యునైటెడ్ స్టేట్స్‌లోని Shopify Paymentsతో కస్టమర్ చెల్లింపు పద్ధతులు
మీరు యునైటెడ్ స్టేట్స్‌లో Shopify Paymentsను ఉపయోగించినప్పుడు, క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లు, యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్‌లు, స్థానిక చెల్లింపు పద్ధతులు, అలాగే క్రిప్టోకరెన్సీ ద్వారా కస్టమర్ చెల్లింపులను అంగీకరించవచ్చు. మీ స్టోర్ కోసం ఏ చెల్లింపు పద్ధతులను యాక్టివేట్ చేయాలో నిర్ణయించడానికి, అందుబాటులో ఉన్న ఆప్షన్‌లను రివ్యూ చేయండి. కస్టమర్ కార్డ్ కొనుగోళ్ల కోసం Shopify Payments మీకు విధించే చెల్లింపు ప్రాసెసింగ్ రేట్లు, మీ Shopify ఖాతా కోసం మీరు కలిగి ఉన్న సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటాయి.
Shopify Paymentsతో, మీ చెల్లింపు ప్రాసెసింగ్, మరియు ఆర్డర్ నిర్వహణ సిస్టమ్‌లను నేరుగా మీ Shopify అడ్మిన్ నుండి నిర్వహించవచ్చు. మోసాలను గుర్తించడం మరియు 3D సెక్యూర్ లాంటి ఎన్‌క్రిప్షన్ పద్ధతుల ద్వారా మీ కస్టమర్‌ల డేటాను Shopify Payments రక్షిస్తుంది.
ఈ పేజీలో
యునైటెడ్ స్టేట్స్‌లోని Shopify Paymentsతో క్రెడిట్, మరియు డెబిట్ కార్డ్‌లు
Shopify Paymentsను ఉపయోగించే యునైటెడ్ స్టేట్స్‌లోని వ్యాపారాలు, Shopify POS ద్వారా ఆన్‌లైన్‌లో మరియు వ్యక్తిగతంగా చెల్లింపులను అంగీకరించగలవు. Shopify POS ద్వారా వ్యక్తిగతంగా చెల్లింపులను అంగీకరించడానికి, మీరు కింది ఆప్షన్‌లలో దేనినైనా ఉపయోగించవచ్చు:
- Shopify Paymentsతో Shopify-సపోర్ట్ చేసే కార్డ్ రీడర్
- థర్డ్-పార్టీ చెల్లింపు ప్రాసెసర్‌తో ఎక్స్టర్నల్ కార్డ్ టెర్మినల్
మీరు Shopify Paymentsను యాక్టివేట్ చేసినప్పుడు, క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ చెల్లింపులు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి, అదనపు సెటప్ ఏదీ అవసరం లేదు. మీరు కింది క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ బ్రాండ్‌ల నుండి చెల్లింపులను అంగీకరించవచ్చు:
- American Express
- Diner's Club
- Discover
- Mastercard
- Visa
యునైటెడ్ స్టేట్స్‌లో Shopify Paymentsతో యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్‌లు
యునైటెడ్ స్టేట్స్‌లో Shopify Paymentsతో కింది యాక్సిలరేటెడ్ చెక్‌అవుట్ చెల్లింపు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి:
యునైటెడ్ స్టేట్స్‌లో Shopify Paymentsతో స్థానిక చెల్లింపు పద్ధతులు
స్థానిక చెల్లింపు పద్ధతులను ఉపయోగించడానికి, మీరు మీ Shopify అడ్మిన్‌లోని చెల్లింపుల పేజీలో వాటిని యాక్టివేట్ చేయాలి.
స్థానిక చెల్లింపు పద్ధతులు మీ స్టోర్ లొకేషన్‌పై కాకుండా మీ కస్టమర్ లొకేషన్ ఆధారంగా చెక్‌అవుట్ వద్ద ప్రదర్శించబడతాయి. అంటే, కస్టమర్‌లు ఎంచుకున్న స్థానిక చెల్లింపు పద్ధతులను ఉపయోగించి, మీరు వివిధ దేశాల్లోని వారి నుండి చెల్లింపులను అంగీకరించవచ్చు.
ఉదాహరణకు, మీ స్టోర్ యునైటెడ్ స్టేట్స్‌లో ఉంటే, మీరు iDEAL | Weroని స్థానిక చెల్లింపు పద్ధతిగా యాక్టివేట్ చేసి, మీ కస్టమర్ నెదర్లాండ్స్‌లో ఉంటే, ఆ కస్టమర్ కోసం చెక్‌అవుట్ వద్ద iDEAL | Wero ఒక చెల్లింపు ఆప్షన్‌గా ప్రదర్శించబడుతుంది.
మీరు ఏ చెల్లింపు పద్ధతులను యాక్టివేట్ చేయవచ్చు మరియు చెక్‌అవుట్ వద్ద ఈ ఆప్షన్‌లను ఉపయోగించడానికి మీ కస్టమర్‌లు ఏయే దేశాలలో ఉండాలనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి కింది పట్టికను రివ్యూ చేయండి.
| చెల్లింపు పద్ధతి | కస్టమర్ లొకేషన్ |
|---|---|
| Bancontact | బెల్జియం |
| iDEAL | Wero | నెదర్లాండ్స్ |
| MB WAY | పోర్చుగల్ |
| Satispay | ఇటలీ |
నిర్దిష్ట స్థానిక చెల్లింపు పద్ధతుల కోసం అదనపు అర్హత ఆవశ్యకతలు
కొన్ని స్థానిక చెల్లింపు పద్ధతులకు అదనపు అర్హత ఆవశ్యకతలు ఉన్నాయి. ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్ కోసం Shopify Paymentsను ఉపయోగిస్తున్నప్పుడు, iDEAL | Weroను యాక్టివేట్ చేయడానికి ముందు మీరు Shopify Paymentsతో కనీసం 100 ఆర్డర్‌లను ప్రాసెస్ చేయాలి. iDEAL | Weroను స్థానిక చెల్లింపు పద్ధతిగా అందిస్తున్నప్పుడు అవసరమైన ఆవశ్యకతల గురించి మరింత తెలుసుకోండి.
- MB WAY: మీ కస్టమర్‌లు పోర్చుగల్‌లో ఉండాలి, EURలో చెల్లించాలి, అలాగే తమ MB WAY ఖాతాలో రిజిస్టర్ చేసిన మొబైల్ ఫోన్ నంబర్‌ను అందించాలి. Shopify Paymentsతో MB WAYని ఉపయోగించడానికి అవసరమైన ఆవశ్యకతల గురించి మరింత తెలుసుకోండి.
యునైటెడ్ స్టేట్స్‌లో Shopify Paymentsతో క్రిప్టోకరెన్సీ
యునైటెడ్ స్టేట్స్‌లోని Shopify Paymentsతో, మీరు USD కాయిన్ (USDC)లో క్రిప్టోకరెన్సీ చెల్లింపులను అంగీకరించవచ్చు.
ఒకవేళ మీరు అర్కాన్సాస్, న్యూయార్క్, పెన్సిల్వేనియా లేదా టెక్సాస్‌లో ఉంటే, మీరు USDC చెల్లింపులను అంగీకరించలేరు.
USDC క్రిప్టోకరెన్సీని ఉపయోగించి ఆర్డర్ చేస్తే, మీరు ప్రతి లావాదేవీకి ఒక క్రెడిట్‌ను పొందుతారు. మీరు మీ USDC చెల్లింపులను ఎలా పొందాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి, మీరు కింది విధాలుగా క్రెడిట్‌లను పొందుతారు:
- ఒకవేళ మీరు మీ Shopify Payments పేఅవుట్‌లలో USDC చెల్లింపులను స్వీకరించడానికి ఎంచుకుంటే, ఆ క్రెడిట్ మీ తదుపరి అందుబాటులో ఉన్న పేఅవుట్‌కు వర్తించబడుతుంది.
- ఒకవేళ మీరు మీ USDC బ్యాలెన్స్‌కు USDC చెల్లింపులను స్వీకరించడానికి ఎంచుకుంటే, మీ మొదటి USDC లావాదేవీ తేదీ నుండి క్రెడిట్‌లు సేకరించబడతాయి, అలాగే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పేఅవుట్ చేయబడతాయి. మీ USDC బ్యాలెన్స్‌కు USDC లావాదేవీల క్రెడిట్‌లను స్వీకరించడం సాధ్యమైనప్పుడు మీకు ఇమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది. USDC పేఅవుట్‌లను క్లెయిమ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
హెల్త్ సేవింగ్స్ అకౌంట్ (HSA) లేదా ఫ్లెక్సిబుల్ స్పెండింగ్ అకౌంట్ (FSA) కార్డ్‌లను అంగీకరించడం
వైద్యపరమైన ఉత్పత్తులను విక్రయించే యునైటెడ్ స్టేట్స్‌లోని బిజినెస్‌లు చెక్‌అవుట్ వద్ద హెల్త్ సేవింగ్స్ అకౌంట్ (HSA) లేదా ఫ్లెక్సిబుల్ స్పెండింగ్ అకౌంట్ (FSA) కార్డ్‌లను అంగీకరించడానికి అర్హత పొందవచ్చు.
చెక్‌అవుట్ వద్ద HSA లేదా FSA కార్డ్‌లను అంగీకరించేందుకు రివ్యూ చేయబడటానికి ముందు మీ స్టోర్ కింది ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండాలి:
- స్టోర్ యజమాని అభ్యర్థన చేయాలి.
- మీ ఆన్‌లైన్ స్టోర్ తప్పనిసరిగా యాక్టివ్‌గా, పబ్లిక్‌కి యాక్సెస్ చేయగల విధంగా ఉండాలి.
- మీ సేల్స్‌లో కనీసం 90% వైద్యపరమైన ఉత్పత్తులు ఉండాలి.
- మీ వైద్యపరమైన ఉత్పత్తులు తప్పనిసరిగా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ (IRS) ఆమోదించిన కేటగిరీలలో ఒకదానికి చెంది ఉండాలి.
- మీ ఉత్పత్తులు Shopify Payments సేవా నిబంధనలకు, ప్రత్యేకంగా Shopify Payments ఉపయోగించి విక్రయించడానికి నిషేధించిన ఐటెమ్‌లను వివరించే సెక్షన్ B.5కి అనుగుణంగా ఉండాలి.
మీ బిజినెస్ చెక్‌అవుట్ వద్ద HSA లేదా FSA కార్డ్‌లను అంగీకరించగలదో లేదో వెరిఫై చేయడానికి, మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించాలి.