మీ ఆర్థిక విషయాలను సిద్ధం చేయడం

మీరు డ్రాప్‌షిప్పింగ్ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, మీరు మీ వ్యక్తిగత, వ్యాపార ఆర్థిక విషయాలను విడిగా ఉంచాలి. ఇది అకౌంటింగ్‌ను సులభతరం చేయడానికి సహాయపడుతుంది, అలాగే స్థానిక పన్ను నిబంధనలకు కట్టుబడి ఉండటంలో మీకు సహాయపడుతుంది.

నిర్దిష్ట వ్యాపార ఖాతాలను సెటప్ చేయడం, మీ స్థానిక వ్యాపార, పన్ను చట్టాలను అర్థం చేసుకోవడం, అలాగే బుక్ కీపింగ్ పద్ధతిని ఎంచుకోవడం వంటివన్నీ మీరు పరిశోధించాల్సిన ముఖ్యమైన విషయాలు.

వ్యాపార ఖాతాలను సెటప్ చేయండి

వ్యాపారాలు సెటప్ చేయాల్సిన ఖాతాలు ఒక్కో ప్రాంతీయ ప్రభుత్వానికి ఒక్కోలా ఉంటాయి. ఉదాహరణకు, కొత్త వ్యాపారాలకు తరచుగా కింది ఖాతాలు అవసరమవుతాయి:

  • ఒక వ్యాపార బ్యాంక్ ఖాతా - ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మొత్తం వ్యాపార రాబడి, ఖర్చులన్నింటినీ ఒక వ్యాపార ఖాతా ద్వారా నిర్వహించడం సాధారణం. మీ వ్యాపారం కోసం ఒక బ్యాంక్ ఖాతాను ప్రారంభించడం వలన మీ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడం, వాటిని ట్రాక్ చేయడం సులభం అవుతుంది.

  • స్థానిక చెల్లింపు పద్ధతి వ్యాపార ఖాతాలు - నెదర్లాండ్స్‌లో iDEAL | Wero వంటి స్థానిక చెల్లింపు పద్ధతి ద్వారా చెల్లింపులను ఆమోదించాలని మీరు ప్లాన్ చేస్తుంటే, ఆ చెల్లింపు పద్ధతిలో వ్యాపార ఖాతాల కోసం ఎలాంటి ఆవశ్యకతలు ఉన్నాయో తనిఖీ చేయండి. స్థానిక చెల్లింపు ఎంపికల కోసం సైన్ అప్ చేయడం వలన మీ కస్టమర్‌లకు సుపరిచితమైన చెల్లింపు పద్ధతులను ఆమోదించడం ద్వారా మీ బ్రాండ్‌పై నమ్మకాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

    మీ ప్రాంతంలో చెల్లింపులను అంగీకరించడానికి మీకు ఏ పద్ధతులు అందుబాటులో ఉన్నాయో చూడటానికి పేమెంట్ ప్రొవైడర్ల పేజీని సందర్శించండి.

  • అంతర్జాతీయ చెల్లింపు పద్ధతి వ్యాపార ఖాతా - PayPal వంటి అంతర్జాతీయ చెల్లింపు పద్ధతి ద్వారా చెల్లింపులను అంగీకరించాలని మీరు ప్లాన్ చేస్తుంటే, దానిని Shopifyతో కనెక్ట్ చేయడానికి మీకు బహుశా ఆ చెల్లింపు పద్ధతిని కలిగి ఉన్న వ్యాపార ఖాతా అవసరం కావచ్చు.

    మీ ప్రాంతంలో ఏ గేట్‌వేలు అందుబాటులో ఉన్నాయో చూడటానికి మా పేమెంట్ గేట్‌వేల పేజీని సందర్శించండి.

  • వ్యాపార క్రెడిట్ కార్డ్ - మీ సరఫరాదారుల కనీస ఆర్డర్ పరిమాణాలను పూర్తి చేసేటప్పుడు మీరు మామూలు కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ రకమైన కొనుగోళ్ల కోసం ఉపయోగించడానికి, అలాగే మీ ఖర్చులను ఒకే చోట ఉంచుకోవడానికి మీ వ్యాపార బ్యాంక్ ఖాతాకు కనెక్ట్ చేసిన వ్యాపార క్రెడిట్ కార్డ్‌ను కలిగి ఉండటం సహాయపడుతుంది.

  • వ్యాపార పొదుపు ఖాతా - మీ వ్యాపారం కోసం మీరు క్రమం తప్పకుండా పొదుపు ఖాతాలో నిధులు సమకూర్చుకుంటే, మీ వ్యాపారానికి వచ్చే ఏవైనా ఊహించని ఖర్చుల కోసం మీరు మరింత సిద్ధంగా ఉండవచ్చు.

    ఉదాహరణకు, మీరు విక్రయించాలనుకుంటున్న కొత్త ఉత్పత్తిని కలిగి ఉన్న కొత్త సరఫరాదారు మీకు కనిపించవచ్చు, అయితే ఆ సరఫరాదారు మీరు అలవాటు పడిన దానికంటే చాలా ఎక్కువ కనీస ఆర్డర్ ఖర్చులను కలిగి ఉండవచ్చు. మీరు వ్యాపారం కోసం కొంత డబ్బు ఆదా చేసి ఉంటే, మీరు ఈ ఎక్కువ ఖర్చులను చెల్లించగలరు.

పన్ను సంబంధిత అంశాలను పరిశోధించండి

మీ ప్రాంతంలోని డ్రాప్‌షిప్పింగ్ వ్యాపారాలకు ఏ పన్ను చట్టాలు వర్తిస్తాయో తెలుసుకోవడానికి మీ స్థానిక ప్రభుత్వ, వ్యాపార బ్యూరోను సంప్రదించండి. డ్రాప్‌షిప్పింగ్ అనేది ఒక ప్రత్యేకమైన వ్యాపార రకం, ఎందుకంటే చాలా వరకు వ్యాపారం ఆన్‌లైన్‌లో నడుస్తుంది.

మీ డ్రాప్‌షిప్పింగ్ వ్యాపారం నుండి ఏమేం ఆశించబడుతుందనే దానిపై మీకు మంచి అవగాహన ఉందని నిర్ధారించుకోవడానికి కిందివాటిని పరిశోధించండి:

  • మీరు ఏయే వ్యాపార రిజిస్ట్రేషన్ నంబర్‌లను పొందాలి - ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వ్యాపారం ఏదైనా ఒక రకమైన వ్యాపార గుర్తింపు కోసం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్‌లో చాలా వ్యాపారాలు పన్నులను ఫైల్ చేయడానికి లేదా వారి వ్యాపారం కోసం బ్యాంక్ ఖాతాను తెరవడానికి యజమాని గుర్తింపు సంఖ్య (EIN) అవసరం అవుతుంది.

    మీరు వ్యాపారాన్ని నిర్వహించడానికి అవసరమైన అన్ని వ్యాపార డాక్యుమెంట్‌లను వీలైనంత త్వరగా పొందినట్లయితే, మీరు సరఫరాదారులతో కలిసి పని చేయడానికి, ఆడిట్‌లకు ప్రతిస్పందించడానికి, అలాగే పన్ను చట్టాలకు కట్టుబడి ఉండటానికి మరింత మెరుగ్గా సిద్ధంగా ఉన్నట్లు అవుతుంది.

  • మీరు ఏయే పరిస్థితుల్లో పన్నును వసూలు చేసి, రెమిట్ చేయాల్సి ఉంటుంది - నిర్దిష్ట వ్యవధిలో నిర్దిష్ట రాబడికి చేరుకునే వరకు వ్యాపారాలు పన్నును వసూలు చేయాల్సిన లేదా రెమిట్ చేయాల్సిన అవసరం కొన్ని ప్రాంతాల్లో ఉండదు. ఇతర ప్రాంతాలలో, కస్టమర్ అదే ప్రాంతంలో ఉంటేనే, ప్రతి లావాదేవీపై పన్ను వసూలు చేయాలని ఆశిస్తారు.

    మీ వ్యాపారం అభివృద్ధి చెందే ప్రతి దశలో దాని నుండి ఏమి ఆశించబడుతుందో మీకు తెలిస్తే, మీరు సిద్ధంగా ఉండి, అవసరమైనప్పుడు సరైన మొత్తంలో పన్నును వసూలు చేయవచ్చు.

  • మీ ఆదాయం నుండి మీరు దేన్ని మినహాయించవచ్చు - కొన్ని ప్రాంతాలు వివిధ స్థాయిల వ్యాపారాలకు వ్యాపార పన్ను రాయితీలను ఇస్తాయి. మీరు మీ వ్యాపారాన్ని హోమ్ ఆఫీస్ నుండి నిర్వహిస్తుంటే, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ లేదా ఆఫీసు ఫర్నిచర్ వంటి మీ ఇంటి నుండి మీ వ్యాపారాన్ని నిర్వహించడానికి ఉపయోగించే నిర్దిష్ట వస్తువుల ఖర్చులను మినహాయించగలుగుతారు.

    మీ ఆదాయం నుండి మీరు దేన్ని మినహాయించగలరో తెలుసుకోవడం వల్ల సరైన పన్నులు చెల్లించడంలో, స్థానిక పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండటంలో సహాయపడుతుంది.