవచ్చు.

  6. ఆప్షనల్: మీ స్టోర్ టోన్ మరియు బ్రాండ్‌కి సరిపోయేలా కంటెంట్‌ని ఎడిట్ చేయండి.

  7. మీ ఎడిట్‌లు పూర్తయిన తర్వాత, సేవ్ క్లిక్ చేయండి.

మీకు అందే థీమ్ కంటెంట్ సూచనలను మెరుగుపరచడం

మీరు సృష్టించే కంటెంట్ అనేది, మీ స్టోర్ బ్రాండ్‌ను ప్రతిబింబించేలా నాన్-జెనెరిక్ పద్ధతిలో మీ ఉత్పత్తుల ప్రయోజనాలను కమ్యూనికేట్ చేయాలి. మీరు మీ ప్రాంప్ట్‌లో మరిన్ని వివరాలను చేర్చినప్పుడు, ఆటోమేటిక్‌గా రూపొందించబడిన మీ కంటెంట్‌లో మీకు మెరుగైన ఫలితాలు అందుతాయి.

ఫలితాలను మెరుగుపరచడానికి, కింది రకాల సమాచారాన్ని జోడించడాన్ని పరిగణించండి:

  • కస్టమర్ గురించిన సమాచారం: తరచుగా, ఉత్తమ కంటెంట్ అనేది మీ లక్ష్యిత కస్టమర్ యొక్క అవసరాలు మరియు ఆసక్తులను ప్రతిబింబిస్తుంది. జనాభా (యువ తల్లిదండ్రులు) లేదా వారి విలువలు (పర్యావరణ స్పృహ ఉన్నవారు, ఆరుబయట ఉండటానికి ఇష్టపడేవారు) వంటి ఉత్పత్తులు ఎవరికి బాగుంటాయి అనే దాని గురించి కొన్ని కీవర్డ్‌లను చేర్చండి. ఉత్పత్తి ప్రయోజనాలను రూపొందించడానికి మరియు మీ ఫలితాల్లో చేర్చబడిన పదజాలం రకాన్ని నిర్ణయించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
  • మెటీరియల్స్, ఉత్పత్తి పద్ధతి, ఫిట్, ఉద్దేశించిన ఉపయోగం గురించిన నిర్దిష్ట వివరాలు: మీరు అందించే ఏవైనా ఉత్పత్తి స్పెసిఫికేషన్‌లు, మీ రూపొందించబడిన కంటెంట్‌లో పేరాగ్రాఫ్‌లుగా మార్చబడవచ్చు.
  • ముఖ్యమైన బ్రాండ్ కీవర్డ్‌లు లేదా పదజాలం: ఫలితాల్లో మీరు అందించే సమాచారం కోసం వేర్వేరు వాక్యనిర్మాణాలు ఉన్నప్పటికీ, బ్రాండ్ పేర్లు లేదా ప్రత్యేకమైన వివరణాత్మక పదాల వంటివి తరచుగా అలానే ఉంచబడతాయి. ఉదాహరణకు, మీరు మీ మింట్ లిప్ బామ్‌ను కీవర్డ్‌లలో mint-tastic అని వివరిస్తే, రూపొందించబడిన సూచనల్లో ఆ పదం తరచుగా చేర్చబడుతుంది.
  • ఇతర వివరాలు: ఉత్పత్తి వెండర్‌లు, ఉత్పత్తి కేటగిరీలు లేదా మీ కలెక్షన్‌ల పేర్లు లాంటి ఏ కీవర్డ్‌లను అందించాలనే దాని గురించి మీకు ఐడియాలు ఇవ్వడానికి మీరు మీ థీమ్‌కు జోడించిన వివరాలు మరియు ఇమేజ్‌లను ఉపయోగించవచ్చు.