Shopify Protectతో ఛార్జ్‌బ్యాక్‌లను పరిష్కరించడం
Shop Payని ఉపయోగించే లావాదేవీలలో మీరు ఛార్జ్‌బ్యాక్‌లను పరిష్కరించవచ్చు, అలాగే మోసపూరితమైన, గుర్తించబడని ఛార్జ్‌బ్యాక్ కారణాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీకు ఛార్జ్‌బ్యాక్ వస్తే, ఆ ఛార్జ్‌బ్యాక్‌కు స్పందించే ప్రక్రియ అనేది ఆర్డర్ Shopify Protect ద్వారా సురక్షితం చేయబడిందా లేదా అన్న దానిపైన, ఛార్జ్‌బ్యాక్ కారణంపైన ఆధారపడి మారుతుంది.
ఛార్జ్‌బ్యాక్‌లు, విచారణలను నివారించడం గురించి మరింత తెలుసుకోండి.
ఈ పేజీలో
సురక్షిత ఆర్డర్‌లపై మోసపూరితమైన లేదా గుర్తించబడని ఛార్జ్‌బ్యాక్‌లు
ఆ ఛార్జీని తాము ప్రామాణీకరించలేదని కార్డుదారు క్లెయిమ్ చేసినప్పుడు, ఆ ఛార్జ్‌బ్యాక్ అనేది fraudulent (మోసపూరితం) అని పరిగణించబడుతుంది. ఇది ఛార్జ్‌బ్యాక్‌లకు సాధారణ కారణం, అలాగే కార్డ్ దొంగిలించబడినట్లయితే ఇలా జరగవచ్చు. ఒక కస్టమర్ తమ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లోని వ్యాపారి పేరును లేదా లొకేషన్‌ను గుర్తించనప్పుడు unrecognized (గుర్తించబడని) ఛార్జ్‌బ్యాక్ జరుగుతుంది.
సురక్షిత ఆర్డర్‌పై మోసపూరితమైన లేదా గుర్తించబడని ఛార్జ్‌బ్యాక్ చేయబడితే, మీరు ఎటువంటి చర్య తీసుకోనవసరం లేదు. మీ అకౌంట్‌లో ఏమి జరుగుతుందంటే:
- వివాదాస్పదమైన మొత్తం, అలాగే ఛార్జ్‌బ్యాక్ రుసుము మీ అకౌంట్ నుండి డెబిట్ చేయబడతాయి.
- వివాదాస్పదమైన మొత్తం, అలాగే ఛార్జ్‌బ్యాక్ రుసుము మీకు క్రెడిట్‌గా వెంటనే తిరిగి చెల్లించబడతాయి.
- ఒకవేళ కార్డుదారుని బ్యాంక్ ఛార్జ్‌బ్యాక్‌ను మీకు అనుకూలంగా పరిష్కరిస్తే, అప్పుడు వివాదాస్పదమైన మొత్తం, రుసుము మీకు తిరిగి ఇవ్వబడతాయి, అలాగే Shopify Protect నుండి పొందిన క్రెడిట్‌ను Shopify వెనక్కి తీసుకుంటుంది.
మీరు మీ Shopify అడ్మిన్‌కు వెళ్లి, పేఅవుట్‌ల పేజీకి నావిగేట్ చేసి, ఆపై లావాదేవీలను క్లిక్ చేయడం ద్వారా డెబిట్‌లను, క్రెడిట్‌లను రివ్యూ చేయవచ్చు.
సురక్షితం కాని ఆర్డర్‌లపై మోసపూరితమైన లేదా గుర్తించబడని ఛార్జ్‌బ్యాక్‌లు
సురక్షితం చేయబడని ఆర్డర్‌పై మోసపూరిత ఛార్జ్‌బ్యాక్ చేయబడితే, అప్పుడు ఛార్జ్‌బ్యాక్‌ను పరిష్కరించే ప్రక్రియ సాధారణ ప్రక్రియ వలెనే ఉంటుంది. ఈ సందర్భంలో, క్రెడిట్ కార్డ్ కంపెనీ వివాదాన్ని మీకు అనుకూలంగా పరిష్కరిస్తే తప్ప, వివాదాస్పదమైన మొత్తం, ఛార్జ్‌బ్యాక్ రుసుము మీకు తిరిగి చెల్లించబడవు.
సురక్షితం కాని ఆర్డర్‌ల ఛార్జ్‌బ్యాక్‌లకు సంబంధించిన ఛార్జ్‌బ్యాక్‌లు, విచారణలను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
సురక్షితమైన లేదా సురక్షితం కాని ఆర్డర్‌లపై ఇతర రకాల ఛార్జ్‌బ్యాక్‌లు
మోసపూరితమైన, గుర్తించబడని ఛార్జ్‌బ్యాక్‌లు సర్వసాధారణమైనప్పటికీ, కస్టమర్‌లు వివిధ కారణాల వల్ల తమ క్రెడిట్ కార్డ్‌పై జరిగిన చెల్లింపును వివాదాస్పదం చేయవచ్చు. ఉత్పత్తిని అందుకోలేదని క్లెయిమ్ చేయడం లేదా ఉత్పత్తి లోపభూయిష్టంగా ఉందని, దెబ్బతిన్నదని లేదా వివరించిన విధంగా లేదని వారు నమ్మడం లాంటివి ఇందులో ఉండవచ్చు.
ఇతర రకాల ఛార్జ్‌బ్యాక్‌లకు సంబంధించిన ఛార్జ్‌బ్యాక్‌లు, విచారణల మేనేజ్‌మెంట్ గురించి మరింత తెలుసుకోవడానికి, ఛార్జ్‌బ్యాక్‌లు, విచారణలను మేనేజ్ చేయడం డాక్యుమెంటేషన్‌ను చూడండి.