మెక్సికోలో Shopify Paymentsను ఉపయోగించడం కోసం బ్యాంక్ ఖాతా మరియు వ్యక్తిగత సమాచార ఆవశ్యకతలు
మీరు మెక్సికోలో Shopify Paymentsను ఉపయోగించడానికి ముందు, నిబంధనలకు అనుగుణంగా మరియు ఆర్థిక నేరాలను నిరోధించడానికి ఉన్న ఆవశ్యకతలను మీరు అర్థం చేసుకోవాలి. మీ గుర్తింపును మరియు వ్యాపార వివరాలను ధృవీకరించడానికి వ్యక్తిగత సమాచారం సేకరించబడుతుంది మరియు ఈ ప్రయోజనం కోసం కొన్ని రకాల డాక్యుమెంటేషన్ అంగీకరించబడతాయి.
ఈ పేజీలో
- మెక్సికోలో Shopify Paymentsను ఉపయోగించడం కోసం ఆవశ్యకతలు
- సమాచారాన్ని సేకరించడం వెనుక ఉన్న ఉద్దేశం
- మెక్సికోలో Shopify Paymentsను యాక్టివేట్ చేయడానికి అవసరమైన వ్యక్తిగత, వ్యాపార సమాచారం
- ఆమోదయోగ్యమైన డాక్యుмент రకాలు
- డాక్యుమెంటేషన్ సమ్మతిని నిర్ధారించడం
- సాధారణ సమస్యల ట్రబుల్షూటింగ్
- తరచుగా అడిగే ప్రశ్నలు
- మెక్సికోలో Shopify Payments గురించి మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి ముందు
మెక్సికోలో Shopify Paymentsను ఉపయోగించడం కోసం ఆవశ్యకతలు
మీరు మెక్సికోలో Shopify Paymentsను ఉపయోగించే ముందు, మీరు ఈ కింది ఆవశ్యకతలను తీర్చారని నిర్ధారించుకోవాలి:
- అర్హతగల వ్యాపార రకాలు: కొన్ని రకాల వ్యాపారాలు మరియు సర్వీస్‌లు Shopify Paymentsను ఉపయోగించడానికి అనుమతించబడవు. మీ వ్యాపారం అర్హత కలిగి ఉందో లేదో నిర్ధారించడానికి, Shopify Payments సేవా నిబంధనలలో (TOS) మెక్సికో కోసం నిషేధించబడిన వ్యాపార రకాల జాబితాను చూడండి.
- బ్యాంక్ ఖాతా ఆవశ్యకతలు: మీరు మీ బ్యాంక్ ఖాతాను Shopify Paymentsకు కనెక్ట్ చేయడానికి ముందు, అది కింది ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండాలి:
- బ్యాంక్ ఖాతా మెక్సికోలో ఉండాలి.
- ఆ బ్యాంక్ ఖాతా SPEI బదిలీలకు అర్హత కలిగి ఉండాలి.
మద్దతు లేని బ్యాంక్ ఖాతా రకాలు
నిర్దిష్ట బ్యాంక్ ఖాతా రకాలు Shopify Paymentsకు అనుకూలంగా లేవు. కింది ఖాతా రకాలకు మద్దతు లేదు:
- కేవలం వైర్ బదిలీలను మాత్రమే ఆమోదించే చెకింగ్ ఖాతాలు: ఈ ఖాతాలు Shopify Paymentsతో పని చేయవు.
- పొదుపు ఖాతాలు: Shopify Payments పేఅవుట్ల కోసం పొదుపు ఖాతాలను ఉపయోగించలేరు.
- ఫ్లెక్స్-కరెన్సీ ఖాతాలు: ఒకేసారి బహుళ కరెన్సీలకు మద్దతు ఇచ్చే ఖాతాలకు మద్దతు లేదు.
- మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్‌లు: కొన్ని ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల వంటి బ్యాంక్ ఖాతాలను పోలి ఉండే సర్వీస్‌లను Shopify Paymentsతో ఉపయోగించడం సాధ్యపడదు.
నాన్-Shopify వర్చువల్ ఖాతాలకు మద్దతు ఉన్నప్పటికీ, ఈ ఖాతాలతో మీరు మరిన్ని పేఅవుట్ వైఫల్యాలను ఎదుర్కోవచ్చు.
మీ ఖాతా, మీ ప్రాంతానికి జాబితా చేయబడిన బదిలీ రకాన్ని ఆమోదిస్తుందో లేదో నిర్ధారించడానికి మీ బ్యాంక్‌ను సంప్రదించండి.
సమాచారాన్ని సేకరించడం వెనుక ఉన్న ఉద్దేశం
ఆర్థిక నేరాలను నిరోధించడానికి రూపొందించిన మెక్సికో నిబంధనలకు అనుగుణంగా, మీ గురించి, మీ వ్యాపారం గురించి సమాచారాన్ని సేకరించి, ధృవీకరించాల్సిన అవసరం Shopifyకి, దాని బ్యాంకింగ్ భాగస్వాములకు ఉంది. స్థానిక నియమాలు, నిబంధనలు మారుతున్నందున, మీ Shopify Payments ఖాతా మనుగడలో ఉన్నంత కాలం అదనపు సమాచారాన్ని అందించాల్సిందిగా Shopify, దాని బ్యాంకింగ్ భాగస్వాములు మిమ్మల్ని సంప్రదించవచ్చు.
వ్యాపార గుర్తింపును, వ్యాపారంతో లింక్ చేయబడిన వ్యక్తుల గుర్తింపులను, అలాగే ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధ స్వభావాన్ని నిర్ధారించడానికి సేకరించిన సమాచారం ఉపయోగించబడుతుంది.
మీకు డాక్యుమెంటేషన్‌ను Shopify ఎప్పటికీ భౌతికంగా మెయిల్ చేయదు. ఏవైనా ముఖ్యమైన డాక్యుమెంట్లు లేదా కమ్యూనికేషన్లు ఇమెయిల్ ద్వారా పంపబడతాయి లేదా మీ Shopify అడ్మిన్లోని సెట్టింగ్‌లు > వినియోగదారులు పేజీలో స్టోర్ యజమానికి డిజిటల్‌గా అందుబాటులో ఉంచబడతాయి.
మీ సమాచారం గోప్యంగా, సురక్షితంగా ఎలా ఉంచబడుతుందో తెలుసుకోవడానికి Shopify గోప్యతా విధానాన్ని చదవండి.
మెక్సికోలో Shopify Paymentsను యాక్టివేట్ చేయడానికి అవసరమైన వ్యక్తిగత, వ్యాపార సమాచారం
మీ వ్యాపార రకాన్ని సరిగ్గా గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే మీరు అందించాల్సిన సమాచారాన్ని అది నిర్ణయిస్తుంది.
మీరు ఇంకా మీ వ్యాపారాన్ని ప్రభుత్వంతో నమోదు చేసుకోనట్లయితే, వ్యక్తిని ఎంచుకోండి.
మీరు మీ వ్యాపారాన్ని నమోదు చేసి ఉండి, ఆ వ్యాపార సంస్థకు (Registro Federal de Contribuyentes) RFC ఉంటే, కింది మార్గదర్శకాల ఆధారంగా మీ వ్యాపార రకాన్ని ఎంచుకోండి:
- ఏకవ్యక్తి యాజమాన్యాలు తప్పనిసరిగా వ్యక్తిని ఎంచుకోవాలి.
- లాభాపేక్ష లేని సంస్థలు తప్పనిసరిగా లాభాపేక్ష లేని సంస్థను ఎంచుకోవాలి.
- మిగతా అన్ని వ్యాపారాలు ప్రైవేట్ కార్పొరేషన్‌ను ఎంచుకోవాలి.
ఏ వ్యాపార రకాన్ని ఎంచుకోవాలో మీకు తెలియకపోతే, సరైనదాన్ని ఎంచుకోవడంలో సహాయం కోసం Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.
వ్యక్తులు
వ్యక్తులు అంటే ప్రభుత్వంతో నమోదు చేసుకోకుండా, ప్రైవేట్‌గా వ్యాపారం చేస్తున్న ఏకవ్యక్తి యాజమాన్య వ్యాపారాలు. వ్యక్తులు కింది సమాచారాన్ని అందించాలి:
- చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్నట్లుగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
- పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
- Registro Federal de Contribuyentes (RFC): Servicio de Administración Tributaria (SAT) జారీ చేసిన, మీ పేరుతో అనుబంధించబడిన మీ వ్యక్తిగత RFC నంబర్.
- ఇమెయిల్ చిరునామా: చెల్లుబాటు అయ్యే, సక్రియంగా ఉన్న ఇమెయిల్ చిరునామా.
- ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే, సక్రియంగా ఉన్న ఫోన్ నంబర్.
- మెక్సికోలో నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌కు సరిపోలే మీ ఇంటి చిరునామా.
మీ పేరు, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా ఖచ్చితమైనవిగా ఉన్నాయని, అలాగే ప్రభుత్వం జారీ చేసిన మీ డాక్యుమెంటేషన్‌కు సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. మీ సమాచారాన్ని ధృవీకరించలేకపోతే, డాక్యుమెంటేషన్‌కు సరిపోయేలా మీ పేరును, పుట్టిన తేదీని అప్డేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది, అలాగే మీరు ఫోటో IDని కూడా అందించాల్సి రావచ్చు. ఆమోదయోగ్యమైన ఫోటో ID డాక్యుమెంట్ల జాబితాను రివ్యూ చేయండి.
ఒకవేళ మీ చిరునామా ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, మీరు తప్పనిసరిగా చిరునామా డాక్యుమెంట్ రుజువును అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ ఖాతాలో జాబితా చేయబడిన చిరునామా, డాక్యుమెంట్‌లోని చిరునామాకు ఖచ్చితంగా సరిపోలుతుందని నిర్ధారించుకోండి. అవసరమైతే, డాక్యుమెంట్‌కు సరిపోయేలా మీ ఖాతాలోని సమాచారాన్ని అప్డేట్ చేయండి. ఆమోదయోగ్యమైన చిరునామా డాక్యుమెంట్ల జాబితాను రివ్యూ చేయండి.
ప్రైవేట్ కార్పొరేషన్లు
ప్రైవేట్ కార్పొరేషన్ అనేది వాటాదారుల యాజమాన్యంలో షేర్లుగా విభజించబడిన ఈక్విటీని కలిగి ఉండే వ్యాపారం. కంపెనీ అనేది దానిని నడిపే వ్యక్తుల కంటే భిన్నంగా తనకంటూ సొంతంగా ఉండే ఒక చట్టబద్ధమైన సంస్థగా పరిగణించబడుతుంది. వాళ్లు సాధారణంగా డైరెక్టర్ల బోర్డును కూడా కలిగి ఉంటారు.
ప్రైవేట్ కార్పొరేషన్లు, లబ్ధిదారుడైన యజమానిని లేదా నిర్ణయాధికారం ఉన్న ఎగ్జిక్యూటివ్‌ను వారి ఖాతా ప్రతినిధిగా కేటాయించాలి. ఖాతా ప్రతినిధి కింది సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది:
- చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్నట్లుగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
- పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
- Registro Federal de Contribuyentes (RFC): Servicio de Administración Tributaria (SAT) జారీ చేసిన, మీ పేరుతో అనుబంధించబడిన మీ వ్యక్తిగత RFC నంబర్.
- ఇమెయిల్ చిరునామా: చెల్లుబాటు అయ్యే, సక్రియంగా ఉన్న ఇమెయిల్ చిరునామా.
- ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే, సక్రియంగా ఉన్న ఫోన్ నంబర్.
- నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌కు సరిపోలే మీ ఇంటి చిరునామా.
- ఉద్యోగ హోదా: వ్యాపారంలో మీకు ఉన్న ఉద్యోగ హోదా.
- ఈక్విటీ: వర్తిస్తే, వ్యాపారంలో మీరు కలిగి ఉన్న ఈక్విటీ శాతం.
మీ పేరు, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా ఖచ్చితమైనవిగా ఉన్నాయని, అలాగే ప్రభుత్వం జారీ చేసిన మీ డాక్యుమెంటేషన్‌కు సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. మీ సమాచారాన్ని ధృవీకరించలేకపోతే, డాక్యుమెంటేషన్‌కు సరిపోయేలా మీ పేరును, పుట్టిన తేదీని అప్డేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది, అలాగే మీరు ఫోటో IDని కూడా అందించాల్సి రావచ్చు. ఆమోదయోగ్యమైన ఫోటో ID డాక్యుమెంట్ల జాబితాను రివ్యూ చేయండి.
ఒకవేళ మీ చిరునామా ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, మీరు తప్పనిసరిగా చిరునామా డాక్యుమెంట్ రుజువును అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ ఖాతాలో జాబితా చేయబడిన చిరునామా, డాక్యుమెంట్‌లోని చిరునామాకు ఖచ్చితంగా సరిపోలుతుందని నిర్ధారించుకోండి. అవసరమైతే, డాక్యుమెంట్‌కు సరిపోయేలా మీ ఖాతాలోని సమాచారాన్ని అప్డేట్ చేయండి. ఆమోదయోగ్యమైన చిరునామా డాక్యుమెంట్ల జాబితాను రివ్యూ చేయండి.
ప్రైవేట్ కార్పొరేషన్లు, వారి వ్యాపారం గురించి కింది వివరాలను కూడా అందించాలి:
- నమోదిత వ్యాపార పేరు: SAT బిజినెస్ రిజిస్ట్రీలో చూపబడిన చట్టబద్ధమైన వ్యాపార పేరు.
- Registro Federal de Contribuyentes (RFC): Servicio de Administración Tributaria (SAT) జారీ చేసిన, వ్యాపారంతో అనుబంధించబడిన మీ వ్యాపారానికి చెందిన RFC నంబర్.
- వ్యాపార ఫోన్ నంబర్: వ్యాపారానికి సంబంధించిన సక్రియ సంప్రదింపు ఫోన్ నంబర్.
- వ్యాపార చిరునామా: SAT బిజినెస్ రిజిస్ట్రీలో చూపబడిన వ్యాపారానికి సంబంధించిన అధికారిక నమోదిత చిరునామా.
మెక్సికోలోని ప్రభుత్వ రిజిస్ట్రీలతో పోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు మీ సమాచారాన్ని ధృవీకరిస్తారు. అక్షరాల (కేస్), విరామ చిహ్నాలు, అలాగే గుర్తుల పట్ల చాలా శ్రద్ధ వహించండి.
వ్యాపారం గురించి మీరు అందించే సమాచారాన్ని ధృవీకరించలేకపోతే, మీరు వ్యాపార ధృవీకరణ డాక్యుమెంట్‌ను అందించాల్సి రావచ్చు. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ ఖాతాలో జాబితా చేయబడిన నమోదిత పేరు, RFC, అలాగే వ్యాపార చిరునామా డాక్యుమెంట్‌లోని సమాచారానికి ఖచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అవసరమైతే, డాక్యుమెంట్‌కు సరిపోయేలా మీ ఖాతాలోని సమాచారాన్ని అప్డేట్ చేయండి.
మీరు అదనంగా, కంపెనీలో లబ్ధిదారులైన యజమానులుగా ఉన్న ఇతరుల పేర్లను కూడా జాబితా చేయాలి. వారి పేర్లు, పుట్టిన తేదీలు, ఇంటి చిరునామాలను ప్రభుత్వ డాక్యుమెంట్లలో చూపిన విధంగానే సరిగ్గా నమోదు చేశారని నిర్ధారించుకోండి. అందించిన సమాచారాన్ని ఉపయోగించి వారి గుర్తింపులను ఆటోమేటిక్‌గా ధృవీకరించలేకపోతే, వారు ఫోటో IDని లేదా చిరునామా రుజువును అందించాల్సి రావచ్చు.
లాభాపేక్ష లేని సంస్థలు
లాభాపేక్ష లేని సంస్థ (NPO) అనేది దాని వాటాదారుల కోసం లాభాలను ఆర్జించడం కాకుండా ఇతర ఉద్దేశాల కోసం స్థాపించబడిన సంస్థ. ప్రజల లేదా కమ్యూనిటీ ప్రయోజనం కోసం సేవ చేయడమే దీని ప్రాథమిక లక్ష్యం.
లాభాపేక్ష లేని సంస్థలు ఒక డైరెక్టర్‌ను లేదా నిర్ణయాధికారం ఉన్న ఒక ఎగ్జిక్యూటివ్‌ను తమ ఖాతా ప్రతినిధిగా కేటాయించాలి. ఖాతా ప్రతినిధి కింది సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది:
- చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్నట్లుగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
- పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
- Registro Federal de Contribuyentes (RFC): Servicio de Administración Tributaria (SAT) జారీ చేసిన, మీ పేరుతో అనుబంధించబడిన మీ వ్యక్తిగత RFC నంబర్.
- ఇమెయిల్ చిరునామా: చెల్లుబాటు అయ్యే, సక్రియంగా ఉన్న ఇమెయిల్ చిరునామా.
- ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే, సక్రియంగా ఉన్న ఫోన్ నంబర్.
- నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌కు సరిపోలే మీ ఇంటి చిరునామా.
- ఉద్యోగ హోదా: వ్యాపారంలో మీకు ఉన్న ఉద్యోగ హోదా.
- ఈక్విటీ: వర్తిస్తే, వ్యాపారంలో మీరు కలిగి ఉన్న ఈక్విటీ శాతం.
మీ పేరు, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా ఖచ్చితమైనవిగా ఉన్నాయని, అలాగే ప్రభుత్వం జారీ చేసిన మీ డాక్యుమెంటేషన్‌కు సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. మీ సమాచారాన్ని ధృవీకరించలేకపోతే, డాక్యుమెంటేషన్‌కు సరిపోయేలా మీ పేరును, పుట్టిన తేదీని అప్డేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది, అలాగే మీరు ఫోటో IDని కూడా అందించాల్సి రావచ్చు. ఆమోదయోగ్యమైన ఫోటో ID డాక్యుమెంట్ల జాబితాను రివ్యూ చేయండి.
ఒకవేళ మీ చిరునామా ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, మీరు తప్పనిసరిగా చిరునామా డాక్యుమెంట్ రుజువును అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ ఖాతాలో జాబితా చేయబడిన చిరునామా, డాక్యుమెంట్‌లోని చిరునామాకు ఖచ్చితంగా సరిపోలుతుందని నిర్ధారించుకోండి. అవసరమైతే, డాక్యుమెంట్‌కు సరిపోయేలా మీ ఖాతాలోని సమాచారాన్ని అప్డేట్ చేయండి. ఆమోదయోగ్యమైన చిరునామా డాక్యుమెంట్ల జాబితాను రివ్యూ చేయండి.
లాభాపేక్ష లేని సంస్థలు కూడా తమ వ్యాపారం గురించి కింది వివరాలను అందించాలి:
- నమోదిత వ్యాపార పేరు: SAT బిజినెస్ రిజిస్ట్రీలో చూపబడిన చట్టబద్ధమైన వ్యాపార పేరు.
- Registro Federal de Contribuyentes (RFC): Servicio de Administración Tributaria (SAT) జారీ చేసిన, వ్యాపారంతో అనుబంధించబడిన మీ వ్యాపారానికి చెందిన RFC నంబర్.
- వ్యాపార ఫోన్ నంబర్: వ్యాపారానికి సంబంధించిన సక్రియ సంప్రదింపు ఫోన్ నంబర్.
- వ్యాపార చిరునామా: SAT బిజినెస్ రిజిస్ట్రీలో చూపబడిన వ్యాపారానికి సంబంధించిన అధికారిక నమోదిత చిరునామా.
మెక్సికోలోని ప్రభుత్వ రిజిస్ట్రీలతో పోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు మీ సమాచారాన్ని ధృవీకరిస్తారు. అక్షరాల (కేస్), విరామ చిహ్నాలు, అలాగే గుర్తుల పట్ల చాలా శ్రద్ధ వహించండి.
వ్యాపారం గురించి మీరు అందించే సమాచారాన్ని ధృవీకరించలేకపోతే, మీరు వ్యాపార ధృవీకరణ డాక్యుమెంట్‌ను అందించాల్సి రావచ్చు. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ ఖాతాలో జాబితా చేయబడిన నమోదిత పేరు, RFC, అలాగే వ్యాపార చిరునామా డాక్యుమెంట్‌లోని సమాచారానికి ఖచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అవసరమైతే, డాక్యుమెంట్‌కు సరిపోయేలా మీ ఖాతాలోని సమాచారాన్ని అప్డేట్ చేయండి.
మీరు అదనంగా, మీ డైరెక్టర్ల బోర్డులో ఉన్న వ్యక్తులను లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులను కూడా జాబితా చేయాలి. వారి పేర్లు, పుట్టిన తేదీలు, ఇంటి చిరునామాలను వారి ప్రభుత్వ డాక్యుమెంట్లలో చూపిన విధంగానే సరిగ్గా నమోదు చేశారని నిర్ధారించుకోండి. అందించిన సమాచారాన్ని ఉపయోగించి వారి గుర్తింపులను ఆటోమేటిక్‌గా ధృవీకరించలేకపోతే, వారు ఫోటో IDని లేదా చిరునామా రుజువును అందించాల్సి రావచ్చు.
ఆమోదయోగ్యమైన డాక్యుమెంట్ రకాలు
ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి, మీ వ్యక్తిగత సమాచారాన్ని, కొన్ని సందర్భాల్లో మీ వ్యాపార సమాచారాన్ని ధృవీకరించడానికి మీరు నిర్దిష్ట డాక్యుమెంట్లను అందించాలి. మెక్సికోలోని వ్యక్తులకు, వ్యాపారాలకు కింది డాక్యుమెంట్ రకాలు ఆమోదయోగ్యమైనవి.
గుర్తింపు డాక్యుమెంట్లు
గుర్తింపు డాక్యుమెంట్లలో మీ పేరు, పుట్టిన తేదీ మరియు ఫోటో ఉండాలి. మీ Shopify Payments అకౌంట్లోని పేరు, పుట్టిన తేదీలు మీరు అందిస్తున్న గుర్తింపు డాక్యుమెంట్లో ఉన్న సమాచారంతో సరిపోలేలా అప్డేట్ చేయాలి. డాక్యుమెంట్లు చెల్లుబాటులో ఉండాలి, వాటి గడువు ముగిసి ఉండకూడదు. గుర్తింపు రుజువుగా కింది డాక్యుమెంట్లు అంగీకరించబడతాయి:
- Pasaporte (పాస్‌పోర్ట్)
- Tarjeta de identificación (ID కార్డ్, ముందు, వెనుక భాగాల ఫోటోలు అవసరం)
- ID consular / ID matricular consular (కాన్సులర్ ID/మెట్రిక్యులర్ కాన్సులర్ ID కార్డ్)
- Credencial de elector (ఓటరు ID కార్డ్)
- CURP, Clave Única de Registro de Población (యూనిక్ పాపులేషన్ రిజిస్ట్రీ కోడ్)
- Acta de nacimiento (జనన ధృవీకరణ పత్రం)
- Licencia de conducir (డ్రైవింగ్ లైసెన్స్)
చిరునామా డాక్యుమెంట్లు
చిరునామా డాక్యుమెంట్లలో మీ పూర్తి పేరు, నివాస చిరునామా కనిపించాలి. మీ Shopify Payments అకౌంట్లోని పేరు, చిరునామాలు మీరు అందిస్తున్న చిరునామా డాక్యుమెంట్లలోని సమాచారంతో సరిపోలేలా అప్డేట్ చేయాలి. మెక్సికోలో Shopify Paymentsని ఉపయోగిస్తున్నప్పుడు ఆమోదించబడే చిరునామా డాక్యుమెంట్లు కింద ఇవ్వబడ్డాయి:
- Recibo de servicios (యుటిలిటీ బిల్లులు) - 6 నెలల లోపు తేదీ ఉండాలి
- Estado de cuenta de una institución financiera (ఆర్థిక సంస్థ నుండి స్టేట్మెంట్) - 6 నెలల లోపు తేదీ ఉండాలి
- Aviso emitido por el gobierno (ప్రభుత్వం జారీ చేసిన లెటర్) - 12 నెలల లోపు తేదీ ఉండాలి
వ్యాపారం లేదా సంస్థ డాక్యుమెంట్లు
వ్యాపార సంబంధిత డాక్యుమెంటేషన్‌లో చట్టబద్ధమైన సంస్థ పేరు, RFC నంబర్, మీ వ్యాపార చిరునామా స్పష్టంగా కనిపించాలి. మీ Shopify Payments అకౌంట్లోని వివరాలు మీరు అందిస్తున్న డాక్యుమెంట్లలోని సమాచారంతో సరిపోలేలా అప్డేట్ చేయాలి. వ్యాపార వెరిఫికేషన్ కోసం కింది డాక్యుమెంట్లు అంగీకరించబడతాయి:
- Cédula de Identificación Fiscal (పన్ను ID)
- Estatutos (ఆర్టికల్స్ ఆఫ్ ఇన్కార్పొరేషన్)
- Reglamentos vigentes (ప్రస్తుత ఉప-చట్టాలు)
- Poder notarial (పవర్ ఆఫ్ అటార్నీ)
- Constancia de Situación Fiscal (SAT)
డాక్యుమెంటేషన్ సమ్మతిని నిర్ధారించడం
మీ డాక్యుమెంట్లను అందిస్తున్నప్పుడు, అవి అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. సమ్మతిని నిర్ధారించుకోవడానికి కింది మార్గదర్శకాలను రివ్యూ చేయండి:
- ఖచ్చితత్వం: మీ డాక్యుమెంట్లలోని సమాచారం మీ Shopify Payments అకౌంట్లో మీరు నమోదు చేసిన దానితో సరిపోలుతుందని నిర్ధారించుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్లకు సరిపోలేలా మీ అకౌంట్‌ను అప్డేట్ చేయండి.
- స్పష్టత, చదవగలిగే వీలు: మీ డాక్యుమెంట్లు స్పష్టంగా, చదవడానికి వీలుగా తగినంత పెద్దవిగా ఉన్నాయో లేదో చూసుకోండి. డాక్యుమెంట్ మొత్తం ఫోటోలో కనిపిస్తోందని నిర్ధారించుకోండి.
- సమగ్రత: మీ డాక్యుమెంట్లో అవసరమైన అన్ని వివరాలు కనిపిస్తున్నాయని నిర్ధారించుకోండి. డాక్యుమెంట్లో ఏ వివరాలను చేర్చాలో అర్థం చేసుకోవడానికి ఈ పేజీలో జాబితా చేసిన ఆమోదయోగ్యమైన డాక్యుమెంట్ రకాలను రివ్యూ చేయండి.
- ఒరిజినల్ డాక్యుమెంటేషన్: కెమెరాను ఉపయోగించి మీ డాక్యుమెంట్ ఒరిజినల్ ఫోటోను తీయండి. మీ డాక్యుమెంట్లను ఫోటోకాపీ, స్కాన్ లేదా స్క్రీన్‌షాట్ చేయవద్దు. డాక్యుమెంట్ల ఫోటోలను ఇతర డాక్యుమెంట్లలో పేస్ట్ చేయవద్దు. కంప్యూటర్ స్క్రీన్లు లేదా ప్రింటవుట్ల ఫోటోలను తీయవద్దు.
- మీ డాక్యుమెంట్ మీకు డిజిటల్‌గా జారీ చేయబడితే, ఎటువంటి మార్పులు చేయకుండా మీకు మొదట ఇచ్చిన విధంగానే అన్ని పేజీలతో కూడిన PDF ఫైల్‌ను అందించండి.
- చెల్లుబాటు: ఫోటో IDల గడువు ముగియలేదని, చిరునామా రుజువు ఇటీవల జారీ చేయబడిందని నిర్ధారించుకోండి. ఒకవేళ వ్యాపార రిజిస్ట్రేషన్ రుజువును అందిస్తున్నట్లయితే, మీ వ్యాపారం ఇప్పటికీ యాక్టివ్‌గా రిజిస్టర్ అయి ఉండాలి మరియు మంచి స్థితిలో ఉండాలి.
సాధారణ సమస్యల ట్రబుల్షూటింగ్
Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి ముందు, కింది సాధారణ ఆన్‌బోర్డింగ్ సమస్యలు, వాటి పరిష్కారాలను రివ్యూ చేయండి.
నా డాక్యుమెంట్ తిరస్కరించబడింది.
మీ అకౌంట్లోని సమాచారం, మీరు సమర్పిస్తున్న డాక్యుమెంట్‌లోని సమాచారంతో సరిపోలుతుందని నిర్ధారించుకోండి. ఒకవేళ అవసరమైతే మీ డాక్యుమెంటేషన్‌కు సరిపోలేలా మీ అకౌంట్‌ను అప్డేట్ చేయండి. మీ డాక్యుమెంట్లు ఇంకా తిరస్కరించబడుతుంటే, ఈ పేజీలోని కింది విభాగాలను చూడండి:
- ఆమోదయోగ్యమైన డాక్యుమెంట్ రకాలు: ఏ డాక్యుమెంట్లు ఆమోదించబడతాయి, వాటిలో ఏ వివరాలు ఉండాలి. స్క్రీన్షాట్లు, ఆన్లైన్ శోధనల ప్రింటవుట్లు, రిజిస్ట్రీ స్క్రీన్షాట్లు ఆమోదించబడవు.
- డాక్యుమెంటేషన్ సమ్మతిని నిర్ధారించడం: ఖచ్చితత్వం, స్పష్టత, సమగ్రత, ఒరిజినల్ డాక్యుమెంటేషన్, చెల్లుబాటు కోసం అవసరాలు.
నా చిరునామా ఆటోమేటిక్‌గా ధృవీకరించబడదు.
మీ చిరునామా ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, చిరునామా రుజువు డాక్యుమెంట్‌ను అందించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. చిరునామా రుజువు డాక్యుమెంట్లలో మీ పూర్తి పేరు, ఇంటి చిరునామా ఉండాలి, అలాగే అవి ఆమోదించబడిన డాక్యుమెంట్ రకాల్లో ఒకటి అయి ఉండాలి. మీ డాక్యుమెంట్‌ను అప్లోడ్ చేయడానికి ముందు:
- మీ Shopify Payments అకౌంట్లోని చిరునామా, మీ చిరునామా రుజువు డాక్యుమెంట్‌లోని చిరునామాతో ఖచ్చితంగా సరిపోలుతుందని నిర్ధారించండి.
- అవసరమైతే మీ డాక్యుమెంట్‌కు సరిపోలేలా మీ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయండి.
- డాక్యుమెంట్లో మీ స్వంత పూర్తి పేరు ఉందని నిర్ధారించండి. ఒకవేళ మీ వద్ద వేరొకరి పేరు మీద ఉన్న యుటిలిటీ బిల్లు ఉన్నట్లయితే, మీరు వేరొక డాక్యుమెంట్‌ను అందించాల్సి ఉంటుంది.
- డాక్యుమెంట్ యొక్క స్పష్టమైన ఫోటోను అప్లోడ్ చేయండి.
నా వ్యాపార సమాచారం ధృవీకరించబడటం లేదు.
Shopify బ్యాంకింగ్ భాగస్వాములు మీ వ్యాపార సమాచారాన్ని మెక్సికోలోని ప్రభుత్వ రిజిస్ట్రీలతో పోల్చడం ద్వారా ధృవీకరిస్తారు. ఒకవేళ మీ వ్యాపారాన్ని ధృవీకరించలేకపోతే, ఈ కింది వివరాలను చెక్ చేయండి:
- ప్రభుత్వ వ్యాపార రిజిస్ట్రీలలో కనిపించే విధంగా అక్షరాల కేస్, విరామ చిహ్నాలు, ఇతర చిహ్నాలతో సహా మీ నమోదిత వ్యాపార పేరు ఖచ్చితంగా సరిపోలుతుందని నిర్ధారించుకోండి.
- మీ RFC నంబర్ సరైనదని నిర్ధారించుకోండి.
- మీ వ్యాపార చిరునామా ప్రభుత్వ వ్యాపార రిజిస్ట్రీలో జాబితా చేయబడిన చిరునామాతో సరిపోలుతుందని నిర్ధారించుకోండి.
అప్పటికీ మీ సమాచారాన్ని ధృవీకరించలేకపోతే, మీరు ఒక వ్యాపార వెరిఫికేషన్ డాక్యుమెంట్‌ను అందించాల్సి రావచ్చు. మీ డాక్యుమెంట్‌లోని సమాచారం మీ Shopify Payments అకౌంట్లో మీరు నమోదు చేసిన దానితో సరిపోలుతుందని నిర్ధారించుకోండి.
మెక్సికోలోని నా వ్యాపారం కోసం నా వద్ద RFC లేదు, కానీ నేను వ్యక్తిని కాను
మీ వ్యాపార సంస్థ కోసం మీ వద్ద Registro Federal de Contribuyentes (RFC) లేకపోతే, మీరు ఒక వ్యక్తిగా కొనసాగాలి. మీరు ఒక కీలక నిర్ణయకర్తను లేదా యజమానిని అకౌంట్ ప్రతినిధిగా కేటాయించవచ్చు. Shopify Payments ప్రస్తుతం RFC లేని ఇతర వ్యాపార నిర్మాణాలకు మద్దతు ఇవ్వదు.
తరచుగా అడిగే ప్రశ్నలు
మెక్సికోలో Shopify Payments అవసరాలకు సంబంధించి తరచుగా అడిగే కింది ప్రశ్నలను రివ్యూ చేయండి.
నేను మెక్సికోలో ఒక కంపెనీ లేదా లాభాపేక్ష లేని సంస్థను అయితే, మీకు నా ఫోటో ID లేదా చిరునామా రుజువు ఎందుకు అవసరం?
మీరు ఒక కంపెనీ లేదా లాభాపేక్ష లేని సంస్థగా నమోదు చేసుకున్నప్పటికీ, మెక్సికోలోని నిబంధనల ప్రకారం Shopify బ్యాంకింగ్ భాగస్వాములు వ్యాపారానికి అనుబంధంగా ఉన్న వ్యక్తుల గుర్తింపులను, అలాగే వారు ఎక్కడ ఉన్నారో ధృవీకరించాల్సి ఉంటుంది.
నేను మెక్సికో పౌరుడిని కానీ ప్రస్తుతం అక్కడ నివసించడం లేదు. నేను Shopify Payments మెక్సికోను ఉపయోగించవచ్చా?
మీ వ్యాపార రకం 'వ్యక్తి' అయితే, Shopify Payments మెక్సికోకు అర్హత పొందడానికి మీరు మెక్సికోలో నివసించడం తప్పనిసరి. ఒకవేళ మీరు ప్రస్తుతం మెక్సికోలో నివసించకపోతే, దానికి బదులుగా మీరు నివసిస్తున్న ప్రాంతం కోసం ఒక Shopify Payments అకౌంట్‌ను సృష్టించాలి.
మీ స్టోర్ చిరునామాను మీ ప్రస్తుత లొకేషన్‌కు అప్డేట్ చేయండి. మీ లొకేషన్ Shopify Paymentsకు అర్హత పొందితే, దానికి బదులుగా మీరు ఆ ప్రాంతం కోసం ఒక Shopify Payments అకౌంట్‌ను సృష్టించవచ్చు.
మీరు కంపెనీ లేదా లాభాపేక్ష లేని సంస్థ రకం అయితే, మీరు వ్యక్తిగతంగా మెక్సికోలో నివసించాల్సిన అవసరం లేదు, కానీ మీ వ్యాపారం అక్కడ నమోదు చేయబడి ఉండాలి, అలాగే మెక్సికన్ వ్యాపార చిరునామాను కలిగి ఉండాలి. మీకు సహాయం కావాలంటే, Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.
నేను మెక్సికోలో ఒక సోల్ ట్రేడర్ లేదా ఏకవ్యక్తి యాజమాన్యాన్ని. నేను నా వ్యాపార సమాచారం, RFCని ఎలా నమోదు చేయాలి?
మెక్సికోలో వ్యాపారం మరియు గుర్తింపు వెరిఫికేషన్ ప్రయోజనాల కోసం, మీరు ఏకవ్యక్తి యాజమాన్యం అయితే యజమాని వ్యక్తిగత సమాచారం మాత్రమే అవసరం. దానికి అనుగుణంగా వ్యక్తి వ్యాపార రకాన్ని ఎంచుకోండి.
మీరు ఏకవ్యక్తి యాజమాన్యం అయితే, వేరే వ్యాపార రకంగా సైన్ అప్ చేయడానికి ప్రయత్నించకండి. మీరు వెరిఫికేషన్‌లో ఉత్తీర్ణత సాధించడంలో ఇబ్బంది పడవచ్చు.
నేను మెక్సికోలో పబ్లిక్‌గా ట్రేడ్ చేయబడే కంపెనీని. నేను ఏ వ్యాపార రకాన్ని ఎంచుకోవాలి?
ప్రైవేట్ కార్పొరేషన్ (Private corporation)ని ఎంచుకోండి. వ్యాపారం మరియు గుర్తింపు వెరిఫికేషన్ ప్రయోజనాల కోసం, పబ్లిక్ మరియు ప్రైవేట్ యాజమాన్యంలోని కంపెనీల ప్రాసెస్ ఒకేలా ఉంటుంది.
యజమానులను జోడించమని అభ్యర్థించే అకౌంట్ సెటప్ ఫారమ్ విభాగాన్ని మీరు దాటవేయవచ్చు. మీరు ముందే అకౌంట్‌ను సెటప్ చేసి ఉండి, మీ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో భాగంగా యాజమాన్యం సమాచారాన్ని అడిగితే, మీ వ్యాపార రకాన్ని అప్డేట్ చేయడంలో సహాయం కోసం Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.
నా Shopify Payments అకౌంట్ సమాచారాన్ని నేను ఎలా అప్డేట్ చేయాలి?
అకౌంట్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయమని మిమ్మల్ని యాక్టివ్‌గా అడుగుతున్నట్లయితే, అభ్యర్థిస్తున్న ఏవైనా డాక్యుమెంట్లను సమర్పించడంతో పాటు, మీరు వెరిఫికేషన్ పేజీ నుండి మీ సమాచారంలో ఏవైనా అప్డేట్లు చేయవచ్చు.
వెరిఫికేషన్ ప్రాసెస్ కాకుండా, స్టోర్‌కు చెందిన ఖాతా యజమాని సెట్టింగ్‌లు > సాధారణం > వ్యాపార వివరాలు ద్వారా ఈ వివరాలను అప్డేట్ చేయవచ్చు. మీ వ్యాపార సంస్థ పక్కన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి, ఆపై వ్యాపార రకంతో సహా ఆ వ్యాపార సమాచారాన్ని అప్డేట్ చేయడానికి "ఎడిట్ చేయండి"పై క్లిక్ చేయండి.
మీరు ఇక్కడ చేసే ఏవైనా మార్పులు ఆటోమేటిక్‌గా రివ్యూ కోసం మా బ్యాంకింగ్ భాగస్వాములకు పంపబడతాయి మరియు వారి వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా కొత్త సమాచారం మళ్లీ రన్ చేయబడుతుందని గమనించండి. మార్పులు ఆటోమేటిక్‌గా మళ్లీ వెరిఫై అయ్యే అవకాశం ఉంది, కానీ మిమ్మల్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా అడగవచ్చు.
ఈ ప్రాసెస్‌తో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, సహాయం కోసం Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.
నా అకౌంట్ ఇప్పటికే వెరిఫై చేయబడింది. కొత్త సమాచారాన్ని అందించమని నన్ను ఎందుకు అడుగుతున్నారు?
కాలానుగుణంగా, చట్టపరమైన మార్పులు మరియు Shopifyకి చెందిన ఆర్థిక భాగస్వాముల అవసరాలకు సంబంధించిన అప్డేట్ల కారణంగా ఖాతాదారుల నుండి అదనపు సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉండవచ్చు. ఈ రివ్యూలు ఆర్థిక సేవలను సురక్షితంగా మరియు భద్రంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఈ మార్పులు జరిగినప్పుడు, మీ Shopify అడ్మిన్లోని బ్యానర్ లేదా అలర్ట్ ద్వారా, అలాగే సంబంధిత ఇమెయిల్ ద్వారా మీకు తెలియజేయబడుతుంది. Shopify ఆర్థిక సేవలను ఉపయోగించడం కొనసాగించడానికి మీరు తప్పనిసరిగా ఈ అభ్యర్థనలను పూర్తి చేయాలి.
మెక్సికోలో Shopify Payments గురించి మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి ముందు
Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి ముందు, మీ సమస్యను వేగంగా పరిష్కరించడంలో సహాయపడటానికి కింది సమాచారాన్ని సేకరించండి:
- మీరు పొందిన ఏవైనా ఎర్రర్ మెసేజ్‌ల స్క్రీన్షాట్లు (బ్యాంక్ ఖాతా నంబర్ల వంటి సున్నితమైన సమాచారాన్ని సెన్సార్ చేయండి)
- సెటప్ సమయంలో మీరు ఎంచుకున్న వ్యాపార రకం
- వర్తిస్తే, మీ రిజిస్ట్రో ఫెడరల్ డి కంట్రిబ్యూయెంటెస్ (RFC)
- మీరు సమస్యను ఎదుర్కొన్న నిర్దిష్ట దశ
- మీరు ఉపయోగిస్తున్న బ్రౌజర్ మరియు పరికరం
- పూర్తి ఖాతా నంబర్‌ను షేర్ చేయకుండా మీ బ్యాంక్ ఖాతా వివరాలు (దేశం, కరెన్సీ, ఖాతా రకం)
ఈ సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవడం వలన Shopify సపోర్ట్ మీకు మరింత సమర్ధవంతంగా సహాయపడగలుగుతుంది.