విక్రయించడానికి ఉత్పత్తులను ఎంచుకోవడం
ఉత్పత్తి శ్రేణి అనేది మీరు విక్రయించే ఉత్పత్తుల సమూహాన్ని సూచిస్తుంది. ఉత్పత్తి శ్రేణిని ఎంచుకునేటప్పుడు, ఉమ్మడి థీమ్, ఆడియన్స్ లేదా ఫంక్షన్ ఆధారంగా మీ ఉత్పత్తులను క్యూరేట్ చేయడాన్ని పరిగణించండి. ఉదాహరణకు, మీరు పర్యావరణ అనుకూల వంటసామగ్రి లేదా ఫిట్‌నెస్ ఉపకరణాల ఉత్పత్తి శ్రేణిని క్యూరేట్ చేయవచ్చు.
డ్రాప్‌షిప్పింగ్ ద్వారా విక్రయించడానికి ఉత్పత్తులను ఎంచుకునేటప్పుడు, మార్కెట్ ట్రెండ్‌లను పరిశోధించడం ద్వారా సాంస్కృతిక, సాంకేతిక లేదా కాలానుగుణ అంశాల వల్ల ప్రభావితమయ్యే కస్టమర్ డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. మీరు ఒక ప్రత్యేక విక్రయ ప్రతిపాదనను (USP) కూడా డెవలప్ చేయాలి, స్థిరత్వం లేదా అందుబాటులో ఉండే ధర లాంటి పోటీదారులతో పోలిస్తే మీ ఉత్పత్తులు అందించే విభిన్న విలువను కస్టమర్లకు తెలియజేయడానికి ఇది మీకు సహాయపడుతుంది.
ఈ పేజీలో
మీ వ్యాపార లక్ష్యాలకు నిర్దిష్టమైన డ్రాప్‌షిప్పింగ్ ఉత్పత్తులను ఎంచుకోవడం
మీ వ్యాపార లక్ష్యాలను బట్టి మీ డ్రాప్‌షిప్పింగ్ స్టోర్ కోసం ఉత్పత్తులను ఎంచుకోవడానికి కింది చిట్కాలను పరిగణించండి:
- మీరు కాలానుగుణ ఉత్పత్తులను విక్రయిస్తుంటే, స్థిరమైన విక్రయాలను కొనసాగించడానికి నిరంతర డిమాండ్‌ను కలిగి ఉన్న ఉత్పత్తులను వాటికి జోడించండి.
- మీ ఉత్పత్తుల ఖర్చును పరిగణనలోకి తీసుకునేటప్పుడు, మీరు టార్గెట్ చేయాలనుకుంటున్న కస్టమర్‌లను దృష్టిలో ఉంచుకుని, మీరు ఆరోగ్యకరమైన లాభాల మార్జిన్‌ల కోసం ధర నిర్ణయించగల ఉత్పత్తులను ఎంచుకోండి.
- మీరు పోటీతో కూడిన షిప్పింగ్ రేట్‌లను అందించాలనుకుంటే, తక్కువ బరువు ఉండే ఐటెమ్‌ల లాంటి షిప్ చేయడానికి సులువుగా ఇంకా తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తులను విక్రయించడాన్ని పరిగణించండి.
విక్రయించడానికి ఉత్పత్తులను ఎలా వెతకాలనే దానిపై దృష్టి పెట్టడం సహాయపడుతుంది. మీ వ్యాపారం కోసం మీరు వేటిని ఉపయోగించవచ్చో చూడడానికి కింది పద్ధతులను సమీక్షించండి.
సరఫరాదారు కీర్తి ఆధారంగా
మంచి నాణ్యత గల ఉత్పత్తులను కలిగి ఉన్నారని మీకు తెలిసిన సరఫరాదారు నుండి మీరు ఉత్పత్తులను ఎంచుకుంటే, మీ కస్టమర్‌లు వారి కొనుగోలుతో సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాణ్యతను మీకై మీరు నిర్ణయించడానికి వేర్వేరు సరఫరాదారుల నుండి ఉత్పత్తులను ఆర్డర్ చేస్తూ సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు, ఇది మీ సమయాన్ని మరియు డబ్బును ఆదా చేస్తుంది.
మీ ఉత్పత్తులన్నింటినీ ఒకే సరఫరాదారు నుండి ఎంచుకోవడం వల్ల షిప్పింగ్ ఖర్చులను తక్కువగా ఉంచడం మరియు మీ కస్టమర్‌లకు మరింత ఖచ్చితమైన షిప్పింగ్ రేట్‌లను ఛార్జ్ చేయడం సులభతరం అవుతుంది.
మార్కెట్ ట్రెండ్‌ల ఆధారంగా
మార్కెట్ ట్రెండ్‌లను పరిశోధించడానికి చాలా సమయం పట్టవచ్చు, కానీ మీరు సరైన సమయంలో ట్రెండీగా ఉండే ఉత్పత్తిని విక్రయిస్తే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పద్ధతి ప్రకారం మీరు మీ ఉత్పత్తి శ్రేణిని తరచుగా మార్చాలి మరియు తాజా ట్రెండ్‌లను నిరంతరం పరిశోధించాలి, కానీ అది లాభదాయకంగా ఉంటుంది.
ప్రత్యేకమైన అవసరాన్ని నెరవేర్చడం ఆధారంగా
వ్యక్తులు ఎదుర్కొనే సమస్యను పరిష్కరించే ఉత్పత్తి శ్రేణిని రూపొందించడం అనేది మీ ఉత్పత్తి శ్రేణిని ఉంచడానికి ఒక మంచి మార్గం. మీరు ప్రత్యేకమైన ఉత్పత్తులను సులభంగా కనుగొనేలా చేయవచ్చు, లేదా సాధారణంగా ఒకే చోట దొరకని ఉత్పత్తుల సమూహాన్ని అందించవచ్చు.
ఉదాహరణకు, వ్యక్తులు సాధారణంగా వివిధ మూలాల నుండి కొనుగోలు చేయాల్సిన విభిన్న మెటీరియల్‌లు అవసరమయ్యే ఒక ప్రత్యేకమైన క్రాఫ్ట్ గురించి మీకు తెలిసి ఉండవచ్చు. మీరు ఆ మెటీరియల్‌లన్నింటినీ ఒకే చోట ఉంచితే, లేదా ఆ మెటీరియల్‌లన్నింటినీ కలిగి ఉన్న ఉత్పత్తిని సృష్టిస్తే, ఆ ఉత్పత్తులన్నింటినీ కనుగొనాల్సిన సమస్య పరిష్కరించబడుతుంది.
జనాభా గణాంకాల ఆధారంగా
వ్యక్తుల నిర్దిష్ట జనాభా గణాంకాలను పరిశోధించడం వలన మీ ఉత్పత్తి శ్రేణికి ఏ ఉత్పత్తులు సరిపోతాయనే దాని గురించిన మరింత డేటాను కలిగి ఉండటానికి మీకు అనుమతి లభిస్తుంది. ఉదాహరణకు, యూనివర్శిటీ విద్యార్థులు మొదటిసారి కొత్త ఇంటికి మారినప్పుడు సాధారణంగా మర్చిపోయే ఉత్పత్తులను మీరు పరిశోధించవచ్చు మరియు వారి కోరికలు మరియు అవసరాలకు తగినట్లుగా మీ ఉత్పత్తి శ్రేణిని ఎంచుకోవచ్చు.
మీరు దేనిని కొనుగోలు చేస్తారనే దానిపై ఆధారపడి
మీరు కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేస్తే, బహుశా వాటిని ఇతరులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వాటి ఆధారంగా ఉత్పత్తులను ఎంచుకోవడం వల్ల ఉత్పత్తి సమీక్షలు లేదా గైడెన్స్ ఇచ్చే బ్లాగ్‌ల లాంటి ఉత్పత్తుల కోసం మార్కెటింగ్ కంటెంట్‌ను రాయడం కూడా సులభతరం అవుతుంది.
ఉత్పత్తులను ఎంచుకోవడంలో మీకు సహాయపడటానికి మార్కెట్ పరిశోధనను ఉపయోగించడం
సమగ్రమైన మార్కెట్ పరిశోధన అనేది ఉత్పత్తి ఎంపికలో చాలా సహాయపడుతుంది. మార్కెట్ పరిశోధన చేయడంలో మీకు సహాయపడే కింది ఉదాహరణ టూల్స్‌ను సమీక్షించండి:
- కస్టమర్‌లు దేనికోసం వెతుకుతున్నారో అర్థం చేసుకోవడంలో Google Trends సహాయపడుతుంది.
- ట్రెండ్‌ల ఆధారంగా ఉత్పత్తులను సిఫార్సు చేయగల థర్డ్-పార్టీ యాప్‌ల కోసం Shopify App Storeను వెతకండి.
- నిర్దిష్ట ఉత్పత్తి రకాలపై పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించడానికి సోషల్ మీడియా విశ్లేషణ నిర్వహించండి.
- మన్నిక విషయంగా స్థిరంగా తక్కువ రేటింగ్‌లను కలిగి ఉన్న ఉత్పత్తుల లాంటి తీర్చలేని అవసరాలను కనుగొనడానికి పోటీదారుల సమీక్షలను అధ్యయనం చేయండి.
మీరు మీ టార్గెట్ కస్టమర్ జనాభా గణాంకాలను కూడా పరిగణించాలి. ఉదాహరణకు, యూనివర్శిటీ విద్యార్థులకు తక్కువ జాగాను తీసుకునే హాస్టల్ నిత్యావసరాలు అవసరం కావచ్చు.
వీగన్ స్కిన్‌కేర్ ఉత్పత్తి శ్రేణికి సంబంధించిన మార్కెట్ పరిశోధన ఉదాహరణ
ఉదాహరణకు, మీరు వీగన్ స్కిన్‌కేర్ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించాలనుకుంటున్నారనుకుందాం. మార్కెట్ పరిశోధన ద్వారా, మీరు కింది సమాచారాన్ని గుర్తిస్తారు:
- “వీగన్ ఫేస్ క్రీమ్” మరియు “న్యాచురల్ మాయిశ్చరైజర్” కోసం పెరుగుతున్న సెర్చ్‌లను Google Trends చూపుతుంది.
- కస్టమర్‌లు సువాసన లేని మరిన్ని ఎంపికలను కోరుకుంటున్నారని పోటీదారుల సమీక్షలు వెల్లడిస్తున్నాయి.
- స్థిరమైన ప్యాకేజింగ్‌పై పెరుగుతున్న ఆసక్తిని సోషల్ మీడియా విశ్లేషణ చూపుతుంది.
- విటమిన్ సి సిరమ్‌లకు అధిక డిమాండ్ ఉందని థర్డ్-పార్టీ ట్రెండ్ టూల్స్ సూచిస్తున్నాయి.
ఈ పరిశోధన ఆధారంగా, మీరు మీ ప్రారంభ ఉత్పత్తిగా రీసైకిల్ చేయగల ప్యాకేజింగ్‌లో సువాసన లేని విటమిన్ సి సిరమ్‌లపై దృష్టి పెట్టవచ్చు మరియు మీరు కస్టమర్ విధేయతను పెంపొందించుకుంటూ ఇతర వీగన్ స్కిన్‌కేర్ ఐటెమ్‌లకు విస్తరించవచ్చు.
సమగ్ర ఉత్పత్తి శ్రేణిని రూపొందించడం
ఏకీకృత ఉత్పత్తి శ్రేణి మీ టార్గెట్ ఆడియన్స్‌కు అనుకూలమైన స్థిరమైన థీమ్‌ను సృష్టించడం ద్వారా మీ బ్రాండింగ్‌ను బలోపేతం చేస్తుంది మరియు మార్కెటింగ్ ప్రయత్నాలను సులభతరం చేస్తుంది. డిజైన్ స్టైల్, ఫంక్షన్ లేదా టార్గెట్ చేసే జనాభా గణాంకాలు ఏదైనా సరే, మీ ఉత్పత్తులు సాధారణ లక్షణాలను పంచుకున్నప్పుడు, మీరు మరింత దృష్టి పెట్టగల మార్కెటింగ్‌ను సృష్టించగలరు.
ఉదాహరణకు, బేకింగ్ కప్‌లు, ఆప్రాన్‌లు, ఓవెన్ మిట్స్, మరియు కుకీ కట్టర్‌లు లాంటి డైనోసార్-థీమ్ ఉన్న పిల్లల కిచెన్ యాక్సెసరీలను విక్రయించే Shopify స్టోర్ అనేది తమ పిల్లల కోసం ప్లేఫుల్ వంట సాధనాలను వెతుకుతున్న తల్లిదండ్రులను సమర్థవంతంగా టార్గెట్ చేయవచ్చు. పూర్తి డైనోసార్-థీమ్ ఉన్న కిచెన్ సెట్‌లను సృష్టించేందుకు స్టోర్, దానికి సరిపోయే ప్లేస్‌మ్యాట్‌లు, ప్లేట్‌లు మరియు పాత్రల ద్వారా ఈ థీమ్‌ను విస్తరించగలదు. ఈ ఫోకస్డ్ అప్రోచ్ అనేది “మేక్ బేకింగ్ ఫన్” లేదా “ప్రీహిస్టారిక్ కిచెన్ అడ్వెంచర్స్” లాంటి థీమ్‌లకు సంబంధించిన టార్గెట్ చేసిన మార్కెటింగ్ ప్రచారాలను అనుమతిస్తుంది.
దీనికి విరుద్ధంగా, పిల్లల ఐటెమ్‌లతో పాటు ప్రామాణిక కిచెన్ యాక్సెసరీలను విక్రయించే స్టోర్‌కి దాని అన్ని ఉత్పత్తుల కోసం కస్టమర్‌లను కనుగొనడానికి మరింత వైవిధ్యభరితమైన ప్రకటనలు అవసరం అవుతాయి. ఈ విధానం మీ మార్కెటింగ్ బడ్జెట్‌ను నీరుగార్చవచ్చు మరియు గుర్తింపు పొందగల బ్రాండ్ ఐడెంటిటీని స్థాపించడం కష్టతరం చేస్తుంది. ఈ స్టోర్ ప్రొఫెషనల్ వంట సామాగ్రి మరియు పిల్లల ఐటెమ్‌ల కోసం వేర్వేరు ప్రచారాలను సృష్టించాల్సి ఉంటుంది, ఇది స్టోర్ ఫోకస్ గురించి కస్టమర్‌లను గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంటుంది.
సమగ్ర ఉత్పత్తి శ్రేణిని నిర్మించడం కోసం కింది చిట్కాలను పరిగణించండి:
- థీమ్ స్థిరత్వం: కొత్త ఉత్పత్తులు మీరు స్థాపించిన థీమ్‌తో అలైన్ అయ్యేలా చూసుకోండి.
- టార్గెట్ ఆడియన్స్ అలైన్‌మెంట్: అన్ని ఉత్పత్తులు ఒకే విధమైన కస్టమర్ విభాగాలకు నచ్చేలా ఉండాలి.
- క్రాస్-సెల్లింగ్ పొటెన్షియల్: ఉత్పత్తులు సహజంగా ఒకదానికొకటి పూరకంగా ఉండాలి.
- బ్రాండ్ ఐడెంటిటీ: ప్రతి ఉత్పత్తి మీ బ్రాండ్ యొక్క ప్రత్యేక స్థానాన్ని బలోపేతం చేయాలి.
- మార్కెటింగ్ సామర్థ్యం: ఒక ఏకీకృత శ్రేణి అనేది నిర్దిష్ట లక్ష్యంతో ఉన్న, తక్కువ ఖర్చుతో కూడిన మార్కెటింగ్ ప్రచారాలను అనుమతిస్తుంది.
మీ ఉత్పత్తులను ఎంచుకోవడం
మీ ఉత్పత్తి శ్రేణి కోసం ఉత్పత్తులను ఎంచుకునే పద్ధతిని మరియు థీమ్‌ను నిర్ణయించుకున్న తర్వాత, మీ స్టోర్‌కు జోడించడానికి నిర్దిష్ట ఉత్పత్తుల కోసం వెతకడం ప్రారంభించవచ్చు. కింది వాటిని కలిగి ఉన్న ఉత్పత్తులను జోడించడం ప్రయోజనకరంగా ఉంటుంది:
- అధిక రేటింగ్‌లు
- సానుకూల రివ్యూలు
- కలిపి కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉండటం
- అధిక నాణ్యత గల ఫోటోలు
- మంచి వివరణలు రాయడానికి సులభంగా ఉండటం
- ఉచిత షిప్పింగ్ ఆప్షన్
- టెస్ట్ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో ఆర్డర్ చేయగలగడం.
మీరు విక్రయాలు చేయడం ప్రారంభించిన తర్వాత, కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా మీ ఉత్పత్తి శ్రేణిని మార్చుకోవచ్చు, మీ రంగంలో కొత్త ట్రెండ్‌లను అనుసరించవచ్చు లేదా సృష్టించవచ్చు, అలాగే కొత్తగా ఏమి ఉన్నాయో చూడటానికి కస్టమర్‌లను తిరిగి మీ స్టోర్‌కు వచ్చేలా ప్రోత్సహించవచ్చు.
Shopifyలో మీ డ్రాప్‌షిప్పింగ్ ఉత్పత్తులను సెటప్ చేయడం
మీ ఉత్పత్తి వ్యూహాన్ని అమలు చేస్తున్నప్పుడు, ఉత్పత్తుల ఎంపికను సులభతరం చేయడానికి, అలాగే ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ను ఆటోమేట్ చేయడానికి మీరు ప్రింట్-ఆన్-డిమాండ్ లేదా డ్రాప్‌షిప్పింగ్ కోసం యాప్ ఇంటిగ్రేషన్‌లను సద్వినియోగం చేసుకోవచ్చు.
విక్రయించడానికి మీరు మీ ఉత్పత్తులను సెటప్ చేసేటప్పుడు ఈ కింది ఉత్తమ పద్ధతులను పరిగణనలోకి తీసుకోండి:
- వివిధ కోణాలను చూపే బహుళ అధిక నాణ్యత గల ఇమేజ్‌లు మరియు వీడియోలతో ఆకట్టుకునే ఉత్పత్తి పేజీలను సృష్టించండి.
- ఒకే లిస్టింగ్ కింద పరిమాణం, రంగు వంటి ఆప్షన్‌లను ప్రదర్శించడానికి ప్రొడక్ట్ వేరియంట్‌లను ఉపయోగించండి.
- సంబంధిత కీవర్డ్‌లతో మీ USPలను హైలైట్ చేసే SEO-ఆప్టిమైజ్ చేయబడిన వివరణలను రాయండి.
- మీ ఆన్‌లైన్ స్టోర్‌లో నావిగేషన్‌ను మెరుగుపరచడానికి మరియు క్రాస్-సెల్లింగ్ అవకాశాలను ప్రోత్సహించడానికి మీ ఉత్పత్తులను "ఔట్‌డోర్ గేర్" లేదా "వర్క్-ఫ్రమ్-హోమ్ ఎసెన్షియల్స్" వంటి కలెక్షన్‌లుగా నిర్వహించండి.
- కస్టమర్‌లు తాము వెతుకుతున్న వాటిని కనుగొనడంలో సహాయపడేందుకు ధర, రంగు మరియు రేటింగ్‌ల కోసం ఫిల్టర్‌లను సెటప్ చేయండి.
- మీ ఉత్పత్తుల కొనుగోలు పట్ల కస్టమర్‌లలో నమ్మకాన్ని, భరోసాను పెంచడానికి యాప్‌లను ఉపయోగించి మీ ఉత్పత్తి పేజీలలో కస్టమర్ రివ్యూలను, సోషల్ మీడియా ఫోటోలను పొందుపరచండి.
- కార్ట్‌లో షిప్పింగ్ ఖర్చులను ప్రదర్శించడానికి షిప్పింగ్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ద్వారా మీరు వదిలివేసిన కార్ట్‌లను తగ్గించవచ్చు, తద్వారా కస్టమర్‌లు మరింత అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోగలుగుతారు.