తిరస్కరించబడిన చెల్లింపులను అర్థం చేసుకోవడం
చెల్లింపులు ఎందుకు తిరస్కరించబడవచ్చో, తిరస్కరణల గురించి మరింత సమాచారాన్ని ఎలా పొందాలో మరియు చెల్లింపు తిరస్కరణలను తగ్గించే వ్యూహాలను ఈ పేజీ వివరిస్తుంది.
ఈ పేజీలో
తిరస్కరించబడిన చెల్లింపులను అర్థం చేసుకోవడం
కస్టమర్ చెల్లింపు తిరస్కరించబడటానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఛార్జీని మీ కస్టమర్ బ్యాంక్‌కు సమర్పించినప్పుడు, ఛార్జీని అంగీకరించాలా వద్దా అని నిర్ణయించే ఆటోమేటెడ్ సిస్టమ్‌లు వారి వద్ద ఉంటాయి. ఈ సిస్టమ్‌లు మీ కస్టమర్ ఖర్చు చేసే అలవాట్లు, అకౌంట్ బ్యాలెన్స్, గడువు ముగింపు తేదీ మరియు కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ (CVV) లాంటి కార్డ్ సమాచారం వంటి వివిధ సంకేతాలను పరిగణనలోకి తీసుకుంటాయి.
ఈ సంకేతాలు నిరంతరం మారుతుంటాయి, కాబట్టి గతంలో విజయవంతమైన కార్డ్ భవిష్యత్తులో తిరస్కరించబడవచ్చు. కార్డ్ సమాచారం అంతా సరిగ్గా ఉన్నప్పటికీ, మీ కస్టమర్ గతంలో విజయవంతంగా చెల్లింపు చేసినప్పటికీ, బ్యాంక్ మోసం (ఫ్రాడ్) కనుక్కునే సిస్టమ్‌ల ద్వారా కొత్త ఛార్జీ ఇప్పటికీ తిరస్కరించబడవచ్చు.
తిరస్కరణల గురించి మరింత సమాచారాన్ని పొందడం
ఆర్డర్ చరిత్రలోని తిరస్కరణ గురించి మీ కస్టమర్ బ్యాంక్ నుండి మాకు ఎంత సమాచారం అందితే అంత సమాచారాన్ని మేము చూపుతాము. చాలా తిరస్కరణలు సాధారణమైనవి కాబట్టి, ఛార్జీ ఎందుకు తిరస్కరించబడిందనే దాని గురించి మాకు ఎక్కువ సమాచారం ఉండదు.
కార్డ్ సమాచారం సరైనదిగా కనిపిస్తే, మీ కస్టమర్‌ను వారి బ్యాంక్‌ని సంప్రదించమని, మరింత సమాచారాన్ని అడగమని, మరియు భవిష్యత్ ఛార్జీలను అంగీకరించమని కోరడం మంచిది.
చెల్లింపు తిరస్కరణలను తగ్గించడం
లావాదేవీని ఆమోదించాలా వద్దా అని నిర్ణయించడానికి కస్టమర్ బ్యాంక్ ప్రధానంగా కార్డ్ నంబర్, గడువు ముగింపు తేదీ మరియు CVVని ఉపయోగిస్తుంది. బిల్లింగ్ చిరునామా లేదా కార్డుదారు పేరు వంటి మీరు సేకరించే ఇతర డేటా, కార్డ్ బ్రాండ్‌ను బట్టి వివిధ స్థాయిల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు, American Express మాత్రమే దాని తనిఖీలలో కార్డుదారు పేరును ఉపయోగిస్తుంది.
మీరు Shopify Payments ఉపయోగిస్తుంటే, మీ లావాదేవీలు ఆటోమేటిక్‌గా వాటిని ఆథరైజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్న చెల్లింపు ప్రాసెసర్‌కి పంపబడతాయి. ఈ స్మార్ట్ రూటింగ్ మీ ద్వారా అదనపు పనేమీ లేకుండానే తిరస్కరణలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ప్రీపెయిడ్ గిఫ్ట్ క్రెడిట్ కార్డ్‌లు
కస్టమర్లు Shopify Paymentsతో Visa, Mastercard మరియు American Express నుండి ప్రీపెయిడ్ గిఫ్ట్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించవచ్చు. అయినప్పటికీ, లేని సమాచారం లేదా తగినన్ని నిధులు లేనందున చెక్అవుట్ సమయంలో ఈ కార్డ్‌లు తిరస్కరించబడవచ్చు.
ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డ్ తిరస్కరణలకు సాధారణ కారణాలు
కింది కారణాల వల్ల ప్రీపెయిడ్ గిఫ్ట్ క్రెడిట్ కార్డ్‌లు తిరస్కరించబడవచ్చు:
- బిల్లింగ్ సమాచారం లేకపోవడం: ఒకవేళ కార్డుదారు బిల్లింగ్ చిరునామా మరియు జిప్ కోడ్‌తో ఆన్లైన్లో వారి కార్డ్‌ను రిజిస్టర్ చేసుకోనట్లయితే, లావాదేవీ తిరస్కరించబడవచ్చు.
- జిప్ కోడ్ ధృవీకరణ యాక్టివేట్ చేయబడింది: ఒకవేళ మీరు జిప్ కోడ్ ధృవీకరణను యాక్టివేట్ చేసి ఉంటే, రిజిస్టర్డ్ జిప్ కోడ్లు లేని కార్డ్‌లు తిరస్కరించబడతాయి.
- తగినంత బ్యాలెన్స్ లేదు: ఏవైనా షిప్పింగ్ ఖర్చులు లేదా పన్నులతో సహా పూర్తి లావాదేవీ మొత్తాన్ని కవర్ చేయడానికి కార్డ్‌లో తగినంత నిధులు లేవు.