మీ డేటాను తొలగించండి
మీ వ్యాపారి వ్యక్తిగత డేటా మీ కస్టమర్ల వ్యక్తిగత డేటాకు భిన్నంగా ఉంటుంది. మీ వ్యక్తిగత డేటాలో మీ Shopify ఖాతాను నిర్వహించే వ్యక్తుల పేర్లు మరియు సంప్రదింపు వివరాలు వంటి సమాచారం ఉంటుంది.
దానికి బదులుగా కస్టమర్ వ్యక్తిగత డేటాను తొలగించడానికి, కస్టమర్ డేటా అభ్యర్థనల ప్రాసెసింగ్ని చూడండి.
కస్టమర్ ప్రొఫైల్‌ను సవరించడానికి లేదా తొలగించడానికి, కస్టమర్‌ల నిర్వహణను చూడండి.
వ్యాపారిగా Shopify సేవలను ఉపయోగిస్తున్నప్పుడు, మీ వ్యక్తిగత డేటా సేకరణ మరియు వినియోగానికి సంబంధించి మీకు ఎంపికలు ఉంటాయి. మీ వ్యక్తిగత డేటా అనేది మీ కస్టమర్ల వ్యక్తిగత డేటాకి భిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోండి. మీ వ్యక్తిగత డేటాలో మీ Shopify ఖాతాను నిర్వహించే వ్యక్తుల పేర్లు, సంప్రదింపు సమాచారం వంటివి ఉంటాయి.
ఈ పేజీలో
ఒక వ్యాపారిగా Shopify నుండి మీ వ్యక్తిగత డేటాను తొలగించడం
మీరు వ్యాపారిగా Shopify సేవలను ఉపయోగించినప్పుడు Shopify ప్రాసెస్ చేసే వ్యక్తిగత డేటాలో మీ గురించిన, అలాగే మీ వ్యాపారాన్ని నిర్వహించడంలో అనుబంధంగా ఉన్న ఇతర వ్యక్తుల గురించిన సమాచారం ఉంటుంది. ఈ సమాచారంలో, పరిమితం కాకుండా, మీ అన్ని స్టోర్‌ల నుండి పేరు, చిరునామా, ఇమెయిల్ అడ్రస్, చెల్లింపు వివరాలతో పాటుగా పలు స్టోర్‌లతో అనుబంధంగా ఉండే మీ Shopify ఖాతా సమాచారం కూడా ఉంటుంది. మీ వ్యక్తిగత డేటాను తొలగించమని Shopifyకి సూచించడం వలన, మీకు స్వంతమైన అన్ని Shopify షాప్‌లు మరియు ఖాతాల నుండి వ్యక్తిగత డేటా తొలగించబడుతుంది.
మీ వ్యక్తిగత డేటాను తొలగించమని అభ్యర్థించడానికి ముందు కింది అంశాలను పరిశీలించండి:
- మీ ఇమెయిల్ అడ్రస్‌తో అనుబంధంగా ఉన్న అన్ని స్టోర్‌లు, అన్ని ఖాతాలను డీయాక్టివేట్ చేసిన తర్వాత మాత్రమే మీ వ్యాపారి వ్యక్తిగత డేటా తొలగించబడుతుంది. వ్యాపారి వ్యక్తిగత డేటా తొలగింపు ప్రాసెస్‌లో భాగంగా, ఖాతాలన్నీ మూసివేయబడ్డాయని నిర్ధారించాల్సిందిగా మిమ్మల్ని అడుగుతుంది.
- మీ వ్యక్తిగత డేటా తొలగించబడిన తర్వాత, దాన్ని రికవర్ చేయడం సాధ్యపడదు.
మీ వ్యక్తిగత డేటా తొలగింపును అభ్యర్థించడానికి, Shopify గోప్యతా నియంత్రణలకి వెళ్లి, ప్రాసెస్‌ను ప్రారంభించడానికి నా డేటాను తొలగించండి పై క్లిక్ చేయండి. మీ అభ్యర్థనను ప్రాసెస్ చేయడానికి Shopifyకి గరిష్టంగా 30 రోజులు పట్టవచ్చు, అలాగే తొలగింపు అనేది వర్తించే చట్టం అందించిన మినహాయింపులు, పరిమితులకు లోబడి ఉండవచ్చు.
మీ స్టోర్ నుండి కస్టమర్ వ్యక్తిగత డేటాను తొలగించడం
ఒకవేళ మీరు వారి వ్యక్తిగత డేటాను తొలగించమని కస్టమర్ నుండి అభ్యర్థనను స్వీకరించిన Shopify వ్యాపారి అయితే, కస్టమర్ డేటా అభ్యర్థనను ప్రాసెస్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి.
డీయాక్టివేట్ చేసిన స్టోర్ నుండి కస్టమర్ వ్యక్తిగత డేటాను తొలగించడం
ఒకవేళ మీరు Shopify వ్యాపారిగా మీ స్టోర్‌ను డీయాక్టివేట్ చేయాలని ఎంచుకుంటే, మీరు మీ స్టోర్‌ను మళ్లీ తెరవాలని నిర్ణయించుకునే అవకాశం కోసం మీ స్టోర్ సమాచారం అంతా 2 సంవత్సరాల వరకు ఉంచబడుతుంది. అయితే, ఆ గడువుకు ముందు ఎప్పుడైనా మీ డీయాక్టివేట్ చేసిన స్టోర్ నుండి మీ కస్టమర్ల వ్యక్తిగత డేటాను తొలగించమని మీరు అభ్యర్థించవచ్చు.
మీ కస్టమర్ల వ్యక్తిగత డేటాను తొలగించమని అభ్యర్థించడానికి ముందు కింది అంశాలను పరిశీలించండి:
- మీ కస్టమర్లందరి వ్యక్తిగత డేటా అనేది డీయాక్టివేట్ చేసిన స్టోర్ నుండి మాత్రమే తొలగించబడుతుంది.
- మీ కస్టమర్ల వ్యక్తిగత డేటాను తొలగించడం అనేది మీరు డీయాక్టివేట్ చేయమని అభ్యర్థించే స్టోర్‌కు మాత్రమే వర్తిస్తుంది. మీకు ఇతర యాక్టివ్ లేదా ఇన్‌యాక్టివ్ Shopify స్టోర్‌లు ఉన్నట్లయితే, ఆ స్టోర్‌లలోని కస్టమర్‌ల వ్యక్తిగత డేటా తొలగించబడదు.
- వ్యక్తిగత డేటా తొలగించబడిన తర్వాత, దానిని రికవర్ చేయడం సాధ్యపడదు అలాగే స్టోర్‌ను మళ్లీ తెరవలేరు.
- ఆ స్టోర్ యొక్క కస్టమర్ వ్యక్తిగత డేటాను తొలగించమని స్టోర్ యజమాని మాత్రమే అభ్యర్థించగలరు. స్టోర్ యజమాని తరపున ఏ ఇతర సిబ్బంది కూడా అభ్యర్థనను సమర్పించలేరు.
మీ కస్టమర్ల వ్యక్తిగత డేటాను తొలగించడానికి మీ అభ్యర్థనను సమర్పించేందుకు, Shopify సపోర్ట్‌ను సంప్రదించండి. వర్తించే చట్టం అందించిన మినహాయింపులు, పరిమితులకు లోబడి, ఒక అభ్యర్థన పూర్తయిన 14 రోజుల్లోపు మీ స్టోర్ కస్టమర్ల వ్యక్తిగత డేటా తొలగించబడుతుంది.
Shop లేదా Shop Pay తొలగింపు అభ్యర్థనలు
మీ కస్టమర్ Shop లేదా Shop Payని ఉపయోగిస్తూ, వారి గురించి Shopify కలిగి ఉన్న వ్యక్తిగత డేటాను తొలగించాలనుకుంటే, అప్పుడు వారు Shopify గోప్యతా నియంత్రణలకు వెళ్లి, ప్రాసెస్‌ను ప్రారంభించడానికి నా డేటాను తొలగించండి పై క్లిక్ చేయవచ్చు. ఇది వారు కొనుగోలు చేసిన ఏ వ్యాపారి స్టోర్‌ల నుండి అయినా సరే వ్యక్తిగత డేటాను తొలగించదని గమనించండి.