చైనా కోసం Shopify Payments
చైనా కోసం Shopify Payments, మెయిన్‌ల్యాండ్ చైనా బిజినెస్ ఎంటిటీని కలిగి ఉన్న అర్హత గల వ్యాపారులను క్రాస్-బోర్డర్ సేల్స్ కోసం చెల్లింపులను ఆమోదించడానికి అనుమతిస్తుంది.
మీ Shopify స్టోర్‌లోని చెక్‌అవుట్ వద్ద వివిధ రకాల చెల్లింపు పద్ధతులను ఆమోదించడానికి మీరు చైనాలో Shopify Paymentsను ఉపయోగించవచ్చు. మీరు మీ Shopify ఖాతాను సెటప్ చేసినప్పుడు Shopify Paymentsను యాక్టివేట్ చేయవచ్చు. వ్యాపార వెరిఫికేషన్, అలాగే పేఅవుట్‌ల కోసం మీరు తప్పనిసరిగా WorldFirst ఖాతాను కనెక్ట్ చేయాలి. చైనాలో Shopify Payments ఆవశ్యకతల గురించి మరింత తెలుసుకోండి.
Shopify Paymentsతో, మీ చెల్లింపు ప్రాసెసింగ్, ఆర్డర్ నిర్వహణ సిస్టమ్‌లు నేరుగా మీ Shopify అడ్మిన్ నుండి నిర్వహించబడతాయి. మోసపు గుర్తింపు, అలాగే 3D సెక్యూర్ లాంటి ఎన్‌క్రిప్షన్ పద్ధతుల ద్వారా Shopify Payments మీ కస్టమర్‌ల డేటాను రక్షిస్తుంది. Shopify Paymentsతో కస్టమర్ కార్డ్ కొనుగోళ్ల కోసం మీకు విధించే చెల్లింపు ప్రాసెసింగ్ ధరలు, మీ Shopify ఖాతా కోసం మీరు కలిగి ఉన్న సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటాయి.
చైనా కోసం Shopify Payments, క్రెడిట్, డెబిట్ కార్డ్ చెల్లింపులను, అలాగే యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ చెల్లింపులను ఆమోదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.