థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్‌లు మరియు మూలాలు
మీ ఆన్‌లైన్ స్టోర్‌కు ఏ ఫీచర్‌లు మరియు అనుకూలీకరణలు అందుబాటులో ఉంటాయి, అలాగే మీ థీమ్ కోసం మద్దతును ఎక్కడ కనుగొనాలి అనేవి మీ థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్ మరియు మీ థీమ్ డెవలపర్ మూలం నిర్ధారిస్తాయి.
మీరు థీమ్ ఎడిటర్లో మీ థీమ్ డెవలపర్ మరియు వెర్షన్‌ను కనుగొనవచ్చు.
థీమ్ మూలాలు
మీరు మీ స్టోర్‌కు జోడించగల థీమ్‌లన్నీ Shopify లేదా థర్డ్-పార్టీ డెవలపర్ ద్వారా డెవలప్ చేయబడతాయి. థీమ్‌లు కింది మూలాలలో దేని నుండి అయినా రావచ్చు:
- Shopify Theme Storeలో Shopify వారి ఉచిత థీమ్‌లు మరియు థర్డ్-పార్టీ థీమ్ డెవలపర్‌ల చెల్లింపు థీమ్‌లు రెండూ ఉంటాయి.
- Shopifyకి అనుకూలమైన థీమ్‌లు Theme Store వెలుపల నుండి కూడా అందుబాటులో ఉండవచ్చు. వీటిలో అనుకూలీకరించి రూపొందించిన థీమ్‌లు మరియు మద్దతు లేని థర్డ్-పార్టీ సైట్‌ల నుండి వచ్చిన థీమ్‌లు ఉంటాయి. Shopify Theme Store కాకుండా మరే ఇతర సైట్ నుండి థీమ్‌ను ఇన్‌స్టాల్ చేయవద్దని గట్టిగా సిఫార్సు చేయబడింది. Theme Store వెలుపల ఉన్న థీమ్‌ల నాణ్యత లేదా ప్రధాన Shopify ఫీచర్‌లతో అనుకూలత అనేది తనిఖీ చేయబడదు మరియు ఇవి మీ ఆన్‌లైన్ స్టోర్‌లో ఊహించని ప్రవర్తనకు కారణం కావచ్చు.
థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్
థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్ మీ థీమ్‌కు ఏయే ఫీచర్‌లు ఉన్నాయో నిర్ధారిస్తుంది. థీమ్ ఆర్కిటెక్చర్ అనేది మీ థీమ్‌లోని ఫైళ్ల థీమ్ నిర్మాణాన్ని వివరిస్తుంది. Shopify ద్వారా రూపొందించిన అన్ని థీమ్‌లు, అలాగే Shopify Theme Store నుండి చెల్లింపు థర్డ్-పార్టీ థీమ్‌లన్నీ, కింది ఆర్కిటెక్చర్ రకాలలో ఒకదాన్ని కలిగి ఉంటాయి:
- వింటేజ్ థీమ్‌లు అసలు థీమ్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించే థీమ్‌లు. వింటేజ్ థీమ్‌లు సెక్షన్‌లుగా ఉన్నవి లేదా సెక్షన్‌లుగా లేనివి అయి ఉండవచ్చు. వింటేజ్ థీమ్‌లు Theme Storeలో అందుబాటులో లేవు. Shopify ఉచిత వింటేజ్ థీమ్‌లు సెక్యూరిటీ ఫిక్స్‌లు మినహా అప్‌డేట్‌లను పొందవు.
- Online Store 2.0 థీమ్‌లు అన్ని పేజీలలో సెక్షన్‌లతో పాటు, డైనమిక్ సోర్స్‌లకు మద్దతు ఇచ్చే థీమ్‌లు.
- Horizon థీమ్‌ల కుటుంబంతో సహా థీమ్ బ్లాక్‌లకు మద్దతిచ్చే థీమ్‌లు సరికొత్త థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్‌ను కలిగి ఉంటాయి. ఈ థీమ్‌లు Online Store 2.0 థీమ్‌లలో అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్‌లతో పాటు థీమ్ బ్లాక్‌లతో కూడిన అధునాతన అనుకూలీకరణ ఫీచర్‌లకు మద్దతిస్తాయి.
థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్ మీ డ్రాఫ్ట్ థీమ్‌లలోని ప్రతి థీమ్‌కు నిర్దిష్టంగా ఉంటుంది. మీరు ఒకే సమయంలో మీ డ్రాఫ్ట్ థీమ్‌లలో విభిన్న ఆర్కిటెక్చర్ వెర్షన్‌లను కలిగి ఉన్న థీమ్‌లను కలిగి ఉండవచ్చు.
థీమ్ వెర్షన్ నంబర్
అన్ని థీమ్‌లు 1.0 వంటి వెర్షన్ నంబర్‌ను కలిగి ఉంటాయి, ఇది మీ Shopify అడ్మిన్‌లో థీమ్‌తో పాటుగా ప్రదర్శించబడుతుంది. Theme Storeలో అందుబాటులో ఉన్న అదే థీమ్ తాజా వెర్షన్‌తో పోల్చితే, మీ థీమ్ వెర్షన్ నంబర్ ఆ థీమ్ వెర్షన్‌ను వివరిస్తుంది. థీమ్ వెర్షన్‌లలో ఉన్న తేడాల గురించి తెలుసుకోవడానికి, థీమ్ అప్‌డేట్ విడుదలకు సంబంధించిన గమనికలను రివ్యూ చేయండి.

థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్ ఫీచర్‌లు
మీ థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్ మీ థీమ్ కోసం అందుబాటులో ఉన్న మొత్తం కార్యాచరణను నిర్ధారిస్తుంది. నిర్దిష్ట ఫీచర్‌ల లభ్యత అనేది మీరు ఏ థీమ్‌ని ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ప్రతి థీమ్‌కు అందుబాటులో ఉండే నిర్దిష్ట సెట్టింగ్‌లు థీమ్‌పైనే ఆధారపడి ఉంటాయి. నిర్దిష్ట థీమ్ కోసం అందుబాటులో ఉన్న అనుకూలీకరణ ఎంపికలను అన్వేషించడానికి థీమ్ ఎడిటర్‌ను ఉపయోగించండి.
మీ ప్రస్తుత థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్ కోసం అందుబాటులో లేని ఫీచర్ మీకు కావాలంటే, ఆ ఫీచర్‌లకు మద్దతు ఇచ్చే కొత్త థీమ్‌కు మీరు Shopify Theme Store నుండి మారవచ్చు, ఆపై మీ ప్రస్తుత థీమ్‌ను భర్తీ చేయడానికి ముందు దాన్ని అనుకూలీకరించవచ్చు. థీమ్‌లను జోడించడం మరియు మార్చడం గురించి మరింత తెలుసుకోండి.
| ఫీచర్ | వింటేజ్ | OS 2.0 | థీమ్ బ్లాక్‌లు |
|---|---|---|---|
| హోమ్ పేజీలో సెక్షన్‌లు మీ ఆన్‌లైన్ స్టోర్ హోమ్ పేజీలోని కంటెంట్‌ను అనుకూలీకరించండి. మీ పేజీ లేఅవుట్‌ను సృష్టించడానికి సెక్షన్‌లను జోడించండి, క్రమాన్ని మార్చండి లేదా తీసివేయండి. | ✔ | ✔ | ✔ |
| ప్రతి పేజీలో సెక్షన్‌లు మీ ఆన్‌లైన్ స్టోర్‌లోని చాలా పేజీలలో కంటెంట్‌ను అనుకూలీకరించండి. ప్రత్యేకమైన పేజీ లేఅవుట్‌లను సృష్టించడానికి సెక్షన్‌లు మరియు బ్లాక్‌లను జోడించండి, క్రమాన్ని మార్చండి లేదా తీసివేయండి. ప్రతి పేజీలో సెక్షన్‌లు ఉన్న థీమ్‌లు JSON టెంప్లేట్‌లతో రూపొందించబడతాయి. | ✘ | ✔ | ✔ |
| టెంప్లేట్‌లను సృష్టించండి థీమ్ ఎడిటర్ నుండి థీమ్ కోసం కొత్త టెంప్లేట్‌లను సృష్టించండి. | ✘ | ✔ | ✔ |
| మెరుగైన యాప్ మద్దతు ఏ కోడ్‌ను తాకకుండా యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి లేదా మార్చండి. యాప్ బ్లాక్‌లు మరియు యాప్ ఎంబెడ్‌లను ఉపయోగించి మీ థీమ్‌లో ఎక్కడైనా యాప్ ఫంక్షనాలిటీని జోడించండి. | ✘ | ✔ | ✔ |
| డైనమిక్ సోర్స్‌లను ఉపయోగించి రిచ్ కంటెంట్ సెట్టింగ్‌ను డైనమిక్ సోర్స్‌కు కనెక్ట్ చేయడం ద్వారా మీ థీమ్‌లోని ఏ సెట్టింగ్‌కైనా డైనమిక్, ప్రత్యేక సమాచారాన్ని జోడించండి. డైనమిక్ సోర్స్ అనేది వనరుల లక్షణం లేదా మెటాఫీల్డ్ విలువ అయి ఉండవచ్చు. | ✘ | ✔ | ✔ |
| కలెక్షన్ ఫిల్టరింగ్ కస్టమర్‌లు లభ్యత, ధర మరియు మరిన్నింటి ఆధారంగా మీ స్టోర్‌లోని కలెక్షన్‌లను ఫిల్టర్ చేయడానికి అనుమతించండి. | ✘ | ✔ | ✔ |
| ప్రిడిక్టివ్ సెర్చ్ మీరు టైప్ చేస్తున్నప్పుడు ప్రిడిక్టివ్ సెర్చ్ సూచించబడిన ఫలితాలను ప్రదర్శిస్తుంది. | ✘ | ✔ | ✔ |
| Planet యాప్ మీ ఆన్‌లైన్ స్టోర్‌కు అనుకూలీకరించదగిన Planet బ్యాడ్జ్ మరియు మార్కెటింగ్ వనరులను జోడించడం ద్వారా కర్బన తటస్థ షిప్పింగ్ పట్ల మీ నిబద్ధతను ప్రదర్శించండి. | ✘ | ✔ | ✔ |
| థీమ్ బ్లాక్‌లు థీమ్ బ్లాక్‌లతో మీ సెక్షన్‌లు మరియు బ్లాక్‌ల కోసం అధునాతన అనుకూలీకరణలను సృష్టించండి. | ✘ | ✘ | ✔ |
మీ థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్‌ను నిర్ధారించండి
కింది సందర్భాలలో మీ థీమ్ ఏ థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్‌ను ఉపయోగిస్తుందో మీరు తెలుసుకోవాలనుకోవచ్చు:
- యాప్ లేదా యాప్ ఫీచర్ మీ థీమ్‌కు అనుకూలంగా ఉందో లేదో నిర్ధారించడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు.
- మీరు కొన్ని థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఫీచర్‌లలో ఒకదాన్ని ఉపయోగించాలనుకున్నప్పుడు.
- మీరు థీమ్ బ్లాక్‌లకు మద్దతిచ్చే థీమ్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఫీచర్‌లలో ఒకదాన్ని ఉపయోగించాలనుకున్నప్పుడు.
- నిర్దిష్ట అనుకూలీకరణ ట్యుటోరియల్ మీ థీమ్‌కు వర్తిస్తుందో లేదో మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్‌కు వెళ్లండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్‌ను కనుగొని, ఆపై థీమ్‌ను ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
ఉత్పత్తులు > డిఫాల్ట్ ఉత్పత్తిని ఎంచుకోండి. ఇది డిఫాల్ట్ ఉత్పత్తి టెంప్లేట్‌ను తెరుస్తుంది.
ఉత్పత్తి టెంప్లేట్ సెక్షన్‌ల దిగువన ఉన్న సైడ్‌బార్‌ను రివ్యూ చేయండి. ప్రతి పేజీలోనూ సెక్షన్‌లకు అనుకూలంగా ఉండే థీమ్ మీకు ఉంటే, సెక్షన్ లిస్ట్ దిగువన సెక్షన్‌ను జోడించండి బటన్ కనిపిస్తుంది.
ఒకవేళ సెక్షన్‌ను జోడించండి బటన్ కనిపించకపోతే, మీకు వింటేజ్ సెక్షన్డ్ థీమ్ లేదా వింటేజ్ నాన్-సెక్షన్డ్ థీమ్ ఉండి ఉండవచ్చు. మీ థీమ్ ఏ వింటేజ్ ఆర్కిటెక్చర్ వెర్షన్‌ను ఉపయోగిస్తుందో తెలుసుకోవడానికి మీ వింటేజ్ థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్‌ను నిర్ణయించండిలోని దశలను ఫాలో అవ్వండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
విక్రయ ఛానెల్‌లు సెక్షన్‌లో, ఆన్‌లైన్ స్టోర్‌ను ట్యాప్ చేయండి.
థీమ్‌లను మేనేజ్ చేయండిని ట్యాప్ చేయండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్‌ను కనుగొని, ఆపై థీమ్‌ను ఎడిట్ చేయండిని ట్యాప్ చేయండి.
టెంప్లేట్‌లను ట్యాప్ చేయండి.
ఉత్పత్తులు > డిఫాల్ట్ ఉత్పత్తిని ఎంచుకోండి. ఇది డిఫాల్ట్ ఉత్పత్తి టెంప్లేట్‌ను తెరుస్తుంది.
ఉత్పత్తి టెంప్లేట్ సెక్షన్‌ల దిగువన ఉన్న సైడ్‌బార్‌ను రివ్యూ చేయండి. ప్రతి పేజీలోనూ సెక్షన్‌లకు అనుకూలంగా ఉండే థీమ్ మీకు ఉంటే, సెక్షన్ లిస్ట్ దిగువన సెక్షన్‌ను జోడించండి బటన్ కనిపిస్తుంది.
ఒకవేళ సెక్షన్‌ను జోడించండి బటన్ కనిపించకపోతే, మీకు వింటేజ్ సెక్షన్డ్ థీమ్ లేదా వింటేజ్ నాన్-సెక్షన్డ్ థీమ్ ఉండి ఉండవచ్చు. మీ థీమ్ ఏ వింటేజ్ ఆర్కిటెక్చర్ వెర్షన్‌ను ఉపయోగిస్తుందో తెలుసుకోవడానికి మీ వింటేజ్ థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్‌ను నిర్ణయించండిలోని దశలను ఫాలో అవ్వండి.

కొన్ని పరిమిత సందర్భాల్లో, మీ థీమ్‌లోని కొన్ని భాగాలు ఫీచర్‌లకు సపోర్ట్ చేయవచ్చు, మరికొన్ని చేయకపోవచ్చు. ఉదాహరణకు, మీ ఉత్పత్తి టెంప్లేట్‌లు సెక్షన్‌లను జోడించడానికి, తీసివేయడానికి మద్దతు ఇవ్వొచ్చు, కానీ మీ కలెక్షన్ టెంప్లేట్‌లు మద్దతు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ఫీచర్‌లు పని చేయడానికి JSON టెంప్లేట్‌లు అవసరం. మీరు మీ థీమ్‌ను పాక్షికంగా మాత్రమే మైగ్రేట్ చేసినట్లయితే లేదా మీరు మీ థీమ్‌ను Shopify Theme Store బయట నుండి పొంది, ఆ థీమ్ డెవలపర్ అన్ని పేజీల కోసం JSON టెంప్లేట్‌లను చేర్చకపోయినట్లయితే, మీకు అన్ని పేజీలకు JSON టెంప్లేట్‌లు ఉండకపోవచ్చు.
మీ వింటేజ్ థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్‌ను నిర్ణయించండి
మీరు వింటేజ్ థీమ్‌ను ఉపయోగిస్తున్నారని మీకు తెలిసిన తర్వాత, మీరు సెక్షన్డ్ లేదా నాన్-సెక్షన్డ్ థీమ్‌లలో దేనిని ఉపయోగిస్తున్నారో కూడా తెలుసుకోవాలి. ఇది మీ థీమ్‌కు ఏ అనుకూలీకరణలు అందుబాటులో ఉన్నాయో, ఏవైనా థీమ్ అనుకూలీకరణ ట్యుటోరియల్స్‌లో ఏ దశలను ఫాలో అవ్వాలో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
థీమ్ ఎడిటర్లో మీ థీమ్ ఆర్కిటెక్చర్ వెర్షన్‌ను నిర్ణయించడానికి ఒక మార్గం ఏమిటంటే, మీ హోమ్ పేజీ లేఅవుట్‌ను అమర్చడానికి మీరు ఎలిమెంట్‌లను లాగి వదలగలరో (డ్రాగ్ అండ్ డ్రాప్) లేదో చెక్ చేయడం. మీరు ఎలిమెంట్‌లను లాగి వదలగలిగితే, మీ వద్ద సెక్షన్డ్ థీమ్ ఉన్నట్లే.
మీరు ఏ వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారో నిర్ధారించుకోవడానికి, మీ థీమ్ కోడ్‌లోని Sections ఫోల్డర్‌ను చెక్ చేయండి.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, ఆన్‌లైన్ స్టోర్‌కు వెళ్లండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్‌ను కనుగొని, యాక్షన్‌ల మెనూను తెరవడానికి
బటన్‌ను క్లిక్ చేసి, ఆపై కోడ్‌ను ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
సైడ్‌బార్‌లో ఫోల్డర్ నిర్మాణాన్ని చెక్ చేయండి:
- Sections డైరెక్టరీలో ఫైల్స్ ఉంటే, మీరు సెక్షన్డ్ థీమ్‌ను ఉపయోగిస్తున్నట్లు అర్థం.
- Sections డైరెక్టరీలో ఎలాంటి ఫైల్స్ లేకపోతే, మీరు నాన్-సెక్షన్డ్ థీమ్‌ను ఉపయోగిస్తున్నట్లు అర్థం.
మొబైల్
Shopify యాప్ నుండి,
ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
విక్రయ ఛానెల్‌లు సెక్షన్‌లో, ఆన్‌లైన్ స్టోర్‌ను ట్యాప్ చేయండి.
అన్ని థీమ్‌లను మేనేజ్ చేయండిని ట్యాప్ చేయండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న థీమ్‌ను కనుగొని, యాక్షన్‌ల మెనూను తెరవడానికి
బటన్‌ను ట్యాప్ చేసి, ఆపై కోడ్‌ను ఎడిట్ చేయండిని ట్యాప్ చేయండి.
సైడ్‌బార్‌లో ఫోల్డర్ నిర్మాణాన్ని చెక్ చేయండి:
- Sections డైరెక్టరీలో ఫైల్స్ ఉంటే, మీరు సెక్షన్డ్ థీమ్‌ను ఉపయోగిస్తున్నట్లు అర్థం.
- Sections డైరెక్టరీలో ఎలాంటి ఫైల్స్ లేకపోతే, మీరు నాన్-సెక్షన్డ్ థీమ్‌ను ఉపయోగిస్తున్నట్లు అర్థం.