Shopify భాగస్వాములను నియమించుకోవడం, వారితో కలిసి పని చేయడం

మీ వ్యాపారాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన సేవల కోసం నియమించుకోగల Shopify భాగస్వాములతో Partner Directory మిమ్మల్ని కలుపుతుంది.

భాగస్వాములను కనుగొనడం

మీరు 2 విధాలుగా భాగస్వామిని కనుగొనవచ్చు: పేరుతో వెతకవచ్చు లేదా వారు అందించే సేవలు లేదా భాగస్వామి స్థాయి ప్రకారం వర్గీకరించిన భాగస్వాములను అక్షర క్రమంలో బ్రౌజ్ చేయవచ్చు. భాగస్వామి ప్రొఫైల్‌లో అందుబాటులో ఉన్న ప్రధాన లొకేషన్ వంటి సమాచారం ఆధారంగా ఫిల్టర్‌లను ఉపయోగించి మీ శోధనను మరింత పరిమితం చేయవచ్చు.

భాగస్వామి సేవలు

భాగస్వాములు వివిధ రకాల సేవలు, ప్రత్యేక నైపుణ్యాలను అందించగలరు. వాటిలో ఇవి ఉన్నాయి:

  • స్టోర్ నిర్మాణం: హెడ్‌లెస్ డెవలప్‌మెంట్, కొత్త స్టోర్ సెటప్, ఉత్పత్తులు మరియు మెటాఫీల్డ్‌ల నిర్వహణ, స్టోర్‌ఫ్రంట్ మరియు థీమ్ అనుకూలీకరణ
  • కస్టమ్ యాప్ డెవలప్‌మెంట్: చెక్‌అవుట్ మరియు కస్టమర్ ఖాతాల అనుకూలీకరణ, కస్టమ్ యాప్/API డెవలప్‌మెంట్, Shopify Functions, స్టోర్‌ఫ్రంట్ ఎక్స్‌టెన్షన్‌లు
  • మార్కెటింగ్: బ్లాగ్ మరియు కంటెంట్ నిర్వహణ, మార్కెటింగ్ మరియు విక్రయాల ఛానెల్‌ల సెటప్, SEO ఆప్టిమైజేషన్
  • మైగ్రేషన్‌లు: ప్లాట్‌ఫారమ్ మైగ్రేషన్‌లు
  • ఇంటిగ్రేషన్‌లు: ERP ఇంటిగ్రేషన్‌లు, ఫుల్‌ఫిల్‌మెంట్ ఇంటిగ్రేషన్‌లు
  • ఛానెల్ విస్తరణ: డిజిటల్ ఉత్పత్తులు, డ్రాప్‌షిప్పింగ్, అంతర్జాతీయీకరణ మరియు మార్కెట్లు, రిటైల్ మరియు POS, టోకు మరియు B2B

భాగస్వామి స్థాయులు

వారి అనుభవం మరియు వారు సాధారణంగా సేవలందించే వ్యాపారుల వ్యాపార పరిమాణం ఆధారంగా భాగస్వాములను 4 స్థాయులుగా వర్గీకరిస్తారు:

  • సెలెక్ట్ పార్ట్‌నర్‌లు: సాధారణంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు ఎంచుకుంటారు.
  • ప్లస్ పార్ట్‌నర్‌లు: సాధారణంగా మిడ్-మార్కెట్, భారీ వ్యాపారాలు ఎంచుకుంటారు.
  • ప్రీమియర్ పార్ట్‌నర్‌లు: సాధారణంగా భారీ సంస్థలు ఎంచుకుంటాయి.
  • ప్లాటినం పార్టనర్‌లు: సాధారణంగా గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ వ్యాపారాలు ఎంచుకుంటాయి.

భాగస్వామి ప్రొఫైల్‌లో ఉండే సమాచారం

ప్రతి భాగస్వామి ప్రొఫైల్‌లో వారి భాగస్వామి ఖాతా లేదా Shopify వ్యాపారులతో చేసిన పని నుంచి సేకరించిన వాస్తవ డేటా ఆధారంగా వారి అనుభవం స్పష్టంగా తెలుస్తుంది. అందులో ఇవి ఉంటాయి:

  • వారి ప్రధాన లొకేషన్
  • వారి ప్రధాన భాషలు (గరిష్టంగా 3)
  • అంచనా ప్రకారం వారి బృందంలోని సభ్యుల సంఖ్య
  • వారు ప్రస్తుతం పని చేస్తున్న స్టోర్‌ల సంఖ్య
  • వారు Shopify భాగస్వామిగా ఉన్న కాలవ్యవధి
  • గత 4 సంవత్సరాల్లో వారు సేవలందించిన క్లయింట్ల ప్రధాన పరిశ్రమలు (గరిష్టంగా 3)
  • గత 4 సంవత్సరాల్లో వారి క్లయింట్ల కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ప్రధాన మార్కెట్లు (గరిష్టంగా 3)
  • గత 4 సంవత్సరాల్లో వారు వ్యాపారులకు అందించిన ప్రధాన సేవలు (గరిష్టంగా 6)
  • అర్హత గల వ్యాపారులతో కలిసి చేసిన పని, స్టోర్ బదిలీల ఆధారంగా భాగస్వామి ఎంపిక చేసి ప్రత్యేకంగా చూపే క్లయింట్లు (గరిష్టంగా 6)

భాగస్వాములను సంప్రదించడం

మీరు పని చేయాలనుకునే భాగస్వామిని కనుగొన్నప్పుడు, వారిని నేరుగా సంప్రదించడానికి వారి ప్రొఫైల్‌లోని Contact (సంప్రదించండి) బటన్‌ను ఉపయోగించండి. మీ అవసరాలు భాగస్వామికి అర్థమయ్యేలా తగినన్ని వివరాలు ఇవ్వండి. వాటిలో ఇవి ఉండాలి:

  • సంబంధిత లింక్‌లతో సహా మీ స్టోర్ గురించి పూర్తి వివరాలు
  • బడ్జెట్
  • కాలవ్యవధి
  • సమస్య లేదా సేవ వివరణ

భాగస్వాములతో కలిసి పని చేయడం

భాగస్వామి స్పందించిన తర్వాత, కొన్ని పనులను పూర్తి చేయడానికి సహకారి ఖాతా ద్వారా మీ స్టోర్‌కు యాక్సెస్ అడగవచ్చు.

పని పూర్తయ్యాక, భాగస్వామి మీకు నేరుగా బిల్లు ఇస్తారు. ఈ ఛార్జీలు మీ Shopify బిల్లులో కనిపించవు.

భాగస్వామితో సహకారాన్ని పూర్తి చేయండి

మీకు సహకారి నుండి ఇంక సహాయం అవసరం లేకపోతే, వారి ఖాతాను తీసివేయండి. ఒకవేళ, సహకారి వినియోగదారు 90 రోజులలోపు మీ స్టోర్‌లోకి లాగిన్ అవ్వకపోతే, వారి యాక్సెస్ గడువు ఆటోమెటిక్‌గా ముగుస్తుంది.