కెనడాలో Shopify Paymentsతో కస్టమర్ చెల్లింపు పద్ధతులు

మీరు కెనడాలో Shopify Payments ఉపయోగిస్తున్నప్పుడు, మీరు క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్‌లు, స్థానిక చెల్లింపు పద్ధతులతో కస్టమర్ చెల్లింపులను అంగీకరించవచ్చు. మీ స్టోర్ కోసం ఏ చెల్లింపు పద్ధతులను యాక్టివేట్ చేయాలో నిర్ణయించడానికి అందుబాటులో ఉన్న ఆప్షన్‌లను రివ్యూ చేయండి. Shopify Paymentsతో కస్టమర్ చేసే కార్డ్ కొనుగోళ్ల కోసం మీకు విధించబడే చెల్లింపు ప్రాసెసింగ్ రేట్‌లు మీ Shopify ఖాతాకు ఉన్న సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మీద ఆధారపడి ఉంటాయి.

Shopify Paymentsతో, మీ చెల్లింపు ప్రాసెసింగ్, ఆర్డర్ నిర్వహణ సిస్టమ్‌లను నేరుగా మీ Shopify అడ్మిన్ నుండి నిర్వహించవచ్చు. మోసం గుర్తింపు మరియు 3D సెక్యూర్ లాంటి ఎన్‌క్రిప్షన్ పద్ధతుల ద్వారా Shopify Payments మీ కస్టమర్‌ల డేటాను రక్షిస్తుంది.

కెనడాలో Shopify Paymentsతో క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు

కెనడాలో Shopify Payments ఉపయోగించే వ్యాపారాలు Shopify POSతో ఆన్‌లైన్, స్వయంగా చేసే చెల్లింపులను అంగీకరించవచ్చు. Shopify POSతో స్వయంగా చెల్లింపులను అంగీకరించడానికి, మీరు ఈ కింది ఆప్షన్‌లలో ఒకదాన్ని ఉపయోగించవచ్చు:

మీరు Shopify Payments యాక్టివేట్ చేసినప్పుడు, క్రెడిట్, డెబిట్ కార్డ్ చెల్లింపులు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి మరియు అదనపు సెటప్ ఏదీ అవసరం లేదు. మీరు కింది క్రెడిట్, డెబిట్ కార్డ్ బ్రాండ్‌ల నుండి చెల్లింపులను అంగీకరించవచ్చు:

  • Visa
  • Mastercard
  • American Express
  • Discover

Shopify POSను ఉపయోగించే కెనడాలోని వ్యాపారాలు కాంటాక్ట్‌లెస్ ట్యాప్, అలాగే చిప్ ప్లస్ పిన్ ఎంట్రీ పద్ధతుల కోసం ఒక అనుకూలమైన కార్డ్ రీడర్ను ఉపయోగించి Interac డెబిట్ కార్డ్‌లను కూడా అంగీకరించవచ్చు. Discoverను అంగీకరించడం ద్వారా UnionPayతో చెల్లించడానికి, అలాగే American Expressను అంగీకరించడం ద్వారా JCBతో చెల్లించడానికి మీ కస్టమర్‌లకు ఆటోమేటిక్‌గా అవకాశం లభిస్తుంది.

కెనడాలో Shopify Paymentsతో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్‌లు

కెనడాలో Shopify Paymentsతో ఈ కింది యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ చెల్లింపు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి:

కెనడాలో Shopify Paymentsతో స్థానిక చెల్లింపు పద్ధతులు

మీ Shopify అడ్మిన్ చెల్లింపులు విభాగంలో స్థానిక చెల్లింపు పద్ధతులు తప్పనిసరిగా యాక్టివేట్ చేయబడాలి.

మీ స్టోర్ లొకేషన్ ఆధారంగా కాకుండా మీ కస్టమర్ లొకేషన్ ఆధారంగా స్థానిక చెల్లింపు పద్ధతులు చెక్‌అవుట్ వద్ద ప్రదర్శించబడతాయి. అంటే వివిధ దేశాల కస్టమర్‌లు ఎంచుకున్న స్థానిక చెల్లింపు పద్ధతులను ఉపయోగించి వారు చేసే చెల్లింపులను మీరు అంగీకరించవచ్చు.

ఉదాహరణకు, మీ స్టోర్ కెనడాలో ఉండి, మీరు స్థానిక చెల్లింపు పద్ధతిగా iDEAL | Weroను యాక్టివేట్ చేసి ఉంటే, మరియు మీ కస్టమర్ నెదర్లాండ్స్‌లో ఉంటే, ఆ కస్టమర్‌ కోసం చెక్‌అవుట్ వద్ద iDEAL | Wero చెల్లింపు ఆప్షన్‌గా కనిపిస్తుంది.

మీరు ఏ చెల్లింపు పద్ధతులను యాక్టివేట్ చేయవచ్చు మరియు చెక్‌అవుట్ వద్ద ఈ ఆప్షన్‌లను ఉపయోగించడానికి మీ కస్టమర్‌లు ఏ దేశాల్లో ఉండాలి అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి కింది పట్టికను రివ్యూ చేయండి.

కెనడాలో Shopify Paymentsతో అందుబాటులో ఉన్న స్థానిక చెల్లింపు పద్ధతులు.
చెల్లింపు పద్ధతికస్టమర్ లొకేషన్
Bancontactబెల్జియం
iDEAL | Weroనెదర్లాండ్స్
MB WAYపోర్చుగల్
Satispayఇటలీ

నిర్దిష్ట స్థానిక చెల్లింపు పద్ధతుల కోసం అదనపు అర్హత ఆవశ్యకతలు

iDEAL | Weroను యాక్టివేట్ చేసే ముందు మీరు Shopify Paymentsతో కనీసం 100 ఆర్డర్‌లకైనా ప్రాసెస్ చేసి ఉండాలి. స్థానిక చెల్లింపు పద్ధతిగా iDEAL | Weroను ఆఫర్ చేస్తున్నప్పటి ఆవశ్యకతల గురించి మరింత తెలుసుకోండి.

  • MB WAY: మీ కస్టమర్‌లు తప్పనిసరిగా పోర్చుగల్‌లో ఉండాలి, EURలలో చెల్లించాలి, అలాగే వాళ్ల MB WAY ఖాతాలో రిజిస్టర్ చేసిన మొబైల్ ఫోన్ నంబర్‌ను అందించాలి. Shopify Paymentsతో MB WAYని ఉపయోగించడానికున్న ఆవశ్యకతల గురించి మరింత తెలుసుకోండి.