Shopify Plus ప్లాన్‌లో ఉన్న సంస్థల కోసం విస్తరణ స్టోర్‌ల ఓవర్‌వ్యూ

విస్తరణ స్టోర్‌లు అనేవి మీ Shopify Plus ప్లాన్‌లో ఒకే సంస్థ మరియు ఒప్పందం పరిధిలోకి వచ్చే అదనపు .myshopify.com స్టోర్‌లు. వీటి ద్వారా మీరు ప్రత్యేకమైన స్టోర్ సెట్టింగ్‌లు, కాన్ఫిగరేషన్‌లు మరియు స్టోర్‌ఫ్రంట్‌లతో వేర్వేరు స్టోర్‌లను సృష్టించవచ్చు, అలాగే యూజర్‌ల కోసం మరియు బిల్లింగ్ కోసం సంస్థ-స్థాయి మేనేజ్‌మెంట్‌ను కేంద్రీకృతంగా నిర్వహించవచ్చు.

మీ వ్యాపారంలో ప్రత్యేకమైన పరిస్థితుల కోసం లేదా వ్యాపార లక్ష్యాల కోసం ప్రత్యేక స్టోర్‌లను సృష్టించడానికి విస్తరణ స్టోర్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి:

  • అంతర్జాతీయ విస్తరణ: వేరొక భాష, ప్రాంతం లేదా కరెన్సీలో అందించే ఒకే విధమైన బ్రాండ్/పేరు మరియు ఉత్పత్తులు.
  • ఉత్పత్తి శ్రేణి విస్తరణలు: ఒకే విధమైన బ్రాండ్‌లతో ప్రస్తుత ఉత్పత్తులను విస్తరించడం కోసం వేర్వేరు ఉత్పత్తులను అందించడం. ఉదాహరణకు, క్యాంపింగ్ టెంట్‌ల నుండి కూలర్‌ల వరకు విస్తరించడం.
  • B2B స్టోర్‌లు: టోకు కస్టమర్‌ల కోసం ఒకే విధమైన ఉత్పత్తులు మరియు బ్రాండ్‌లను కలిగి ఉండే స్టోర్‌లు.
  • ఉద్యోగి లేదా VIP స్టోర్‌లు: ప్రధాన వ్యాపారంలో భాగంగా ఉండే, కేవలం సభ్యులకు లేదా ఉద్యోగులకు మాత్రమే యాక్సెస్ ఉండే స్టోర్‌లు.
  • భౌతిక రిటైల్ లొకేషన్‌లు: ఆన్‌లైన్ లావాదేవీలు లేకుండా 100% భౌతికంగా ఉండే రిటైల్ స్టోర్‌లు.

Shopify Plus ప్లాన్‌లో విస్తరణ స్టోర్‌ల కోసం పరిగణనలు

విస్తరణ స్టోర్‌లను సెటప్ చేయడానికి ముందు, అవి మీ Shopify Plus ప్లాన్ సంస్థలో ఎలా ఆపరేట్ చేయబడతాయి అనేదానిపై కింది పరిగణనలను రివ్యూ చేయండి:

  • అన్ని స్టోర్‌ల వ్యాప్తంగా యూజర్‌లను మరియు బిల్లింగ్‌ను కేంద్రీకృతంగా నిర్వహించడానికి మీ సంస్థ సెట్టింగ్‌లు అనుమతించినప్పటికీ, ప్రతి స్టోర్ విడిగా తన స్వంత డేటా, సెట్టింగ్‌లు మరియు కాన్ఫిగరేషన్‌లతో పూర్తిగా స్వతంత్రంగా ఆపరేట్ చేయబడుతుంది.
  • స్టోర్ సెట్టింగ్‌లు, ఉత్పత్తులు, కలెక్షన్‌లు, మరియు ఇన్వెంటరీ అనేవి స్టోర్‌ల మధ్య సింక్ అవ్వవు. ఆటోమేటిక్‌గా ఇవి డేటాను షేర్ చేయవు.
  • ఒక నిర్దిష్ట స్టోర్‌కి చేసిన మార్పులు సంస్థలోని ఇతర స్టోర్‌లలో ప్రతిఫలించవు. అయితే, అవసరమైతే, ఇన్వెంటరీ లాంటి నిర్దిష్ట డేటాను స్టోర్‌ల మధ్య సింక్ చేయడానికి, మీరు థర్డ్-పార్టీ యాప్‌లు లేదా ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) సిస్టమ్‌లను ఉపయోగించవచ్చు.
  • యాప్‌లు మొత్తం సంస్థ కోసం కాకుండా, ప్రతి స్టోర్‌కు విడిగా బిల్ చేయబడతాయి.
  • ప్రతి ఒక్క ప్రొడక్షన్ స్టోర్ కోసం విడిగా థీమ్ లైసెన్స్‌లు అవసరం. స్టేజింగ్ స్టోర్‌లకు మినహాయింపు ఉంటుంది.
  • స్టోర్‌ను సృష్టించే ప్రాసెస్‌లో, మీ కొత్త స్టోర్ కోసం ఒక ఉద్దేశ్యాన్ని అందించమని మిమ్మల్ని అడుగుతారు. మీరు ఎంచుకునే ఉద్దేశ్యం మీ స్టోర్ బిల్లింగ్ లేదా సెటప్‌పై ప్రభావం చూపవచ్చు, కానీ దాని ఫీచర్‌లను లేదా సామర్థ్యాలను పరిమితం చేయదు. ఏ ఎంపికను ఎంచుకోవాలో మీకు కచ్చితంగా తెలియకపోతే, అప్పుడు Shopify Plus సపోర్ట్‌ను సంప్రదించండి.
  • మీరు ఒక స్టోర్‌ను సృష్టించినప్పుడు, సాధారణంగా అది వెంటనే మీ సంస్థకు జోడించబడుతుంది. అయితే, అభ్యర్థించిన స్టోర్ మీ ఒప్పంద పరిమితులను మించితే, దానికి బదులుగా ఒక ట్రయల్ స్టోర్ సృష్టించబడుతుంది. అదనపు స్టోర్‌ను జోడించడానికి ఒక అభ్యర్థన Shopify Plusకు పంపబడుతుంది, అలాగే అదనపు ఫీజును ఆమోదించమని మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తుంది. కొన్ని రోజుల వ్యవధిలో, మీ అభ్యర్థన ప్రాసెస్ చేయబడుతుంది, మరియు మీ ట్రయల్ స్టోర్ అప్‌గ్రేడ్ అవుతుంది. ఈ మార్పును నిర్ధారిస్తూ మీకు ఒక ఇమెయిల్ వస్తుంది.
  • మీరు కొత్త స్టోర్‌లోకి థీమ్‌ను ఇంపోర్ట్ చేసినప్పుడు, ఆ థీమ్‌లో హార్డ్-కోడ్ చేయబడిన ఫైల్స్ రెఫరెన్సులు ఎప్పటికీ అసలు స్టోర్‌లోని ఫైల్స్‌నే పాయింట్ చేస్తూ ఉంటాయి. అసలు స్టోర్‌లో ఫైల్ కనుక తొలగించబడితే, మీ కొత్త స్టోర్ థీమ్‌లోని ఫైల్ లింక్ బ్రేక్ అవుతుంది. లింక్‌లు బ్రేక్ కాకుండా నివారించడానికి, మీరు థీమ్‌లను ఇంపోర్ట్ చేసేటప్పుడు ఫైల్స్‌ను కూడా తప్పనిసరిగా ఇంపోర్ట్ చేయండి, అలాగే మీ థీమ్‌లోని ఏవైనా URLలను అప్‌డేట్ చేయండి తద్వారా అవి మీ కొత్త స్టోర్‌లోని ఫైల్స్‌ను పాయింట్ చేస్తాయి.

అందుబాటులో ఉన్న స్టోర్‌ల సంఖ్య

Shopify Plus ప్లాన్ సంస్థలు అదనపు ఖర్చు లేకుండా తమ ఒప్పందంపై గరిష్టంగా పది స్టోర్‌లను కలిగి ఉండవచ్చు:

  • ఒక ప్రధాన స్టోర్.
  • తొమ్మిది విస్తరణ స్టోర్‌లు.
  • ఈ పది స్టోర్‌ల పరిమితి కిందకు స్టేజింగ్ స్టోర్‌లు రావు.

మీకు పది కంటే ఎక్కువ స్టోర్‌లు కావాలంటే, అప్పుడు మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించాలి.

ప్రామాణిక Shopify Plus ప్లాన్ ఒప్పందాలలో విస్తరణ స్టోర్‌ల అర్హత ఆవశ్యకతలు

స్టోర్ ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా భౌతిక రిటైల్ లొకేషన్‌గా ఆపరేట్ చేయబడినా విస్తరణ స్టోర్‌ల ఆవశ్యకతలు ఒకేలా ఉంటాయి. విస్తరణ స్టోర్‌లు కింది అన్ని షరతులకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి:

  • ప్రధాన బ్రాండ్ యొక్క విస్తరణలు అయి ఉండాలి.
  • స్టోర్ పేరు మరియు ఇతర బ్రాండింగ్ పరంగా ప్రధాన బ్రాండ్‌ను పోలి ఉండాలి.
  • ప్రధాన బ్రాండ్ విక్రయించే వస్తువులు మరియు సేవలనే ఇవి కూడా కలిగి ఉండాలి.
  • బిల్లింగ్ కరెన్సీని USD లేదా INRకి సెట్ చేసి ఉండాలి. USD లేదా INRలలో బిల్ చేయబడిన స్టోర్‌లను మాత్రమే Plus ఒప్పందానికి జోడించగలరు.

ఒక విస్తరణ స్టోర్ కోసం మీ బిల్లింగ్ కరెన్సీని మార్చండి

మీ స్టోర్ కనుక USD లేదా INR కాకుండా వేరే బిల్లింగ్ కరెన్సీని ఉపయోగిస్తుంటే, మీ Plus ఒప్పందానికి ఆ స్టోర్‌ను జోడించే ముందు మీరు దానిని మార్చాలి. మీ బిల్లింగ్ కరెన్సీని మార్చడం వలన ఏవైనా పెండింగ్ ఛార్జీలు ఉంటే వెంటనే బిల్ చేయబడతాయి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > బిల్లింగ్కు వెళ్లండి.
  2. చెల్లింపు వివరాల విభాగంలో, బిల్లింగ్ కరెన్సీని క్లిక్ చేయండి.
  3. బిల్లింగ్ కరెన్సీని మార్చండిని క్లిక్ చేయండి.
  4. మీ కొత్త బిల్లింగ్ కరెన్సీగా USD లేదా INRని ఎంచుకోండి.
  5. ఏవైనా పెండింగ్ ఛార్జీలను రివ్యూ చేసి, ఆపై నిర్ధారించండిని క్లిక్ చేయండి.

ముందుగా ఆమోదించబడిన విస్తరణ స్టోర్ రకాలు

కింది విస్తరణ స్టోర్ రకాలకు ఆటోమేటిక్‌గా అర్హత ఉంటుంది:

  • అంతర్జాతీయ స్టోర్‌లు: వేర్వేరు భాషల్లో, ప్రాంతాల్లో లేదా కరెన్సీలో ఉండే ఒకే విధమైన బ్రాండ్/పేరు మరియు ఉత్పత్తులు. ఉదాహరణకు, abc123.com, abc123.ca, abc123.com.au.
  • B2B టోకు స్టోర్‌లు: ప్రధాన బ్రాండ్ లాంటి ఉత్పత్తులనే కలిగి ఉంటాయి, యూజర్ లాగిన్ కావాలి అలాగే B2B సంస్థతో అనుబంధించబడి ఉండాలి. ఒక్కో ఒప్పందానికి ఒక ఉచిత B2B స్టోర్ మాత్రమే పరిమితి.
  • టోకు వ్యాపారుల కోసం D2C స్టోర్‌లు: ఒకే విధమైన ఉత్పత్తులతో నేరుగా-వినియోగదారునికి (D2C) స్టోర్‌ఫ్రంట్‌ను సృష్టించాలనుకునే, ప్రత్యేకంగా టోకు విక్రయాలు చేసే వ్యాపారుల కోసం. ఒక్కో ఒప్పందానికి 1 ఉచిత B2C స్టోర్ మాత్రమే పరిమితి.
  • కేవలం ఉద్యోగుల కోసం మాత్రమే ఉద్దేశించిన స్టోర్‌లు: ఒకే బ్రాండ్‌ను ప్రతిబింబిస్తూ ప్రధాన వ్యాపారంలో భాగంగా ఉంటాయి, సాధారణ ప్రజలకు ఇవి అందుబాటులో ఉండవు.
  • భౌతిక రిటైల్ లొకేషన్‌లు: ఆన్‌లైన్ లావాదేవీలు లేకుండా నడిచే 100% భౌతిక రిటైల్, ఇవి ప్రధాన బ్రాండ్ మాదిరిగానే ఒకే బ్రాండింగ్, పేరు మరియు ఉత్పత్తులను కలిగి ఉంటాయి.

మరొక స్టోర్‌ను జోడించండి

కింది రెండు పద్ధతుల్లో ఒకదానిని ఉపయోగించడం ద్వారా, మీరు Shopify Plus ప్లాన్‌లో మీ సంస్థకు విస్తరణ స్టోర్‌లను జోడించవచ్చు:

ఇప్పటికే ఉన్న స్టోర్ నుండి డేటాను దిగుమతి చేయడం

మీరు స్టోర్‌ను సృష్టించినప్పుడు, మీ సంస్థలో ఇప్పటికే ఉన్న స్టోర్ నుండి ఈ క్రింది డేటాను దిగుమతి చేసుకోవచ్చు:

  • థీమ్‌లు: మీరు ఎంచుకున్న స్టోర్ నుండి థీమ్‌లను కలిగి ఉంటుంది.
  • ఉత్పత్తులు, కలెక్షన్‌లు: మీరు ఎంచుకున్న స్టోర్‌లోని అన్ని ఉత్పత్తులు, వేరియంట్‌లు, కలెక్షన్‌లు, వాటి మెటాఫీల్డ్‌లను (రిఫరెన్స్ రకాలు, కేటగిరీ మెటాఫీల్డ్‌లు మినహాయించి) కలిగి ఉంటుంది.
  • ఫైల్‌లు: మీరు ఎంచుకున్న స్టోర్‌కి అప్‌లోడ్ చేసిన అన్ని ఇమేజ్‌లు, వీడియోలు, ఫైల్‌లను కలిగి ఉంటుంది.

మీరు స్టోర్‌ను సృష్టించే సమయంలో మాత్రమే మీ సంస్థలోని మరొక స్టోర్ నుండి డేటాను దిగుమతి చేయగలరు. స్టోర్‌ను సృష్టించిన తర్వాత, మీరు డేటాను దిగుమతి చేయలేరు మరియు మీ స్టోర్ డేటాను మీరే మాన్యువల్‌గా నిర్వహించుకోవాలి.

కొత్త స్టోర్‌ను సృష్టించండి

మీరు మీ Shopify అడ్మిన్‌లోని సంస్థ విభాగంలో విస్తరణ స్టోర్‌ను సృష్టించవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > సంస్థకి వెళ్లండి.

  2. స్టోర్‌ను సృష్టించండిని క్లిక్ చేయండి.

  3. స్టోర్ రకం విభాగంలో, ఆ స్టోర్ స్టేజింగ్ కోసమా లేదా ప్రొడక్షన్ కోసమా ఎంచుకోండి.

  4. ప్రొఫైల్ విభాగంలో, పేరు అలాగే స్టోర్ URLను ఎంటర్ చేయండి.

  5. ఐచ్ఛికం: అంతర్గత పేరు, ఐకాన్ విభాగంలో, స్టోర్ కోసం పేరు అలాగే రెండు లేదా మూడు అక్షరాల ఇనీషియల్‌ను ఎంటర్ చేయండి. ఈ విభాగంలో మీరు ఎంటర్ చేసే పేరు, ఇనీషియల్స్ కేవలం Shopify అడ్మిన్‌లో మాత్రమే కనిపిస్తాయి, కస్టమర్‌లకు కనిపించవు.

  6. ఐచ్ఛికం: డేటాను దిగుమతి చేయడానికి, ఇప్పటికే ఉన్న స్టోర్ నుండి డేటాను దిగుమతి చేయండి విభాగంలో, స్టోర్‌ను ఎంచుకోండిని క్లిక్ చేసి, ఆపై స్టోర్‌ను ఎంచుకోండి.

  7. ఐచ్ఛికం: కింది దశలలో దేనినైనా పూర్తి చేయడం ద్వారా మీరు మీ కొత్త స్టోర్‌కు కాపీ చేయాలనుకుంటున్న డేటాను ఎంచుకోండి:

    • థీమ్‌ను ఎంచుకోవడానికి, కింది వాటిలో ఒకదాన్ని చేయండి:
      • మీరు ఎంచుకున్న స్టోర్‌లో ఒకదాని కంటే ఎక్కువ థీమ్‌లు ఉంటే, మీరు కాపీ చేయాలనుకుంటున్న థీమ్‌లను ఎంచుకోవడానికి థీమ్‌లను ఎంచుకోండిని క్లిక్ చేయండి.
      • మీరు ఎంచుకున్న స్టోర్‌లో ఒకే ఒక్క థీమ్ ఉన్నట్లయితే, థీమ్‌ను కాపీ చేయడానికి థీమ్‌లు ఎంచుకోండి.
    • అన్ని ఉత్పత్తులు, వేరియంట్‌లు, వాటి మెటాఫీల్డ్‌లను (రిఫరెన్స్ రకాలను మినహాయించి) కాపీ చేయడానికి ఉత్పత్తులు, కలెక్షన్‌లు ఎంచుకోండి.
    • అన్ని ఇమేజ్‌లు, వీడియోలతో సహా ఫైల్‌లన్నింటినీ కాపీ చేయడానికి ఫైల్‌లు ఎంచుకోండి.
  8. స్టోర్‌ను సృష్టించండిని క్లిక్ చేయండి.

ఇప్పటికే ఉన్న స్టోర్‌ను జోడించండి

మీరు విస్తరణ స్టోర్‌గా జోడించాలనుకునే ట్రయల్ స్టోర్, ఇప్పటికే ఉన్న స్టోర్ లేదా పార్ట్‌నర్ సృష్టించిన స్టోర్ వంటివి మీకు ఉంటే, మీరు దీన్ని మాన్యువల్ ప్రాసెస్ ద్వారా అభ్యర్థించవచ్చు.

స్టోర్‌ను జోడించడానికి మీరు ఈ క్రింది ముందస్తు అవసరాలను తీర్చాలి:

  • ఈ అభ్యర్థన రెండు స్టోర్‌లకు చెందిన స్టోర్ యజమానుల ద్వారా ప్రారంభించబడాలి లేదా నిర్ధారించబడాలి:
    • ప్రధాన బిల్లింగ్ స్టోర్ యజమాని లేదా సంస్థ యజమాని.
    • అభ్యర్థించిన విస్తరణ స్టోర్ యజమాని.
  • స్టోర్‌లకు వేర్వేరు స్టోర్ యజమానులు ఉంటే, ఈ అభ్యర్థన మెసేజ్‌లో ఇద్దరు యజమానులను కాపీలో ఉంచి ఇమెయిల్‌కి మార్చబడాలి, మరియు 'అందరికీ-ప్రత్యుత్తరం' (reply-all) ఇమెయిల్‌ ద్వారా అభ్యర్థనను నిర్ధారించాలి.

దశలు:

  1. మీరు ప్రతిపాదించిన విస్తరణ స్టోర్ అర్హత అవసరాలను తీరుస్తుందో లేదో నిర్ధారించుకోండి.
  2. మీ అభ్యర్థనతో Shopify Plus మద్దతును సంప్రదించండి.
  3. ఇద్దరు ఖాతా యజమానుల నుండి నిర్ధారణను అందించండి.
  4. Shopify సమీక్ష, ఆమోదం కోసం వేచి ఉండండి.

అర్హత లేని స్టోర్‌ల కోసం ప్రత్యామ్నాయ ఎంపికలు

మీరు ప్రతిపాదించిన స్టోర్ విస్తరణ స్టోర్ ప్రమాణాలను తీర్చకపోతే, ఒకే సంస్థ కింద బహుళ బ్రాండ్‌లను అనుమతించే మల్టీ-బ్రాండ్ ఒప్పందానికి మీరు అర్హత పొందవచ్చు, అయితే దీనికి ప్రతి బ్రాండ్ తనకంటూ సొంత Shopify Plus ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉండాలి. మల్టీ-బ్రాండ్ ఆప్షన్‌లు, ధర నిర్ణయాల వివరాలను చర్చించడానికి Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.