ఐర్లాండ్‌లో Shopify Paymentsతో పేఅవుట్‌లు మరియు సెటిల్‌మెంట్ సమయాలు

ఐర్లాండ్‌లో Shopify Paymentsతో మీరు అన్ని సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లలో EURలో పేఅవుట్‌లను స్వీకరించవచ్చు. మీ స్టోర్ Advanced Shopify ప్లాన్ లేదా Shopify Plus ప్లాన్‌లో ఉన్నట్లయితే, మీరు బహుళ కరెన్సీలలో పేఅవుట్‌లను స్వీకరించవచ్చు. మీ ఆర్డర్‌లకు చెల్లించడానికి మీ కస్టమర్‌లు ఉపయోగించే కరెన్సీ, Shopify Payments నుండి మీరు పొందే పేఅవుట్‌ల కరెన్సీకి భిన్నంగా ఉండవచ్చు. వివిధ కరెన్సీలలో విక్రయించడం మరియు చెల్లింపులు పొందడం గురించి మరింత తెలుసుకోండి.

ఈ గైడ్ ఐర్లాండ్‌లో Shopify Paymentsతో పేఅవుట్ కరెన్సీలు, సెటిల్‌మెంట్ సమయాలు, ప్రాసెసింగ్ రుసుములు మరియు మీ లావాదేవీల చరిత్రను ఎలా చూడాలో వివరిస్తుంది.

ఐర్లాండ్‌లో Shopify Payments కోసం రుసుములు

Shopify Payments రుసుములు లొకేషన్ ఆధారంగా ఉంటాయి మరియు మారుతూ ఉండవచ్చు. రుసుములకు సంబంధించి అత్యంత కచ్చితమైన మరియు వివరణాత్మక సమాచారం కోసం, ఐర్లాండ్ ప్లాన్‌లు మరియు ధర నిర్ణయాల పేజీని సందర్శించండి. ఈ పేజీ, మీరు ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా Shopify Paymentsతో అనుబంధించబడిన రేట్లు మరియు రుసుముల వివరణను అందిస్తుంది.

మీ Shopify అడ్మిన్‌లో చెల్లింపు రేట్లను చూడండి

మీరు ఇప్పటికే Shopify వ్యాపారి అయితే, మీరు మీ స్టోర్ లొకేషన్ మరియు ఎంచుకున్న ప్లాన్‌కు వర్తించే నిర్దిష్ట రేట్లు మరియు రుసుముల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > చెల్లింపులుకు వెళ్లండి.

  2. Shopify Payments విభాగంలో, నిర్వహించండిపై క్లిక్ చేయండి.

  3. విభిన్న చెల్లింపు పద్ధతులకు వర్తించే రేట్లను చూడండి.

ఐర్లాండ్‌లో Shopify Payments కోసం సెటిల్‌మెంట్ సమయాలు

సెటిల్‌మెంట్ సమయం అంటే కస్టమర్ చెల్లింపును క్యాప్చర్ చేసినప్పటి నుండి, ఆ నిధులు మీ బ్యాంక్ ఖాతాకు పంపబడేందుకు అందుబాటులో ఉండే సమయం వరకు పట్టే వ్యవధి. కస్టమర్ చెల్లింపును క్యాప్చర్ చేసిన టైమ్‌స్టాంప్ అనేది కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (UTC)లో రికార్డ్ చేయబడుతుంది. శుక్రవారం, శనివారం మరియు ఆదివారం క్యాప్చర్ చేసిన చెల్లింపులు ఏకీకృతం చేయబడి, ఒకే పేఅవుట్‌గా పంపబడతాయి.

ఐర్లాండ్‌లో, కనీస సెటిల్‌మెంట్ సమయం 3 పనిదినాలుగా ఉంటుంది. మీరు పేఅవుట్‌లను స్వీకరించడం ప్రారంభించినప్పుడు, మీ సెటిల్‌మెంట్ సమయం ఎక్కువగా ఉంటుంది, అయితే మీరు ఆర్డర్‌లను నిర్ణీత సమయానికి క్రమం తప్పకుండా నెరవేర్చిన కొద్దీ, మీ సెటిల్‌మెంట్ సమయం మీ ప్రాంతానికి ఉండే కనీస సెటిల్‌మెంట్ సమయానికి తగ్గుతుంది.

ఐర్లాండ్‌లో Shopify Payments కోసం కనీస పేఅవుట్ మొత్తం €1 EUR. పేఅవుట్ ఈ మొత్తం కంటే తక్కువగా ఉంటే, మరిన్ని నిధులు పేఅవుట్ కోసం అందుబాటులోకి వచ్చే వరకు అది పెండింగ్ స్థితిలో ఉంటుంది.

Shopify Payments ద్వారా చెల్లింపులు పొందడం గురించి మరింత తెలుసుకోండి.

ఐర్లాండ్‌లో Shopify Paymentsతో బహుళ కరెన్సీలలో పేఅవుట్‌లను స్వీకరించడం

మీ స్టోర్ Advanced ప్లాన్ లేదా Shopify Plus ప్లాన్‌లో ఉన్నట్లయితే, మీరు మద్దతు ఉన్న ఏదైనా పేఅవుట్ కరెన్సీని మీ డిఫాల్ట్ పేఅవుట్ కరెన్సీగా ఎంచుకోవచ్చు. బహుళ-కరెన్సీ చెల్లింపుల రుసుములు మరియు కరెన్సీ మార్పిడి రుసుముల కోసం కింది అంశాలను పరిశీలించండి:

  • మీ డిఫాల్ట్ పేఅవుట్ కరెన్సీ మీ దేశీయ కరెన్సీ అయిన EUR అయితే, మీకు బహుళ-కరెన్సీ చెల్లింపుల రుసుములు పడవు.
  • మీరు పేఅవుట్‌ల కోసం అదనపు బ్యాంక్ ఖాతాలను సెటప్ చేసినట్లయితే, మీ లొకేషన్ మరియు Shopify ప్లాన్ ఆధారంగా బహుళ-కరెన్సీ చెల్లింపుల రుసుములు వర్తిస్తాయి.
  • పేఅవుట్‌లను స్వీకరించడానికి మీ Shopify Payments ఖాతాలో సెటప్ చేయని కరెన్సీలో ఆర్డర్‌లు చేయబడితే, అవి మీ డిఫాల్ట్ కరెన్సీ బ్యాంక్ ఖాతాకు చెల్లించబడతాయి.
  • ఖాతా దేశీయేతర కరెన్సీలో ఉంటే, మీకు కరెన్సీ మార్పిడి రుసుము పడుతుంది.
  • ఆర్డర్‌లు మీ దేశీయ కరెన్సీలో ఉండి, మీ దేశీయ ప్రాంతంలోని బ్యాంకుకు చెల్లించబడితే, మీ దేశీయ కరెన్సీ మీ డిఫాల్ట్ పేఅవుట్ కరెన్సీ కానప్పటికీ మీకు అదనపు రుసుములు విధించబడవు.

మీరు దేశీయేతర కరెన్సీని మీ డిఫాల్ట్ కరెన్సీగా ఎంచుకుంటే - ఉదాహరణకు, ఐర్లాండ్‌లో Shopify Paymentsను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు USDని మీ డిఫాల్ట్ కరెన్సీగా ఎంచుకుంటే - మీరు పొందే ఏవైనా పేఅవుట్‌లకు మీ లొకేషన్ మరియు Shopify ప్లాన్ ఆధారంగా బహుళ-కరెన్సీ చెల్లింపుల రుసుము విధించబడుతుంది.

ఐర్లాండ్‌లో Shopify Paymentsతో మద్దతు ఉన్న పేఅవుట్ కరెన్సీలు

ఐర్లాండ్‌లో Shopify Paymentsను ఉపయోగిస్తున్నప్పుడు మీరు పేఅవుట్‌లను స్వీకరించగల కరెన్సీలు, బ్యాంక్ ఖాతా ఉండాల్సిన లొకేషన్ మరియు వీటికి బహుళ-కరెన్సీ చెల్లింపుల రుసుములు విధించబడతాయా అనే వివరాలు కింద అందించబడ్డాయి.

ఐర్లాండ్‌లో Shopify Paymentsతో బహుళ-కరెన్సీ చెల్లింపులను ఉపయోగిస్తున్నప్పుడు అందుబాటులో ఉన్న పేఅవుట్ కరెన్సీలు.
పేఅవుట్ కరెన్సీబ్యాంక్ ఖాతా లొకేషన్దేశీయ కరెన్సీబహుళ-కరెన్సీ చెల్లింపుల రుసుము
EURఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జిబ్రాల్టర్, గ్రీస్, హంగేరి, ఐర్లాండ్, ఇటలీ, లాట్వియా, లీచ్టెన్‌స్టెయిన్, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లొవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్అవునులేదు
AUD, CAD, CHF, CZK, DKK, GBP, HKD, HUF, JPY, NOK, NZD, PLN, RON, SEK, SGD, ZARఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జిబ్రాల్టర్, గ్రీస్, హంగేరి, ఐర్లాండ్, ఇటలీ, లాట్వియా, లీచ్టెన్‌స్టెయిన్, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లొవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్లేదుఅవును
USDఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జిబ్రాల్టర్, గ్రీస్, హంగేరి, ఐర్లాండ్, ఇటలీ, లాట్వియా, లీచ్టెన్‌స్టెయిన్, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లొవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్లేదుఅవును

పేఅవుట్‌లను చూడటం

మీ Shopify అడ్మిన్‌లోని ఫైనాన్స్ పేజీ నుండి మీ పేఅవుట్‌లను చూడవచ్చు.

దశలు:

డెస్క్‌టాప్
  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఫైనాన్స్ > పేఅవుట్‌లుకు వెళ్లండి.
మొబైల్
  1. Shopify యాప్ నుండి, మెనూ ఐకాన్‌ను ట్యాప్ చేయండి.

  2. ఫైనాన్స్ను ట్యాప్ చేయండి.

  3. పేఅవుట్‌లను చూడండిని ట్యాప్ చేయండి.

పన్ను రిపోర్టింగ్

వ్యాపారిగా, పన్ను రిపోర్టింగ్‌తో సహా వర్తించే అన్ని నిబంధనలకు మీరు కట్టుబడి ఉండాలి. మీ అధికార పరిధి ఆధారంగా, మీ విక్రయాలను స్థానిక పన్ను అధికారులకు రిపోర్ట్ చేయడం Shopify Payments‌కు కూడా తప్పనిసరి కావచ్చు.

ఐర్లాండ్ మినహా ఐరోపాలోని స్టోర్‌లకు, Shopify Payments రుసుములలో విలువ ఆధారిత పన్ను (VAT) కలిసి ఉండదు. మీరు మీ VAT రిటర్న్‌లో స్థానికంగా వర్తించే పన్ను రేటు వద్ద VATను లెక్కించాల్సి రావచ్చు. ఈ సమాచారాన్ని పొందడానికి, మీరు రూపొందించిన ఇన్‌వాయిస్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా మీ లావాదేవీ వివరాలున్న ఫైల్‌ను ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు.

ఐర్లాండ్‌లోని స్టోర్‌లకు, Shopify Payments రుసుములతో పాటు 23% VAT అదనంగా వసూలు చేయబడుతుంది.

రూపొందించిన ఇన్‌వాయిస్‌ను డౌన్‌లోడ్ చేయండి

మీ పన్ను క్లెయిమ్‌తో సమర్పించడానికి, నెలవారీ ఇన్‌వాయిస్‌లను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ నెలలో మీ స్టోర్‌లో చేసిన అన్ని ఆర్డర్‌లకు సంబంధించిన లావాదేవీ రుసుములపై చెల్లించిన మొత్తం VAT ప్రతి ఇన్‌వాయిస్‌లో ఉంటుంది. రూపొందించిన ఇన్‌వాయిస్‌లు UTC టైమ్ జోన్‌ను (సమయ మండలాన్ని) ఉపయోగిస్తాయి, ఇది మీ స్టోర్ టైమ్ జోన్‌కు భిన్నంగా ఉండవచ్చు. మీ స్టోర్ టైమ్ జోన్‌ను ఉపయోగించే రిపోర్ట్ మీకు కావాలంటే, మీరు మీ స్టోర్ లావాదేవీల జాబితాను ఒక CSV ఫైల్‌గా ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు.

ప్రతి నెలకు సంబంధించిన ఇన్‌వాయిస్ తర్వాతి నెల 5వ తేదీన రూపొందుతుంది. ఉదాహరణకు, జూన్ ఇన్‌వాయిస్ జూలై 5న రూపొందుతుంది. ఒక నెలలో Shopify Payments ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగకపోతే, ఆ నెలకు ఎలాంటి ఇన్‌వాయిస్ రూపొందదు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఫైనాన్స్ > పేఅవుట్‌లుకు వెళ్లండి.

  2. డాక్యుమెంట్‌లు మీద క్లిక్ చేయండి.

  3. పన్ను డాక్యుమెంట్‌లు డైలాగ్‌లో, మీరు డౌన్‌లోడ్ చేయాలనుకునే ఇన్‌వాయిస్ కోసం PDF డౌన్‌లోడ్ చేయండి మీద క్లిక్ చేయండి.

లావాదేవీలను ఎక్స్‌పోర్ట్ చేయండి

మీ స్టోర్ లావాదేవీల జాబితాను మీరు ఒక CSV ఫైల్‌గా ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు. యూరోపియన్ వ్యాపారుల కోసం, ఈ CSV ఫైల్‌లో VAT నిలువు వరుస ఉంటుంది.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఫైనాన్స్ > పేఅవుట్‌లుకు వెళ్లండి.

  2. లావాదేవీలు మీద క్లిక్ చేయండి.

  3. ఎక్స్‌పోర్ట్ చేయండి మీద క్లిక్ చేయండి. మీ బ్రౌజర్‌లో ఒక CSV ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది.

  4. ఒక స్ప్రెడ్‌షీట్ ఎడిటర్‌లో CSV ఫైల్‌ను తెరవండి. ప్రతి లావాదేవీపై వసూలు చేసిన VAT మొత్తాన్ని ఈ CSV ఫైల్‌లోని చివరి నిలువు వరుస చూపుతుంది.

  5. మీరు వసూలు చేసిన మొత్తం VATను లెక్కించడానికి SUM టూల్‌ను ఉపయోగించండి.