ఆకట్టుకునే ఉత్పత్తి వివరణలను రాయడం

ఆకట్టుకునే ఉత్పత్తి వివరణలను రాయడానికి, కింది పద్ధతులలో కొన్నింటిని లేదా అన్నింటిని వర్తింపజేయడాన్ని పరిగణించండి.

మీ ఐడియల్ కస్టమర్‌పై దృష్టి పెట్టడం

మీ ఉత్పత్తి వివరణలను రాస్తున్నప్పుడు మీ ఐడియల్ కస్టమర్ లేదా మీ టార్గెట్ ఆడియన్స్‌ను ఊహించుకుని, వారిని నేరుగా సంబోధించండి. ఎవరో ఒకరిని ఉద్దేశించి సాధారణంగా రాయడానికి బదులుగా, మీ ఐడియల్ కస్టమర్‌తో మీరు మాట్లాడుతున్నట్లుగా ప్రశ్నలు అడిగి, సమాధానాలు ఇవ్వండి.

కింది ప్రశ్నలలో కొన్నింటిని మిమ్మల్ని మీరే అడగడాన్ని పరిగణించండి:

  • మీ కస్టమర్‌లు ఏ రకమైన హాస్యాన్ని ఇష్టపడతారు (ఏదైనా ఉంటే)?
  • మీ కస్టమర్‌లు ఏ పదాలను ఉపయోగిస్తారు? వారు ఏ పదాలను అసహ్యించుకుంటారు?
  • మీరు సమాధానం ఇవ్వాల్సిన ఏయే ప్రశ్నలను కస్టమర్‌లు అడుగుతారు?

వాస్తవికమైన, నిజమైన ఆన్‌లైన్ సంభాషణ కోసం మీరు ఆ భాషను మీ స్టోర్‌లో చేర్చడానికి ప్రయత్నించవచ్చు.

ప్రయోజనాలతో కస్టమర్‌లను ఆకర్షించడం

మీ ఉత్పత్తి వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో కస్టమర్‌లకు తెలిసేలా దాని ప్రయోజనాలను హైలైట్ చేయండి. మీ ఉత్పత్తికి సంబంధించిన ఫీచర్‌లను, ప్రయోజనాలను బుల్లెట్ పాయింట్‌ల జాబితాలో అమర్చి, ఏవైనా సాంకేతిక వివరాలను మీరు చేర్చవచ్చు.

కింది ప్రశ్నలను పరిగణించండి:

  • మీ ఉత్పత్తి మీ కస్టమర్‌లు మరింత సంతోషంగా, ఆరోగ్యంగా లేదా మరింత ఉత్పాదకతతో ఉండటానికి ఎలా సహాయపడుతుంది?
  • ఏయే సమస్యలు, చిక్కులు మరియు ఇబ్బందులను పరిష్కరించడంలో మీ ఉత్పత్తి సహాయపడుతుంది?
  • మీ ఉత్పత్తికి చెందిన ప్రాథమిక ఫీచర్‌లు ఏమిటి? మీరు దుస్తులను విక్రయిస్తున్నట్లయితే కొలతలు, మెటీరియల్స్, ఫంక్షన్‌లు, జాగ్రత్తలు మరియు ఫిట్ గురించిన వివరాలను రాయండి.
  • ఉత్పత్తిని ఏ సమయంలో ఉపయోగించడం మంచిది? ఫైర్‌ప్లేస్ వద్ద వేడివేడి కోకోను తాగుతూ చల్లని శీతాకాలపు రాత్రుల్లో మీ దుప్పటి ఉంటే చక్కగా సరిపోతుందా? లేక, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చురుకైన ఆటం సాయంత్రం సమయంలో బాగుంటుందా? కస్టమర్ మీ ఉత్పత్తిని ఎప్పుడు ఉపయోగించాలో తెలిపే సరైన సందర్భాలను హైలైట్ చేయండి.
  • మీ ఉత్పత్తిని ఏది ప్రత్యేకంగా మారుస్తుంది? మీ ఉత్పత్తి ప్రత్యేక ప్రయోజనాల గురించి మరియు అది మీ పోటీదారుల ఉత్పత్తి కంటే ఎందుకు మెరుగైనదో ఆలోచించండి.

సాధారణ స్టేట్‌మెంట్‌లను నివారించడం

మీ ఉత్పత్తి వివరణలలో నిర్దిష్టంగా ఉండండి. ఉత్పత్తి వివరాలు విశ్వసనీయతను జోడించి, మీ ఉత్పత్తిని విక్రయించడంలో సహాయపడతాయి. “అద్భుతమైన ఉత్పత్తి నాణ్యత” లాంటి అస్పష్టమైన విషయాలు మీ కస్టమర్‌కు ఎలాంటి ముఖ్య సమాచారాన్ని అందించవు, పైగా మీరు దానికి ఎలాంటి సాక్ష్యాలను అందించకపోతే, వారు సందేహించే అవకాశం ఉంటుంది.

మీరు పునఃవిక్రేత అయితే, తయారీదారు యొక్క ఖచ్చితమైన వివరణను కాపీ చేయకండి. మీ స్వంత వివరణను రాయడం ద్వారా సెర్చ్ ఇంజిన్‌లకు మీ ఉత్పత్తి పేజీ ప్రత్యేకంగా ఉండేందుకు సహాయపడుతుంది.

ఉత్పత్తి ప్రయోజనాల కోసం సాక్ష్యాలను అందించడం

మీ ఉత్పత్తుల గురించి మీరు చేసే ఏవైనా క్లెయిమ్‌లు వాస్తవమైనవి అని నిర్ధారించుకోండి. మీ ఉత్పత్తి దానికి సంబంధించిన కేటగిరీలోనే అత్యుత్తమమైనది అయితే, దానికి తగిన రుజువును అందించండి. లేకపోతే, మీ ప్రొడక్ట్ కాపీ టోన్‌ను తగ్గించండి లేదా మీ ఉత్పత్తి తాము ఉపయోగించిన వాటిలోకెల్లా అద్భుతమైనదని చెప్పే ఒక కస్టమర్‌ను కోట్ చేయండి.

మీ కస్టమర్‌లు ఊహించుకునేలా చేయడం

ఒకవేళ మీ స్టోర్ ఆన్‌లైన్‌లో ఉన్నట్లయితే, కస్టమర్‌లు ఆ ఉత్పత్తిని తమ చేతుల్లో పట్టుకోలేరు. మీ ఉత్పత్తిని కలిగి ఉండటం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కస్టమర్‌కు సహాయం చేయండి. మీ వాక్యాన్ని “ఊహించుకోండి” అనే పదంతో ప్రారంభించడానికి ప్రయత్నించండి, అలాగే మీ ఉత్పత్తిని సొంతం చేసుకుని, దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మీ రీడర్‌కు ఎలా అనిపిస్తుందో వివరిస్తూ మీ వాక్యాన్ని లేదా పేరాను ముగించండి.

కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వడానికి చిన్న-కథలను ఉపయోగించడం

మీ ఉత్పత్తి వివరణలలో చిన్న-కథలను చేర్చండి. కథలు కస్టమర్‌లను మీ బ్రాండ్‌కి మరియు ఉత్పత్తికి కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.

మీ ఉత్పత్తుల గురించిన కథనాన్ని చెప్పే విషయానికి వస్తే, కింది ప్రశ్నలను మిమ్మల్ని మీరే అడగండి:

  • ఉత్పత్తిని ఎవరు తయారు చేస్తున్నారు?
  • ఉత్పత్తిని సృష్టించడానికి ఏది ప్రేరేపించింది?
  • ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి మీరు ఏయే అడ్డంకులను అధిగమించాల్సి వచ్చింది?
  • ఉత్పత్తి ఎలా పరీక్షించబడింది?

సెన్సరీ పదాలను చేర్చడం

స్పష్టమైన ఉత్పత్తి వివరణల ద్వారా మీ రీడర్‌లను ఎంగేజ్ చేయండి. మీ కస్టమర్‌లు చదువుతున్నప్పుడే మీ ఉత్పత్తిని అనుభూతి చెందడానికి, ఉత్పత్తితో సెన్సరీ ఇంటరాక్షన్‌ను వివరించే విశేషణాలు సహాయపడతాయి.

ఉదాహరణకు, మీరు ఆహార ఉత్పత్తులను విక్రయిస్తుంటే, “మృదువైన,” “సున్నితమైన,” “కరకరలాడే,” మరియు “స్ఫుటమైన” వంటి పదాల గురించి ఆలోచించండి.

సామాజిక రుజువు ద్వారా నమ్మకాన్ని పెంచడం

కాబోయే కస్టమర్‌లు, గతంలో మీ ఉత్పత్తులను కొన్న కస్టమర్‌ల అనుభవాల గురించి తెలుసుకోవడానికి కస్టమర్ టెస్టిమోనియల్‌లు లేదా సోషల్ మీడియా ఫీడ్‌ను చేర్చండి. మీరు కస్టమర్ టెస్టిమోనియల్‌లను చేరుస్తుంటే, దానికి విశ్వసనీయతను జోడించడానికి కస్టమర్ ఆ ఉత్పత్తిని ఉపయోగిస్తున్నప్పటి ఇమేజ్‌ని చేర్చడానికి ప్రయత్నించండి. మీ ఉత్పత్తులను ఉపయోగించే నిజమైన వ్యక్తుల ఉదాహరణలను మీరు షేర్ చేసినప్పుడు, కాబోయే కస్టమర్‌లు తాము ఎంచుకున్న ఉత్పత్తుల విషయంలో మరింత నమ్మకంగా ఫీల్ అవుతారు.

మీ వెబ్‌సైట్‌లో ఉత్పత్తి సమీక్షలను క్యాప్చర్ చేయడానికి, Google లేదా Facebook వంటి థర్డ్-పార్టీ సైట్‌ల నుండి వచ్చిన ఇతర రివ్యూలను ఇంటిగ్రేట్ చేయడానికి మీరు ఒక కస్టమర్ రివ్యూస్ యాప్ను ఉపయోగించవచ్చు.

మీ వివరణను సులభంగా స్కాన్ చేసేలా చేయడం

మీ ఉత్పత్తి వివరణలు స్పష్టంగా మరియు సులభంగా స్కాన్ చేసే విధంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి, తద్వారా అవి చదవడానికి సులభంగా ఉంటాయి మరియు సంభావ్య కస్టమర్‌లను మరింత ఆకర్షిస్తాయి. ఉత్పత్తి వివరాల పేజీలోని వివరణ ఫీల్డ్ రిచ్ టెక్స్ట్ ఎడిటర్ను ఉపయోగిస్తుంది, కాబట్టి మీరు మీ టెక్స్ట్‌ను ఫార్మాట్ చేయవచ్చు.

మీ ఉత్పత్తి వివరణలను రాస్తున్నప్పుడు దృష్టి పెట్టాల్సిన కింది అంశాలను పరిగణించండి:

  • హెడ్‌లైన్‌లతో మీ వెబ్ సందర్శకుడిని ఆకర్షించండి.
  • లిస్ట్‌ల కోసం బుల్లెట్ పాయింట్‌లను ఉపయోగించండి.
  • తగినంత వైట్ స్పేస్‌ను చేర్చండి.
  • చదవడాన్ని సులభతరం చేయడానికి మీ ఫాంట్ పరిమాణాన్ని పెంచండి.
  • అధిక నాణ్యత గల ఉత్పత్తి చిత్రాలను ఉపయోగించండి.

విజయాన్ని అంచనా వేయడానికి లక్ష్యాలను సెట్ చేయడం

మీ ఉత్పత్తి వివరణలు మరిన్ని విక్రయాలకు దారితీస్తున్నాయో లేదో అర్థం చేసుకోవడానికి మీ ఉత్పత్తి పేజీలలో ట్రాక్ చేయడానికి కొన్ని మెట్రిక్‌లను నిర్ణయించుకోండి. ఈ మెట్రిక్‌లను నిర్వచించడం వలన ఏ ఉత్పత్తి వివరణలు అత్యుత్తమంగా పని చేస్తున్నాయో తెలుసుకోవడంలో మరియు తక్కువ పనితీరు కనబరుస్తున్న వాటిని మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది.

పర్యవేక్షించాల్సిన కొన్ని సాధారణ మెట్రిక్‌లు ఇవి:

  • కన్వర్షన్ రేట్
  • కార్ట్‌ను వదిలివేయడం
  • రిటర్న్ రేట్
  • మద్దతు విచారణలు
  • ఆర్గానిక్ సెర్చ్ ర్యాంకింగ్‌లు

మీరు Shopify App Store నుండి ఒక A/B టెస్టింగ్ యాప్‌ను ఉపయోగించి విభిన్న A/B టెస్ట్‌లను రన్ చేయవచ్చు, దీని వల్ల మీ ఈకామర్స్ వెబ్‌సైట్ కోసం అత్యధిక కన్వర్షన్‌లు మరియు మరిన్ని విక్రయాలు జరగవచ్చు.