ఎస్టోనియా కోసం Shopify Paymentsను ఉపయోగించడానికి అవసరమైన బ్యాంక్ ఖాతా మరియు వ్యక్తిగత సమాచార ఆవశ్యకతలు

ఎస్టోనియాలో Shopify Paymentsను ఉపయోగించడానికి ముందు, నిబంధనలను పాటించడానికి మరియు ఆర్థిక నేరాలను నిరోధించడానికి ఉన్న ఆవశ్యకతలను మీరు అర్థం చేసుకోవాలి. Shopify Paymentsను సెటప్ చేస్తున్నప్పుడు, మీరు వెరిఫికేషన్ కోసం వ్యక్తిగత సమాచారాన్ని అందించాలి, ఆమోదించబడిన డాక్యుమెంటేషన్ రకాలను సమర్పించాలి మరియు మీ సమర్పణలు నిర్దిష్ట సమ్మతి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.

ఎస్టోనియాలో Shopify Paymentsను ఉపయోగించడానికి ఆవశ్యకతలు

మీరు ఎస్టోనియాలో Shopify Paymentsను ఉపయోగించే ముందు, మీరు కింది ఆవశ్యకతలను తీర్చారని నిర్ధారించుకోండి:

  • అర్హత గల వ్యాపార రకాలు: నిర్దిష్ట రకాల వ్యాపారాలు మరియు సేవలు Shopify Paymentsను ఉపయోగించడానికి అనుమతించబడవు. మీ వ్యాపారం అర్హత పొందిందో లేదో తెలుసుకోవడానికి, Shopify Payments సేవా నిబంధనలలో ఎస్టోనియా కోసం నిషేధించబడిన వ్యాపార రకాల జాబితాను చూడండి.
  • బ్యాంక్ ఖాతా ఆవశ్యకతలు: మీరు Shopify Paymentsకు కనెక్ట్ చేయడానికి ముందు మీ బ్యాంక్ ఖాతా కింది ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండాలి:
    • బ్యాంక్ ఖాతా EUR కరెన్సీలో ఉండాలి.
    • బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా సింగిల్ యూరో పేమెంట్స్ ఏరియా (SEPA) బదిలీలకు అర్హత కలిగి ఉండాలి.
    • బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా కింది దేశ కోడ్‌లలో దేనితోనైనా ప్రారంభమయ్యే అంతర్జాతీయ బ్యాంక్ ఖాతా నంబర్ (IBAN)ని కలిగి ఉండాలి: AT, BE, BG, CH, CY, DE, DK, EE, ES, FI, FR, GB, GI, GR, HR, HU, IE, IT, LT, LU, LV, MT, NL, NO, PL, PT, RO, SE లేదా SI.

సపోర్ట్ చేయని బ్యాంక్ ఖాతా రకాలు

నిర్దిష్ట బ్యాంక్ ఖాతా రకాలు Shopify Paymentsకు అనుకూలంగా ఉండవు. కింది ఖాతా రకాలకు సపోర్ట్ లేదు:

  • కేవలం వైర్ బదిలీలను మాత్రమే ఆమోదించే చెకింగ్ ఖాతాలు: ఈ ఖాతాలు Shopify Paymentsతో పని చేయవు.
  • పొదుపు ఖాతాలు: Shopify Payments పేఅవుట్‌ల కోసం పొదుపు ఖాతాలను ఉపయోగించలేరు.
  • ఫ్లెక్స్-కరెన్సీ ఖాతాలు: ఏకకాలంలో బహుళ కరెన్సీలకు సపోర్ట్ చేసే ఖాతాలకు సపోర్ట్ లేదు.
  • మనీ ట్రాన్స్‌ఫర్ సేవలు: కొన్ని ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి బ్యాంక్ ఖాతాలను అనుకరించే సేవలను Shopify Paymentsతో ఉపయోగించలేరు.

నాన్-Shopify వర్చువల్ ఖాతాలకు సపోర్ట్ ఉన్నప్పటికీ, మీరు ఈ ఖాతాలతో మరిన్ని పేఅవుట్ వైఫల్యాలను ఎదుర్కోవచ్చు.

మీ ఖాతా మీ ప్రాంతం కోసం జాబితా చేయబడిన బదిలీ రకాన్ని అంగీకరించగలదో లేదో నిర్ధారించడానికి, మీ బ్యాంక్‌ను సంప్రదించండి.

సమాచారాన్ని సేకరించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం

ఆర్థిక నేరాలను నిరోధించడానికి రూపొందించబడిన ఎస్టోనియాలోని నిబంధనలకు అనుగుణంగా మీ గురించి మరియు మీ వ్యాపారం గురించిన సమాచారాన్ని సేకరించి, ధృవీకరించాల్సిన బాధ్యత Shopifyకి మరియు దాని బ్యాంకింగ్ భాగస్వాములకు ఉంటుంది. స్థానిక నియమాలు మరియు నిబంధనలు మారుతున్నందున, మీ Shopify Payments ఖాతా జీవితకాలమంతా అదనపు సమాచారాన్ని అందించమని Shopify మరియు దాని బ్యాంకింగ్ భాగస్వాములు మిమ్మల్ని సంప్రదించవచ్చు.

సేకరించబడిన సమాచారం వ్యాపారం యొక్క గుర్తింపు, వ్యాపారానికి లింక్ చేయబడిన వ్యక్తుల గుర్తింపులు మరియు ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం యొక్క స్వభావాన్ని నిర్ధారించడానికి ఉపయోగించబడుతుంది.

Shopify మీకు డాక్యుమెంటేషన్‌ను ఎప్పుడూ భౌతికంగా మెయిల్ చేయదు. ఏవైనా ముఖ్యమైన డాక్యుమెంట్‌లు లేదా కమ్యూనికేషన్‌లు ఇమెయిల్ చేయబడతాయి లేదా మీ Shopify అడ్మిన్‌లోని సెట్టింగ్‌లు > యూజర్‌ల పేజీలో స్టోర్ యజమానికి డిజిటల్‌గా అందుబాటులో ఉంచబడతాయి.

మీ సమాచారం ఎలా గోప్యంగా మరియు భద్రంగా ఉంచబడుతుందో తెలుసుకోవడానికి Shopify గోప్యతా విధానాన్ని రివ్యూ చేయండి.

ఎస్టోనియాలో Shopify Paymentsను యాక్టివేట్ చేయడానికి అవసరమైన వ్యక్తిగత, వ్యాపార సమాచారం

మీరు అందించాల్సిన సమాచారం దానిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి, మీరు తప్పనిసరిగా మీ వ్యాపార రకాన్ని సరిగ్గా గుర్తించాలి.

మీరు ఏ ప్రభుత్వ ఏజెన్సీలోనూ రిజిస్టర్ కాకపోయినా, లేదా మీరు రిజిస్టర్ చేసుకుని వ్యాపారాన్ని ఏకవ్యక్తి యాజమాన్యంగా నడుపుతున్నా (FIE, సొంత వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారితో సహా), వ్యక్తి / ఏకవ్యక్తి యాజమాన్యం వ్యాపార రకాన్ని ఎంచుకోండి.

మీరు మీ వ్యాపారాన్ని రిజిస్టర్ చేసుకుని ఉండి, వ్యాపార రిజిస్ట్రీ కోడ్ (Äriregistri kood) కలిగి ఉంటే, కింది సూచనల ఆధారంగా మీ వ్యాపార రకాన్ని ఎంచుకోండి:

  • వ్యాపార రిజిస్ట్రీ కోడ్‌లు ఉన్న భాగస్వామ్యాలు, అంటే TÜ, UÜ లేదా కమర్షియల్ అసోసియేషన్స్ లాంటివి నమోదిత భాగస్వామ్యం వ్యాపార రకాన్ని ఎంచుకోవాలి.
  • వ్యాపార రిజిస్ట్రీ కోడ్‌లు ఉన్న లాభాపేక్ష లేని సంస్థలు, అంటే MTÜ లేదా SA లాంటివి నమోదిత లాభాపేక్ష లేని సంస్థ వ్యాపార రకాన్ని ఎంచుకోవాలి.
  • వ్యాపార రిజిస్ట్రీ కోడ్‌లు ఉన్న మిగతా అన్ని వ్యాపారాలు, అంటే OÜ లాంటివి ప్రైవేట్ కార్పొరేషన్ వ్యాపార రకాన్ని ఎంచుకోవాలి.

మీది నమోదిత వ్యాపారం అయ్యుండి, కానీ వ్యాపార రిజిస్ట్రీ కోడ్ లేకుంటే, కింది సూచనల ఆధారంగా మీ వ్యాపార రకాన్ని ఎంచుకోండి:

  • వ్యాపార రిజిస్ట్రీ కోడ్‌లు లేని భాగస్వామ్యాలు నమోదు కాని భాగస్వామ్యం వ్యాపార రకాన్ని ఎంచుకోవాలి.
  • వ్యాపార రిజిస్ట్రీ కోడ్‌లు లేని లాభాపేక్ష లేని సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు నమోదు కాని లాభాపేక్ష లేని సంస్థ వ్యాపార రకాన్ని ఎంచుకోవాలి.

ఏ వ్యాపార రకాన్ని ఎంచుకోవాలో మీకు ఖచ్చితంగా తెలియకపోతే, సరైన దాన్ని ఎంచుకోవడంలో సహాయం కోసం Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.

వ్యక్తులు / ఏకవ్యక్తి యాజమాన్యం

వ్యక్తులు అనే వారు ప్రభుత్వంలో రిజిస్టర్ కాకుండా ప్రైవేట్‌గా వ్యాపారం చేసే సింగిల్-ఓనర్ వ్యాపారాలు. ఏకవ్యక్తి యాజమాన్యాలు అంటే, ప్రభుత్వంలో వారి వ్యక్తిగత సమాచారం కింద రిజిస్టర్ చేసుకున్న సింగిల్-ఓనర్ వ్యాపారాలు. ఇవి రెండూ కూడా ఎస్టోనియాలో నివసిస్తున్న ఒకే వ్యక్తి ఆధీనంలో, నియంత్రణలో నడిచే వ్యాపారాలు. ఇందులో ఫ్రీలాన్సర్‌లు, అలాగే స్వయం ఉపాధి పొందుతున్న చిన్న వ్యాపార నిర్వాహకులు కూడా వస్తారు.

ఈ వ్యాపార రకాలను ఒకే విధంగా పరిగణిస్తారు కాబట్టి ఒకే రకమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. వ్యక్తులు, ఏకవ్యక్తి యాజమాన్యాలు కింది వాటిని అందించాలి:

  • చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
  • పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
  • ఇమెయిల్ అడ్రస్: చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్‌గా ఉన్న ఇమెయిల్ అడ్రస్.
  • ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్.
  • ఎస్టోనియాలోని నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌తో సరిపోలే మీ ఇంటి చిరునామా.

ఒకవేళ మీ సమాచారం ఆటోమేటిక్‌గా వెరిఫై అవ్వకపోతే, మీ గుర్తింపును వెరిఫై చేయాలనే అభ్యర్థన మీకు అందుతుంది. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఇంటి చిరునామా లాంటి వివరాలేమైనా తప్పుగా ఉంటే, మీరు మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.

సమాచారం సరిగ్గానే ఉన్నప్పటికీ మీకు వెరిఫికేషన్ కోసం అభ్యర్థన అందితే, మీరు కింది టాస్క్‌లలో ఒకదానిని పూర్తి చేయడం ద్వారా ఆ అభ్యర్థనను పరిష్కరించవచ్చు:

  • చెల్లుబాటు అయ్యే ఫోటో IDతో సెల్ఫీ తీసుకోవడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించండి.
  • వేరువేరు గుర్తింపు రుజువు , చిరునామా రుజువు డాక్యుమెంట్‌లను మీ Shopify అడ్మిన్‌లో అప్‌లోడ్ చేయండి.
    • మీ డాక్యుమెంట్లపై ఉన్న సమాచారం మీరు మీ అకౌంట్‌లో నమోదు చేసిన దానికి ఖచ్చితంగా సరిపోలాలి. అవసరమైతే మీ డాక్యుమెంట్లకు సరిపోయేలా మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
ప్రైవేట్ కార్పొరేషన్ (OÜ)

ప్రైవేట్ కార్పొరేషన్ అనేది వాటాదారుల సొంతమైన, ఈక్విటీని షేర్లుగా విభజించిన వ్యాపారం. కార్పొరేషన్‌ను దాన్ని నడిపే వ్యక్తులతో సంబంధం లేకుండా, దానికదే ఒక ప్రత్యేకమైన చట్టబద్ధమైన సంస్థగా పరిగణిస్తారు. వీరికి సాధారణంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఉంటారు.

ప్రైవేట్ కార్పొరేషన్లు తమ అకౌంట్ ప్రతినిధిగా లబ్ధిదారుడైన యజమానిని లేదా నిర్ణయాధికారం ఉన్న ఎగ్జిక్యూటివ్‌ను కేటాయించాలి. అకౌంట్ ప్రతినిధి కింది సమాచారాన్ని అందించాలి:

  • చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
  • పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
  • ఇమెయిల్ అడ్రస్: చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్‌గా ఉన్న ఇమెయిల్ అడ్రస్.
  • ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్.
  • నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌తో సరిపోలే మీ ఇంటి చిరునామా.
  • ఉద్యోగ హోదా: వ్యాపారంలో మీరు కలిగి ఉన్న ఉద్యోగ హోదా.
  • ఈక్విటీ: వర్తిస్తే, వ్యాపారంలో మీకు ఉన్న ఈక్విటీ శాతం.

ఒకవేళ మీ సమాచారం ఆటోమేటిక్‌గా వెరిఫై అవ్వకపోతే, మీ గుర్తింపును వెరిఫై చేయాలనే అభ్యర్థన మీకు అందుతుంది. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఇంటి చిరునామా లాంటి వివరాలేమైనా తప్పుగా ఉంటే, మీరు మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.

సమాచారం సరిగ్గానే ఉన్నప్పటికీ మీకు వెరిఫికేషన్ కోసం అభ్యర్థన అందితే, మీరు కింది టాస్క్‌లలో ఒకదానిని పూర్తి చేయడం ద్వారా ఆ అభ్యర్థనను పరిష్కరించవచ్చు:

  • చెల్లుబాటు అయ్యే ఫోటో IDతో సెల్ఫీ తీసుకోవడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించండి.
  • వేరువేరు గుర్తింపు రుజువు , చిరునామా రుజువు డాక్యుమెంట్‌లను మీ Shopify అడ్మిన్‌లో అప్‌లోడ్ చేయండి.
    • మీ డాక్యుమెంట్లపై ఉన్న సమాచారం మీరు మీ అకౌంట్‌లో నమోదు చేసిన దానికి ఖచ్చితంగా సరిపోలాలి. అవసరమైతే మీ డాక్యుమెంట్లకు సరిపోయేలా మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.

ప్రైవేట్ కార్పొరేషన్లు వ్యాపారం గురించి కింది వివరాలను కూడా అందించాలి:

  • నమోదిత వ్యాపార పేరు: సెంట్రల్ కమర్షియల్ రిజిస్టర్‌లో రికార్డ్ చేయబడిన చట్టబద్ధమైన వ్యాపార పేరు.
  • వ్యాపార రిజిస్ట్రీ కోడ్ (Äriregistri kood): సెంట్రల్ కమర్షియల్ రిజిస్టర్‌లో రికార్డ్ చేయబడిన వ్యాపార రిజిస్ట్రీ కోడ్.
  • విలువ ఆధారిత పన్ను (VAT) నంబర్: వర్తిస్తే, మీ VAT రిజిస్ట్రేషన్ నంబర్.
  • వ్యాపార ఫోన్ నంబర్: వ్యాపారం కోసం యాక్టివ్‌గా ఉన్న సంప్రదింపు ఫోన్ నంబర్.
  • వ్యాపార చిరునామా: సెంట్రల్ కమర్షియల్ రిజిస్టర్‌లో రికార్డ్ చేయబడిన వ్యాపారం యొక్క అధికారిక నమోదిత చిరునామా.

ఎస్టోనియాలోని ప్రభుత్వ రిజిస్ట్రీలతో మీ వివరాలను సరిపోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు ఆ సమాచారాన్ని వెరిఫై చేస్తారు. మీరు కరెక్ట్ లెటర్ కేస్, విరామ చిహ్నాలు, గుర్తులను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

వ్యాపారం గురించి మీరు అందించే సమాచారాన్ని వెరిఫై చేయడం కుదరకపోతే, మీరు వ్యాపార వెరిఫికేషన్ డాక్యుమెంట్‌ను అందించాల్సి రావచ్చు. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ అకౌంట్‌లో లిస్ట్ చేసిన నమోదిత పేరు, వ్యాపార రిజిస్ట్రీ కోడ్, వ్యాపార చిరునామా డాక్యుమెంట్‌లోని సమాచారంతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అలాగే డాక్యుమెంట్‌కు సరిపోయేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఆమోదయోగ్యమైన వ్యాపార డాక్యుమెంట్‌ల జాబితాను రివ్యూ చేయండి.

మీరు కంపెనీకి లబ్ధిదారుడైన యజమాని అయితే, లబ్ధిదారులైన ఇతర యజమానుల పేర్లను కూడా మీరు లిస్ట్ చేయాలి. వాళ్ళ పేర్లు, పుట్టిన తేదీలు, ఇంటి చిరునామాలను వారి ప్రభుత్వ డాక్యుమెంట్‌లలో ఉన్నట్టుగానే మీరు ఖచ్చితంగా ఎంటర్ చేశారని నిర్ధారించుకోండి. వాళ్ళ గుర్తింపు ఆటోమేటిక్‌గా వెరిఫై కాకపోతే, వాళ్లు ఫోటో IDని లేదా చిరునామా రుజువును అందించాల్సి రావచ్చు.

మీరు అందించే యజమానుల పేర్లు, మీ ప్రభుత్వ వ్యాపార రిజిస్ట్రీలో లిస్ట్ చేసిన యజమానులతో సరిపోలాలి. ఈ వివరాలు సరిపోలకపోతే, సంతకం చేయండి బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా అటెస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయమని లేదా యాజమాన్య రుజువు డాక్యుమెంట్‌ను అందించమని మిమ్మల్ని అడుగుతారు. ఈ విధంగా వివరాలు సరిపోలని సమస్యను పరిష్కరించడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయడమే అత్యంత వేగవంతమైన మార్గం, కానీ మీరు డాక్యుమెంట్‌ను సబ్‌మిట్ చేయాలనుకుంటే, మీ అకౌంట్‌లో లిస్ట్ చేసిన యజమానుల పేర్లు మీ డాక్యుమెంట్‌లో లిస్ట్ చేసిన యజమానులతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌కు సరిపోయేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఒకవేళ మీ వ్యాపారం ఏదైనా హోల్డింగ్ కంపెనీ ఆధీనంలో ఉంటే (పూర్తిగా లేదా పాక్షికంగా), వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయండి.

ఒకవేళ మీ వ్యాపారానికి యజమానులు లేకుంటే, అటెస్టేషన్‌పై సంతకం చేయమని లేదా దానికి బదులుగా మీ డైరెక్టర్‌లను నిర్ధారించే డాక్యుమెంట్‌ను అందించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మీరు డాక్యుమెంట్‌ను సమర్పించడానికి ప్రాధాన్యత ఇస్తే, మీ అకౌంట్‌లో జాబితా చేయబడిన డైరెక్టర్‌ల పేర్లు మీ డాక్యుమెంట్‌లో జాబితా చేయబడిన డైరెక్టర్‌లతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌కు సరిపోయేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.

నమోదిత భాగస్వామ్యాలు (TÜ, UÜ, కమర్షియల్ అసోసియేషన్స్)

నమోదిత భాగస్వామ్యం అనేది కనీసం ఇద్దరు భాగస్వాముల సొంతమైన వ్యాపారం, వీరు వాణిజ్య కార్యకలాపాల కోసం రిజిస్టర్ చేసుకుని, వ్యాపార రిజిస్ట్రీ కోడ్‌ను పొంది ఉంటారు. నమోదిత భాగస్వామ్యాలు ఈక్విటీని కలిగి ఉంటాయి, అలాగే ఈ భాగస్వామ్యాన్ని యజమానులతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైన సంస్థగా పరిగణిస్తారు.

నమోదిత భాగస్వామ్యాలు తమ Shopify Payments అకౌంట్ యొక్క అకౌంట్ ప్రతినిధిగా ఒక యజమానిని లేదా భాగస్వామిని నియమించాలి. అకౌంట్ ప్రతినిధి కింది సమాచారాన్ని అందించాలి:

  • చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
  • పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
  • ఇమెయిల్ అడ్రస్: చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్‌గా ఉన్న ఇమెయిల్ అడ్రస్.
  • ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్.
  • నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌తో సరిపోలే మీ ఇంటి చిరునామా.
  • ఉద్యోగ హోదా: వ్యాపారంలో మీరు కలిగి ఉన్న ఉద్యోగ హోదా.
  • ఈక్విటీ: వర్తిస్తే, వ్యాపారంలో మీకు ఉన్న ఈక్విటీ శాతం.

ఒకవేళ మీ సమాచారం ఆటోమేటిక్‌గా వెరిఫై అవ్వకపోతే, మీ గుర్తింపును వెరిఫై చేయాలనే అభ్యర్థన మీకు అందుతుంది. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఇంటి చిరునామా లాంటి వివరాలేమైనా తప్పుగా ఉంటే, మీరు మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.

సమాచారం సరిగ్గానే ఉన్నప్పటికీ మీకు వెరిఫికేషన్ కోసం అభ్యర్థన అందితే, మీరు కింది టాస్క్‌లలో ఒకదానిని పూర్తి చేయడం ద్వారా ఆ అభ్యర్థనను పరిష్కరించవచ్చు:

  • చెల్లుబాటు అయ్యే ఫోటో IDతో సెల్ఫీ తీసుకోవడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించండి.
  • వేరువేరు గుర్తింపు రుజువు , చిరునామా రుజువు డాక్యుమెంట్‌లను మీ Shopify అడ్మిన్‌లో అప్‌లోడ్ చేయండి.
    • మీ డాక్యుమెంట్లపై ఉన్న సమాచారం మీరు మీ అకౌంట్‌లో నమోదు చేసిన దానికి ఖచ్చితంగా సరిపోలాలి. అవసరమైతే మీ డాక్యుమెంట్లకు సరిపోయేలా మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.

నమోదిత భాగస్వామ్యాలు వ్యాపారం గురించి కింది వివరాలను కూడా అందించాలి:

  • నమోదిత వ్యాపార పేరు: సెంట్రల్ కమర్షియల్ రిజిస్టర్‌లో రికార్డ్ చేయబడిన చట్టబద్ధమైన వ్యాపార పేరు.
  • వ్యాపార రిజిస్ట్రీ కోడ్ (Äriregistri kood): సెంట్రల్ కమర్షియల్ రిజిస్టర్‌లో రికార్డ్ చేయబడిన వ్యాపార రిజిస్ట్రీ కోడ్.
  • విలువ ఆధారిత పన్ను (VAT) నంబర్: వర్తిస్తే, మీ VAT రిజిస్ట్రేషన్ నంబర్.
  • వ్యాపార ఫోన్ నంబర్: వ్యాపారం కోసం యాక్టివ్‌గా ఉన్న సంప్రదింపు ఫోన్ నంబర్.
  • వ్యాపార చిరునామా: సెంట్రల్ కమర్షియల్ రిజిస్టర్‌లో రికార్డ్ చేయబడిన వ్యాపారం యొక్క అధికారిక నమోదిత చిరునామా.

ఎస్టోనియాలోని ప్రభుత్వ రిజిస్ట్రీలతో మీ వివరాలను సరిపోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు ఆ సమాచారాన్ని వెరిఫై చేస్తారు. మీరు కరెక్ట్ లెటర్ కేస్, విరామ చిహ్నాలు, గుర్తులను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

వ్యాపారం గురించి మీరు అందించే సమాచారాన్ని వెరిఫై చేయడం కుదరకపోతే, మీరు వ్యాపార వెరిఫికేషన్ డాక్యుమెంట్‌ను అందించాల్సి రావచ్చు. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ అకౌంట్‌లో లిస్ట్ చేసిన నమోదిత పేరు, వ్యాపార రిజిస్ట్రీ కోడ్, వ్యాపార చిరునామా డాక్యుమెంట్‌లోని సమాచారంతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అలాగే డాక్యుమెంట్‌కు సరిపోయేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఆమోదయోగ్యమైన వ్యాపార డాక్యుమెంట్‌ల జాబితాను రివ్యూ చేయండి.

మీరు యజమాని లేదా భాగస్వామి అయితే, యజమానులు లేదా భాగస్వాములైన ఇతర వ్యక్తుల పేర్లను కూడా మీరు లిస్ట్ చేయాలి. వాళ్ళ పేర్లు, పుట్టిన తేదీలు, ఇంటి చిరునామాలను వారి ప్రభుత్వ డాక్యుమెంట్‌లలో ఉన్నట్టుగానే మీరు ఖచ్చితంగా ఎంటర్ చేశారని నిర్ధారించుకోండి. వాళ్ళ గుర్తింపు ఆటోమేటిక్‌గా వెరిఫై కాకపోతే, వాళ్లు ఫోటో IDని లేదా చిరునామా రుజువును అందించాల్సి రావచ్చు.

మీరు అందించే యజమానుల పేర్లు, మీ ప్రభుత్వ వ్యాపార రిజిస్ట్రీలో లిస్ట్ చేసిన యజమానులతో సరిపోలాలి. ఈ వివరాలు సరిపోలకపోతే, సంతకం చేయండి బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా అటెస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయమని లేదా యాజమాన్య రుజువు డాక్యుమెంట్‌ను అందించమని మిమ్మల్ని అడుగుతారు. ఈ విధంగా వివరాలు సరిపోలని సమస్యను పరిష్కరించడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయడమే అత్యంత వేగవంతమైన మార్గం, కానీ మీరు డాక్యుమెంట్‌ను సబ్‌మిట్ చేయాలనుకుంటే, మీ అకౌంట్‌లో లిస్ట్ చేసిన యజమానుల పేర్లు మీ డాక్యుమెంట్‌లో లిస్ట్ చేసిన యజమానులతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌కు సరిపోయేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఒకవేళ మీ వ్యాపారం ఏదైనా హోల్డింగ్ కంపెనీ ఆధీనంలో ఉంటే (పూర్తిగా లేదా పాక్షికంగా), వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయండి.

నమోదు కాని భాగస్వామ్యాలు

నమోదు కాని భాగస్వామ్యం అనేది వ్యాపార రిజిస్ట్రీ కోడ్ కోసం రిజిస్టర్ చేసుకోని, అయితే భాగస్వామ్య ఒప్పందాన్ని కలిగి ఉన్న కనీసం ఇద్దరు భాగస్వాముల స్వంతమైన వ్యాపారం. ఈ సందర్భంలో యజమానులే చట్టబద్ధమైన సంస్థగా పరిగణించబడతారు మరియు వ్యాపారం అనేది ప్రత్యేక సంస్థ కాదు.

నమోదు కాని భాగస్వామ్యాలు తప్పనిసరిగా ఒక యజమానిని తమ Shopify Payments అకౌంట్ అకౌంట్ ప్రతినిధిగా పేర్కొనాలి. అకౌంట్ ప్రతినిధి ఈ కింది సమాచారాన్ని అందించాలి:

  • చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
  • పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
  • ఇమెయిల్ అడ్రస్: చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్‌గా ఉన్న ఇమెయిల్ అడ్రస్.
  • ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్.
  • నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌తో సరిపోలే మీ ఇంటి చిరునామా.
  • ఉద్యోగ హోదా: వ్యాపారంలో మీరు కలిగి ఉన్న ఉద్యోగ హోదా.
  • ఈక్విటీ: వర్తిస్తే, వ్యాపారంలో మీకు ఉన్న ఈక్విటీ శాతం.

ఒకవేళ మీ సమాచారం ఆటోమేటిక్‌గా వెరిఫై అవ్వకపోతే, మీ గుర్తింపును వెరిఫై చేయాలనే అభ్యర్థన మీకు అందుతుంది. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఇంటి చిరునామా లాంటి వివరాలేమైనా తప్పుగా ఉంటే, మీరు మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.

సమాచారం సరిగ్గానే ఉన్నప్పటికీ మీకు వెరిఫికేషన్ కోసం అభ్యర్థన అందితే, మీరు కింది టాస్క్‌లలో ఒకదానిని పూర్తి చేయడం ద్వారా ఆ అభ్యర్థనను పరిష్కరించవచ్చు:

  • చెల్లుబాటు అయ్యే ఫోటో IDతో సెల్ఫీ తీసుకోవడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించండి.
  • వేరువేరు గుర్తింపు రుజువు , చిరునామా రుజువు డాక్యుమెంట్‌లను మీ Shopify అడ్మిన్‌లో అప్‌లోడ్ చేయండి.
    • మీ డాక్యుమెంట్లపై ఉన్న సమాచారం మీరు మీ అకౌంట్‌లో నమోదు చేసిన దానికి ఖచ్చితంగా సరిపోలాలి. అవసరమైతే మీ డాక్యుమెంట్లకు సరిపోయేలా మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.

నమోదు కాని భాగస్వామ్యాలు వ్యాపారం గురించిన ఈ కింది వివరాలను కూడా అందించాలి:

  • నమోదిత వ్యాపార పేరు: డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా చట్టబద్ధమైన వ్యాపార పేరు.
  • విలువ ఆధారిత పన్ను (VAT) నంబర్: వర్తిస్తే, మీ VAT రిజిస్ట్రేషన్ నంబర్.
  • వ్యాపార ఫోన్ నంబర్: వ్యాపారం కోసం యాక్టివ్‌గా ఉన్న సంప్రదింపు ఫోన్ నంబర్.
  • వ్యాపార చిరునామా: డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా వ్యాపారం యొక్క అధికారిక నమోదిత చిరునామా.

ఎస్టోనియాలోని ప్రభుత్వ రిజిస్ట్రీలతో మీ వివరాలను సరిపోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు ఆ సమాచారాన్ని వెరిఫై చేస్తారు. మీరు కరెక్ట్ లెటర్ కేస్, విరామ చిహ్నాలు, గుర్తులను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

మీరు వ్యాపారం గురించి అందించే సమాచారాన్ని వెరిఫై చేయలేకపోతే, మీరు వ్యాపార వెరిఫికేషన్ డాక్యుమెంట్‌ను అందించాల్సి రావచ్చు. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ అకౌంట్‌లో పేర్కొన్న నమోదిత పేరు మరియు వ్యాపార చిరునామా డాక్యుమెంట్‌లోని సమాచారంతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి, అలాగే డాక్యుమెంట్‌తో సరిపోలేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఆమోదయోగ్యమైన వ్యాపార డాక్యుమెంట్‌ల జాబితాను రివ్యూ చేయండి.

మీరు యజమాని లేదా భాగస్వామి అయితే, యజమానులు లేదా భాగస్వాములైన ఇతర వ్యక్తుల పేర్లను కూడా మీరు లిస్ట్ చేయాలి. వాళ్ళ పేర్లు, పుట్టిన తేదీలు, ఇంటి చిరునామాలను వారి ప్రభుత్వ డాక్యుమెంట్‌లలో ఉన్నట్టుగానే మీరు ఖచ్చితంగా ఎంటర్ చేశారని నిర్ధారించుకోండి. వాళ్ళ గుర్తింపు ఆటోమేటిక్‌గా వెరిఫై కాకపోతే, వాళ్లు ఫోటో IDని లేదా చిరునామా రుజువును అందించాల్సి రావచ్చు.

మీరు అందించే యజమానుల పేర్లు, మీ ప్రభుత్వ వ్యాపార రిజిస్ట్రీలో లిస్ట్ చేసిన యజమానులతో సరిపోలాలి. ఈ వివరాలు సరిపోలకపోతే, సంతకం చేయండి బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా అటెస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయమని లేదా యాజమాన్య రుజువు డాక్యుమెంట్‌ను అందించమని మిమ్మల్ని అడుగుతారు. ఈ విధంగా వివరాలు సరిపోలని సమస్యను పరిష్కరించడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయడమే అత్యంత వేగవంతమైన మార్గం, కానీ మీరు డాక్యుమెంట్‌ను సబ్‌మిట్ చేయాలనుకుంటే, మీ అకౌంట్‌లో లిస్ట్ చేసిన యజమానుల పేర్లు మీ డాక్యుమెంట్‌లో లిస్ట్ చేసిన యజమానులతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌కు సరిపోయేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఒకవేళ మీ వ్యాపారం ఏదైనా హోల్డింగ్ కంపెనీ ఆధీనంలో ఉంటే (పూర్తిగా లేదా పాక్షికంగా), వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయండి.

నమోదిత నాన్-ప్రాఫిట్‌లు (MTÜ, SA)

నాన్-ప్రాఫిట్ (NPO) అనేది దాని వాటాదారులకు లాభాలను చేకూర్చడం మినహా ఇతర ప్రయోజనాల కోసం స్థాపించబడిన సంస్థ. ప్రజలకు లేదా కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం దీని ప్రధాన ఉద్దేశం. నమోదిత నాన్-ప్రాఫిట్‌లు వాణిజ్య ప్రయోజనాల కోసం రిజిస్టర్ చేసుకుని, వ్యాపార రిజిస్ట్రీ కోడ్‌ను పొంది ఉంటాయి.

నమోదిత నాన్-ప్రాఫిట్‌లు తప్పనిసరిగా నిర్ణయాధికారం ఉన్న డైరెక్టర్‌ని లేదా ఎగ్జిక్యూటివ్‌ని తమ అకౌంట్ ప్రతినిధిగా కేటాయించాలి. అకౌంట్ ప్రతినిధి ఈ కింది సమాచారాన్ని అందించాలి:

  • చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
  • పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
  • ఇమెయిల్ అడ్రస్: చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్‌గా ఉన్న ఇమెయిల్ అడ్రస్.
  • ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్.
  • నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌తో సరిపోలే మీ ఇంటి చిరునామా.
  • ఉద్యోగ హోదా: వ్యాపారంలో మీరు కలిగి ఉన్న ఉద్యోగ హోదా.
  • ఈక్విటీ: వర్తిస్తే, వ్యాపారంలో మీకు ఉన్న ఈక్విటీ శాతం.

ఒకవేళ మీ సమాచారం ఆటోమేటిక్‌గా వెరిఫై అవ్వకపోతే, మీ గుర్తింపును వెరిఫై చేయాలనే అభ్యర్థన మీకు అందుతుంది. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఇంటి చిరునామా లాంటి వివరాలేమైనా తప్పుగా ఉంటే, మీరు మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.

సమాచారం సరిగ్గానే ఉన్నప్పటికీ మీకు వెరిఫికేషన్ కోసం అభ్యర్థన అందితే, మీరు కింది టాస్క్‌లలో ఒకదానిని పూర్తి చేయడం ద్వారా ఆ అభ్యర్థనను పరిష్కరించవచ్చు:

  • చెల్లుబాటు అయ్యే ఫోటో IDతో సెల్ఫీ తీసుకోవడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించండి.
  • వేరువేరు గుర్తింపు రుజువు , చిరునామా రుజువు డాక్యుమెంట్‌లను మీ Shopify అడ్మిన్‌లో అప్‌లోడ్ చేయండి.
    • మీ డాక్యుమెంట్లపై ఉన్న సమాచారం మీరు మీ అకౌంట్‌లో నమోదు చేసిన దానికి ఖచ్చితంగా సరిపోలాలి. అవసరమైతే మీ డాక్యుమెంట్లకు సరిపోయేలా మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.

నమోదిత నాన్-ప్రాఫిట్‌లు వ్యాపారం గురించిన ఈ కింది వివరాలను కూడా అందించాలి:

  • నమోదిత వ్యాపార పేరు: సెంట్రల్ కమర్షియల్ రిజిస్టర్‌లో రికార్డ్ చేయబడిన చట్టబద్ధమైన వ్యాపార పేరు.
  • వ్యాపార రిజిస్ట్రీ కోడ్ (Äriregistri kood): సెంట్రల్ కమర్షియల్ రిజిస్టర్‌లో రికార్డ్ చేయబడిన వ్యాపార రిజిస్ట్రీ కోడ్.
  • విలువ ఆధారిత పన్ను (VAT) నంబర్: వర్తిస్తే, మీ VAT రిజిస్ట్రేషన్ నంబర్.
  • వ్యాపార ఫోన్ నంబర్: వ్యాపారం కోసం యాక్టివ్‌గా ఉన్న సంప్రదింపు ఫోన్ నంబర్.
  • వ్యాపార చిరునామా: సెంట్రల్ కమర్షియల్ రిజిస్టర్‌లో రికార్డ్ చేయబడిన వ్యాపారం యొక్క అధికారిక నమోదిత చిరునామా.

ఎస్టోనియాలోని ప్రభుత్వ రిజిస్ట్రీలతో మీ వివరాలను సరిపోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు ఆ సమాచారాన్ని వెరిఫై చేస్తారు. మీరు కరెక్ట్ లెటర్ కేస్, విరామ చిహ్నాలు, గుర్తులను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

వ్యాపారం గురించి మీరు అందించే సమాచారాన్ని వెరిఫై చేయడం కుదరకపోతే, మీరు వ్యాపార వెరిఫికేషన్ డాక్యుమెంట్‌ను అందించాల్సి రావచ్చు. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ అకౌంట్‌లో లిస్ట్ చేసిన నమోదిత పేరు, వ్యాపార రిజిస్ట్రీ కోడ్, వ్యాపార చిరునామా డాక్యుమెంట్‌లోని సమాచారంతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అలాగే డాక్యుమెంట్‌కు సరిపోయేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఆమోదయోగ్యమైన వ్యాపార డాక్యుమెంట్‌ల జాబితాను రివ్యూ చేయండి.

మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఉంటే, మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఉన్న లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ఇతర వ్యక్తులను కూడా మీరు జాబితా చేయాలి. ప్రభుత్వ డాక్యుమెంట్‌లలో రికార్డ్ చేసిన విధంగానే వారి పేర్లు, పుట్టిన తేదీలు మరియు ఇంటి చిరునామాలను మీరు నమోదు చేసినట్లు నిర్ధారించుకోండి. వారి గుర్తింపులను ఆటోమేటిక్‌గా వెరిఫై చేయలేకపోతే, వారు ఫోటో ID లేదా చిరునామా రుజువును అందించాల్సి రావచ్చు.

మీరు అందించే డైరెక్టర్‌లు మీ ప్రభుత్వ వ్యాపార రిజిస్ట్రీలో జాబితా చేయబడిన డైరెక్టర్‌లతో తప్పనిసరిగా సరిపోలాలి. ఒకవేళ సరిపోలకపోతే, సంతకం చేయండి బటన్‌ని క్లిక్ చేయడం ద్వారా అటెస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయమని లేదా డైరెక్టర్‌షిప్ రుజువు డాక్యుమెంట్‌ను అందించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సరిపోలని సమస్యను పరిష్కరించడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయడం వేగవంతమైన మార్గం, కానీ మీరు డాక్యుమెంట్‌ను సమర్పించాలనుకుంటే, మీ అకౌంట్‌లో జాబితా చేయబడిన డైరెక్టర్‌ల పేర్లు మీ డాక్యుమెంట్‌లో జాబితా చేయబడిన డైరెక్టర్‌లతో కచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌తో సరిపోలడానికి మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.

నమోదు కాని నాన్-ప్రాఫిట్‌లు

నాన్-ప్రాఫిట్ (NPO) అనేది దాని వాటాదారులకు లాభాలను చేకూర్చడం మినహా ఇతర ప్రయోజనాల కోసం స్థాపించబడిన సంస్థ. ప్రజలకు లేదా కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం దీని ప్రధాన ఉద్దేశం. నమోదు కాని నాన్-ప్రాఫిట్‌కు వ్యాపార రిజిస్ట్రీ కోడ్ ఉండదు, కానీ ఇది స్థానిక కోర్టులలో నమోదు చేయబడి, నాన్-ప్రాఫిట్ స్టేటస్‌ను కలిగి ఉంటుంది.

నమోదు కాని నాన్-ప్రాఫిట్‌లు తప్పనిసరిగా కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని లేదా ఆర్గనైజర్‌ని తమ అకౌంట్ ప్రతినిధిగా కేటాయించాలి మరియు ఆ వ్యక్తిని ఎగ్జిక్యూటివ్‌గా గుర్తించాలి. అకౌంట్ ప్రతినిధి ఈ కింది సమాచారాన్ని అందించాలి:

  • చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
  • పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
  • ఇమెయిల్ అడ్రస్: చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్‌గా ఉన్న ఇమెయిల్ అడ్రస్.
  • ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే మరియు యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్.
  • నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌తో సరిపోలే మీ ఇంటి చిరునామా.
  • ఉద్యోగ హోదా: వ్యాపారంలో మీరు కలిగి ఉన్న ఉద్యోగ హోదా.
  • ఈక్విటీ: వర్తిస్తే, వ్యాపారంలో మీకు ఉన్న ఈక్విటీ శాతం.

ఒకవేళ మీ సమాచారం ఆటోమేటిక్‌గా వెరిఫై అవ్వకపోతే, మీ గుర్తింపును వెరిఫై చేయాలనే అభ్యర్థన మీకు అందుతుంది. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఇంటి చిరునామా లాంటి వివరాలేమైనా తప్పుగా ఉంటే, మీరు మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.

సమాచారం సరిగ్గానే ఉన్నప్పటికీ మీకు వెరిఫికేషన్ కోసం అభ్యర్థన అందితే, మీరు కింది టాస్క్‌లలో ఒకదానిని పూర్తి చేయడం ద్వారా ఆ అభ్యర్థనను పరిష్కరించవచ్చు:

  • చెల్లుబాటు అయ్యే ఫోటో IDతో సెల్ఫీ తీసుకోవడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించండి.
  • వేరువేరు గుర్తింపు రుజువు , చిరునామా రుజువు డాక్యుమెంట్‌లను మీ Shopify అడ్మిన్‌లో అప్‌లోడ్ చేయండి.
    • మీ డాక్యుమెంట్లపై ఉన్న సమాచారం మీరు మీ అకౌంట్‌లో నమోదు చేసిన దానికి ఖచ్చితంగా సరిపోలాలి. అవసరమైతే మీ డాక్యుమెంట్లకు సరిపోయేలా మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.

నమోదు కాని నాన్-ప్రాఫిట్‌లు వ్యాపారం గురించిన ఈ కింది వివరాలను కూడా అందించాలి:

  • నమోదిత వ్యాపార పేరు: డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా చట్టబద్ధమైన వ్యాపార పేరు.
  • విలువ ఆధారిత పన్ను (VAT) నంబర్: వర్తిస్తే, మీ VAT రిజిస్ట్రేషన్ నంబర్.
  • వ్యాపార ఫోన్ నంబర్: వ్యాపారం కోసం యాక్టివ్‌గా ఉన్న సంప్రదింపు ఫోన్ నంబర్.
  • వ్యాపార చిరునామా: డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా వ్యాపారం యొక్క అధికారిక నమోదిత చిరునామా.

ఎస్టోనియాలోని ప్రభుత్వ రిజిస్ట్రీలతో మీ వివరాలను సరిపోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు ఆ సమాచారాన్ని వెరిఫై చేస్తారు. మీరు కరెక్ట్ లెటర్ కేస్, విరామ చిహ్నాలు, గుర్తులను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

మీరు వ్యాపారం గురించి అందించే సమాచారాన్ని వెరిఫై చేయలేకపోతే, మీరు వ్యాపార వెరిఫికేషన్ డాక్యుమెంట్‌ను అందించాల్సి రావచ్చు. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ అకౌంట్‌లో పేర్కొన్న నమోదిత పేరు మరియు వ్యాపార చిరునామా డాక్యుమెంట్‌లోని సమాచారంతో ఖచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి, అలాగే డాక్యుమెంట్‌తో సరిపోలేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఆమోదయోగ్యమైన వ్యాపార డాక్యుమెంట్‌ల జాబితాను రివ్యూ చేయండి.

మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఉంటే, మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఉన్న లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ఇతర వ్యక్తులను కూడా మీరు జాబితా చేయాలి. ప్రభుత్వ డాక్యుమెంట్‌లలో రికార్డ్ చేసిన విధంగానే వారి పేర్లు, పుట్టిన తేదీలు మరియు ఇంటి చిరునామాలను మీరు నమోదు చేసినట్లు నిర్ధారించుకోండి. వారి గుర్తింపులను ఆటోమేటిక్‌గా వెరిఫై చేయలేకపోతే, వారు ఫోటో ID లేదా చిరునామా రుజువును అందించాల్సి రావచ్చు.

మీరు అందించే డైరెక్టర్‌లు మీ ప్రభుత్వ వ్యాపార రిజిస్ట్రీలో జాబితా చేయబడిన డైరెక్టర్‌లతో తప్పనిసరిగా సరిపోలాలి. ఒకవేళ సరిపోలకపోతే, సంతకం చేయండి బటన్‌ని క్లిక్ చేయడం ద్వారా అటెస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయమని లేదా డైరెక్టర్‌షిప్ రుజువు డాక్యుమెంట్‌ను అందించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సరిపోలని సమస్యను పరిష్కరించడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయడం వేగవంతమైన మార్గం, కానీ మీరు డాక్యుమెంట్‌ను సమర్పించాలనుకుంటే, మీ అకౌంట్‌లో జాబితా చేయబడిన డైరెక్టర్‌ల పేర్లు మీ డాక్యుమెంట్‌లో జాబితా చేయబడిన డైరెక్టర్‌లతో కచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌తో సరిపోలడానికి మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.

ఆమోదయోగ్యమైన డాక్యుమెంట్ రకాలు

మీ గుర్తింపు మరియు వ్యాపార వివరాలను వెరిఫై చేయడానికి మీరు ఏ డాక్యుమెంట్‌లను ఉపయోగించవచ్చో ఈ విభాగం వివరిస్తుంది.

గుర్తింపు డాక్యుమెంట్‌లు

మీరు అందిస్తున్న గుర్తింపు డాక్యుమెంట్‌లోని సమాచారంతో సరిపోలడానికి మీ Shopify Payments అకౌంట్‌లోని పేరు మరియు పుట్టిన తేదీని అప్‌డేట్ చేయాలి. డాక్యుమెంట్‌లు చెల్లుబాటు అయ్యేవిగా ఉండాలి మరియు గడువు ముగియనివి అయి ఉండాలి. గుర్తింపు రుజువుగా ఈ కింది డాక్యుమెంట్‌లు ఆమోదించబడతాయి:

  • పాస్‌పోర్ట్ (Pass)
  • డ్రైవింగ్ లైసెన్స్ (Juhiluba)
  • గుర్తింపు కార్డ్ (ID-kaart)
  • నివాస అనుమతి (Elamisluba)

చిరునామా డాక్యుమెంట్‌లు

మీరు అందిస్తున్న చిరునామా డాక్యుమెంట్‌లలోని సమాచారంతో సరిపోలడానికి మీ Shopify Payments అకౌంట్‌లోని పేరు మరియు చిరునామాను అప్‌డేట్ చేయాలి. అన్ని డాక్యుమెంట్‌లలో గత 6 నెలల్లోపు జారీ చేసిన తేదీ తప్పనిసరిగా ఉండాలి. చిరునామా రుజువుగా ఈ కింది డాక్యుమెంట్‌లు ఆమోదించబడతాయి:

  • యుటిలిటీ బిల్లు (Kommunaalarve)
  • బ్యాంక్ స్టేట్‌మెంట్ (Kontoväljavõte)
  • నివాస రిజిస్ట్రేషన్ (Elukoha registreerimine)
  • బిన్ లేదా చెత్త నిర్మూలన బిల్లు

వ్యాపార వెరిఫికేషన్ డాక్యుమెంట్‌లు

వ్యాపార వెరిఫికేషన్ కోసం ఈ కింది డాక్యుమెంట్‌లు ఆమోదించబడతాయి. వాటిలో చట్టబద్ధమైన సంస్థ పేరు, వ్యాపార రిజిస్ట్రీ కోడ్ (Äriregistri kood) మరియు మీ వ్యాపార చిరునామా స్పష్టంగా ఉండాలి. మీరు అందిస్తున్న డాక్యుమెంట్‌లలోని సమాచారంతో సరిపోలడానికి మీ Shopify Payments అకౌంట్‌లోని వివరాలు తప్పనిసరిగా అప్‌డేట్ చేయబడాలి:

  • కమర్షియల్ రిజిస్టర్ ఎక్స్‌ట్రాక్ట్ (Äriregistri registrikaart)
  • పన్ను సర్టిఫికెట్ (Maksuandmete tõend)
  • VAT రిజిస్ట్రేషన్ (Käibemaksukohustuslasena registreerimine)

యాజమాన్య డాక్యుమెంట్‌లు

ఈ కింది డాక్యుమెంట్‌లలో మీ వ్యాపారం యొక్క చట్టబద్ధమైన సంస్థ పేరు మరియు మీ వ్యాపార యజమానులు లేదా డైరెక్టర్‌ల పూర్తి పేర్లు అన్నీ ఉన్నట్లయితే, అవి యాజమాన్యం లేదా డైరెక్టర్‌షిప్‌కి రుజువుగా ఆమోదించబడతాయి.

యజమానులను వెరిఫై చేయడానికి ఉపయోగించగల డాక్యుమెంట్‌లు:

  • Asutamisleping (ఆర్టికల్స్ ఆఫ్ ఇన్‌కార్పొరేషన్)
  • Äriregistri väljavõte (కార్పొరేట్ స్టేటస్ సర్టిఫికెట్)
  • Partnerluse leping (భాగస్వామ్య ఒప్పందాలు)
  • Asutamisdokument (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్)
  • Tegeliku kasusaaja register (లబ్ధిదారుడైన యజమాని రిజిస్టర్)

డైరెక్టర్‌లను వెరిఫై చేయడానికి ఉపయోగించగల డాక్యుమెంట్‌లు:

  • Aastaaruanne (వార్షిక రిపోర్ట్‌లు)
  • Asutamisleping (ఆర్టికల్స్ ఆఫ్ ఇన్‌కార్పొరేషన్)
  • Äriregistri väljavõte (కార్పొరేట్ స్టేటస్ సర్టిఫికెట్)
  • Asutamisdokument (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్)
  • Tegeliku kasusaaja register (లబ్ధిదారుడైన యజమాని రిజిస్టర్)

మీ డాక్యుమెంటేషన్‌లో జాబితా చేయబడిన ప్రతి లబ్ధిదారుడైన యజమాని మీ Shopify Payments అకౌంట్‌లో కూడా జాబితా చేయబడాలి మరియు వారికి యజమాని పాత్రను కేటాయించాలి. వ్యాపార ఈక్విటీలో 25% లేదా అంతకంటే ఎక్కువ స్వంతం చేసుకున్న వ్యక్తిని లబ్ధిదారుడైన యజమానిగా నిర్వచిస్తారు. అవసరమైతే డాక్యుమెంట్‌తో సరిపోలడానికి మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.

మీ వ్యాపారానికి లబ్ధిదారులైన యజమానులు ఎవరూ లేకుంటే, దానికి బదులుగా మీరు మీ డైరెక్టర్‌లను వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో, డైరెక్టర్‌ల కోసం పైన జాబితా చేసిన డాక్యుమెంట్‌లు అర్హత పొందుతాయి. మీ డాక్యుమెంటేషన్‌లో జాబితా చేయబడిన ప్రతి డైరెక్టర్ కూడా మీ Shopify Payments అకౌంట్‌లో జాబితా చేయబడాలి మరియు వారికి డైరెక్టర్ పాత్రను కేటాయించాలి. అవసరమైతే డాక్యుమెంట్‌తో సరిపోలడానికి మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.

ఒకవేళ మీ వ్యాపారం ఏదైనా హోల్డింగ్ కంపెనీ స్వంతమైతే, దయచేసి ముందుగా మీ యజమానులు మరియు డైరెక్టర్‌లను సరిగ్గా నమోదు చేసినట్లు నిర్ధారించుకోండి, ఆపై దానికి బదులుగా సంతకం చేయండి బటన్‌ను నొక్కడం ద్వారా డిజిటల్ అటెస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయండి.

డాక్యుమెంటేషన్ సమ్మతిని నిర్ధారించడం

మీరు డాక్యుమెంట్‌లను అందిస్తున్నప్పుడు, అవి అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. సమ్మతిని నిర్ధారించడానికి ఈ కింది గైడ్‌లైన్స్‌ను రివ్యూ చేయండి:

  • కచ్చితత్వం: మీ డాక్యుమెంట్‌లలోని సమాచారం, మీ Shopify Payments అకౌంట్‌లో మీరు నమోదు చేసిన దానితో సరిపోలుతుందని నిర్ధారించుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌లతో సరిపోలేలా మీ అకౌంట్‌ను అప్‌డేట్ చేయండి.
  • స్పష్టత మరియు చదవడానికి వీలుగా ఉండటం: మీ డాక్యుమెంట్‌లు స్పష్టంగా మరియు చదవడానికి వీలైనంత పెద్దవిగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఫోటోగ్రాఫ్‌లో మొత్తం డాక్యుమెంట్ కనిపించేలా చూసుకోండి.
  • పూర్తి వివరాలు: అవసరమైన అన్ని వివరాలు మీ డాక్యుమెంట్‌లో కనిపించేలా నిర్ధారించుకోండి. డాక్యుమెంట్‌లో ఏయే వివరాలను చేర్చాలో అర్థం చేసుకోవడానికి, ఈ పేజీలో జాబితా చేసిన ఆమోదయోగ్యమైన డాక్యుమెంట్ రకాలను రివ్యూ చేయండి.
  • ఒరిజినల్ డాక్యుమెంటేషన్: కెమెరాను ఉపయోగించి మీ పత్రం ఒరిజినల్ ఫోటో తీయండి. మీ పత్రాలను ఫోటోకాపీ, స్కాన్ లేదా స్క్రీన్‌షాట్ చేయవద్దు. పత్రాల ఫోటోలను ఇతర పత్రాలలో అతికించవద్దు. కంప్యూటర్ స్క్రీన్‌లు లేదా ప్రింటవుట్‌ల ఫోటోలను తీయవద్దు.
    • మీ పత్రం మీకు డిజిటల్‌గా జారీ చేయబడితే, ఏ మార్పులు లేకుండా మీకు మొదట ఇవ్వబడిన విధంగానే అన్ని పేజీలతో కూడిన PDF ఫైల్‌ను అందించండి.
  • చెల్లుబాటు: ఫోటో IDల గడువు ముగియలేదని, చిరునామా రుజువు ఇటీవల జారీ చేయబడిందని నిర్ధారించుకోండి. వ్యాపార రిజిస్ట్రేషన్ రుజువును అందిస్తుంటే, అప్పుడు మీ వ్యాపారం ఇప్పటికీ యాక్టివ్‌గా రిజిస్టర్ అయి ఉండాలి, మంచి స్థితిలో ఉండాలి.

సాధారణ సమస్యల ట్రబుల్షూటింగ్

Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి ముందు, ఈ సాధారణ ఆన్‌బోర్డింగ్ సమస్యలు, వాటి పరిష్కారాలను రివ్యూ చేయండి.

నా పత్రం తిరస్కరించబడింది.

మీ అకౌంట్‌లోని సమాచారం మీరు సమర్పిస్తున్న పత్రంలోని సమాచారానికి సరిపోలుతుందని నిర్ధారించుకోండి, అవసరమైతే మీ పత్రానికి సరిపోయేలా మీ అకౌంట్‌ను అప్‌డేట్ చేయండి. మీ పత్రాలు ఇంకా తిరస్కరించబడుతుంటే, ఈ పేజీలోని కింది విభాగాలను చూడండి:

నా బ్యాంక్ ఖాతా సమాచారం పనిచేయడం లేదు.

బ్యాంక్ ఖాతా సమస్యలు సపోర్ట్ చేయని ఖాతా రకాలు లేదా సరికాని ఫార్మాటింగ్ వల్ల తలెత్తవచ్చు.

సపోర్ట్ చేయని ఖాతా రకాలు:

ఎస్టోనియాలో Shopify Payments‌తో నిర్దిష్ట బ్యాంక్ ఖాతా రకాలను ఉపయోగించలేరు:

  • పొదుపు ఖాతాలు: పేఅవుట్‌ల కోసం చెకింగ్ లేదా కరెంట్ ఖాతాలు మాత్రమే ఉపయోగించబడతాయి.
  • వర్చువల్ బ్యాంక్ ఖాతాలు: వర్చువల్ ఖాతాలకు సాంకేతికంగా సపోర్ట్ ఉన్నప్పటికీ, వాటిలో పేఅవుట్ వైఫల్యాల రేటు చాలా ఎక్కువగా ఉంది. సాధ్యమైనప్పుడు సాంప్రదాయ బ్యాంక్ ఖాతాను ఉపయోగించమని సిఫార్సు చేయబడింది.
  • ఫ్లెక్స్-కరెన్సీ ఖాతాలు: ఒకే సమయంలో బహుళ కరెన్సీలకు సపోర్ట్ చేసే ఖాతాలకు సపోర్ట్ లేదు.
  • వైర్ బదిలీలను మాత్రమే ఆమోదించే ఖాతాలు: మీ ఖాతా తప్పనిసరిగా సింగిల్ యూరో పేమెంట్స్ ఏరియా (SEPA) బదిలీలకు అర్హత కలిగి ఉండాలి.

ఫార్మాట్ ఆవశ్యకతలు:

మీ బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసేటప్పుడు, అవి సరిగ్గా ఫార్మాట్ చేయబడ్డాయని నిర్ధారించుకోండి:

  • IBAN: తప్పనిసరిగా కింది దేశం కోడ్‌లలో ఒకదానితో ప్రారంభం కావాలి: AT, BE, BG, CH, CY, DE, DK, EE, ES, FI, FR, GB, GI, GR, HR, HU, IE, IT, LT, LU, LV, MT, NL, NO, PL, PT, RO, SE లేదా SI.
  • కరెన్సీ: మీ ఖాతా తప్పనిసరిగా యూరో (EUR)లో ఉండాలి.

మీ పేఅవుట్ విఫలమైతే, మీరు మీ ఖాతా సమాచారాన్ని సరైన ఫార్మాట్‌లో నమోదు చేశారని, సపోర్ట్ చేసే ఖాతా రకాన్ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

నా బ్యాంక్ ఖాతాను అప్‌డేట్ చేసిన తర్వాత నా పేఅవుట్‌లు హోల్డ్‌లో ఉన్నాయి.

మీరు Shopify Payments‌లో మీ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేసినప్పుడు, కొత్త పేఅవుట్‌లపై ఆటోమేటిక్‌గా 3-5 పనిదినాల సెక్యూరిటీ హోల్డ్ ఉంచబడుతుంది. మీ అకౌంట్‌ను అనధికారిక మార్పుల నుండి రక్షించడానికి ఇది ఒక భద్రతా ఫీచర్.

ఈ వ్యవధిలో:

  • అప్‌డేట్ సమయంలో ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన పేఅవుట్‌లు ఏవైనా మీ మునుపటి బ్యాంక్ ఖాతాకు పంపబడతాయి.
  • అప్‌డేట్ తర్వాత క్రియేట్ చేసిన కొత్త పేఅవుట్‌లు 3-5 పని దినాల పాటు హోల్డ్ చేయబడతాయి.
  • హోల్డ్ ముగిసిన తర్వాత, మీ పేఅవుట్ షెడ్యూల్ ప్రకారం కొత్త పేఅవుట్‌లు మీ అప్‌డేట్ చేసిన బ్యాంక్ ఖాతాకు ప్రాసెస్ చేయడం ప్రారంభమవుతుంది.

ఈ హోల్డ్‌ను తీసివేయలేరు మరియు ఇది అన్ని బ్యాంక్ ఖాతా మార్పులకు వర్తిస్తుంది.

నా వ్యాపార సమాచారం ధృవీకరించబడటం లేదు.

మీ వ్యాపార సమాచారాన్ని నమోదు చేసేటప్పుడు, మీ వ్యాపారం పేరు, వ్యాపార రిజిస్ట్రీ కోడ్ (Äriregistri kood), చిరునామా కచ్చితంగా సెంట్రల్ కమర్షియల్ రిజిస్టర్‌లో కనిపించే విధంగానే ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇందులో ఇవి ఉంటాయి:

  • సరైన లెటర్ కేస్ (అప్పర్‌కేస్ మరియు లోయర్‌కేస్)
  • సరైన విరామ చిహ్నాలు, స్పేసింగ్
  • రిజిస్టర్ అయిన విధంగా పూర్తి వ్యాపార పేరు

అధికారిక రిజిస్ట్రీలతో పోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు మీ సమాచారాన్ని ఆటోమేటిక్‌గా ధృవీకరిస్తారు. చిన్న చిన్న తేడాలు కూడా ధృవీకరణ విఫలం కావడానికి దారితీయవచ్చు. మీరు సమర్పిస్తున్న డాక్యుమెంటేషన్‌లో మీ చట్టబద్ధమైన పేరు, వ్యాపార రిజిస్ట్రీ కోడ్, వ్యాపార చిరునామా ఉన్నాయని, ఈ వివరాలు మీ అకౌంట్‌లో పేర్కొన్న వాటితో సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అవసరమైతే, మీ పత్రానికి సరిపోయేలా మీ అకౌంట్‌ను అప్‌డేట్ చేయండి.

నా చిరునామా ఆటోమేటిక్‌గా ధృవీకరించబడదు.

Shopify Payments ఎస్టోనియా కోసం, మీ చిరునామా ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, సెల్ఫీ ప్రక్రియను పూర్తి చేయమని లేదా చిరునామా రుజువు పత్రాన్ని అందించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది.

సెల్ఫీ ప్రాసెస్‌ను పూర్తి చేయడం సిఫార్సు చేయబడింది. ధృవీకరణ అవసరమైన వ్యక్తి సెల్ఫీ బటన్‌పై క్లిక్ చేసి, ధృవీకరించడానికి వారి ఫోటో ID, వారి స్వంత ఫోటోను తీయవచ్చు. చిరునామా రుజువు పత్రాన్ని అందించడానికి బదులుగా మీరు సెల్ఫీ ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు.

మీరు మాన్యువల్‌గా పత్రాన్ని అందించాలనుకుంటే, దానికి బదులుగా దాన్ని చేయవచ్చు. చిరునామా రుజువు పత్రాలు తప్పనిసరిగా మీ పూర్తి పేరు, ఇంటి చిరునామాను చూపాలి, అలాగే ఇక్కడ చూపిన డాక్యుమెంట్ రకాల్లో ఒకటి అయి ఉండాలి. మీరు కింది వాటిని కూడా నిర్ధారించుకోవాలి:

  1. మీరు మీ Shopify Payments ఖాతాలో నమోదు చేసిన చిరునామా, మీ చిరునామా రుజువు పత్రంలోని చిరునామాతో కచ్చితంగా సరిపోలాలి.
  2. అవసరమైతే మీ పత్రానికి సరిపోయేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
  3. మీ చిరునామా రుజువు పత్రం యొక్క స్పష్టమైన ఫోటోను అప్‌లోడ్ చేయండి.
  4. మీరు అప్‌లోడ్ చేస్తున్న డాక్యుమెంట్ మీ స్వంత పూర్తి పేరును జాబితా చేయాలి. ఉదాహరణకు, మీ వద్ద వేరొకరి పేరుతో యుటిలిటీ బిల్లు ఉంటే, మీరు వేరొక డాక్యుమెంట్‌ను అందించాలి.
నా యజమాని సమాచారం ధృవీకరించబడదు.

Shopify Payments ఎస్టోనియా కోసం, మీరు మీ యజమానులను నమోదు చేయాలి, తద్వారా జాబితా చేయబడిన పేర్లు మీ ప్రభుత్వ వ్యాపార రిజిస్ట్రీలో మీ వ్యాపారం కోసం జాబితా చేయబడిన యజమానులతో సరిపోలతాయి. మీరు రిజిస్ట్రీలో మీ యజమాని సమాచారాన్ని వెతికి, అక్కడ చూపిన విధంగానే పేర్లను కచ్చితంగా నమోదు చేయాలని సిఫార్సు చేయబడింది. మీకు ఎవరూ యజమానులు లేనట్లయితే, మీరు దానికి బదులుగా అకౌంట్‌లో మీ డైరెక్టర్లందరినీ జాబితా చేయాలి.

మీరు అలా చేసి, మీ యాజమాన్యం లేదా డైరెక్టర్‌షిప్ ఇంకా ధృవీకరించబడలేకపోతే, మీరు అందించిన సమాచారం సరైనదని డిజిటల్‌గా ధృవీకరించడానికి మీ ధృవీకరణ పేజీలోని సైన్ బటన్‌పై క్లిక్ చేయడం సిఫార్సు చేయబడింది.

మీకు కావాలంటే, అటెస్టేషన్ ప్రాసెస్‌ని ఉపయోగించే బదులు మీ యజమానులు లేదా డైరెక్టర్లు ఎవరో నిర్ధారించే పత్రాన్ని మీరు అందించవచ్చు. మీ Shopify Payments అకౌంట్‌లో మీరు ఎంటర్ చేసే యజమాని, డైరెక్టర్ సమాచారం మీరు అప్‌లోడ్ చేసే డాక్యుమెంటేషన్‌లోని సమాచారంతో తప్పనిసరిగా సరిపోలాలి. మీ డాక్యుమెంటేషన్‌లో యజమాని లేదా డైరెక్టర్ జాబితా చేయబడి, మీ Shopify Payments ఖాతాకు జోడించబడకపోతే, మీరు ఆ వ్యక్తిని మీ అకౌంట్‌కు యాడ్ చేసి, వారికి యజమాని లేదా డైరెక్టర్ పాత్రను కేటాయించాలి. యాజమాన్యాన్ని ధృవీకరించడానికి మీరు అందించగల పత్ర రకాల జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది.

మీ అకౌంట్‌లోని యజమానులు, డైరెక్టర్లు మీ డాక్యుమెంటేషన్‌తో 1:1గా సరిపోలుతున్నారని మీరు నిర్ధారించుకోవాలి. మీ పత్రాల్లో చూపని అదనపు యజమానులు లేదా డైరెక్టర్లను జాబితా చేయవద్దు.

నన్ను వ్యాపార రిజిస్ట్రీ కోడ్ అడిగారు, కానీ నా వద్ద అది లేదు.

మిమ్మల్ని వ్యాపార రిజిస్ట్రీ కోడ్ (Äriregistri kood) అడిగి, మీ వద్ద అది లేకపోతే, బహుశా మీరు తప్పు వ్యాపార రకంగా సెట్ చేయబడి ఉండవచ్చు.

ఒకవేళ మీరు అకౌంట్‌ను సెటప్ చేసే దశలో ఉన్నట్లయితే, వ్యాపార రకం ఎంపిక స్క్రీన్‌కు తిరిగి వెళ్లి, మీ వ్యాపార నిర్మాణాన్ని బట్టి రిజిస్టర్ కాని భాగస్వామ్యం లేదా రిజిస్టర్ కాని లాభాపేక్ష లేనిని ఎంచుకోండి.

మీరు ఇప్పటికే అకౌంట్ సెటప్ చేసి ఉండి, మీ ధృవీకరణ ప్రక్రియలో భాగంగా వ్యాపార రిజిస్ట్రీ కోడ్ కోసం అడగబడితే, మీరు సెట్టింగ్‌లు > సాధారణంకి వెళ్లడం ద్వారా మీ వ్యాపార రకాన్ని అప్‌డేట్ చేయవచ్చు. మీ వ్యాపార వివరాల పక్కన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి, ఆపై ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి. మీ వ్యాపార రకాన్ని అప్‌డేట్ చేయడంలో మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే, సహాయం కోసం Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.

మీకు వ్యాపార రిజిస్ట్రీ కోడ్ లేకపోతే, మరియు ఈ వ్యాపార రకాలు ఏవీ మీ వ్యాపారానికి సరిపోకపోతే, వ్యక్తి / ఏకవ్యక్తి యాజమాన్యంని ఎంచుకోండి, మరియు ఖాతా ప్రతినిధిగా ఒక ముఖ్య నిర్ణయకర్తను లేదా యజమానిని కేటాయించండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఎస్టోనియాలో Shopify Payments ఆవశ్యకతల గురించి తరచుగా అడిగే ఈ ప్రశ్నలను సమీక్షించండి.

నేను ఒక కంపెనీ, భాగస్వామ్య సంస్థ లేదా లాభాపేక్ష లేని సంస్థ అయితే మీకు నా ఫోటో ID లేదా చిరునామా రుజువు ఎందుకు కావాలి?

మీరు కంపెనీ, భాగస్వామ్య సంస్థ లేదా లాభాపేక్ష లేని సంస్థగా నమోదైనప్పటికీ, ఎస్టోనియాలోని నియంత్రణ చట్టాల ప్రకారం వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల గుర్తింపులను, మరియు వారు ఉన్న స్థానాలను ధృవీకరించడం Shopify బ్యాంకింగ్ భాగస్వాములకు తప్పనిసరి.

నేను ఎస్టోనియాలో నివసించకపోతే, నేను Shopify Payments Estoniaని ఉపయోగించవచ్చా?

మీ వ్యాపార రకం వ్యక్తి/ఏకవ్యక్తి యాజమాన్యం అయితే, మీరు Shopify Payments Estoniaకి అర్హత పొందాలంటే ఎస్టోనియాలో నివసించడం తప్పనిసరి. మీరు ప్రస్తుతం ఎస్టోనియాలో నివసించకపోతే, మీరు నివసిస్తున్న ప్రాంతం కోసం మీరు ఒక Shopify Payments ఖాతాను సృష్టించుకోవాలి.

మీ స్టోర్ చిరునామాను మీ ప్రస్తుత లొకేషన్‌కు అప్‌డేట్ చేయండి. మీ లొకేషన్ గనుక Shopify Paymentsకి అర్హత కలిగి ఉంటే, దానికి బదులుగా మీరు ఆ ప్రాంతం కోసం ఒక Shopify Payments ఖాతాను సృష్టించవచ్చు.

మీరు భాగస్వామ్య సంస్థ, కంపెనీ లేదా లాభాపేక్ష లేని సంస్థ రకం అయితే, మీరు వ్యక్తిగతంగా ఎస్టోనియాలో నివసించాల్సిన అవసరం లేదు, కానీ మీ వ్యాపారం అక్కడ నమోదు చేయబడి ఉండాలి మరియు ఎస్టోనియా వ్యాపార చిరునామాను కలిగి ఉండాలి. మీకు సహాయం కావాలంటే, Shopify Supportను సంప్రదించండి.

నేను ఒక ఏకవ్యక్తి యజమానిని. నేను నా వ్యాపార రిజిస్ట్రేషన్‌ను అందించవచ్చా?

వ్యాపారం మరియు గుర్తింపు ధృవీకరణ ప్రయోజనాల కోసం, మీరు ఏకవ్యక్తి యజమాని అయితే యజమాని యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే సేకరించడం మరియు ధృవీకరించడం Shopifyకి అవసరం.

మీరు ఏకవ్యక్తి యజమాని అయితే, వేరే వ్యాపార రకంగా సైన్ అప్ చేయడానికి ప్రయత్నించకండి. మీరు ధృవీకరణను పాస్ చేయడంలో ఇబ్బంది పడవచ్చు.

నేను ఎస్టోనియాలో పబ్లిక్‌గా ట్రేడ్ చేయబడే కంపెనీని. నేను ఏ వ్యాపార రకాన్ని ఎంచుకోవాలి?

ప్రైవేట్ కార్పొరేషన్ను ఎంచుకోండి. వ్యాపారం మరియు గుర్తింపు ధృవీకరణ ప్రయోజనాల కోసం, పబ్లిక్ మరియు ప్రైవేట్ యాజమాన్యాల కంపెనీల ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుంది. యజమానులను జోడించమని అభ్యర్థించే ఖాతా సెటప్ ఫారమ్ విభాగాన్ని మీరు దాటవేయవచ్చు. మీకు ఎవరూ లేకపోతే, మీరు లబ్ధిదారులైన యజమానులను జాబితా చేయాల్సిన అవసరం లేదు.

మీరు ఎస్టోనియాలో పబ్లిక్‌గా ట్రేడ్ చేయబడే కంపెనీ అయి ఉండి, మీరు ఇప్పటికే Shopify Payments ఖాతాను సెటప్ చేసి ఉంటే, మరియు ఇప్పుడు మీ ధృవీకరణ ప్రాసెస్‌లో భాగంగా యాజమాన్య సమాచారం కోసం మిమ్మల్ని అడుగుతున్నట్లయితే, మీకు యజమానులు ఎవరూ లేరని ప్రతిబింబించేలా మీ యాజమాన్య వివరాలను అప్‌డేట్ చేయండి. ఫైల్‌లోని వ్యక్తులందరి నుండి యజమాని పాత్రను తీసివేయండి మరియు దానికి బదులుగా మీ డైరెక్టర్‌లందరూ ఖాతాలో జాబితా చేయబడి ఉన్నారని మరియు వారికి డైరెక్టర్ పాత్ర కేటాయించబడిందని నిర్ధారించుకోండి.

జాబితా చేయబడిన డైరెక్టర్‌షిప్ సరైనదేనా అని నిర్ధారించమని మిమ్మల్ని అడగవచ్చు. అది సరైనదిగా కనిపిస్తోందని మీరు నిర్ధారించగలిగితే, ఫైల్‌లో ఉన్న సమాచారాన్ని డిజిటల్‌గా ధృవీకరించడానికి సంతకం చేయండి బటన్‌పై క్లిక్ చేయండి.

మీకు ఈ ప్రాసెస్‌తో ఏదైనా ఇబ్బంది ఉంటే, సహాయం కోసం Shopify Supportను సంప్రదించండి.

నా ఖాతా ఇప్పటికే ధృవీకరించబడింది. నేను కొత్త సమాచారాన్ని అందించమని ఎందుకు అడగబడుతున్నాను?

కాలక్రమేణా, నిబంధనలలో మార్పులు మరియు Shopify యొక్క ఆర్థిక భాగస్వాముల ఆవశ్యకతల అప్‌డేట్‌ల కారణంగా ఖాతాదారుల నుండి అదనపు సమాచారాన్ని సేకరించాల్సి రావచ్చు. ఈ సమీక్షలు ఆర్థిక సేవలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఈ మార్పులు జరిగినప్పుడు, మీ Shopify అడ్మిన్‌లోని బ్యానర్ లేదా అలర్ట్ ద్వారా మరియు సంబంధిత ఇమెయిల్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది. Shopify ఆర్థిక సేవలను ఉపయోగించడం కొనసాగించడానికి మీరు ఈ అభ్యర్థనలను తప్పనిసరిగా పూర్తి చేయాలి.

నా Shopify Payments ఖాతా సమాచారాన్ని నేను ఎలా అప్‌డేట్ చేయాలి?

ఖాతా ధృవీకరణను పూర్తి చేయమని మిమ్మల్ని చురుకుగా అడుగుతున్నట్లయితే, అభ్యర్థిస్తున్న ఏవైనా డాక్యుమెంట్‌లను సమర్పించడంతో పాటు, మీరు ధృవీకరణ పేజీ నుండి మీ సమాచారానికి ఏవైనా అప్‌డేట్‌లను చేయవచ్చు.

ధృవీకరణ ప్రాసెస్ వెలుపల, స్టోర్ యజమాని ఈ వివరాలను సెట్టింగ్‌లు > సాధారణం > వ్యాపార వివరాలు ద్వారా అప్‌డేట్ చేయవచ్చు. వ్యాపార రకంతో సహా ఆ వ్యాపార సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి మీ వ్యాపార ఎంటిటీ పక్కన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి, ఆపై సవరించండిపై క్లిక్ చేయండి.

మీరు ఇక్కడ చేసే ఏవైనా మార్పులు ఆటోమేటిక్‌గా సమీక్ష కోసం మా బ్యాంకింగ్ భాగస్వాములకు పంపబడతాయని, మరియు కొత్త సమాచారం వారి ధృవీకరణ ప్రాసెస్ ద్వారా మళ్లీ రన్ చేయబడుతుందని గమనించండి. మార్పులు ఆటోమేటిక్‌గా మళ్లీ ధృవీకరించబడే అవకాశం ఉంది, కానీ మిమ్మల్ని సపోర్టింగ్ డాక్యుమెంట్‌లు కూడా అడగవచ్చు.

నేను నా ధృవీకరణ గడువును దాటవేస్తే ఏమవుతుంది?

ధృవీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు మీ పేఅవుట్‌లపై మీరు తాత్కాలిక విరామాన్ని చూస్తారు. మొదటి గడువు ముగిసి, పేఅవుట్‌లు తాత్కాలికంగా పాజ్ చేయబడిన తర్వాత, Shopify Paymentsతో ఆర్డర్‌లను ఆమోదించే మీ సామర్థ్యం ఎప్పుడు తాత్కాలికంగా పాజ్ చేయబడుతుందో సూచించే రెండవ గడువును మీరు చూడవచ్చు.

ఈ విరామాలన్నీ తాత్కాలికమైనవి మరియు మీరు ధృవీకరణను పూర్తి చేసిన తర్వాత అవి ఆటోమేటిక్‌గా ఎత్తివేయబడతాయి. మీ గడువుల కోసం మీ అడ్మిన్ పేజీని రెఫరెన్స్ చేయండి.

జూన్ 2026 నుండి, కొత్త Shopify Payments ఎస్టోనియా ఖాతాలు ధృవీకరణను పూర్తి చేయడానికి మొదటి ఆర్డర్ ప్రాసెస్ చేయబడినప్పటి నుండి 90 రోజుల సమయం కలిగి ఉంటాయి. 90 రోజులు గడిచిపోతే, మీరు Shopify Paymentsని ఉపయోగించి ప్రాసెస్ చేసిన ఏవైనా ఆర్డర్‌లు ఆటోమేటిక్‌గా రీఫండ్ చేయబడవచ్చు.

ఈ రీఫండ్ విధానం యూరోపియన్ దేశాలకు మాత్రమే వర్తిస్తుంది, మరియు జూన్ 2026 న లేదా ఆ తర్వాత సృష్టించబడిన సరికొత్త ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ రీఫండ్ విధానం మీకు వర్తిస్తే, రీఫండ్‌లు ఎప్పుడు ప్రాసెస్ చేయబడతాయని స్టోర్ యజమాని ఆశించవచ్చో హెచ్చరికలు తెలియజేస్తాయి.

ఎస్టోనియాలో Shopify Payments గురించి మీరు Shopify Supportను సంప్రదించడానికి ముందు

Shopify Supportను సంప్రదించడానికి ముందు, మీ సమస్యను వేగంగా పరిష్కరించడంలో సహాయపడేందుకు ఈ సమాచారాన్ని సేకరించండి:

  • మీకు వచ్చిన ఏవైనా ఎర్రర్ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌లు (బ్యాంక్ ఖాతా నంబర్‌ల లాంటి సున్నితమైన సమాచారాన్ని సెన్సార్ చేయండి)
  • సెటప్ సమయంలో మీరు ఎంచుకున్న వ్యాపార రకం
  • వర్తిస్తే, మీ వ్యాపార రిజిస్ట్రీ కోడ్ (Äriregistri kood)
  • మీకు సమస్య ఎదురైన నిర్దిష్ట దశ
  • మీరు ఉపయోగిస్తున్న బ్రౌజర్ మరియు పరికరం
  • పూర్తి ఖాతా నంబర్‌ను షేర్ చేయకుండా మీ బ్యాంక్ ఖాతా వివరాలు (IBAN దేశం కోడ్, ఖాతా రకం, కరెన్సీ)
  • మీరు అప్‌లోడ్ చేసిన ఏవైనా డాక్యుమెంట్‌లు మరియు మీరు వాటిని ఎప్పుడు అప్‌లోడ్ చేసారు

ఈ సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవడం వలన మీకు మరింత సమర్ధవంతంగా సహాయం చేయడానికి Shopify Supportకి సులభంగా ఉంటుంది.