స్వీడన్‌లో Shopify Payments కోసం బ్యాంక్ ఖాతా మరియు వ్యక్తిగత సమాచార ఆవశ్యకతలు
స్వీడన్‌లో Shopify Payments ఉపయోగించడానికి ముందు, నిబంధనలను పాటించడానికి మరియు ఆర్థిక నేరాలను నిరోధించడానికి అమలులో ఉన్న ఆవశ్యకతలను మీరు అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు సేకరిస్తాము, ఆమోదించబడే పత్రాల రకాలను ఈ ఆర్టికల్ వివరిస్తుంది మరియు మీ డాక్యుమెంటేషన్ అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి మార్గదర్శకాలను అందిస్తుంది.
ఈ పేజీలో
- స్వీడన్‌లో Shopify Payments ఉపయోగించడానికి కావలసిన ఆవశ్యకతలు
- సమాచారాన్ని సేకరించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం
- స్వీడన్‌లో Shopify Payments యాక్టివేట్ చేయడానికి అవసరమైన వ్యక్తిగత, వ్యాపార సమాచారం
- ఆమోదించబడే డాక్యుమెంట్ రకాలు
- డాక్యుమెంటేషన్ సమ్మతిని నిర్ధారించడం
- సాధారణ సమస్యల ట్రబుల్షూటింగ్
- తరచుగా అడిగే ప్రశ్నలు
- స్వీడన్‌లో Shopify Payments గురించి మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి ముందు
స్వీడన్‌లో Shopify Payments ఉపయోగించడానికి కావలసిన ఆవశ్యకతలు
మీరు స్వీడన్‌లో Shopify Payments ఉపయోగించడానికి ముందు, ఈ కింది ఆవశ్యకతలకు మీరు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోండి:
- అర్హత ఉన్న వ్యాపార రకాలు: నిర్దిష్ట రకాల వ్యాపారాలు, సేవలు Shopify Payments ఉపయోగించడానికి అనుమతించబడవు. మీ వ్యాపారానికి అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి, Shopify Payments సేవా నిబంధనలులో స్వీడన్ కోసం నిషేధించబడిన వ్యాపార రకాల జాబితాను చూడండి.
- బ్యాంక్ ఖాతా ఆవశ్యకతలు: మీరు మీ బ్యాంక్ ఖాతాను Shopify Paymentsకి కనెక్ట్ చేయడానికి ముందు అది ఈ కింది ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండాలి:
- బ్యాంక్ ఖాతా EUR కరెన్సీలో ఉండాలి లేదా బ్యాంక్ ఖాతా స్వీడన్‌లో ఉన్నట్లయితే, అది SEK కరెన్సీలో ఉండవచ్చు.
- బ్యాంక్ ఖాతా సింగిల్ యూరో పేమెంట్స్ ఏరియా (SEPA) బదిలీలకు అర్హత పొంది ఉండాలి.
- బ్యాంక్ ఖాతా ఈ కింది దేశపు కోడ్‌లతో ప్రారంభమయ్యే అంతర్జాతీయ బ్యాంక్ ఖాతా నంబర్ (IBAN)ను కలిగి ఉండాలి: AT, BE, BG, CH, CY, DE, DK, EE, ES, FI, FR, GB, GI, GR, HR, HU, IE, IT, LT, LU, LV, MT, NL, NO, PL, PT, RO, SE లేదా SI.
సపోర్ట్ చేయని బ్యాంక్ ఖాతా రకాలు
నిర్దిష్ట బ్యాంక్ ఖాతా రకాలు Shopify Paymentsకు అనుకూలంగా లేవు. కింది ఖాతా రకాలకు సపోర్ట్ లేదు:
- కేవలం వైర్ బదిలీలను మాత్రమే ఆమోదించే చెకింగ్ ఖాతాలు: ఈ ఖాతాలు Shopify Paymentsతో పని చేయవు.
- పొదుపు ఖాతాలు: Shopify Payments పేఅవుట్‌ల కోసం పొదుపు ఖాతాలను ఉపయోగించలేరు.
- ఫ్లెక్స్-కరెన్సీ ఖాతాలు: ఏకకాలంలో బహుళ కరెన్సీలకు సపోర్ట్ చేసే ఖాతాలకు సపోర్ట్ లేదు.
- డబ్బు బదిలీ సేవలు: కొన్ని ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి బ్యాంక్ ఖాతాలను అనుకరించే సేవలను Shopify Paymentsతో ఉపయోగించలేరు.
నాన్-Shopify వర్చువల్ ఖాతాలకు సపోర్ట్ ఉన్నప్పటికీ, మీరు ఈ ఖాతాలతో పేఅవుట్ వైఫల్యాలను ఎక్కువగా ఎదుర్కోవచ్చు.
మీ ప్రాంతం కోసం జాబితా చేయబడిన బదిలీ రకాన్ని మీ ఖాతా ఆమోదించగలదో లేదో నిర్ధారించడానికి, మీ బ్యాంక్‌ను సంప్రదించండి.
సమాచారాన్ని సేకరించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం
ఆర్థిక నేరాలను అరికట్టడానికి రూపొందించబడిన స్వీడన్ నిబంధనలకు అనుగుణంగా మీ గురించి, మీ వ్యాపారం గురించి సమాచారాన్ని సేకరించి, ధృవీకరించాల్సిన అవసరం Shopify, దాని బ్యాంకింగ్ భాగస్వాములకు ఉంది. స్థానిక నియమ, నిబంధనలు మారుతున్న కొద్దీ, మీ Shopify Payments అకౌంట్ కొనసాగినంత కాలం అదనపు సమాచారాన్ని అందించాల్సిందిగా Shopify, దాని బ్యాంకింగ్ భాగస్వాములు మిమ్మల్ని సంప్రదించవచ్చు.
వ్యాపార గుర్తింపును, వ్యాపారానికి లింక్ చేయబడిన వ్యక్తుల గుర్తింపులను, మరియు ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధం స్వభావాన్ని నిర్ధారించడానికి సేకరించిన సమాచారం ఉపయోగించబడుతుంది.
Shopify భౌతికంగా ఎలాంటి డాక్యుమెంటేషన్‌ను మీకు పోస్ట్ చేయదు. ఏవైనా ముఖ్యమైన డాక్యుమెంట్‌లు లేదా కమ్యూనికేషన్‌లు ఇమెయిల్ చేయబడతాయి లేదా మీ Shopify అడ్మిన్‌లోని సెట్టింగ్‌లు > వినియోగదారులు పేజీలో స్టోర్ యజమానికి డిజిటల్‌గా అందుబాటులో ఉంచబడతాయి.
మీ సమాచారం ఎలా గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుందో తెలుసుకోవడానికి Shopify గోప్యతా విధానం సమీక్షించండి.
స్వీడన్‌లో Shopify Payments యాక్టివేట్ చేయడానికి అవసరమైన వ్యక్తిగత, వ్యాపార సమాచారం
మీ వ్యాపార రకాన్ని సరిగ్గా గుర్తించడం ముఖ్యం ఎందుకంటే మీరు అందించాల్సిన సమాచారాన్ని అది నిర్ణయిస్తుంది.
మీరు ఏ ప్రభుత్వ ఏజెన్సీలోనూ నమోదు చేసుకోకపోయినా లేదా మీరు నమోదు చేసుకుని, సోల్ ట్రేడర్‌గా (ఎన్‌స్కిల్డ్ ఫర్మా, ఏకవ్యక్తి యాజమాన్యాలు, స్వయం ఉపాధి పొందుతున్న వారితో సహా) వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లయితే, వ్యక్తి / సోల్ ట్రేడర్ వ్యాపార రకాన్ని ఎంచుకోండి.
మీరు మీ వ్యాపారాన్ని నమోదు చేసుకుని ఉండి, దానికి ఒక సంస్థ నంబర్ (ఆర్గనైజేషన్‌స్నుమ్మర్) ఉన్నట్లయితే, ఈ కింది మార్గదర్శకం ఆధారంగా మీ వ్యాపార రకాన్ని ఎంచుకోండి:
- సంస్థ నంబర్‌లు ఉన్న భాగస్వామ్యాలు (ఎకనామిస్క్ ఫోరెనింగ్) ఇన్‌కార్పొరేటెడ్ భాగస్వామ్యం వ్యాపార రకాన్ని తప్పక ఎంచుకోవాలి.
- సంస్థ నంబర్‌లు ఉన్న లాభాపేక్ష రహిత సంస్థలు (స్టిఫ్టెల్సే, రిజిస్ట్రేరాడ్ ఐడీల్ ఫోరెనింగ్) ఇన్‌కార్పొరేటెడ్ నాన్-ప్రాఫిట్ వ్యాపార రకాన్ని తప్పక ఎంచుకోవాలి.
- సంస్థ నంబర్‌లు ఉన్న ఇతర వ్యాపారాలన్నీ ప్రైవేట్ కార్పొరేషన్ వ్యాపార రకాన్ని తప్పక ఎంచుకోవాలి. దీనికి అత్యంత సాధారణ ఉదాహరణ AB.
మీకు ఒక నమోదిత వ్యాపారం ఉండి, దానికి సంస్థ నంబర్ లేకుంటే, ఈ కింది మార్గదర్శకం ఆధారంగా మీ వ్యాపార రకాన్ని ఎంచుకోండి:
- సంస్థ నంబర్‌లు లేని భాగస్వామ్యాలు (HB, KB) అన్‌ఇన్‌కార్పొరేటెడ్ భాగస్వామ్యం వ్యాపార రకాన్ని తప్పక ఎంచుకోవాలి.
- సంస్థ నంబర్‌లు లేని లాభాపేక్ష రహిత సంస్థలు, ఛారిటీలు (ఐడీల్ ఫోరెనింగ్) అన్‌ఇన్‌కార్పొరేటెడ్ నాన్-ప్రాఫిట్ వ్యాపార రకాన్ని తప్పక ఎంచుకోవాలి.
ఏ వ్యాపార రకాన్ని ఎంచుకోవాలో మీకు కచ్చితంగా తెలియకపోతే, సరైన దానిని ఎంచుకోవడంలో సహాయం కోసం Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.
వ్యక్తులు / సోల్ ట్రేడర్‌లు
వ్యక్తులు అంటే ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోకుండా ప్రైవేట్‌గా వ్యాపారం చేస్తున్న సింగిల్ ఓనర్ వ్యాపారాలు. సోల్ ట్రేడర్‌లు అంటే తమ వ్యక్తిగత సమాచారంతో ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న సింగిల్ ఓనర్ వ్యాపారాలు. స్వీడన్‌లో నివసిస్తున్న ఏకైక వ్యక్తి స్వంతం చేసుకుని, నియంత్రించే వ్యాపారాలు ఈ రెండు రకాలు. ఫ్రీలాన్సర్‌లు, స్వయం ఉపాధి పొందుతున్న చిన్న వ్యాపార ఆపరేటర్‌లు ఇందులో భాగం.
ఈ వ్యాపార రకాలు ఒకే విధంగా పరిగణించబడతాయి, కాబట్టి ఒకే సమాచారాన్ని అందించాలి. వ్యక్తులు, సోల్ ట్రేడర్‌లు ఈ కింది సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి:
- చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
- పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
- ఇమెయిల్ అడ్రస్: చెల్లుబాటు అయ్యే, యాక్టివ్‌గా ఉన్న ఇమెయిల్ అడ్రస్.
- ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే, యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్.
- స్వీడన్‌లోని నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌కు సరిపోలే మీ ఇంటి చిరునామా.
మీ సమాచారం ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, మీ గుర్తింపును ధృవీకరించమని మీకు ఒక అభ్యర్థన వస్తుంది. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఇంటి చిరునామా లాంటి మీ సమాచారం ఏదైనా తప్పుగా ఉంటే, మీరు మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.
ఒకవేళ సమాచారం సరిగ్గా ఉండి కూడా మీకు ధృవీకరణ అభ్యర్థన వస్తే, ఈ కింది టాస్క్‌లలో ఒకదాన్ని పూర్తి చేయడం ద్వారా మీరు ఆ అభ్యర్థనను పరిష్కరించవచ్చు:
- చెల్లుబాటు అయ్యే ఫోటో IDతో సెల్ఫీ తీసుకోవడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించండి.
- మీ Shopify అడ్మిన్‌లో వేర్వేరు గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.
- మీ డాక్యుమెంట్‌లలో ఉన్న సమాచారం మీ అకౌంట్‌లో మీరు ఎంటర్ చేసిన దానితో కచ్చితంగా సరిపోలాలి. ఒకవేళ అవసరమైతే, మీ డాక్యుమెంట్‌లకు సరిపోలేలా మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
ప్రైవేట్ కార్పొరేషన్‌లు (AB)
ప్రైవేట్ కార్పొరేషన్ (private corporation) అనేది వాటాదారుల స్వంతమైన షేర్‌లుగా ఈక్విటీని విభజించిన వ్యాపారం. కార్పొరేషన్ అనేది దానిని నడిపే వ్యక్తుల నుండి భిన్నంగా తన సొంత చట్టబద్ధమైన సంస్థగా పరిగణించబడుతుంది. అవి సాధారణంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను కూడా కలిగి ఉంటాయి.
ప్రైవేట్ కార్పొరేషన్‌లు తమ అకౌంట్ ప్రతినిధిగా లబ్ధిదారుడైన యజమానిని లేదా నిర్ణయాధికారం కలిగిన ఎగ్జిక్యూటివ్‌ను తప్పనిసరిగా కేటాయించాలి. అకౌంట్ ప్రతినిధి తప్పనిసరిగా కింది సమాచారాన్ని అందించాలి:
- చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
- పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
- ఇమెయిల్ అడ్రస్: చెల్లుబాటు అయ్యే, యాక్టివ్‌గా ఉన్న ఇమెయిల్ అడ్రస్.
- ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే, యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్.
- నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌తో సరిపోలే మీ ఇంటి చిరునామా.
- ఉద్యోగ హోదా: మీరు వ్యాపారంలో కలిగి ఉన్న ఉద్యోగ హోదా.
- ఈక్విటీ: వర్తిస్తే, వ్యాపారంలో మీరు కలిగి ఉన్న ఈక్విటీ శాతం.
మీ సమాచారం ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, మీ గుర్తింపును ధృవీకరించమని మీకు ఒక అభ్యర్థన వస్తుంది. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఇంటి చిరునామా లాంటి మీ సమాచారం ఏదైనా తప్పుగా ఉంటే, మీరు మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.
ఒకవేళ సమాచారం సరిగ్గా ఉండి కూడా మీకు ధృవీకరణ అభ్యర్థన వస్తే, ఈ కింది టాస్క్‌లలో ఒకదాన్ని పూర్తి చేయడం ద్వారా మీరు ఆ అభ్యర్థనను పరిష్కరించవచ్చు:
- చెల్లుబాటు అయ్యే ఫోటో IDతో సెల్ఫీ తీసుకోవడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించండి.
- మీ Shopify అడ్మిన్‌లో వేర్వేరు గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.
- మీ డాక్యుమెంట్‌లలో ఉన్న సమాచారం మీ అకౌంట్‌లో మీరు ఎంటర్ చేసిన దానితో కచ్చితంగా సరిపోలాలి. ఒకవేళ అవసరమైతే, మీ డాక్యుమెంట్‌లకు సరిపోలేలా మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
ప్రైవేట్ కార్పొరేషన్‌లు తమ వ్యాపారం గురించిన కింది వివరాలను కూడా అందించాలి:
- నమోదిత వ్యాపార పేరు: Bolagsverket రిజిస్ట్రీలో చూపిన విధంగా చట్టబద్ధమైన వ్యాపార పేరు.
- సంస్థ నంబర్ (Organisationsnummer): Bolagsverket రిజిస్ట్రీలో చూపిన విధంగా వ్యాపారం సంస్థ నంబర్.
- VAT నంబర్: వర్తిస్తే, మీ VAT రిజిస్ట్రేషన్ నంబర్.
- వ్యాపార ఫోన్ నంబర్: వ్యాపారం కోసం యాక్టివ్ కాంటాక్ట్ ఫోన్ నంబర్.
- వ్యాపార చిరునామా: Bolagsverket రిజిస్ట్రీలో చూపిన విధంగా వ్యాపారం అధికారిక నమోదిత చిరునామా.
స్వీడన్‌లోని ప్రభుత్వ రిజిస్ట్రీలతో సరిపోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు మీ సమాచారాన్ని ధృవీకరిస్తారు. అక్షరాల పరిమాణం, విరామ చిహ్నాలు, అలాగే గుర్తులపై శ్రద్ధ వహించండి.
మీరు వ్యాపారం గురించి అందించే సమాచారం ధృవీకరించబడకపోతే, మీరు వ్యాపార ధృవీకరణ డాక్యుమెంట్‌ను అందించాల్సి రావచ్చు. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ అకౌంట్‌లో జాబితా చేసిన నమోదిత పేరు, సంస్థ నంబర్, అలాగే వ్యాపార చిరునామా డాక్యుమెంట్‌లోని సమాచారంతో ఖచ్చితంగా సరిపోలేలా చూసుకోండి. డాక్యుమెంట్‌కు సరిపోలేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఆమోదయోగ్యమైన వ్యాపార డాక్యుమెంట్‌ల జాబితాను రివ్యూ చేయండి.
మీరు కంపెనీకి లబ్ధిదారుడైన యజమాని అయితే, లబ్ధిదారులైన యజమానులుగా ఉన్న ఇతర వ్యక్తులను కూడా మీరు జాబితా చేయాలి. ప్రభుత్వ డాక్యుమెంట్‌లలో చూపిన విధంగానే వారి పేర్లు, పుట్టిన తేదీలు, అలాగే ఇంటి చిరునామాలను నమోదు చేసినట్లు నిర్ధారించుకోండి. వారి గుర్తింపులు ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, వారు ఫోటో ID లేదా చిరునామా రుజువును అందించాల్సి రావచ్చు.
మీరు అందించే యజమానులు తప్పనిసరిగా మీ ప్రభుత్వ వ్యాపార రిజిస్ట్రీలో జాబితా చేసిన యజమానులతో సరిపోలాలి. సరిపోలని పక్షంలో, సంతకం చేయండి బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా అటెస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయమని లేదా యాజమాన్య ధృవీకరణ డాక్యుమెంట్‌ను అందించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అసమానతను పరిష్కరించడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయడం అత్యంత వేగవంతమైన మార్గం, కానీ మీరు డాక్యుమెంట్‌ను సమర్పించాలనుకుంటే, మీ అకౌంట్‌లో జాబితా చేసిన యజమానుల పేర్లు మీ డాక్యుమెంట్‌లో జాబితా చేసిన యజమానులతో ఖచ్చితంగా సరిపోలేలా చూసుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌తో సరిపోల్చేందుకు మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఒకవేళ మీ వ్యాపారం హోల్డింగ్ కంపెనీ (పూర్తిగా లేదా పాక్షికంగా) స్వంతమైతే, ధృవీకరణను పూర్తి చేయడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయండి.
మీ వ్యాపారానికి యజమానులు లేకుంటే, అటెస్టేషన్‌పై సంతకం చేయమని లేదా మీ డైరెక్టర్లను నిర్ధారించే డాక్యుమెంట్‌ను అందించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఒకవేళ మీరు డాక్యుమెంట్‌ను సమర్పించాలనుకుంటే, మీ అకౌంట్‌లో జాబితా చేసిన డైరెక్టర్ల పేర్లు మీ డాక్యుమెంట్‌లో జాబితా చేసిన డైరెక్టర్లతో ఖచ్చితంగా సరిపోలేలా చూసుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌తో సరిపోల్చేందుకు మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
ఇన్‌కార్పొరేటెడ్ భాగస్వామ్యాలు (Ekonomisk förening)
ఇన్‌కార్పొరేటెడ్ భాగస్వామ్యం అనేది వాణిజ్య కార్యకలాపాల కోసం నమోదు చేసుకుని, సంస్థ నంబర్‌ను పొందిన కనీసం ఇద్దరు భాగస్వాములకు చెందిన వ్యాపారం. ఇన్‌కార్పొరేటెడ్ భాగస్వామ్యాలకు ఈక్విటీ ఉంటుంది, అలాగే ఈ భాగస్వామ్యం యజమానుల నుండి వేరుగా స్వంత సంస్థగా పరిగణించబడుతుంది.
ఇన్‌కార్పొరేటెడ్ భాగస్వామ్యాలు తప్పనిసరిగా తమ Shopify Payments అకౌంట్ ప్రతినిధిగా యజమాని లేదా భాగస్వామిని కేటాయించాలి. అకౌంట్ ప్రతినిధి తప్పనిసరిగా కింది సమాచారాన్ని అందించాలి:
- చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
- పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
- ఇమెయిల్ అడ్రస్: చెల్లుబాటు అయ్యే, యాక్టివ్‌గా ఉన్న ఇమెయిల్ అడ్రస్.
- ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే, యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్.
- నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌తో సరిపోలే మీ ఇంటి చిరునామా.
- ఉద్యోగ హోదా: మీరు వ్యాపారంలో కలిగి ఉన్న ఉద్యోగ హోదా.
- ఈక్విటీ: వర్తిస్తే, వ్యాపారంలో మీరు కలిగి ఉన్న ఈక్విటీ శాతం.
మీ సమాచారం ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, మీ గుర్తింపును ధృవీకరించమని మీకు ఒక అభ్యర్థన వస్తుంది. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఇంటి చిరునామా లాంటి మీ సమాచారం ఏదైనా తప్పుగా ఉంటే, మీరు మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.
ఒకవేళ సమాచారం సరిగ్గా ఉండి కూడా మీకు ధృవీకరణ అభ్యర్థన వస్తే, ఈ కింది టాస్క్‌లలో ఒకదాన్ని పూర్తి చేయడం ద్వారా మీరు ఆ అభ్యర్థనను పరిష్కరించవచ్చు:
- చెల్లుబాటు అయ్యే ఫోటో IDతో సెల్ఫీ తీసుకోవడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించండి.
- మీ Shopify అడ్మిన్‌లో వేర్వేరు గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.
- మీ డాక్యుమెంట్‌లలో ఉన్న సమాచారం మీ అకౌంట్‌లో మీరు ఎంటర్ చేసిన దానితో కచ్చితంగా సరిపోలాలి. ఒకవేళ అవసరమైతే, మీ డాక్యుమెంట్‌లకు సరిపోలేలా మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
ఇన్‌కార్పొరేటెడ్ భాగస్వామ్యాలు కూడా తమ వ్యాపారం గురించిన కింది వివరాలను అందించాలి:
- నమోదిత వ్యాపార పేరు: Bolagsverket రిజిస్ట్రీలో చూపిన విధంగా చట్టబద్ధమైన వ్యాపార పేరు.
- సంస్థ నంబర్ (Organisationsnummer): Bolagsverket రిజిస్ట్రీలో చూపిన విధంగా వ్యాపారం సంస్థ నంబర్.
- VAT నంబర్: వర్తిస్తే, మీ VAT రిజిస్ట్రేషన్ నంబర్.
- వ్యాపార ఫోన్ నంబర్: వ్యాపారం కోసం యాక్టివ్ కాంటాక్ట్ ఫోన్ నంబర్.
- వ్యాపార చిరునామా: Bolagsverket రిజిస్ట్రీలో చూపిన విధంగా వ్యాపారం అధికారిక నమోదిత చిరునామా.
స్వీడన్‌లోని ప్రభుత్వ రిజిస్ట్రీలతో సరిపోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు మీ సమాచారాన్ని ధృవీకరిస్తారు. అక్షరాల పరిమాణం, విరామ చిహ్నాలు, అలాగే గుర్తులపై శ్రద్ధ వహించండి.
మీరు వ్యాపారం గురించి అందించే సమాచారం ధృవీకరించబడకపోతే, మీరు వ్యాపార ధృవీకరణ డాక్యుమెంట్‌ను అందించాల్సి రావచ్చు. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ అకౌంట్‌లో జాబితా చేసిన నమోదిత పేరు, సంస్థ నంబర్, అలాగే వ్యాపార చిరునామా డాక్యుమెంట్‌లోని సమాచారంతో ఖచ్చితంగా సరిపోలేలా చూసుకోండి. డాక్యుమెంట్‌కు సరిపోలేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఆమోదయోగ్యమైన వ్యాపార డాక్యుమెంట్‌ల జాబితాను రివ్యూ చేయండి.
మీరు అదనంగా యజమానులు లేదా భాగస్వాములుగా ఉన్న ఇతర వ్యక్తులను తప్పనిసరిగా జాబితా చేయాలి. ప్రభుత్వ డాక్యుమెంట్‌లలో చూపిన విధంగానే వారి పేర్లు, పుట్టిన తేదీలు, అలాగే ఇంటి చిరునామాలను నమోదు చేసినట్లు నిర్ధారించుకోండి. వారి గుర్తింపులు ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, వారు ఫోటో ID లేదా చిరునామా రుజువును అందించాల్సి రావచ్చు.
మీరు అందించే యజమానులు తప్పనిసరిగా మీ ప్రభుత్వ వ్యాపార రిజిస్ట్రీలో జాబితా చేసిన యజమానులతో సరిపోలాలి. సరిపోలని పక్షంలో, సంతకం చేయండి బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా అటెస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయమని లేదా యాజమాన్య ధృవీకరణ డాక్యుమెంట్‌ను అందించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అసమానతను పరిష్కరించడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయడం అత్యంత వేగవంతమైన మార్గం, కానీ మీరు డాక్యుమెంట్‌ను సమర్పించాలనుకుంటే, మీ అకౌంట్‌లో జాబితా చేసిన యజమానుల పేర్లు మీ డాక్యుమెంట్‌లో జాబితా చేసిన యజమానులతో ఖచ్చితంగా సరిపోలేలా చూసుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌తో సరిపోల్చేందుకు మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఒకవేళ మీ వ్యాపారం హోల్డింగ్ కంపెనీ (పూర్తిగా లేదా పాక్షికంగా) స్వంతమైతే, ధృవీకరణను పూర్తి చేయడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయండి.
అన్‌ఇన్‌కార్పొరేటెడ్ భాగస్వామ్యాలు (HB, KB)
అన్‌ఇన్‌కార్పొరేటెడ్ భాగస్వామ్యం అనేది సంస్థ నంబర్ కోసం నమోదు చేసుకోని, అయితే భాగస్వామ్య ఒప్పందాన్ని కలిగి ఉన్న కనీసం ఇద్దరు భాగస్వాముల స్వంతమైన వ్యాపారం. ఈ సందర్భంలో యజమానులు చట్టబద్ధమైన సంస్థగా పరిగణించబడతారు, అలాగే వ్యాపారం అనేది ప్రత్యేక సంస్థ కాదు.
అన్‌ఇన్‌కార్పొరేటెడ్ భాగస్వామ్యాలు తప్పనిసరిగా తమ Shopify Payments అకౌంట్ ప్రతినిధిగా యజమానిని కేటాయించాలి. అకౌంట్ ప్రతినిధి తప్పనిసరిగా కింది సమాచారాన్ని అందించాలి:
- చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
- పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
- ఇమెయిల్ అడ్రస్: చెల్లుబాటు అయ్యే, యాక్టివ్‌గా ఉన్న ఇమెయిల్ అడ్రస్.
- ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే, యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్.
- నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌తో సరిపోలే మీ ఇంటి చిరునామా.
- ఉద్యోగ హోదా: మీరు వ్యాపారంలో కలిగి ఉన్న ఉద్యోగ హోదా.
- ఈక్విటీ: వర్తిస్తే, వ్యాపారంలో మీరు కలిగి ఉన్న ఈక్విటీ శాతం.
మీ సమాచారం ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, మీ గుర్తింపును ధృవీకరించమని మీకు ఒక అభ్యర్థన వస్తుంది. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఇంటి చిరునామా లాంటి మీ సమాచారం ఏదైనా తప్పుగా ఉంటే, మీరు మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.
ఒకవేళ సమాచారం సరిగ్గా ఉండి కూడా మీకు ధృవీకరణ అభ్యర్థన వస్తే, ఈ కింది టాస్క్‌లలో ఒకదాన్ని పూర్తి చేయడం ద్వారా మీరు ఆ అభ్యర్థనను పరిష్కరించవచ్చు:
- చెల్లుబాటు అయ్యే ఫోటో IDతో సెల్ఫీ తీసుకోవడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించండి.
- మీ Shopify అడ్మిన్‌లో వేర్వేరు గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.
- మీ డాక్యుమెంట్‌లలో ఉన్న సమాచారం మీ అకౌంట్‌లో మీరు ఎంటర్ చేసిన దానితో కచ్చితంగా సరిపోలాలి. ఒకవేళ అవసరమైతే, మీ డాక్యుమెంట్‌లకు సరిపోలేలా మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
అన్‌ఇన్‌కార్పొరేటెడ్ భాగస్వామ్యాలు కూడా తమ వ్యాపారం గురించిన కింది వివరాలను అందించాలి:
- నమోదిత వ్యాపార పేరు: డాక్యుమెంటేషన్‌లో చూపిన విధంగా చట్టబద్ధమైన వ్యాపార పేరు.
- VAT నంబర్: వర్తిస్తే, మీ VAT రిజిస్ట్రేషన్ నంబర్.
- వ్యాపార ఫోన్ నంబర్: వ్యాపారం కోసం యాక్టివ్ కాంటాక్ట్ ఫోన్ నంబర్.
- వ్యాపార చిరునామా: డాక్యుమెంటేషన్‌లో చూపిన విధంగా వ్యాపారం అధికారిక నమోదిత చిరునామా.
స్వీడన్‌లోని ప్రభుత్వ రిజిస్ట్రీలతో సరిపోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు మీ సమాచారాన్ని ధృవీకరిస్తారు. అక్షరాల పరిమాణం, విరామ చిహ్నాలు, అలాగే గుర్తులపై శ్రద్ధ వహించండి.
మీరు వ్యాపారం గురించి అందించే సమాచారం ధృవీకరించబడకపోతే, మీరు వ్యాపార ధృవీకరణ డాక్యుమెంట్‌ను అందించాల్సి రావచ్చు. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ అకౌంట్‌లో జాబితా చేసిన నమోదిత పేరు, అలాగే వ్యాపార చిరునామా డాక్యుమెంట్‌లోని సమాచారంతో ఖచ్చితంగా సరిపోలేలా చూసుకోండి. డాక్యుమెంట్‌కు సరిపోలేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఆమోదయోగ్యమైన వ్యాపార డాక్యుమెంట్‌ల జాబితాను రివ్యూ చేయండి.
మీరు అదనంగా యజమానులు లేదా భాగస్వాములుగా ఉన్న ఇతర వ్యక్తులను తప్పనిసరిగా జాబితా చేయాలి. ప్రభుత్వ డాక్యుమెంట్‌లలో చూపిన విధంగానే వారి పేర్లు, పుట్టిన తేదీలు, అలాగే ఇంటి చిరునామాలను నమోదు చేసినట్లు నిర్ధారించుకోండి. వారి గుర్తింపులు ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, వారు ఫోటో ID లేదా చిరునామా రుజువును అందించాల్సి రావచ్చు.
మీరు అందించే యజమానులు తప్పనిసరిగా మీ ప్రభుత్వ వ్యాపార రిజిస్ట్రీలో జాబితా చేసిన యజమానులతో సరిపోలాలి. సరిపోలని పక్షంలో, సంతకం చేయండి బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా అటెస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయమని లేదా యాజమాన్య ధృవీకరణ డాక్యుమెంట్‌ను అందించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అసమానతను పరిష్కరించడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయడం అత్యంత వేగవంతమైన మార్గం, కానీ మీరు డాక్యుమెంట్‌ను సమర్పించాలనుకుంటే, మీ అకౌంట్‌లో జాబితా చేసిన యజమానుల పేర్లు మీ డాక్యుమెంట్‌లో జాబితా చేసిన యజమానులతో ఖచ్చితంగా సరిపోలేలా చూసుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌తో సరిపోల్చేందుకు మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఒకవేళ మీ వ్యాపారం హోల్డింగ్ కంపెనీ (పూర్తిగా లేదా పాక్షికంగా) స్వంతమైతే, ధృవీకరణను పూర్తి చేయడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయండి.
ఇన్‌కార్పొరేటెడ్ లాభాపేక్ష లేని సంస్థలు (Stiftelse, Registrerad ideell förening)
లాభాపేక్ష లేని సంస్థ (NPO) అనేది దాని వాటాదారులకు లాభం చేకూర్చడం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం స్థాపించబడిన సంస్థ. ప్రజల లేదా కమ్యూనిటీ ప్రయోజనాలకు సేవ చేయడం దాని ప్రాథమిక లక్ష్యం. ఇన్‌కార్పొరేటెడ్ లాభాపేక్ష లేని సంస్థలు వాణిజ్య ప్రయోజనాల కోసం నమోదు చేసుకున్నాయి, అలాగే సంస్థ నంబర్‌ను పొందాయి.
ఇన్‌కార్పొరేటెడ్ లాభాపేక్ష లేని సంస్థలు తమ అకౌంట్ ప్రతినిధిగా డైరెక్టర్‌ను లేదా నిర్ణయాధికారం ఉన్న ఎగ్జిక్యూటివ్‌ను కేటాయించాలి. అకౌంట్ ప్రతినిధి తప్పనిసరిగా కింది సమాచారాన్ని అందించాలి:
- చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
- పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
- ఇమెయిల్ అడ్రస్: చెల్లుబాటు అయ్యే, యాక్టివ్‌గా ఉన్న ఇమెయిల్ అడ్రస్.
- ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే, యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్.
- నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌తో సరిపోలే మీ ఇంటి చిరునామా.
- ఉద్యోగ హోదా: మీరు వ్యాపారంలో కలిగి ఉన్న ఉద్యోగ హోదా.
- ఈక్విటీ: వర్తిస్తే, వ్యాపారంలో మీరు కలిగి ఉన్న ఈక్విటీ శాతం.
మీ సమాచారం ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, మీ గుర్తింపును ధృవీకరించమని మీకు ఒక అభ్యర్థన వస్తుంది. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఇంటి చిరునామా లాంటి మీ సమాచారం ఏదైనా తప్పుగా ఉంటే, మీరు మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.
ఒకవేళ సమాచారం సరిగ్గా ఉండి కూడా మీకు ధృవీకరణ అభ్యర్థన వస్తే, ఈ కింది టాస్క్‌లలో ఒకదాన్ని పూర్తి చేయడం ద్వారా మీరు ఆ అభ్యర్థనను పరిష్కరించవచ్చు:
- చెల్లుబాటు అయ్యే ఫోటో IDతో సెల్ఫీ తీసుకోవడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించండి.
- మీ Shopify అడ్మిన్‌లో వేర్వేరు గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.
- మీ డాక్యుమెంట్‌లలో ఉన్న సమాచారం మీ అకౌంట్‌లో మీరు ఎంటర్ చేసిన దానితో కచ్చితంగా సరిపోలాలి. ఒకవేళ అవసరమైతే, మీ డాక్యుమెంట్‌లకు సరిపోలేలా మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
ఇన్‌కార్పొరేటెడ్ లాభాపేక్ష లేని సంస్థలు కూడా తమ వ్యాపారం గురించిన కింది వివరాలను అందించాలి:
- నమోదిత వ్యాపార పేరు: Bolagsverket రిజిస్ట్రీలో చూపిన విధంగా చట్టబద్ధమైన వ్యాపార పేరు.
- సంస్థ నంబర్ (Organisationsnummer): Bolagsverket రిజిస్ట్రీలో చూపిన విధంగా వ్యాపారం సంస్థ నంబర్.
- VAT నంబర్: వర్తిస్తే, మీ VAT రిజిస్ట్రేషన్ నంబర్.
- వ్యాపార ఫోన్ నంబర్: వ్యాపారం కోసం యాక్టివ్ కాంటాక్ట్ ఫోన్ నంబర్.
- వ్యాపార చిరునామా: Bolagsverket రిజిస్ట్రీలో చూపిన విధంగా వ్యాపారం అధికారిక నమోదిత చిరునామా.
స్వీడన్‌లోని ప్రభుత్వ రిజిస్ట్రీలతో సరిపోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు మీ సమాచారాన్ని ధృవీకరిస్తారు. అక్షరాల పరిమాణం, విరామ చిహ్నాలు, అలాగే గుర్తులపై శ్రద్ధ వహించండి.
మీరు వ్యాపారం గురించి అందించే సమాచారం ధృవీకరించబడకపోతే, మీరు వ్యాపార ధృవీకరణ డాక్యుమెంట్‌ను అందించాల్సి రావచ్చు. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ అకౌంట్‌లో జాబితా చేసిన నమోదిత పేరు, సంస్థ నంబర్, అలాగే వ్యాపార చిరునామా డాక్యుమెంట్‌లోని సమాచారంతో ఖచ్చితంగా సరిపోలేలా చూసుకోండి. డాక్యుమెంట్‌కు సరిపోలేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఆమోదయోగ్యమైన వ్యాపార డాక్యుమెంట్‌ల జాబితాను రివ్యూ చేయండి.
మీ డైరెక్టర్ల బోర్డులో ఉన్న లేదా కీలక నిర్ణయాధికారులుగా ఉన్న ఇతర వ్యక్తులను మీరు అదనంగా జాబితా చేయాలి. ప్రభుత్వ డాక్యుమెంట్‌లలో చూపిన విధంగానే వారి పేర్లు, పుట్టిన తేదీలు, అలాగే ఇంటి చిరునామాలను నమోదు చేసినట్లు నిర్ధారించుకోండి. వారి గుర్తింపులు ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, వారు ఫోటో ID లేదా చిరునామా రుజువును అందించాల్సి రావచ్చు.
మీరు అందించే డైరెక్టర్లు తప్పనిసరిగా మీ ప్రభుత్వ వ్యాపార రిజిస్ట్రీలో జాబితా చేసిన డైరెక్టర్లతో సరిపోలాలి. ఒకవేళ సరిపోలకపోతే, సంతకం చేయండి బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా అటెస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయమని లేదా డైరెక్టర్‌షిప్ డాక్యుమెంట్ రుజువును అందించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అసమానతను పరిష్కరించడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయడం అత్యంత వేగవంతమైన మార్గం, కానీ మీరు డాక్యుమెంట్‌ను సమర్పించాలనుకుంటే, మీ అకౌంట్‌లో జాబితా చేసిన డైరెక్టర్ల పేర్లు మీ డాక్యుమెంట్‌లో జాబితా చేసిన డైరెక్టర్లతో ఖచ్చితంగా సరిపోలేలా చూసుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌తో సరిపోల్చేందుకు మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
అన్‌ఇన్‌కార్పొరేటెడ్ లాభాపేక్ష లేని సంస్థలు (Ideell förening)
లాభాపేక్ష లేని సంస్థ (NPO) అనేది దాని వాటాదారులకు లాభం చేకూర్చడం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం స్థాపించబడిన సంస్థ. ప్రజల లేదా కమ్యూనిటీ ప్రయోజనాలకు సేవ చేయడం దాని ప్రాథమిక లక్ష్యం. అన్‌ఇన్‌కార్పొరేటెడ్ లాభాపేక్ష లేని సంస్థకు సంస్థ నంబర్ లేదు, కానీ స్థానిక కోర్టులలో నమోదు చేసుకుంది, అలాగే లాభాపేక్ష లేని సంస్థ హోదాను కలిగి ఉంది.
అన్‌ఇన్‌కార్పొరేటెడ్ లాభాపేక్ష లేని సంస్థలు ఒక ముఖ్య నిర్ణయాధికారిని లేదా నిర్వాహకుడిని వారి అకౌంట్ ప్రతినిధిగా కేటాయించాలి, ఆ వ్యక్తిని ఎగ్జిక్యూటివ్‌గా మార్క్ చేయాలి. అకౌంట్ ప్రతినిధి తప్పనిసరిగా కింది సమాచారాన్ని అందించాలి:
- చట్టబద్ధమైన మొదటి, చివరి పేరు: ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంటేషన్‌లో ఉన్న విధంగా మీ పూర్తి చట్టబద్ధమైన పేరు.
- పుట్టిన తేదీ: మీ పుట్టిన తేదీ.
- ఇమెయిల్ అడ్రస్: చెల్లుబాటు అయ్యే, యాక్టివ్‌గా ఉన్న ఇమెయిల్ అడ్రస్.
- ఫోన్ నంబర్: చెల్లుబాటు అయ్యే, యాక్టివ్‌గా ఉన్న ఫోన్ నంబర్.
- నివాస చిరునామా: మీ డాక్యుమెంటేషన్‌తో సరిపోలే మీ ఇంటి చిరునామా.
- ఉద్యోగ హోదా: మీరు వ్యాపారంలో కలిగి ఉన్న ఉద్యోగ హోదా.
- ఈక్విటీ: వర్తిస్తే, వ్యాపారంలో మీరు కలిగి ఉన్న ఈక్విటీ శాతం.
మీ సమాచారం ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, మీ గుర్తింపును ధృవీకరించమని మీకు ఒక అభ్యర్థన వస్తుంది. మీ పేరు, పుట్టిన తేదీ లేదా ఇంటి చిరునామా లాంటి మీ సమాచారం ఏదైనా తప్పుగా ఉంటే, మీరు మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.
ఒకవేళ సమాచారం సరిగ్గా ఉండి కూడా మీకు ధృవీకరణ అభ్యర్థన వస్తే, ఈ కింది టాస్క్‌లలో ఒకదాన్ని పూర్తి చేయడం ద్వారా మీరు ఆ అభ్యర్థనను పరిష్కరించవచ్చు:
- చెల్లుబాటు అయ్యే ఫోటో IDతో సెల్ఫీ తీసుకోవడం ద్వారా మీ గుర్తింపును నిర్ధారించండి.
- మీ Shopify అడ్మిన్‌లో వేర్వేరు గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.
- మీ డాక్యుమెంట్‌లలో ఉన్న సమాచారం మీ అకౌంట్‌లో మీరు ఎంటర్ చేసిన దానితో కచ్చితంగా సరిపోలాలి. ఒకవేళ అవసరమైతే, మీ డాక్యుమెంట్‌లకు సరిపోలేలా మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
అన్‌ఇన్‌కార్పొరేటెడ్ లాభాపేక్ష లేని సంస్థలు కూడా తమ వ్యాపారం గురించిన కింది వివరాలను అందించాలి:
- నమోదిత వ్యాపార పేరు: డాక్యుమెంటేషన్‌లో చూపిన విధంగా చట్టబద్ధమైన వ్యాపార పేరు.
- VAT నంబర్: వర్తిస్తే, మీ VAT రిజిస్ట్రేషన్ నంబర్.
- వ్యాపార ఫోన్ నంబర్: వ్యాపారం కోసం యాక్టివ్ కాంటాక్ట్ ఫోన్ నంబర్.
- వ్యాపార చిరునామా: డాక్యుమెంటేషన్‌లో చూపిన విధంగా వ్యాపారం అధికారిక నమోదిత చిరునామా.
స్వీడన్‌లోని ప్రభుత్వ రిజిస్ట్రీలతో సరిపోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు మీ సమాచారాన్ని ధృవీకరిస్తారు. అక్షరాల పరిమాణం, విరామ చిహ్నాలు, అలాగే గుర్తులపై శ్రద్ధ వహించండి.
మీరు వ్యాపారం గురించి అందించే సమాచారం ధృవీకరించబడకపోతే, మీరు వ్యాపార ధృవీకరణ డాక్యుమెంట్‌ను అందించాల్సి రావచ్చు. ఈ డాక్యుమెంట్‌ను అందిస్తున్నప్పుడు, మీ అకౌంట్‌లో జాబితా చేసిన నమోదిత పేరు, అలాగే వ్యాపార చిరునామా డాక్యుమెంట్‌లోని సమాచారంతో ఖచ్చితంగా సరిపోలేలా చూసుకోండి. డాక్యుమెంట్‌కు సరిపోలేలా మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఆమోదయోగ్యమైన వ్యాపార డాక్యుమెంట్‌ల జాబితాను రివ్యూ చేయండి.
మీ డైరెక్టర్ల బోర్డులో ఉన్న లేదా కీలక నిర్ణయాధికారులుగా ఉన్న ఇతర వ్యక్తులను మీరు అదనంగా జాబితా చేయాలి. ప్రభుత్వ డాక్యుమెంట్‌లలో చూపిన విధంగానే వారి పేర్లు, పుట్టిన తేదీలు, అలాగే ఇంటి చిరునామాలను నమోదు చేసినట్లు నిర్ధారించుకోండి. వారి గుర్తింపులు ఆటోమేటిక్‌గా ధృవీకరించబడకపోతే, వారు ఫోటో ID లేదా చిరునామా రుజువును అందించాల్సి రావచ్చు.
మీరు అందించే డైరెక్టర్లు తప్పనిసరిగా మీ ప్రభుత్వ వ్యాపార రిజిస్ట్రీలో జాబితా చేసిన డైరెక్టర్లతో సరిపోలాలి. ఒకవేళ సరిపోలకపోతే, సంతకం చేయండి బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా అటెస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయమని లేదా డైరెక్టర్‌షిప్ డాక్యుమెంట్ రుజువును అందించమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అసమానతను పరిష్కరించడానికి అటెస్టేషన్‌పై సంతకం చేయడం అత్యంత వేగవంతమైన మార్గం, కానీ మీరు డాక్యుమెంట్‌ను సమర్పించాలనుకుంటే, మీ అకౌంట్‌లో జాబితా చేసిన డైరెక్టర్ల పేర్లు మీ డాక్యుమెంట్‌లో జాబితా చేసిన డైరెక్టర్లతో ఖచ్చితంగా సరిపోలేలా చూసుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌తో సరిపోల్చేందుకు మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
ఆమోదయోగ్యమైన డాక్యుమెంట్ రకాలు
మీ గుర్తింపు, అలాగే వ్యాపార వివరాలను ధృవీకరించడానికి మీరు ఏ డాక్యుమెంట్‌లను ఉపయోగించవచ్చో ఈ విభాగం వివరిస్తుంది.
గుర్తింపు డాక్యుమెంట్‌లు
కింది డాక్యుమెంట్‌లు గుర్తింపు రుజువుగా ఆమోదించబడతాయి. మీ Shopify Payments అకౌంట్‌లోని పేరు, అలాగే పుట్టిన తేదీలు, మీరు అందిస్తున్న గుర్తింపు డాక్యుమెంట్‌లో చూపిన సమాచారంతో సరిపోలడానికి తప్పనిసరిగా అప్‌డేట్ చేయబడాలి. డాక్యుమెంట్‌లు తప్పనిసరిగా చెల్లుబాటులో ఉండాలి, అలాగే వాటి గడువు ముగిసి ఉండకూడదు.
- పాస్‌పోర్ట్
- డ్రైవింగ్ లైసెన్స్
- జాతీయ ID - ముందు, వెనుక ఫోటోగ్రాఫ్‌లు అవసరం.
చిరునామా డాక్యుమెంట్‌లు
మీ Shopify Payments అకౌంట్‌లోని పేరు, అలాగే చిరునామాలు, మీరు అందిస్తున్న చిరునామా డాక్యుమెంట్‌లలో ప్రదర్శించే సమాచారంతో సరిపోలడానికి తప్పనిసరిగా అప్‌డేట్ చేయబడాలి. కింది డాక్యుమెంట్‌లు చిరునామా రుజువుగా ఆమోదించబడతాయి:
- యుటిలిటీ బిల్లు (గత 6 నెలలలోపు తేదీ ఉన్నవి)
- బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ (గత 6 నెలల్లోపు తేదీ ఉన్నది)
- ప్రభుత్వం జారీ చేసిన లేఖ (గత 6 నెలల్లోపు తేదీ ఉన్నది)
- Uppehållstillståndskort (నివాస అనుమతి కార్డ్)
- Skatteverket Personbevis
వ్యాపార ధృవీకరణ డాక్యుమెంట్‌లు
వ్యాపార ధృవీకరణ కోసం కింది డాక్యుమెంట్‌లు ఆమోదించబడతాయి. అవి మీ వ్యాపారానికి సంబంధించిన చట్టబద్ధమైన సంస్థ పేరు, సంస్థ నంబర్ మరియు చిరునామాను స్పష్టంగా ప్రదర్శించాలి. మీ Shopify Payments అకౌంట్‌లోని వివరాలు మీరు అందిస్తున్న డాక్యుమెంట్‌లలోని సమాచారానికి సరిపోలేలా అప్‌డేట్ చేయబడాలి.
- Registreringsbevis (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్)
- Registreringsbevis (Skatteverket) - సంస్థ గుర్తింపు నంబర్‌ను చూపుతూ ప్రభుత్వ ఏజెన్సీ జారీ చేసిన డాక్యుమెంట్.
- Bolagsordningsintyg (ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్)
- Bankårsbesked (ఆర్థిక నివేదికలు)
- Inskrivningsbevis (అధికారిక గెజిట్‌లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా ఇవ్వబడిన నోటీసు)
- Momsregistreringsnummer (VAT రిజిస్ట్రేషన్)
యాజమాన్య డాక్యుమెంట్‌లు
కింది డాక్యుమెంట్‌లు మీ వ్యాపారానికి సంబంధించిన చట్టబద్ధమైన సంస్థ పేరును, అలాగే మీ వ్యాపార యజమానులు లేదా డైరెక్టర్‌ల పూర్తి పేర్లన్నింటినీ ప్రదర్శిస్తున్నట్లయితే అవి యాజమాన్యం లేదా డైరెక్టర్‌షిప్‌నకు రుజువుగా ఆమోదించబడతాయి.
యజమానులను ధృవీకరించడానికి ఉపయోగించగల డాక్యుమెంట్‌లు:
- Inkorporeringsdokument (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్)
- Verkliga huvudmän (అల్టిమేట్ బెనిఫిషియల్ ఓనర్ రిజిస్టర్)
డైరెక్టర్‌లను ధృవీకరించడానికి ఉపయోగించగల డాక్యుమెంట్‌లు:
- Årsredovisning (వార్షిక రిపోర్ట్‌లు)
- Årsanmälan (వార్షిక రిటర్న్‌లు)
- Registreringsbevis (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్)
- Inkorporeringsdokument (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్)
- Verkliga huvudmän (అల్టిమేట్ బెనిఫిషియల్ ఓనర్ రిజిస్టర్)
మీ డాక్యుమెంటేషన్‌లో జాబితా చేయబడిన ప్రతి లబ్ధిదారుడైన యజమాని తప్పనిసరిగా మీ Shopify Payments అకౌంట్‌లో కూడా జాబితా చేయబడాలి మరియు ఓనర్ పాత్రను కేటాయించాలి. వ్యాపార ఈక్విటీలో 25% లేదా అంతకంటే ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్న వారిని లబ్ధిదారుడైన యజమానిగా పేర్కొంటారు. అవసరమైతే డాక్యుమెంట్‌తో సరిపోలడానికి మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
మీ వ్యాపారంలో లబ్ధిదారులైన యజమానులు ఎవరూ లేకుంటే, దానికి బదులుగా మీ డైరెక్టర్‌లను ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ సందర్భాలలో, డైరెక్టర్‌ల కోసం పైన జాబితా చేయబడిన డాక్యుమెంట్‌లు అర్హత కలిగి ఉంటాయి. మీ డాక్యుమెంటేషన్‌లో జాబితా చేయబడిన ప్రతి డైరెక్టర్ తప్పనిసరిగా మీ Shopify Payments అకౌంట్‌లో కూడా జాబితా చేయబడాలి మరియు డైరెక్టర్ పాత్రను కేటాయించాలి. అవసరమైతే డాక్యుమెంట్‌తో సరిపోలడానికి మీ అకౌంట్‌లోని సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
మీ వ్యాపారం ఏదైనా హోల్డింగ్ కంపెనీ స్వంతమైతే, దయచేసి ముందుగా మీ యజమానులు మరియు డైరెక్టర్‌ల వివరాలు సరిగ్గా ఎంటర్ చేశారని నిర్ధారించుకోండి, ఆపై సైన్ చేయండి బటన్‌ను నొక్కడం ద్వారా డిజిటల్ అటెస్టేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయండి.
డాక్యుమెంటేషన్ సమ్మతిని నిర్ధారించడం
మీ డాక్యుమెంట్‌లను అందిస్తున్నప్పుడు, అవి అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. సమ్మతిని నిర్ధారించుకోవడానికి కింది మార్గదర్శకాలను సమీక్షించండి:
- కచ్చితత్వం: మీ డాక్యుమెంట్‌లలోని సమాచారం మీ Shopify Payments అకౌంట్‌లో ఎంటర్ చేసిన వివరాలతో సరిపోలుతోందని నిర్ధారించుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌లతో సరిపోలడానికి మీ అకౌంట్‌ను అప్‌డేట్ చేయండి.
- స్పష్టత మరియు చదవదగిన లక్షణం: మీ డాక్యుమెంట్‌లు స్పష్టంగా మరియు చదవడానికి తగినంత పెద్దవిగా ఉండేలా చూసుకోండి. ఫోటోగ్రాఫ్‌లో మొత్తం డాక్యుమెంట్ కనిపించేలా చూసుకోండి.
- సంపూర్ణత: మీ డాక్యుమెంట్‌లో అవసరమైన వివరాలన్నీ కనిపించేలా చూసుకోండి. డాక్యుమెంట్‌లో ఏ వివరాలను చేర్చాలో అర్థం చేసుకోవడానికి ఈ పేజీలో జాబితా చేయబడిన ఆమోదయోగ్యమైన డాక్యుమెంట్ రకాలను సమీక్షించండి.
- అసలైన డాక్యుమెంటేషన్: కెమెరాను ఉపయోగించి మీ డాక్యుమెంట్‌కి చెందిన అసలైన ఫోటోను తీయండి. మీ డాక్యుమెంట్‌లను ఫోటోకాపీ, స్కాన్ లేదా స్క్రీన్‌షాట్ చేయవద్దు. డాక్యుమెంట్‌ల ఫోటోలను ఇతర డాక్యుమెంట్‌లలో పేస్ట్ చేయవద్దు. కంప్యూటర్ స్క్రీన్‌లు లేదా ప్రింటవుట్‌ల ఫోటోలను తీయవద్దు.
- మీ డాక్యుమెంట్ డిజిటల్ రూపంలో మీకు జారీ చేయబడితే, ఎటువంటి మార్పులు లేకుండా మీకు మొదట్లో ఇచ్చిన విధంగానే అన్ని పేజీలతో కూడిన PDF ఫైల్‌ను అందించండి.
- చెల్లుబాటు: ఫోటో IDల గడువు ముగియలేదని మరియు చిరునామా రుజువు ఇటీవల జారీ చేయబడిందని నిర్ధారించుకోండి. వ్యాపార రిజిస్ట్రేషన్ రుజువును అందిస్తున్నట్లయితే, అప్పుడు మీ వ్యాపారం ఇప్పటికీ యాక్టివ్‌గా రిజిస్టర్ అయి ఉండాలి మరియు మంచి స్థితిలో ఉండాలి.
సాధారణ సమస్యల ట్రబుల్షూటింగ్
Shopify సపోర్ట్‌ని సంప్రదించడానికి ముందు, ఈ సాధారణ ఆన్‌బోర్డింగ్ సమస్యలను మరియు వాటి పరిష్కారాలను సమీక్షించండి.
నా డాక్యుమెంట్ తిరస్కరించబడింది
మీ అకౌంట్‌లోని సమాచారం మీ డాక్యుమెంట్‌తో కచ్చితంగా సరిపోలుతోందని నిర్ధారించుకోండి మరియు అవసరమైతే మీ అకౌంట్‌ను అప్‌డేట్ చేయండి. మీ డాక్యుమెంట్‌లు ఇప్పటికీ తిరస్కరించబడుతున్నట్లయితే, ఈ పేజీలోని కింది విభాగాలను పరిశీలించండి:
- ఆమోదయోగ్యమైన డాక్యుమెంట్ రకాలు: ఆమోదించబడిన డాక్యుమెంట్‌లు మరియు అవసరమైన వివరాలు. స్క్రీన్‌షాట్‌లు, ప్రింటవుట్లు మరియు రిజిస్ట్రీ స్క్రీన్‌షాట్‌లు ఆమోదించబడవు.
- డాక్యుమెంట్ సమ్మతిని నిర్ధారించడం: కచ్చితత్వం, స్పష్టత, సంపూర్ణత మరియు చెల్లుబాటు కోసం అవసరాలు.
నా వ్యాపార సమాచారం ధృవీకరించబడటం లేదు
మీ వ్యాపార సమాచారాన్ని ఎంటర్ చేస్తున్నప్పుడు, మీ వ్యాపారం పేరు, సంస్థ నంబర్ (Organisationsnummer) మరియు చిరునామా అనేవి Bolagsverket రిజిస్ట్రీలో కనిపించే విధంగా కచ్చితంగా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. దీనిలో ఇవి ఉంటాయి:
- సరైన అక్షరాల కేస్ (అప్పర్ కేస్ మరియు లోయర్ కేస్)
- సరైన విరామ చిహ్నాలు మరియు స్పేసింగ్
- రిజిస్టర్ చేసిన విధంగానే పూర్తి వ్యాపారం పేరు
అధికారిక రిజిస్ట్రీలతో సరిపోల్చడం ద్వారా Shopify బ్యాంకింగ్ భాగస్వాములు మీ సమాచారాన్ని ఆటోమేటిక్‌గా ధృవీకరిస్తారు. చిన్న చిన్న వ్యత్యాసాల వల్ల కూడా ధృవీకరణ విఫలం కావచ్చు. మీరు సమర్పిస్తున్న డాక్యుమెంటేషన్‌లో చట్టబద్ధమైన పేరు, సంస్థ నంబర్ మరియు వ్యాపార చిరునామా ఉన్నాయని మరియు ఈ వివరాలు మీ అకౌంట్‌లోని వాటితో సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అవసరమైతే, మీ డాక్యుమెంట్‌తో సరిపోలడానికి మీ అకౌంట్‌ను అప్‌డేట్ చేయండి.
నా చిరునామా ఆటోమేటిక్‌గా ధృవీకరించబడదు
Shopify Payments స్వీడన్ కోసం, మీ చిరునామాను ఆటోమేటిక్‌గా ధృవీకరించలేకపోతే, మీరు సెల్ఫీ ప్రాసెస్‌ను పూర్తి చేయమని లేదా చిరునామా రుజువు డాక్యుమెంట్‌ను అందించమని అడగబడతారు.
సెల్ఫీ ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సిందిగా సిఫార్సు చేయబడింది. ధృవీకరణ అవసరమైన వ్యక్తి సెల్ఫీ బటన్‌ను క్లిక్ చేసి, ఆపై ధృవీకరించడానికి తమ ఫోటో IDని అలాగే తమని తాము ఒక ఫోటో తీసుకోవచ్చు. మీరు చిరునామా రుజువు డాక్యుమెంట్‌ను అందించే దానికి బదులుగా సెల్ఫీ ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు.
మీరు మ్యాన్యువల్‌గా డాక్యుమెంట్‌ను అందించాలనుకుంటే, దానికి బదులుగా మీరు అలా చేయవచ్చు. చిరునామా రుజువు డాక్యుమెంట్‌లు తప్పనిసరిగా మీ పూర్తి పేరు మరియు ఇంటి చిరునామాను కలిగి ఉండాలి మరియు తప్పనిసరిగా ఆమోదించబడిన డాక్యుమెంట్ రకాల్లో ఒకటి అయ్యి ఉండాలి. మీ డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి ముందు:
- మీ Shopify Payments అకౌంట్‌లోని చిరునామా మీ చిరునామా రుజువు డాక్యుమెంట్‌లోని చిరునామాతో కచ్చితంగా సరిపోలుతోందని నిర్ధారించుకోండి.
- అవసరమైతే, మీ డాక్యుమెంట్‌తో సరిపోలడానికి మీ అకౌంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
- డాక్యుమెంట్‌లో మీ సొంత పూర్తి పేరు ఉందని నిర్ధారించుకోండి. మీరు వేరొకరి పేరు మీద ఉన్న యుటిలిటీ బిల్లును కలిగి ఉంటే, అప్పుడు మీరు వేరే డాక్యుమెంట్‌ను అందించాల్సి ఉంటుంది.
- డాక్యుమెంట్‌కు సంబంధించిన స్పష్టమైన ఫోటోగ్రాఫ్‌ను అప్‌లోడ్ చేయండి.
నా యజమాని సమాచారం ధృవీకరించబడదు
Shopify Payments స్వీడన్ కోసం, మీ ప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యాపార రిజిస్ట్రీలో మీ వ్యాపారం కోసం జాబితా చేసిన యజమానులతో జాబితా చేయబడిన పేర్లు సరిపోలడం కోసం మీరు మీ యజమానుల వివరాలను ఎంటర్ చేయాలి. మీరు రిజిస్ట్రీలో మీ యజమాని సమాచారాన్ని వెతకాలని మరియు పేర్లు అక్కడ చూపిన విధంగా కచ్చితంగా ఎంటర్ చేయాలని సిఫార్సు చేయబడింది. మీకు యజమానులు ఎవరూ లేకుంటే, అప్పుడు మీరు దానికి బదులుగా అకౌంట్‌లో మీ డైరెక్టర్‌లందరినీ తప్పనిసరిగా జాబితా చేయాలి.
మీరు అలా చేసి, మీ యాజమాన్యం లేదా డైరెక్టర్‌షిప్ ఇప్పటికీ ధృవీకరించబడలేకపోతే, అప్పుడు మీరు అందించిన సమాచారం సరైనదని డిజిటల్‌గా అటెస్ట్ చేయడానికి మీ ధృవీకరణ పేజీలో సైన్ చేయండి బటన్‌ను క్లిక్ చేయాల్సిందిగా సిఫార్సు చేయబడింది.
ధృవీకరణ ప్రక్రియను ఉపయోగించడానికి బదులుగా, మీ యజమానులు లేదా డైరెక్టర్‌లు ఎవరో నిర్ధారించే పత్రాన్ని మీరు కావాలంటే అందించవచ్చు. మీ Shopify Payments అకౌంట్‌లో మీరు నమోదు చేసే యజమాని మరియు డైరెక్టర్ సమాచారం మీరు అప్‌లోడ్ చేసే డాక్యుమెంటేషన్‌లోని సమాచారంతో సరిపోలాలి. మీ డాక్యుమెంటేషన్‌లో యజమాని లేదా డైరెక్టర్ జాబితా చేయబడి ఉండి, మీ Shopify Payments అకౌంట్‌కు జోడించబడకపోతే, మీరు ఆ వ్యక్తిని మీ అకౌంట్‌కు జోడించి, వారికి యజమాని లేదా డైరెక్టర్ పాత్రను కేటాయించాలి. యాజమాన్యాన్ని వెరిఫై చేయడానికి మీరు అందించగల డాక్యుమెంట్ రకాల జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది.
మీ అకౌంట్‌లోని యజమానులు మరియు డైరెక్టర్‌లు మీ డాక్యుమెంటేషన్‌తో సరిగ్గా సరిపోలుతున్నారని నిర్ధారించుకోవాలి. మీ పత్రాలలో చూపని అదనపు యజమానులు లేదా డైరెక్టర్‌లను జాబితా చేయవద్దు.
నా చెల్లింపు పెండింగ్‌లో ఉంది
చెల్లింపు విజయవంతమైందో లేదో నిర్ధారించడానికి ఆర్డర్ టైమ్‌లైన్‌ను చెక్ చేయండి. స్టేటస్ విఫలమైంది (failed) అని ఉంటే, నిధులను క్యాప్చర్ చేయడానికి మీరు కొత్త డ్రాఫ్ట్ ఆర్డర్‌ను సృష్టించి, దాన్ని మీ కస్టమర్‌కు పంపాలి.
నా రీఫండ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి
మీరు SEK బ్యాంక్ ఖాతాను ఉపయోగిస్తుంటే, మీ బ్యాంక్ ఖాతా నుండి రీఫండ్‌లు మరియు ఛార్జ్‌బ్యాక్‌లు డెబిట్ చేయబడవు. బదులుగా, భవిష్యత్ విక్రయాలు వాటిని భర్తీ చేసే వరకు నెగటివ్ మొత్తాలు నెగటివ్ బ్యాలెన్స్‌గా ఉంటాయి. దీనివల్ల రీఫండ్ లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నట్లు కనిపించవచ్చు, కానీ రీఫండ్‌లు విజయవంతంగా ప్రాసెస్ చేయబడతాయి.
మీరు EUR బ్యాంక్ ఖాతాను ఉపయోగిస్తుంటే, నెగటివ్ బ్యాలెన్స్‌లు సాధారణంగా డెబిట్ చేయబడతాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు
స్వీడన్‌లో Shopify Payments ఆవశ్యకతల గురించిన ఈ తరచుగా అడిగే ప్రశ్నలను రివ్యూ చేయండి.
నేను ఒక కంపెనీ, భాగస్వామ్య సంస్థ లేదా లాభాపేక్ష లేని సంస్థ అయితే మీకు నా ఫోటో ID మరియు చిరునామా రుజువు ఎందుకు కావాలి?
మీరు కంపెనీ, భాగస్వామ్య సంస్థ లేదా లాభాపేక్ష లేని సంస్థగా సెటప్ చేయబడినప్పటికీ, వ్యాపారంతో అనుబంధించబడిన వ్యక్తులు ఎవరు మరియు వారు ఎక్కడ ఉన్నారు అనే దానితో సహా వారి గుర్తింపులను వెరిఫై చేయాలని స్వీడన్‌లోని నిబంధనల ప్రకారం Shopify బ్యాంకింగ్ భాగస్వాములు కోరుతున్నారు.
నేను స్వీడన్ పౌరుడిని మరియు అక్కడే జన్మించాను, కానీ నేను ప్రస్తుతం స్వీడన్‌లో నివసించడం లేదు. నేను స్వీడన్‌లో Shopify Paymentsని ఉపయోగించవచ్చా?
మీ వ్యాపార రకం వ్యక్తి / ఏక వ్యాపారి (Individual / Sole trader) అయితే, స్వీడన్‌లో Shopify Payments కోసం అర్హత పొందడానికి మీరు స్వీడన్‌లో నివసించాల్సి ఉంటుంది. మీరు ప్రస్తుతం స్వీడన్‌లో నివసించనట్లయితే, మీరు నివసించే ప్రాంతం కోసం మీరు ఒక Shopify Payments అకౌంట్‌ను సృష్టించాలి.
మీ స్టోర్ చిరునామాను మీ ప్రస్తుత లొకేషన్‌కు అప్‌డేట్ చేయండి. మీ లొకేషన్ Shopify Paymentsకి అర్హత కలిగినట్లయితే, దానికి బదులుగా మీరు ఆ ప్రాంతం కోసం Shopify Payments అకౌంట్‌ను సృష్టించవచ్చు.
మీరు భాగస్వామ్య సంస్థ, కంపెనీ లేదా లాభాపేక్ష లేని సంస్థ అయితే, మీరు వ్యక్తిగతంగా స్వీడన్‌లో నివసించాల్సిన అవసరం లేదు, కానీ మీ వ్యాపారం తప్పనిసరిగా స్వీడన్‌లో నమోదు చేయబడి ఉండాలి అలాగే స్వీడన్ వ్యాపార చిరునామాను కలిగి ఉండాలి. మీకు సహాయం కావాలంటే, Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.
నేను స్వీడన్‌లో భాగస్వామ్య సంస్థను కలిగి ఉన్నాను మరియు నన్ను సంస్థ నంబర్‌ను అడుగుతున్నారు, కానీ నా వద్ద అది లేదు. నేనేం చేయాలి?
మీరు భాగస్వామ్య సంస్థ అయ్యుండి, సంస్థ నంబర్ కోసం అడగబడితే మరియు మీ వద్ద అది లేకపోతే, మీరు సరైన వ్యాపార రకాన్ని సెటప్ చేయలేదని అర్థం. మీరు అకౌంట్‌ను సెటప్ చేసే ప్రక్రియలో ఉన్నట్లయితే, వ్యాపార రకం ఎంపిక స్క్రీన్‌కు తిరిగి వెళ్లి విలీనం చేయని భాగస్వామ్యం (Unincorporated partnership)ని ఎంచుకోండి.
మీరు ఇప్పటికే అకౌంట్‌ను సెటప్ చేసి ఉండి, మీ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా సంస్థ నంబర్ కోసం అడగబడుతుంటే, మీరు సెట్టింగ్‌లు > జనరల్కి వెళ్లడం ద్వారా మీ వ్యాపార రకాన్ని అప్‌డేట్ చేయవచ్చు. మీ వ్యాపార వివరాల పక్కన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి, ఆపై ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి. మీ వ్యాపార రకాన్ని అప్‌డేట్ చేయడంలో మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే, సహాయం కోసం Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.
నేను స్వీడన్‌లో ఏక వ్యాపారిని (sole trader). నా వ్యాపార సమాచారాన్ని నేను ఎలా నమోదు చేయాలి?
ఏక వ్యాపారిగా, గుర్తింపు వెరిఫికేషన్ కోసం మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే అందించాలి. వేరే వ్యాపార రకంగా సైన్ అప్ చేయడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే వెరిఫికేషన్‌లో ఉత్తీర్ణత సాధించడంలో మీకు ఇబ్బంది ఉండవచ్చు.
నేను స్వీడన్‌లో పబ్లిక్‌గా ట్రేడ్ చేయబడే కంపెనీని. నేను ఏ వ్యాపార రకాన్ని ఎంచుకోవాలి?
మీరు ప్రైవేట్ కార్పొరేషన్ (Private corporation)ని ఎంచుకోవాలి. వ్యాపార మరియు గుర్తింపు వెరిఫికేషన్ ప్రయోజనాల కోసం, పబ్లిక్ మరియు ప్రైవేట్ యాజమాన్యంలోని కంపెనీలకు ప్రక్రియ ఒకేలా ఉంటుంది. యజమానులను జోడించమని అభ్యర్థించే అకౌంట్ సెటప్ ఫారమ్ విభాగాన్ని మీరు దాటవేయవచ్చు. మీకు ఎవరూ లేకుంటే, మీరు ఏ లబ్ధిదారుడైన యజమానిని జాబితా చేయాల్సిన అవసరం లేదు.
మీరు స్వీడన్‌లో పబ్లిక్‌గా ట్రేడ్ చేయబడే కంపెనీ అయ్యుండి, ఇప్పటికే Shopify Payments అకౌంట్‌ను సెటప్ చేసి ఉండి, ఇప్పుడు మీ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా యాజమాన్య సమాచారం కోసం అడగబడుతుంటే, మీకు యజమానులు ఎవరూ లేరని ప్రతిబింబించేలా మీ యాజమాన్య వివరాలను అప్‌డేట్ చేయండి. ఫైల్‌లోని ఏ వ్యక్తుల నుండైనా యజమాని (Owner) పాత్రను తీసివేయండి మరియు దానికి బదులుగా మీ డైరెక్టర్‌లందరూ అకౌంట్‌లో జాబితా చేయబడ్డారని మరియు డైరెక్టర్ (Director) పాత్రను కేటాయించబడ్డారని నిర్ధారించుకోండి.
జాబితా చేయబడిన డైరెక్టర్‌షిప్ సరైనదేనని నిర్ధారించమని మిమ్మల్ని అడగవచ్చు. అది సరైనదిగా కనిపిస్తుందని మీరు నిర్ధారించగలిగితే, ఫైల్‌లోని సమాచారాన్ని డిజిటల్‌గా ధృవీకరించడానికి సంతకం చేయండి (Sign) బటన్‌ను క్లిక్ చేయండి.
ఈ ప్రక్రియతో మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే, సహాయం కోసం Shopify సపోర్ట్‌ను సంప్రదించండి.
నా వద్ద సంస్థ నంబర్ లేదు, కానీ నేను ఒక వ్యక్తిని లేదా ఏక వ్యాపారిని కాదు. నేను ఏ వ్యాపార రకాన్ని ఎంచుకోవాలి?
మీ వద్ద సంస్థ నంబర్ లేకుంటే, మీరు మీ వ్యాపార రకంగా విలీనం చేయని భాగస్వామ్యం లేదా విలీనం చేయని లాభాపేక్ష లేని సంస్థను ఎంచుకోవచ్చు. ఈ రెండు వ్యాపార రకాల కోసం స్వీడన్‌లో సదరు వ్యాపార రకంగా వ్యాపారం నమోదు చేయబడిందని చూపే డాక్యుమెంటేషన్‌ను ఇప్పటికీ అందించాల్సి ఉంటుంది.
ఈ వ్యాపార రకాల్లో ఏదీ మీ వ్యాపారానికి సరిపోకపోతే, మీరు వ్యక్తి / ఏక వ్యాపారి (Individual / Sole trader)ని ఎంచుకోవాలి మరియు ఒక కీలక నిర్ణయాధికారి లేదా యజమానిని అకౌంట్ ప్రతినిధిగా కేటాయించాలి.
నా Shopify Payments ప్రాసెసింగ్ రుసుములపై నాకు VAT విధించబడుతుందా?
లేదు. స్వీడన్‌లో Shopify Payments ప్రాసెసింగ్ రుసుములపై VAT విధించబడదు.
నా అకౌంట్ ఇప్పటికే వెరిఫై చేయబడింది. కొత్త సమాచారాన్ని అందించమని నన్ను ఎందుకు అడుగుతున్నారు?
నియంత్రణ మరియు ఆర్థిక భాగస్వామి ఆవశ్యకతలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు, కంప్లయింట్‌గా ఉండటానికి మీరు అదనపు సమాచారాన్ని అందించాల్సి రావచ్చు. మీ అడ్మిన్‌లోని బ్యానర్ లేదా అలర్ట్ ద్వారా మరియు దానికి అనుగుణమైన ఇమెయిల్ ద్వారా మీరు ఈ అభ్యర్థనలను అందుకుంటారు. Shopify Paymentsని ఉపయోగించడం కొనసాగించడానికి మీరు తప్పనిసరిగా ఈ అభ్యర్థనలను పూర్తి చేయాలి.
నా Shopify Payments అకౌంట్ సమాచారాన్ని ఎలా అప్‌డేట్ చేయాలి?
అకౌంట్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయమని మిమ్మల్ని చురుకుగా అడుగుతుంటే, అభ్యర్థించబడుతున్న ఏవైనా పత్రాలను సమర్పించడంతో పాటు, వెరిఫికేషన్ పేజీ నుండి మీరు మీ సమాచారానికి ఏవైనా అప్‌డేట్‌లు చేయవచ్చు.
వెరిఫికేషన్ ప్రక్రియ వెలుపల, స్టోర్ యజమాని ఈ వివరాలను సెట్టింగ్‌లు > జనరల్ > వ్యాపార వివరాలు ద్వారా అప్‌డేట్ చేయవచ్చు. వ్యాపార రకంతో సహా ఆ వ్యాపార సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి మీ వ్యాపార సంస్థ పక్కన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి, ఆపై ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
మీరు ఇక్కడ చేసే ఏవైనా మార్పులు రివ్యూ కోసం మా బ్యాంకింగ్ భాగస్వాములకు ఆటోమేటిక్‌గా పంపబడతాయని గమనించండి మరియు వారి వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా కొత్త సమాచారం మళ్లీ రన్ చేయబడుతుంది. మార్పులు ఆటోమేటిక్‌గా రీ-వెరిఫై అయ్యే అవకాశం ఉంది, కానీ మిమ్మల్ని సపోర్టింగ్ డాక్యుమెంట్‌లు కూడా అడగవచ్చు.
నేను నా వెరిఫికేషన్ గడువును దాటవేస్తే ఏమవుతుంది?
వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మీ పేఅవుట్‌లపై మీరు తాత్కాలిక పాజ్‌ను చూస్తారు. మొదటి గడువు ముగిసి, పేఅవుట్‌లు తాత్కాలికంగా పాజ్ చేయబడిన తర్వాత, Shopify Paymentsతో ఆర్డర్‌లను ఆమోదించే మీ సామర్థ్యం ఎప్పుడు తాత్కాలికంగా పాజ్ చేయబడుతుందో సూచించే రెండవ గడువును మీరు చూడవచ్చు.
ఈ పాజ్‌లన్నీ తాత్కాలికమైనవి మరియు మీరు వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఎత్తివేయబడతాయి. మీ గడువుల కోసం మీ అడ్మిన్ పేజీని చూడండి.
జూన్ 2026 నుండి, సరికొత్త Shopify Payments స్వీడన్ అకౌంట్‌లు వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి ప్రాసెస్ చేయబడిన మొదటి ఆర్డర్ నుండి 90 రోజులు వ్యవధిని కలిగి ఉంటాయి. 90 రోజులు గడిచినట్లయితే, మీరు Shopify Paymentsని ఉపయోగించి ప్రాసెస్ చేసిన ఏవైనా ఆర్డర్‌లు ఆటోమేటిక్‌గా రీఫండ్ చేయబడతాయి.
ఈ రీఫండ్ విధానం యూరోపియన్ దేశాలకు మాత్రమే మరియు జూన్ 2026లో లేదా ఆ తర్వాత సృష్టించబడిన సరికొత్త అకౌంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ రీఫండ్ విధానం మీకు వర్తిస్తే, రీఫండ్‌లు ఎప్పుడు ప్రాసెస్ అవుతాయని ఆశించవచ్చో స్టోర్ యజమానికి హెచ్చరికలు తెలియజేస్తాయి.
స్వీడన్‌లో Shopify Payments గురించి మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి ముందు
Shopify సపోర్ట్‌ను సంప్రదించడానికి ముందు, మీ సమస్యను వేగంగా పరిష్కరించడంలో సహాయపడటానికి ఈ సమాచారాన్ని సేకరించండి:
- బ్యాంక్ ఖాతా నంబర్‌ల వంటి సున్నితమైన సమాచారాన్ని తీసివేసి, మీరు అందుకున్న ఏవైనా ఎర్రర్ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌లు
- సెటప్ సమయంలో మీరు ఎంచుకున్న వ్యాపార రకం
- వర్తిస్తే, మీ సంస్థ నంబర్ (Organisationsnummer)
- మీరు ఒక వ్యక్తి / సోల్ ట్రేడర్‌గా సెటప్ చేయబడితే, మీ వ్యక్తిగత గుర్తింపు నంబర్ (Personnummer)
- మీకు సమస్య ఎదురైన నిర్దిష్ట దశ
- మీరు ఉపయోగిస్తున్న బ్రౌజర్ మరియు పరికరం
- మీ పూర్తి IBAN లేకుండా, మీ బ్యాంక్ ఖాతా రకం మరియు కరెన్సీ (EUR లేదా SEK)
- మీరు అప్‌లోడ్ చేసిన ఏవైనా డాక్యుమెంట్‌లు మరియు వాటిని మీరు అప్‌లోడ్ చేసిన సమయం
ఈ సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవడం వలన, మీకు మరింత సమర్థవంతంగా సహాయం చేయడానికి Shopify సపోర్ట్‌కి సులభంగా ఉంటుంది.