Shopifyలో Buy with Primeను యాక్టివేట్ చేయడం

కస్టమర్‌లు Amazon Pay లేదా Shop Payతో చెక్‌అవుట్ చేసినప్పుడు మీ Shopify స్టోర్‌లో వారి Amazon Prime మెంబర్‌షిప్‌ను ఉపయోగించుకునే ఆప్షన్‌ను అందించడం ద్వారా కన్వర్షన్ రేట్‌లను మెరుగుపరచడంలో Buy with Prime సహాయపడుతుంది. తద్వారా మీరు మీ వ్యాపారంపై దృష్టి సారించేందుకు మరింత సమయం లభిస్తుంది. Buy with Primeను ఉపయోగించడానికి మీరు amazon.comలో విక్రయించాల్సిన అవసరం లేదు.

Buy with Primeను యాక్టివేట్ చేయడం ద్వారా మీ ఉత్పత్తి పేజీలలో Prime హైలైట్ అవుతుంది, Prime మెంబర్‌ల అర్హత గల ఆర్డర్‌లపై వేగవంతమైన, ఉచిత డెలివరీతో పాటు ఉచిత రిటర్న్‌లను అందిస్తుంది.

మీ Shopify స్టోర్‌కు Buy with Primeను జోడించడం ద్వారా, మీ Shopify అడ్మిన్‌లోని Shopify కోసం Amazon MCF మరియు Buy with Prime యాప్ నుండి మీ Buy with Prime ఉత్పత్తులను మీరు మేనేజ్ చేయవచ్చు. Prime మాడ్యూల్ మీ Shopify స్టోర్‌లోని థీమ్‌కు ఆటోమేటిక్‌గా సరిపోలుతుంది.

Shopify కోసం Amazon MCF మరియు Buy with Prime యాప్ ధర నిర్ణయం మీరు వాడిన దానికి చెల్లించే విధానంలో (pay as you go) ఉంటుంది. Buy with Primeకి సంబంధించిన Amazon ధర నిర్ణయం, రుసుముల గురించి మరింత తెలుసుకోండి.

Buy with Primeను ఉపయోగించి ఉంచిన ఆర్డర్ కోసం Amazon ద్వారా చెల్లింపు క్యాప్చర్ చేయబడిన తర్వాత, మీ తదుపరి Shopify Payments పేఅవుట్లో ఆర్డర్ కోసం మీరు చెల్లింపును అందుకుంటారు.

నిబంధనలు మరియు అర్హత

Buy with Primeకు అర్హత పొందడానికి, మీ స్టోర్ మరియు మీ Amazon Seller Central ఖాతా తప్పనిసరిగా తీర్చాల్సిన కొన్ని ఆవశ్యకతలు, అలాగే మీరు అంగీకరించాల్సిన నిబంధనలు ఉన్నాయి. వ్యాపారులు మరియు కస్టమర్‌లకు స్థిరమైన అనుభవాన్ని అందించేందుకు ఈ ఆవశ్యకతలు విధించబడ్డాయి. ఆవశ్యకతల జాబితా ముందస్తు నోటీసు లేకుండా మార్చబడవచ్చు.

మీ స్టోర్

మీ Amazon ఖాతా ఆవశ్యకతలు

Buy with Primeను ఉపయోగించడానికి మీరు Amazon.comలో విక్రయించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, మీ Amazon ఖాతా కింది ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండాలి:

  • మీ Amazon Pay ఖాతా యాక్టివ్‌గా ఉండాలి. మీరు Shopify Paymentsలోని వాలెట్‌ల విభాగం ద్వారా లేదా నేరుగా Amazon Pay వాలెట్ ద్వారా Amazon Payని యాక్టివేట్ చేయవచ్చు.
  • మీ Amazon Seller Central ఖాతా తప్పనిసరిగా యాక్టివ్ స్టేటస్‌లో ఉన్న ప్రొఫెషనల్ ఖాతా అయి ఉండాలి. మీరు Shopify Payments ద్వారా Amazon Payని యాక్టివేట్ చేస్తే, Seller Central ఖాతా ఆటోమేటిక్‌గా క్రియేట్ చేయబడి, ఉపయోగించబడుతుంది, ఇది ఈ ఆవశ్యకతను పూర్తి చేస్తుంది.
  • మీ Seller Central ఖాతాలో Amazon ద్వారా ఫుల్‌ఫిల్‌మెంట్ తప్పనిసరిగా సెటప్ చేయబడి ఉండాలి.

Amazon తరచుగా అడిగే ప్రశ్నల లైబ్రరీలో Buy with Primeను సెటప్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

Buy with Prime కోసం వినియోగ నిబంధనలు

Buy with Prime వినియోగం Buy with Prime మర్చంట్ కన్సోల్ సేవా నిబంధనలు మరియు Buy with Prime వినియోగ షరతుల ద్వారా నియంత్రించబడుతుంది.

Buy with Primeని యాక్టివేట్ చేయండి

  1. Shopify App Storeకి లాగిన్ చేయండి.
  2. Amazon MCF and Buy with Prime app for Shopify కోసం వెతకడానికి సెర్చ బాక్స్‌ను ఉపయోగించి, ఆపై దాన్ని క్లిక్ చేయండి.
  3. యాప్ లిస్టింగ్ పేజీలో, యాప్‌ను జోడించండిపై క్లిక్ చేయండి.
  4. కింది ఫంక్షన్‌లకు అధికారం ఇవ్వడానికి, మీ Shopify అడ్మిన్ నుండి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండిపై క్లిక్ చేయండి:
  • యాప్ వినియోగం.
  • కస్టమర్, అలాగే స్టోర్ సమాచారాన్ని వీక్షించడానికి, ఇంకా సవరించడానికి యాక్సెస్‌తో సహా సమాచారాన్ని షేర్ చేయడానికి Shopify, Amazonలకు ఆమోదం తెలపండి.

మీరు Amazon MCF and Buy with Prime App for Shopifyని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీ Shopify అడ్మిన్‌లోని యాప్‌ల పేజీ నుండి మీరు దాన్ని వీక్షించవచ్చు, అలాగే ఉపయోగించవచ్చు. మల్టీ-ఛానల్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ (MCF)ను, అలాగే Buy with Primeని యాక్టివేట్ చేయడానికి ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. Buy with Primeను ఉపయోగించడానికి, మీరు ముందుగా కింది దశలను క్రమ పద్ధతిలో పూర్తి చేయాల్సి రావచ్చు:

  1. Shopify Paymentsలోని వాలెట్‌ల విభాగంలో Amazon Payని యాక్టివేట్ చేయండి.
  2. మీ Buy with Prime అకౌంట్‌ను సెటప్ చేయండి.
  3. Amazon MCF and Buy with Prime యాప్‌ను ఉపయోగించి మీ ఉత్పత్తులను మ్యాప్ చేసి, Buy with Primeని ఆన్ చేయండి.
  4. మీ Shopify అడ్మిన్‌లో సెట్టింగ్‌లు > షిప్పింగ్, అలాగే డెలివరీకి వెళ్లడం ద్వారా స్ప్లిట్ షిప్పింగ్ని యాక్టివేట్ చేయండి. ఇది కస్టమర్‌లు Buy with Prime, అలాగే స్వయంగా ఫుల్‌ఫిల్ చేసే ఐటెమ్‌లతో చెక్‌అవుట్ చేయడానికి అనుమతిస్తుంది.

మరింత సమాచారం కోసం, Buy with Prime app for Shopifyని చూడండి. మీకు సహాయం కావాలంటే, మీ అకౌంట్ నుండి మీరు Buy with Prime మద్దతును సంప్రదించవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు Buy with Prime మమ్మల్ని సంప్రదించండి ఫారమ్‌ను కూడా పూర్తి చేయవచ్చు.

Buy with Primeని డీయాక్టివేట్ చేయండి

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > యాప్‌లుకి వెళ్లండి.

  2. మీరు అన్‌ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న యాప్ అడ్డు వరుసలో, అన్‌ఇన్‌స్టాల్ చేయండిపై క్లిక్ చేయండి.

  3. ప్రదర్శితమయ్యే డైలాగ్‌లో, అన్‌ఇన్‌స్టాల్ చేయండిని క్లిక్ చేయండి.

Buy with Primeని మేనేజ్ చేయండి

మీ Buy with Prime అకౌంట్‌ను మేనేజ్ చేయడానికి మీరు ఈ కింది వాటిని చేయవచ్చు:

  • మీ ఉత్పత్తుల కోసం Prime షిప్పింగ్, అలాగే రిటర్న్‌లను ఆఫర్ చేయండి.
  • Buy with Prime ఆర్డర్‌లను వీక్షించండి.
  • Buy with Prime కన్సోల్ నుండి మీ అకౌంట్‌ను మేనేజ్ చేయండి.
  • Buy with Prime కోసం మద్దతు పొందండి.

ఆర్డర్‌లను వీక్షించండి

మీరు Amazon MCF and Buy with Prime App for Shopifyని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీ ఆర్డర్‌లు ఆటోమేటిక్‌గా మీ Shopify అడ్మిన్‌కు సింక్ చేయబడతాయి. Buy with Prime ద్వారా చేసిన ఆర్డర్‌లు, రిటర్న్‌లు, అలాగే రీఫండ్‌ల సంఖ్య వంటివి మీ వ్యాపారాన్ని Buy with Prime ఎలా ప్రభావితం చేస్తోందనే సమాచారాన్ని సులభంగా కనుగొనడానికి ఇది మీకు సహాయపడుతుంది.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లుకి వెళ్లండి.

  2. ఆర్డర్ వ్యూపై క్లిక్ చేయండి.

  3. Buy with Prime ట్యాగ్‌తో మీ ఆర్డర్‌లను ఫిల్టర్ చేయండి.

మీ Buy with Prime ఉత్పత్తి కేటలాగ్‌ను మేనేజ్ చేయండి

మీరు Buy with Primeని సెటప్ చేసిన తర్వాత, ప్రైమ్-ఎనేబుల్ చేసిన ఉత్పత్తులను మేనేజ్ చేయడం పేజీలో మీరు Buy with Primeకి అందుబాటులో ఉంచాలనుకుంటున్న ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. మీరు ఒక ఉత్పత్తిలో Buy with Primeని యాక్టివేట్ చేసిన తర్వాత, ఆ ఉత్పత్తి పేజీలో Buy with Prime బటన్ తక్షణమే ప్రదర్శించబడుతుంది.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, యాప్‌లు > Amazon MCF and Buy with Primeకి వెళ్లండి.

  2. ప్రైమ్-ఎనేబుల్ చేసిన ఉత్పత్తులను మేనేజ్ చేయడంపై క్లిక్ చేయండి.

  3. షరతులు నెరవేరితే Primeని ఆఫర్ చేయండి నిలువు వరుసలో, మీరు Buy with Primeతో ప్రదర్శించాలనుకుంటున్న ఉత్పత్తులను ఎంచుకోండి లేదా Buy with Prime నుండి మీరు దాచాలనుకుంటున్న ఉత్పత్తులను డిసెలెక్ట్ చేయండి.

Buy with Prime ఉపయోగించే కస్టమర్‌ల ఆన్‌లైన్ చెక్‌అవుట్ అనుభవం

వారి Amazon అకౌంట్ వివరాలను ఉపయోగించడం ద్వారా, మీ కస్టమర్‌లు కొత్త అకౌంట్‌ను సృష్టించాల్సిన లేదా చెక్‌అవుట్ వద్ద వారి వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ Amazon Prime మెంబర్ తమ Amazon అకౌంట్‌కి లింక్ చేయబడిన షిప్పింగ్ చిరునామాను లేదా చెల్లింపు పద్ధతిని సవరించాలనుకుంటే, అప్పుడు వారు చెక్‌అవుట్ వద్ద వారి Amazon అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయవచ్చు.

కస్టమర్‌లు సింగిల్ Prime-అర్హత ఉన్న ఐటెమ్‌తో చెక్‌అవుట్ చేయవచ్చు లేదా నాన్-Prime ఐటెమ్‌లతో సహా బహుళ ఐటెమ్‌లతో చెక్‌అవుట్ చేయవచ్చు. ఒక సింగిల్-ఐటెమ్, Prime-అర్హత ఉన్న కొనుగోలు అనేది ఉత్పత్తి పేజీ, కార్ట్ నుండి లేదా Prime మాడ్యూల్ ఉపయోగించి చెక్‌అవుట్ వద్ద ప్రారంభించబడుతుంది. బహుళ-ఐటెమ్‌ల చెక్‌అవుట్ అనేది కస్టమర్ కార్ట్‌లో లేదా చెక్‌అవుట్ వద్ద ఉండే Prime మాడ్యూల్ నుండి ప్రారంభించబడుతుంది.

కస్టమర్ Prime చెక్‌అవుట్‌ను ప్రారంభించినప్పుడు, వారు ఈ కింది వాటిని అనుభవిస్తారు:

  • కస్టమర్ వారి Amazon అకౌంట్‌కి లాగిన్ చేయడం ద్వారా వారి Prime మెంబర్‌షిప్‌ను వెరిఫై చేస్తారు:
    • కస్టమర్ అప్పటికే ఒక Prime మెంబర్ అయితే, వారు చెక్‌అవుట్ ఆర్డర్ రివ్యూ పేజీకి తీసుకెళ్లబడతారు, అలాగే వారు వారి Amazon అకౌంట్ నుండి సేవ్ చేసిన షిప్పింగ్ చిరునామా, ఇంకా చెల్లింపు పద్ధతిని ఉపయోగించవచ్చు.
    • కస్టమర్ అప్పటికే Prime మెంబర్ కాకపోతే, ఉచిత Prime ట్రయల్ ప్రారంభించే లేదా Prime మెంబర్‌షిప్ కోసం చెల్లించే ఆప్షన్ వారికి అందించబడుతుంది.
    • ఒకవేళ కస్టమర్ Primeతో కొనసాగకూడదని ఎంచుకుంటే, అప్పుడు వారు తిరిగి ఉత్పత్తి పేజీకి దారి మళ్లించబడతారు, ఇక్కడ వారు వారి కార్ట్‌కు లేదా Buy-with-Prime లేని ఆప్షన్‌తో చెక్‌అవుట్‌కి వెళ్లవచ్చు.
  • ఒకవేళ కొనుగోలు ఒక ఉత్పత్తి పేజీ ద్వారా ప్రారంభించబడితే, కస్టమర్ వారి వివరాలను రివ్యూ చేయడానికి, అలాగే వారి కొనుగోలును పూర్తి చేయడానికి నేరుగా చెక్‌అవుట్‌కి తీసుకెళ్లబడతారు.
  • కొనుగోలు అనేది కార్ట్ ద్వారా లేదా చెక్‌అవుట్ వద్ద ప్రారంభించబడితే, అప్పుడు కస్టమర్ వారి Prime-అర్హత లేని ఉత్పత్తుల కోసం చెక్‌అవుట్ వద్ద అందుబాటులో ఉన్న షిప్పింగ్ ఆప్షన్‌ల నుండి ఎంచుకోవచ్చు. తర్వాత వారు వారి కొనుగోలును రివ్యూ చేసి, చెల్లింపు చేయవచ్చు.

రీఫండ్‌లు, అలాగే రిటర్న్‌లను హ్యాండిల్ చేయడం

మీ కస్టమర్‌లు ఉచిత వాపసు వ్యవధిలోగా రిటర్న్‌ను సమర్పించినప్పుడు Buy with Prime వారి రీఫండ్ అనుభవాన్ని ఆటోమేట్ చేస్తుంది. Buy with Prime రీఫండ్‌ల గురించి మరింత తెలుసుకోండి.

Prime మెంబర్‌షిప్ ప్రాంప్ట్‌ను డీయాక్టివేట్ చేయండి

మీ కస్టమర్ Buy with Primeని ఉపయోగించి చెక్‌అవుట్ ఎంచుకుని, వారికి యాక్టివ్ Amazon Prime మెంబర్‌షిప్ లేకపోతే, డిఫాల్ట్‌గా, చెక్‌అవుట్ వద్ద ఒక Prime మెంబర్‌షిప్ ప్రాంప్ట్ ప్రదర్శించబడుతుంది. ఈ ప్రాంప్ట్ కస్టమర్‌లకు Prime కోసం సైన్ అప్ చేయడానికి లేదా పాజ్ చేయబడిన Prime మెంబర్‌షిప్‌ను మళ్లీ ప్రారంభించడానికి ఆప్షన్‌ను ఆఫర్ చేస్తుంది. ఒకవేళ మీరు ఈ ప్రాంప్ట్ చెక్‌అవుట్ వద్ద ప్రదర్శించబడకూడదనుకుంటే, మీరు దీన్ని డీయాక్టివేట్ చేయవచ్చు.

దశలు:

  1. మీ Amazon Merchant Console అకౌంట్‌కి లాగిన్ చేసి, ఆపై Amazon Services ట్యాబ్‌కు వెళ్లండి.
  2. Prime మెంబర్‌షిప్ ప్రాంప్ట్‌ను కనుగొనండి.
  3. చర్యలు > Prime మెంబర్‌షిప్‌ను డీయాక్టివేట్ చేయండిని ఎంచుకోండి.