Fraud Control యాప్

Fraud Control యాప్ ఐకాన్
Shopify App Store నుండి Fraud Controlను ఇన్‌స్టాల్ చేయండి.

మీ స్టోర్‌లో జరిగిన మోసం లేదా జరగడానికి అవకాశం ఉన్న మోసాలకు సంబంధించిన విశ్లేషణలను చూపించడానికి Fraud Control యాప్, మీ Shopify అడ్మిన్‌లో ఒక డాష్‌బోర్డ్‌ను క్రియేట్ చేసి ప్రదర్శిస్తుంది. ఈ డాష్‌బోర్డ్, ఛార్జ్‌బ్యాక్‌లు, Shopify Protect, మోసం కారణంగా రద్దు చేయబడిన ఆర్డర్‌లు, అలాగే మీ స్టోర్ ఎదుర్కొంటున్న సాధారణ రిస్క్ స్థాయి గురించిన వివరాలను అందిస్తుంది.

మీరు Shopify App Store నుండి Fraud Controlను ఇన్‌స్టాల్ చేయవచ్చు. Fraud Control యాప్ అనేది థర్డ్-పార్టీ మోసాల నియంత్రణ అప్లికేషన్‌లతో ఎటువంటి విభేదాలను కలిగించదు, అంతేకాకుండా ఇతర మోసాల నివారణ యాప్‌ల వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపదు.

Shopify Payments అందుబాటులో ఉన్న లొకేషన్‌లలోని అన్ని స్టోర్ ప్లాన్‌లకు Fraud Control అందుబాటులో ఉంటుంది. మీరు మీ చెల్లింపు ప్రాసెసర్‌గా Shopify Payments‌ను ఉపయోగిస్తే తప్ప, కొంత డేటా మీకు అందుబాటులో ఉండదు.

Fraud Control డాష్‌బోర్డ్

మీరు Fraud Control యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీ Shopify అడ్మిన్‌లోని యాప్‌లు > Fraud Control‌కు వెళ్లడం ద్వారా మీరు డాష్‌బోర్డ్‌ను చూడవచ్చు. Fraud Control డాష్‌బోర్డ్ అనేది మోసం కారణంగా మీరు ఎదుర్కొంటున్న రిస్క్ స్థాయి, అలాగే కింది సమాచారంతో కూడిన డాష్‌బోర్డ్‌ను ప్రదర్శిస్తుంది:

  • అంగీకార రేటు: మీరు ఎంచుకున్న తేదీల మధ్య పరిధిలో Shopify మోసాల విశ్లేషణ ద్వారా తక్కువ-రిస్క్ లేదా మధ్యస్థ-రిస్క్ గలవిగా గుర్తించబడిన మొత్తం ఆర్డర్‌ల శాతం.
  • అధిక-రిస్క్ ఆర్డర్‌లు: మీరు ఎంచుకున్న తేదీల మధ్య పరిధిలో Shopify మోసాల విశ్లేషణ ద్వారా అధిక-రిస్క్ గలవిగా గుర్తించబడిన మొత్తం ఆర్డర్‌ల శాతం.
  • మోసపూరిత ఛార్జ్‌బ్యాక్‌లు: మీరు ఎంచుకున్న తేదీల మధ్య పరిధిలో మోసపూరితమైనవిగా గుర్తించబడిన మొత్తం ఛార్జ్‌బ్యాక్‌ల శాతం.
  • Shopify Protect రక్షణ: మీరు ఎంచుకున్న తేదీల మధ్య పరిధిలో Shopify Protect ద్వారా మోసపూరిత ఛార్జ్‌బ్యాక్‌ల నుండి రక్షించబడిన మొత్తం ఆర్డర్‌ల విలువ. ఫుల్‌ఫిల్‌మెంట్ ఆవశ్యకతలకు గడువు సమయం ఉండటం వలన, ఈ డేటా పది రోజుల పాటు ఆలస్యంగా కనిపిస్తుంది.
  • Shopify Protect కవరేజ్: మీరు ఎంచుకున్న తేదీల మధ్య పరిధిలో వివాదాలను ఎదుర్కొని, Shopify Protect ద్వారా రక్షించబడిన మొత్తం ఆర్డర్‌ల విలువ.
  • మోసం కారణంగా రద్దు చేయబడిన ఆర్డర్‌లు: మీరు ఎంచుకున్న తేదీల మధ్య పరిధిలో మోసపూరిత కార్యకలాపాల కారణంగా సిబ్బంది లేదా యాప్‌ల ద్వారా రీఫండ్ చేయబడిన మొత్తం ఆర్డర్‌ల విలువ.

మీ స్టోర్ Shopify Payments‌ను ఉపయోగించనట్లయితే, మీరు కేవలం అంగీకార రేటు, అధిక-రిస్క్ ఆర్డర్‌లు మరియు మోసం కారణంగా రద్దు చేయబడిన ఆర్డర్‌లుకు సంబంధించిన డేటాను మాత్రమే యాక్సెస్ చేయగలరు.

ఎంచుకున్న పోలిక వ్యవధితో పోల్చినప్పుడు ఈ విలువలలో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటే, ఆ మార్పులు కూడా డాష్‌బోర్డ్‌లో ప్రదర్శించబడతాయి.

మీరు గనుక Shopify Payments ఉపయోగిస్తుంటే, మీ స్టోర్ ఛార్జ్‌బ్యాక్ ఆరోగ్య స్థితిని యాక్సెస్ చేయవచ్చు. కింది స్థాయిలు క్రెడిట్ కార్డ్ కంపెనీలు సెట్ చేసిన ప్రమాణాలపై ఆధారపడి ఉంటాయి:

  • ఉత్తమ స్థితి: మీ స్టోర్‌లోని ఛార్జ్‌బ్యాక్‌ల సంఖ్య మొత్తం ఆర్డర్‌ల సంఖ్యలో 0.4% కంటే తక్కువ ఉందని ఈ స్టేటస్ సూచిస్తుంది. మీ స్టోర్ రిస్క్ స్థాయి సగటు కంటే తక్కువగా ఉంది.
  • రిస్క్‌లో ఉంది: మీ స్టోర్‌లోని ఛార్జ్‌బ్యాక్‌ల సంఖ్య మొత్తం ఆర్డర్‌ల సంఖ్యలో 0.4%, 0.6% మధ్య ఉందని ఈ స్టేటస్ సూచిస్తుంది. మీ స్టోర్ రిస్క్ స్థాయి సగటుగా ఉంది, అంతేకాకుండా మోసపూరిత కార్యకలాపాల కారణంగా మీ స్టోర్ రిస్క్‌ను ఎదుర్కొంటున్నట్లు ఇది సూచిస్తుంది.
  • ఎక్కువ రిస్క్‌లో ఉంది: మీ స్టోర్‌లోని ఛార్జ్‌బ్యాక్‌ల సంఖ్య మొత్తం ఆర్డర్‌ల సంఖ్యలో 0.6% కంటే ఎక్కువ ఉందని ఈ స్టేటస్ సూచిస్తుంది. మీ స్టోర్ రిస్క్ స్థాయి సగటు కంటే ఎక్కువగా ఉంది, అంతేకాకుండా మీ స్టోర్ ఉండాల్సిన దాని కంటే ఎక్కువ రిస్క్‌లో ఉన్నట్లు ఇది సూచిస్తుంది.

వీటిలో ఏదైనా విభాగాన్ని విస్తరించి చూడటానికి, మీరు రివ్యూ చేయాలనుకుంటున్న విభాగంలోని చార్ట్ ఐకాన్‌ను క్లిక్ చేయండి.

తేదీ వారీగా ఫిల్టర్ చేయండి

మీకు ఏ తేదీల మధ్య పరిధిలోని సమాచారం కావాలో మీరు ఎంచుకోవచ్చు. ఆటోమేటిక్‌గా ఎంపికయ్యే తేదీల మధ్య పరిధి 30 రోజులు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, యాప్‌లు > Fraud Control‌కు వెళ్లండి.

  2. తేదీ సూచికను క్లిక్ చేయండి.

  3. తేదీల మధ్య పరిధిని ఎంచుకోండి:

    • తేదీల మధ్య పరిధికి సంబంధించిన ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ప్రారంభ తేదీ, ముగింపు తేదీని ఎంచుకోవడం ద్వారా కస్టమ్ తేదీల మధ్య పరిధిని ఎంచుకోండి.
  4. వర్తింపజేయండి క్లిక్ చేయండి.

పోలిక కోసం తేదీల మధ్య పరిధి

పోలిక కోసం ఎంచుకున్న తేదీల మధ్య పరిధి అనేది అసలు తేదీల మధ్య పరిధి పక్కన ప్రదర్శించబడుతుంది. Fraud control యాప్ మీ ప్రస్తుత డేటాను అంతే పరిధి ఉన్న గతం నాటి వ్యవధిలోని డేటాతో పోలుస్తుంది.

ఉదాహరణకు, మీరు 8 మే 2023న మీ తేదీ పరిధిగా గత 90 రోజులు అని ఎంచుకున్నారనుకుందాం. డాష్‌బోర్డ్‌లో ప్రదర్శించబడే డేటా 7 ఫిబ్రవరి 2023 నుండి 7 మే 2023 వరకు ఉంటుంది. పోలిక తేదీ పరిధి దానికి మునుపటి 90 రోజులు అంటే 10 నవంబర్ 2022 నుండి 6 ఫిబ్రవరి 2023 వరకు ఉంటుంది.

పోలిక తేదీ పరిధి అనేది మీ డేటా కోసం మీరు ఎంచుకునే తేదీ పరిధి ద్వారా నిర్ణయించబడుతుంది మరియు దీనిని మార్చడం కుదరదు. అయితే, మీకు కావాలంటే, మీరు పోలికను తీసివేయవచ్చు.

పోలిక తేదీ పరిధిని తీసివేయండి

  1. మీ Shopify అడ్మిన్ నుండి, యాప్‌లు > Fraud Control‌కు వెళ్లండి.

  2. పోల్చండి తేదీ పరిధిపై క్లిక్ చేయండి.

  3. పోలిక లేదుపై క్లిక్ చేయండి.

Fraud Control చెక్‌అవుట్ నియమాలు

మోసపూరితమయ్యే అవకాశం ఉన్న ఆర్డర్‌లను ఫిల్టర్ చేయడానికి, బ్లాక్ చేయడానికి Fraud Control చెక్‌అవుట్ నియమాలు మిమ్మల్ని అనుమతిస్తాయి. మీరు నిర్వచించిన కొన్ని నియమాల ఆధారంగా, చెక్‌అవుట్‌లు ఆర్డర్‌లుగా మారకుండా యాప్ బ్లాక్ చేస్తుంది.

Fraud Control చెక్‌అవుట్ నియమాలు మీ వ్యాపారాన్ని పలు విధాలుగా రక్షించడంలో సహాయపడతాయి:

  • అంతర్గత మోసాల విశ్లేషణ అందించే దానికి మించి అదనపు రక్షణను జోడిస్తుంది.
  • ఇమెయిల్‌ల కోసం ఫిల్టర్‌లను సృష్టించండి.
  • చిరునామా లక్షణాల కోసం ఫిల్టర్‌లను సృష్టించండి.
  • IP చిరునామాల కోసం ఫిల్టర్‌లను సృష్టించండి.

నియమాలను సెటప్ చేయండి

నియమాలు మోసాన్ని బ్లాక్ చేసేలా, కానీ చట్టబద్ధమైన చెక్‌అవుట్‌లను బ్లాక్ చేయకుండా ఉండేలా వాటిని జాగ్రత్తగా సృష్టించాలి. ఈ నియమాలు ఛార్జ్‌బ్యాక్‌లు జరగవని లేదా స్టోర్‌పై ఛార్జ్‌బ్యాక్‌లు రావని హామీ ఇవ్వలేవు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, యాప్‌లు > Fraud Control‌కు వెళ్లండి.

  2. నియమాలుపై క్లిక్ చేయండి.

  3. నియమాన్ని సృష్టించండిపై క్లిక్ చేయండి.

  4. కొత్త నియమం పేజీలో, మీ నియమాన్ని చెక్‌అవుట్ షరతుల విభాగంలో కాన్ఫిగర్ చేయండి. ప్రతి నియమాన్ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చెక్‌అవుట్ షరతులతో రూపొందించవచ్చు. ఉదాహరణకు, ఆ నిర్దిష్ట షరతులతో ఆర్డర్‌లను బ్లాక్ చేసే నియమాన్ని రూపొందించడానికి మీరు IP చిరునామాతో పాటు ZIP కోడ్‌ను కూడా ఉపయోగించవచ్చు.

  5. ఉపయోగించిన చెక్‌అవుట్ షరతుల ఆధారంగా నియమం పేరు అప్‌డేట్ అవుతుంది మరియు దీనిని ఎడిట్ చేయడం కుదరదు.

  6. మీరు అన్ని ఫీల్డ్‌లను జోడించిన తర్వాత సేవ్ చేయండిపై క్లిక్ చేయవచ్చు.

  7. ఇది స్వయంచాలకంగా నియమాన్ని ఎనేబుల్ చేసి యాక్టివేట్ చేస్తుంది.

  8. (ఐచ్ఛికం) మీరు నియమం గురించిన గమనికలు లేదా వివరణను జోడించవచ్చు.

నియమాన్ని తొలగించడం లేదా డీయాక్టివేట్ చేయడం

  1. నియమాలు పేజీ నుండి, మీరు డీయాక్టివేట్ చేయాలనుకుంటున్న లేదా తొలగించాలనుకుంటున్న నియమాల చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయండి.
  2. తొలగించండి లేదా డీయాక్టివేట్ చేయండి పై క్లిక్ చేయండి, దీని వలన తక్షణమే ఆ నియమం డీయాక్టివేట్ అవుతుంది లేదా తొలగించబడుతుంది.

Fraud Control చెక్‌అవుట్ నియమాల తరచుగా అడిగే ప్రశ్నలు

Fraud Control చెక్‌అవుట్ నియమాలు మోసాన్ని పూర్తిగా నివారించగలవా?

లేదు. మీకు ఎప్పటికీ మోసపూరిత ఆర్డర్ రాదని Fraud Control హామీ ఇవ్వలేదు. మీరు యాప్‌లో సృష్టించిన నిర్దిష్ట నియమానికి మ్యాచ్ అయితే మినహా, ఒక చెక్‌అవుట్ మోసపూరితమైనదో కాదో అది అంచనా వేయలేదు. వీలైతే, ఆర్డర్‌ను నెరవేర్చడానికి ముందే దాని మోసాల విశ్లేషణను రివ్యూ చేయండి.

తమ ఆర్డర్ Fraud Controlలో సెట్ చేయబడిన నియమానికి మ్యాచ్ అవుతోందని కస్టమర్‌కు తెలుస్తుందా?

లేదు. ఆర్డర్ మోసపూరితమైనదిగా అనిపిస్తే Fraud Control కస్టమర్‌లకు నోటిఫై చేయదు. చెక్‌అవుట్ ప్రక్రియలో బ్లాక్ చేయబడిన చెక్‌అవుట్‌కు చెక్‌అవుట్ పూర్తి కాలేదనే ఎర్రర్ వస్తుంది, దానికి పరిష్కారంగా కొనుగోలుదారు స్టోర్ యజమానిని సంప్రదించాల్సిందిగా అడుగుతుంది. బ్లాక్ చేయబడిన చెక్‌అవుట్‌లు మీ స్టోర్ వదిలివేయబడిన చెక్‌అవుట్‌ల విభాగంలో చూపబడతాయి.

Shopify Flow

మీ స్టోర్‌లో మోసపూరిత కార్యకలాపాలను మేనేజ్ చేయడానికి మీరు వెచ్చించే సమయాన్ని, శ్రమను తగ్గించడంలో సహాయపడటానికి మీరు Shopify Flowలో ఆటోమేటెడ్ చర్యలను ఉపయోగించవచ్చు. మీ Shopify అడ్మిన్‌లోని Fraud Control యాప్ పేజీ నుండి, మీరు ముందుగానే సిద్ధం చేయబడిన అనేక Shopify Flow టెంప్లేట్‌లను ఇన్‌స్టాల్ చేయవచ్చు:

  • అధిక-రిస్క్ ఆర్డర్‌ల చెల్లింపును మాన్యువల్‌గా క్యాప్చర్ చేయండి: ఆర్డర్ రిస్క్ స్థాయి అధికంగా ఉంటే, ఈ టెంప్లేట్ ఆటోమేటిక్‌గా ఆర్డర్ చెల్లింపును క్యాప్చర్ చేయకుండా ఆపివేస్తుంది.
  • అధిక-రిస్క్ ఆర్డర్‌లను రద్దు చేసి, రీస్టాక్ చేయండి: ఈ టెంప్లేట్ అధిక-రిస్క్ ఆర్డర్‌లను రద్దు చేస్తుంది, ఆర్డర్ చేసిన ఐటెమ్‌లను మీ ఇన్వెంటరీకి రిటర్న్ చేస్తుంది మరియు కస్టమర్‌కి వారి ఆర్డర్ రద్దు అయినట్లు నోటిఫై చేస్తుంది.
  • తప్పు ఇమెయిల్ చిరునామాల నుండి వచ్చిన ఆర్డర్‌లను రద్దు చేయండి: గతంలో మోసపూరిత ఆర్డర్‌ల కోసం ఉపయోగించిన ఇమెయిల్ చిరునామా నుండి ఆర్డర్ చేయబడితే, ఈ టెంప్లేట్ ఆ ఆర్డర్‌కు ట్యాగ్‌లను జోడిస్తుంది, అలాగే దాన్ని రద్దు చేస్తుంది.
  • కస్టమర్‌లు చేసే ఆర్డర్‌లను రోజుకు ఐదింటికి పరిమితం చేయండి: కస్టమర్ ఒకే రోజులో ఐదు కంటే ఎక్కువ ఆర్డర్‌లు చేస్తే, ఈ టెంప్లేట్ ఆ కస్టమర్ ఆర్డర్‌లన్నింటినీ రద్దు చేస్తుంది.
  • ఛార్జ్‌బ్యాక్ గురించి మీ బృందానికి నోటిఫై చేయండి: మీ స్టోర్‌కు ఛార్జ్‌బ్యాక్ వస్తే, ఈ టెంప్లేట్ సిబ్బందికి ఇంటర్నల్ ఇమెయిల్‌ను పంపుతుంది.
  • అధిక-రిస్క్ ఆర్డర్‌ల గురించి నోటిఫికేషన్ పొందండి: చెల్లింపును క్యాప్చర్ చేయడానికి ముందే ఏదైనా అధిక-రిస్క్ ఆర్డర్ వస్తే, ఈ టెంప్లేట్ సిబ్బందికి ఇంటర్నల్ ఇమెయిల్‌ను పంపుతుంది.
  • "రిటర్న్ అబ్యూస్" చేసే కస్టమర్‌ల గురించి నోటిఫికేషన్ పొందండి: పదే పదే ఐటెమ్‌లను రిటర్న్ చేసిన కస్టమర్ ద్వారా ఆర్డర్ చేయబడితే, ఈ టెంప్లేట్ ఆ ఆర్డర్‌కి ట్యాగ్‌లను జోడించి, సిబ్బందికి ఇంటర్నల్ ఇమెయిల్‌ను పంపుతుంది.

మీకు Shopify Flowలో వర్క్‌ఫ్లోలను సృష్టించడంలో అనుభవం ఉంటే, మీ అవసరాలకు తగినట్లుగా మీరు ఈ టెంప్లేట్‌లను అనుకూలీకరించవచ్చు లేదా మీ స్వంత రిస్క్ మేనేజ్‌మెంట్ వర్క్‌ఫ్లోను సృష్టించవచ్చు.