డ్రాప్‌షిప్పింగ్ కోసం షిప్పింగ్ వ్యూహాలు

డ్రాప్‌షిప్పింగ్ వ్యాపారాలు ఉత్పత్తులను స్వయంగా రవాణా చేయనప్పటికీ, సాధారణంగా వాటికి ఇంకా తమ సరఫరాదారుల నుండి షిప్పింగ్ రుసుములు ఛార్జ్ చేయబడతాయి. ఈ షిప్పింగ్ రుసుములను పరిష్కరించడానికి డ్రాప్‌షిప్పింగ్ వ్యాపారాలు వివిధ వ్యూహాల నుండి ఎంచుకోవచ్చు:

  • ఉచిత షిప్పింగ్‌ను అందించడం మరియు తమ లాభాల నుండి షిప్పింగ్ ఖర్చులను భరించడం
  • ఉచిత షిప్పింగ్‌ను అందించడం మరియు తమ ఉత్పత్తుల ధరను పెంచడం
  • తక్కువ ఫ్లాట్ షిప్పింగ్ రేటును వసూలు చేయడం మరియు ఉత్పత్తుల ఖర్చును కొద్దిగా పెంచడం
  • కస్టమర్ నుండి ఫ్లాట్ షిప్పింగ్ రేటును వసూలు చేయడం
  • షిప్పింగ్ ఖర్చు ఎంతైతే అంతే మొత్తాన్ని కస్టమర్ నుండి వసూలు చేయడం

వ్యాపారాలు విభిన్న ఉత్పత్తుల కోసం ప్రతి-ఐటెమ్ షిప్పింగ్ రేట్లు వంటి విభిన్న వ్యూహాలను కూడా ఎంచుకోవచ్చు.

ఉచిత షిప్పింగ్

మీ కస్టమర్‌లకు ఉచిత షిప్పింగ్‌ను అందించడం వల్ల ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి:

  • మార్కెటింగ్ అవకాశాలు
  • సులభతరమైన షిప్పింగ్ సెటప్
  • కస్టమర్ ఆర్డర్ చేసే అవకాశం పెరగడం

మీ సరఫరాదారు మీకు ఉచిత షిప్పింగ్‌ను అందిస్తున్నట్లయితే, ఆ ఉచిత షిప్పింగ్‌ను మీ కస్టమర్‌లకు బదిలీ చేయడం ఒక మంచి ఆలోచన కాగలదు. మీ సరఫరాదారు ఉచిత షిప్పింగ్‌ను అందించనట్లయితే, మీరు షిప్పింగ్ ఖర్చును మీ ఉత్పత్తి ధరల్లో చేర్చవచ్చు లేదా మీ లాభాల నుండి ఆ షిప్పింగ్ ఖర్చును భరించవచ్చు.

మీ ఉత్పత్తుల ఖర్చులో షిప్పింగ్‌ను చేర్చడం అనేది మీ కస్టమర్‌లకు ముందస్తు ఖర్చును అందించడంలో మీకు సహాయపడుతుంది. ఇలా చేసే చాలా వ్యాపారాలు షిప్పింగ్ కూడా ఇందులో చేర్చబడిందని ప్రకటిస్తాయి. ముందుగానే పూర్తి ధరను తెలుసుకోవడం వల్ల, మీ చెక్‌అవుట్‌లో ఎలాంటి దాచిన రుసుములు ఉండవని కస్టమర్‌లు నమ్మకంగా ఉండటానికి సహాయపడుతుంది.

సింగిల్ ఫ్లాట్ షిప్పింగ్ రేటు

మీ కస్టమర్‌లకు సింగిల్ ఫ్లాట్ షిప్పింగ్ రేటును అందించడం వల్ల ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి:

  • మార్కెటింగ్ అవకాశాలు
  • మీ స్వంత షిప్పింగ్ ఖర్చులను భర్తీ చేయడంలో సహాయపడుతుంది
  • కస్టమర్ ఆర్డర్ చేసే అవకాశం పెరగడం

ఏ ఆర్డర్‌కైనా ఫ్లాట్ షిప్పింగ్ రుసుము ఉంటుందని ప్రకటించడం ద్వారా, మీ చెక్‌అవుట్‌లో దాచిన రుసుములు ఏవీ లేవని కస్టమర్‌లకు తెలియజేస్తుంది.

ఏదైనా వారం రోజుల్లో మీకు వచ్చే ఆర్డర్‌లను అంచనా వేయడం ద్వారా మీరు షిప్పింగ్ కోసం ఎంత ఛార్జీ విధించాలో నిర్ణయించవచ్చు. మీరు మీ సరఫరాదారు విధించే అన్ని షిప్పింగ్ రుసుములను జోడించి, ఆ షిప్పింగ్ మొత్తాన్ని ఆర్డర్‌ల సంఖ్యతో భాగించినట్లయితే, మీ షిప్పింగ్ ఖర్చులను కవర్ చేయడానికి ప్రతి ఆర్డర్‌పై ఎంత ఫ్లాట్ రేటును ఛార్జీ విధించాలో మీకు తెలుస్తుంది.

ఉదాహరణ

ఉదాహరణ షిప్పింగ్ ఖర్చులు
ఉత్పత్తిప్రతి ఐటెమ్‌కి షిప్పింగ్ ఖర్చుఅంచనా వేసిన ఆర్డర్‌ల సంఖ్యఅంచనా వేసిన మొత్తం షిప్పింగ్ ఖర్చు
ప్లేట్$54$20
బౌల్$44$16
మగ్$410$40
మొత్తాలు18$66

స్టోర్ 18 ఆర్డర్‌లను పొందుతుందని అంచనా వేస్తోంది, మొత్తం షిప్పింగ్ ఖర్చు $66 ఉంటుంది. మొత్తం షిప్పింగ్ ఖర్చులను కవర్ చేయడానికి, స్టోర్ ప్రతి ఆర్డర్‌కు $3.67 ($66 / 18) ఫ్లాట్ షిప్పింగ్ రుసుమును విధించాలి.

అంచెల వారీగా ఉండే ఫ్లాట్ రేట్‌లు

మీ కస్టమర్‌లకు అంచెల వారీగా ఉండే ఫ్లాట్ షిప్పింగ్ రేట్‌లను అందించడం వలన కింది ప్రయోజనాలు కలుగుతాయి:

  • మీ స్వంత షిప్పింగ్ ఖర్చులను భర్తీ చేయడంలో సహాయపడుతుంది
  • ఆర్డర్ చేసిన వాటి ఆధారంగా మరింత ఖచ్చితమైన షిప్పింగ్ రేట్‌లు
  • పెద్ద ఆర్డర్‌లపై తగ్గింపుతో కూడిన షిప్పింగ్‌ను అందించే అవకాశం

ధర లేదా బరువు ఆధారంగా విలువల శ్రేణికి వర్తించేలా మీరు ప్రతి షిప్పింగ్ రేటును సెట్ చేయవచ్చు. ఉదాహరణకు, కార్ట్‌ల ధరలు $0-$9.99, $10-$29.99 మధ్య మరియు $30 కంటే ఎక్కువగా ఉన్న వాటి కోసం మీరు మూడు షిప్పింగ్ రేట్‌లను సృష్టించవచ్చు.

ఉదాహరణకు, మీరు ప్రత్యేకమైన స్టిక్కీ నోట్ పేపర్‌లను విక్రయిస్తున్నారని అనుకుందాం. ఒక ప్యాక్‌ను రవాణా చేయడానికి మీ సరఫరాదారు మీ నుండి $1 ఛార్జ్ చేస్తారు, ఇంకా ఆర్డర్‌లోని ప్రతి అదనపు ప్యాక్‌కు $0.25 ఛార్జ్ చేస్తారు. మీరు ప్రతి ప్యాక్ బరువును ఒకేలా సెట్ చేస్తే, ఉదాహరణకు 1 పౌండ్, అప్పుడు ఆర్డర్ బరువు ఆధారంగా మీరు వేర్వేరు షిప్పింగ్ ఖర్చులను సెట్ చేయవచ్చు. 1 ప్యాక్, లేదా 1 పౌండ్ ఉన్న ఆర్డర్‌ల కోసం, మీరు $1 ఛార్జ్ చేయవచ్చు. 2-5 ప్యాక్‌లు, లేదా 2-5 పౌండ్ల ఆర్డర్‌ల కోసం, మీరు $2 ఛార్జ్ చేయవచ్చు. 6-10 ప్యాక్‌లు ఉండే ఆర్డర్‌ల కోసం, మీరు $4 ఛార్జ్ చేయవచ్చు. ఇది సరఫరాదారు నుండి మీరు పొందే షిప్పింగ్ పొదుపులను మీ కస్టమర్‌లకు బదిలీ చేయడంలో సహాయపడుతుంది.

ఒక్కో ఐటెమ్ షిప్పింగ్ రేట్‌లు

మీ కస్టమర్‌లకు ప్రతి ఐటెమ్ ఆధారంగా షిప్పింగ్ రేట్‌లను అందించడం వలన కింది ప్రయోజనాలు కలుగుతాయి:

  • మీ స్వంత షిప్పింగ్ ఖర్చులను పూర్తిగా భర్తీ చేయవచ్చు
  • ఆర్డర్ చేసిన దాని ఆధారంగా అత్యంత ఖచ్చితమైన షిప్పింగ్ రేట్‌లు
  • పెద్ద ఆర్డర్‌లపై తగ్గింపుతో కూడిన షిప్పింగ్‌ను అందించే అవకాశం

మీ సరఫరాదారులు ప్రతి ఉత్పత్తికి ఫ్లాట్ రుసుమును ఛార్జ్ చేసి, అధిక-పరిమాణంలో కొనుగోలు చేసినా ఎలాంటి తగ్గింపు అందించనట్లయితే, ప్రతి ఐటెమ్‌కి షిప్పింగ్ రేట్లు షిప్పింగ్ ఖర్చులను ఖచ్చితంగా ఉంచడంలో సహాయపడతాయి ఇంకా పెద్ద ఆర్డర్‌ల వల్ల వచ్చే లాభాల నష్టాన్ని నిరోధిస్తాయి. తగిన షిప్పింగ్ రేట్‌లను కలిగి ఉన్న షిప్పింగ్ ప్రొఫైల్‌కు మీరు ప్రతి ఉత్పత్తిని జోడించవచ్చు. చెక్‌అవుట్ వద్ద, మొత్తం షిప్పింగ్ ఖర్చును అందించడానికి కార్ట్‌లోని ఉత్పత్తుల అన్ని షిప్పింగ్ రేట్లు కలపబడతాయి.

ఉదాహరణకు, మీరు AA మరియు AAA బ్యాటరీలను విక్రయిస్తున్నారని అనుకుందాం. AA బ్యాటరీల ప్రతి ప్యాక్‌ను షిప్పింగ్ చేయడానికి $3 ఖర్చవుతుంది మరియు ప్రతి AAA బ్యాటరీల ప్యాక్‌ను రవాణా చేయడానికి $2 ఖర్చవుతుంది. మీరు ప్రతి సైజ్ బ్యాటరీకి మరియు తగిన షిప్పింగ్ రేట్ల కోసం ఒక షిప్పింగ్ ప్రొఫైల్‌ను సృష్టించవచ్చు. మీరు ఒక షిప్పింగ్ ప్రొఫైల్‌లో AA బ్యాటరీల కోసం $3 రేటును మరియు మరొకదానిలో AAA బ్యాటరీల కోసం $2 రేటును తయారు చేసినట్లయితే, ఒక్కో ప్యాక్‌ను కలిపి చేసే ఒక ఆర్డర్ వల్ల కస్టమర్ చెక్‌అవుట్ వద్ద $5 షిప్పింగ్ రేటును చూస్తారు.

అనేక విభిన్న ప్రొఫైల్‌లకు చెందిన ఉత్పత్తులను కలిగి ఉన్న ఆర్డర్‌లను మీ స్టోర్ స్వీకరిస్తే, ఒక్కో ఐటెమ్ షిప్పింగ్ సంక్లిష్టంగా మారుతుంది. మరింత సమాచారం కోసం, కంబైన్డ్ షిప్పింగ్ రేట్‌లను పరిశీలించండి.

అడ్వాన్స్‌డ్ షిప్పింగ్ రేటు ఉదాహరణ

మీ సరఫరాదారు షిప్పింగ్ ఖర్చులను ఎలా నిర్ణయిస్తారనే దాని ఆధారంగా, మీ షిప్పింగ్ రేట్‌లను సెటప్ చేసేటప్పుడు పరిగణించవలసిన మరికొన్ని అంశాలు ఉండవచ్చు:

  • కొందరు సరఫరాదారులు వేర్వేరు దేశాలకు వేర్వేరు రేట్లను ఛార్జీ చేస్తారు.
  • ఒక ఆర్డర్‌లో సరఫరాదారులు విభిన్న షిప్పింగ్ రేట్లను వసూలు చేసే బహుళ ఐటెమ్‌లు ఉండవచ్చు.
  • కొందరు సరఫరాదారులు ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్ ఆప్షన్‌ను అందించవచ్చు.

మీ సరఫరాదారు మీకు కింది షిప్పింగ్ రుసుములను అందిస్తున్నారని అనుకోండి:

డ్రాప్‌షిప్పింగ్ సరఫరాదారు విధించే ఉదాహరణ షిప్పింగ్ ఖర్చులు
ఆర్డర్‌లోని ఉత్పత్తులుకెనడాకు బేస్ షిప్పింగ్ ఖర్చు*కెనడాకు ప్రతి అదనపు ఐటెమ్ ఖర్చుయునైటెడ్ స్టేట్స్‌కు బేస్ షిప్పింగ్ ధర*యునైటెడ్ స్టేట్స్‌కు ప్రతి అదనపు ఐటెమ్ ఖర్చు
ప్లేట్‌లు

స్టాండర్డ్: $5

ఎక్స్‌ప్రెస్: $11

స్టాండర్డ్: $2

ఎక్స్‌ప్రెస్: $2

స్టాండర్డ్: $3

ఎక్స్‌ప్రెస్: $8

స్టాండర్డ్: $1

ఎక్స్‌ప్రెస్: $2

బౌల్స్

స్టాండర్డ్: $4

ఎక్స్‌ప్రెస్: $9

స్టాండర్డ్: $1

ఎక్స్‌ప్రెస్: $2

స్టాండర్డ్: $2

ఎక్స్‌ప్రెస్: $6

స్టాండర్డ్: $1

ఎక్స్‌ప్రెస్: $2

మగ్‌లు

స్టాండర్డ్: $3

ఎక్స్‌ప్రెస్: $8

స్టాండర్డ్: $1

ఎక్స్‌ప్రెస్: $2

స్టాండర్డ్: $1.50

ఎక్స్‌ప్రెస్: $5

స్టాండర్డ్: $1

ఎక్స్‌ప్రెస్: $2

ప్లేట్‌లు మరియు బౌల్స్

స్టాండర్డ్: $7

ఎక్స్‌ప్రెస్: $13

స్టాండర్డ్: $2

ఎక్స్‌ప్రెస్: $3

స్టాండర్డ్: $6

ఎక్స్‌ప్రెస్: $11

స్టాండర్డ్: $1.50

ఎక్స్‌ప్రెస్: $2

ప్లేట్‌లు మరియు మగ్‌లు

స్టాండర్డ్: $6

ఎక్స్‌ప్రెస్: $11

స్టాండర్డ్: $2

ఎక్స్‌ప్రెస్: $2.50

స్టాండర్డ్: $5

ఎక్స్‌ప్రెస్: $9

స్టాండర్డ్: $1.50

ఎక్స్‌ప్రెస్: $2

బౌల్స్ మరియు మగ్‌లు

స్టాండర్డ్: $6

ఎక్స్‌ప్రెస్: $11

స్టాండర్డ్: $2

ఎక్స్‌ప్రెస్: $2.50

స్టాండర్డ్: $5

ఎక్స్‌ప్రెస్: $9

స్టాండర్డ్: $1.50

ఎక్స్‌ప్రెస్: $2

ప్లేట్‌లు, బౌల్స్, మరియు మగ్‌లు

స్టాండర్డ్: $8

ఎక్స్‌ప్రెస్: $15

స్టాండర్డ్: $2

ఎక్స్‌ప్రెస్: $2.50

స్టాండర్డ్: $6

ఎక్స్‌ప్రెస్: $13

స్టాండర్డ్: $1.50

ఎక్స్‌ప్రెస్: $2

*బేస్ ఖర్చులో "ఆర్డర్‌లోని ఉత్పత్తులు" నిలువు వరుసలో ఉన్న ప్రతి ఐటెమ్‌లలో ఒకదాన్ని షిప్పింగ్ చేసే ఖర్చు చేర్చబడింది.

మీ మార్కెట్ పరిశోధన ఆధారంగా, మీరు కింది ఆర్డర్‌లను అందుకుంటారని మరియు కింది షిప్పింగ్ రుసుములను చెల్లించాల్సి ఉంటుందని మీరు అంచనా వేస్తారు:

  • స్టాండర్డ్ షిప్పింగ్ ఉపయోగించి కెనడాకు 1 మగ్‌తో ఉన్న 5 ఆర్డర్‌లు: 5 x $3 = $15
  • ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్ ఉపయోగించి కెనడాకు 1 మగ్ కోసం 1 ఆర్డర్: 1 x $8 = $8
  • స్టాండర్డ్ షిప్పింగ్ ఉపయోగించి యునైటెడ్ స్టేట్స్‌కు 1 మగ్ కోసం 7 ఆర్డర్‌లు: 7 x $1.50 = $10.50
  • స్టాండర్డ్ షిప్పింగ్ ఉపయోగించి కెనడాకు 2 బౌల్స్ కోసం 2 ఆర్డర్‌లు: 2 x $5 = $10
  • ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్ ఉపయోగించి యునైటెడ్ స్టేట్స్‌కు 2 బౌల్స్ అలాగే 2 మగ్‌ల కోసం 1 ఆర్డర్: 1 x $13 = $13
  • స్టాండర్డ్ షిప్పింగ్ ఉపయోగించి కెనడాకు 4 ప్లేట్లు అలాగే 4 మగ్‌ల కోసం 4 ఆర్డర్‌లు: 4 x $18 = $72
  • స్టాండర్డ్ షిప్పింగ్ ఉపయోగించి యునైటెడ్ స్టేట్స్‌కు 2 ప్లేట్లు, 2 బౌల్స్ మరియు 2 మగ్‌ల కోసం 4 ఆర్డర్‌లు: 4 x $10.50 = $42

షిప్పింగ్ రుసుములలో $170.50 ఖర్చయ్యే 24 ఆర్డర్‌లను ఈ ఫలితాలు అంచనా వేస్తున్నాయి. మీ షిప్పింగ్ ఖర్చులను కవర్ చేయడానికి, ప్రతి ఆర్డర్‌కు మీరు షిప్పింగ్ కోసం $7.11 ఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

ఉచిత షిప్పింగ్‌ను ఆఫర్ చేయడం

మీరు ఉచిత షిప్పింగ్‌ను ఆఫర్ చేయాలనుకుంటే, అలాగే మీ ధరలో షిప్పింగ్ కూడా కలిసి ఉందని ప్రచారం చేయాలనుకుంటే, మీరు మీ ఉత్పత్తుల ధరల అంతటా $170.50 షిప్పింగ్ ఖర్చును పంపిణీ చేయవచ్చు. అంచనాల ఆధారంగా, మీరు 77 ఉత్పత్తులను విక్రయిస్తారు. మీ షిప్పింగ్ ఖర్చును కవర్ చేయడానికి మీ ప్రతి ఉత్పత్తి ధరకు $2.22 జోడించాల్సిన అవసరం ఉంటుంది.

అయితే, రెండు ఆర్డర్‌లకు ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్ అవసరమవుతుందని మీరు అంచనా వేస్తున్నారు కాబట్టి, కస్టమర్‌లకు రుసుముతో ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్‌ను ఆఫర్ చేయాలా లేదా అన్నింటికీ స్టాండర్డ్ షిప్పింగ్‌నే ఉంచాలా అని మీరు నిర్ణయించుకోవాలి.

మీరు ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్‌ను ఖర్చుతో ఆఫర్ చేస్తే, మీరు ముందుగా మీ స్టాండర్డ్ షిప్పింగ్‌ను మాత్రమే కవర్ చేసే ఖర్చును నిర్ణయించాలి, ఎందుకంటే మీ ఉత్పత్తుల ఖర్చును ఎంత పెంచాలో అది నిర్ణయిస్తుంది. స్టాండర్డ్ షిప్పింగ్ ఉన్న ఆర్డర్‌లలో కలిపి $149.50 షిప్పింగ్ ఖర్చుతో 72 ఉత్పత్తులు ఉన్నాయి. దీని అర్థం మీ షిప్పింగ్ ఖర్చులను కవర్ చేయడానికి మీరు మీ ఉత్పత్తి ధరలను $2.08 పెంచాలి.

ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్ ఉన్న రెండు ఆర్డర్‌లకు షిప్పింగ్ రుసుములలో మొత్తం $21 ఖర్చవుతుంది. ఈ ఆర్డర్‌లలో మొత్తం 5 ఉత్పత్తులు ఉంటాయి. స్టాండర్డ్ షిప్పింగ్‌ని ఆఫ్‌సెట్ చేయడానికి ఉత్పత్తి ధరలు ఇప్పటికే $2.08 మేర పెంచబడ్డాయి కాబట్టి, మొత్తం $21 ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్ రుసుములలోని $10.40 ఇప్పటికే లెక్కించబడింది. దీంతో ఆ రెండు ఎక్స్‌ప్రెస్ ఆర్డర్‌ల నుండి $10.60 వసూలు చేయాల్సి ఉంటుంది, అంటే మీ అంచనా ఖర్చులను కవర్ చేయడానికి మీరు ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్ కోసం $5.30 ఛార్జ్ చేయవచ్చు.

మీరు ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్‌ను ఆఫర్ చేయకూడదని నిర్ణయించుకుంటే, దానికి బదులుగా స్టాండర్డ్ షిప్పింగ్‌ని ఉపయోగించడానికి మీరు ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్ ఆర్డర్‌లన్నింటినీ మళ్లీ లెక్కించాలి. ఇప్పుడు మీ షిప్పింగ్ ఖర్చు మొత్తం $160.50 అవుతుంది, అంటే ఆ ఖర్చులను కవర్ చేయడానికి మీరు ప్రతి ఉత్పత్తికి $2.09 జోడించాల్సి ఉంటుంది.

ఒకే షిప్పింగ్ రేటును ఆఫర్ చేయడం

మీ సరఫరాదారు స్టాండర్డ్ అలాగే ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్‌ను ఆఫర్ చేస్తారు కాబట్టి, ఒక్కో ఆప్షన్ కోసం ఒకే ఫ్లాట్ రేట్‌ను ఆఫర్ చేయడం సమంజసం. అంచనాల ఆధారంగా, మీరు ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్‌తో 2 ఆర్డర్‌లను పొందుతారని ఆశిస్తున్నారు, దానికి మీకు మొత్తం $21 ఖర్చవుతుంది. అలాగే మీరు స్టాండర్డ్ షిప్పింగ్‌తో 22 ఆర్డర్‌లను ఆశిస్తున్నారు, దానికి $149.50 ఖర్చవుతుంది. మీ షిప్పింగ్ రుసుములను కవర్ చేయడానికి, ఎక్స్‌ప్రెస్ ఆర్డర్‌లకు $10.50 ఫ్లాట్ షిప్పింగ్ రుసుమును అలాగే స్టాండర్డ్ షిప్పింగ్ ఆర్డర్‌ల కోసం $6.80 ఫ్లాట్ రుసుమును మీరు ఛార్జ్ చేయాలి.

మీరు ప్రారంభంలో అంచనా వేసిన వాటికి బదులుగా మీ అసలు ఆర్డర్ నంబర్‌లు మరియు షిప్పింగ్ ఖర్చులను పరిగణనలోకి తీసుకునేలా మీ వ్యాపారం వృద్ధి చెందుతున్న కొద్దీ ఈ షిప్పింగ్ రేట్లను తరచుగా సర్దుబాటు చేయాల్సి రావచ్చు.

ఇంకా కచ్చితంగా ఉండటానికి, ఏ దేశం నుండి ఆర్డర్ చేయబడింది అనే దాని ఆధారంగా మీరు వేర్వేరు ఫ్లాట్ షిప్పింగ్ రేట్లను సృష్టించవచ్చు.

అంచెల షిప్పింగ్ రేట్లను ఆఫర్ చేయడం

మీ అంచనాలు తప్పు అయిన పక్షంలో మీ షిప్పింగ్ ఖర్చులను మరింత కచ్చితంగా ఉంచడానికి మీరు అంచెల ఫ్లాట్ రేట్లను కూడా ఆఫర్ చేయవచ్చు. మీరు బరువు లేదా ధర ఆధారంగా అంచెల ఫ్లాట్ రేట్లను ఆఫర్ చేయవచ్చని గుర్తుంచుకోండి. మీరు ప్రతి ఉత్పత్తి బరువును 1 lb ఉండేలా సెట్ చేసి, బరువు ఆధారంగా ఫ్లాట్ షిప్పింగ్ రేట్లను సృష్టిస్తే, మీరు ఒక్కో బరువుకు సగటు షిప్పింగ్ ఖర్చు ఎంత ఉంటుందో లెక్కించవచ్చు.

1 lb ఉన్న ఆర్డర్‌ల కోసం ఖర్చులు

1 lb ఉన్న ఆర్డర్‌ల కోసం ఖర్చులు
ఆర్డర్‌లోని ఉత్పత్తులుకెనడాకు షిప్పింగ్ ఖర్చుయునైటెడ్ స్టేట్స్‌కు షిప్పింగ్ ఖర్చు
1 ప్లేట్$5$3
1 బౌల్$4$2
1 మగ్$3$1.50

కెనడాకు 1 lb షిప్ చేయడానికి సగటు ఖర్చు $4 అలాగే యునైటెడ్ స్టేట్స్‌కు $2.17.

2 lb ఉన్న ఆర్డర్‌ల కోసం ఖర్చులు

2 lb ఉన్న ఆర్డర్‌ల కోసం ఖర్చులు
ఆర్డర్‌లోని ఉత్పత్తులుకెనడాకు షిప్పింగ్ ఖర్చుయునైటెడ్ స్టేట్స్‌కు షిప్పింగ్ ఖర్చు
2 ప్లేట్లు$7$4
2 బౌల్స్$5$3
2 మగ్‌లు$4$2.50
1 ప్లేట్ మరియు 1 బౌల్$7$6
1 ప్లేట్ మరియు 1 మగ్$6$5
1 బౌల్ మరియు 1 మగ్$6$5

కెనడాకు 2 lb షిప్ చేయడానికి సగటు ఖర్చు $5.84 అలాగే యునైటెడ్ స్టేట్స్‌కు $4.25.

మీరు 3 lb, 4 lb ఇంకా భారీ ఆర్డర్‌ల కోసం లెక్కలు వేయడం కొనసాగిస్తే, మీరు మరింత కచ్చితమైన షిప్పింగ్ రేట్లను సెట్ చేయవచ్చు, ఇది ఊహించని షిప్పింగ్ ఖర్చుల వల్ల వచ్చే లాభాల నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ప్రతి ఐటెమ్ షిప్పింగ్ ఖర్చులను ఆఫర్ చేయడం

ప్రతి ఉత్పత్తికి, మీరు ఒక షిప్పింగ్ ప్రొఫైల్‌ను సెటప్ చేయవచ్చు అలాగే ఆర్డర్ చేయబడిన ఉత్పత్తుల ఆధారంగా షిప్పింగ్ రేట్లను సెట్ చేయవచ్చు.

ఒక ఆర్డర్‌లో వేర్వేరు ప్రొఫైల్‌ల నుండి ఉత్పత్తులు ఉన్నప్పుడు, చెక్‌అవుట్‌లో వాటి షిప్పింగ్ రేట్లు కలపబడతాయి, దీని వల్ల మీ కస్టమర్‌లకు అధిక షిప్పింగ్ ఖర్చులు ఏర్పడవచ్చు. ఉదాహరణకు, మీరు $5 రేటుతో ప్లేట్‌ల కోసం షిప్పింగ్ ప్రొఫైల్‌ను అలాగే $4 రేటుతో బౌల్స్ కోసం షిప్పింగ్ ప్రొఫైల్‌ను సెటప్ చేస్తే, ఒక ప్లేట్ ఇంకా ఒక బౌల్‌తో చేసే చెక్‌అవుట్‌కు $9 షిప్పింగ్ రేటు అవుతుంది.

ప్రతి షిప్పింగ్ ప్రొఫైల్ కోసం మీ షిప్పింగ్ రేట్లను సెట్ చేయడానికి ఉన్న కనీస పద్ధతి ఏమిటంటే, కార్ట్‌లో ఇంకా ఏమేమి ఉన్నాయనే దానితో సంబంధం లేకుండా, ప్రొఫైల్‌లోని ఉత్పత్తుల సగటు ఖర్చును కనుగొనడం.

స్టాండర్డ్ షిప్పింగ్ ఉపయోగించి ప్లేట్లను కెనడాకు షిప్పింగ్ చేయడానికి అయ్యే ఖర్చు:

  • 1 ప్లేట్ = $5
  • 2 ప్లేట్లు = $7 ($5 + $2)
  • 3 ప్లేట్లు = $9 ($5 + $2 + $2)
  • 1 ప్లేట్ మరియు 1 బౌల్ = $3.5 ($7 x 0.5)
  • 2 ప్లేట్లు మరియు 1 బౌల్ = $6 ($9 x 0.66)
  • 3 ప్లేట్లు మరియు 1 బౌల్ = $8.25 ($11 x 0.75)
  • 1 ప్లేట్ మరియు 1 మగ్ = $3 ($6 x 0.5)
  • 2 ప్లేట్లు మరియు 1 మగ్ = $5.33 ($8 x 0.66)
  • 3 ప్లేట్లు మరియు 1 మగ్ = $7.50 ($10 x 0.75)

ఎన్ని ప్లేట్లను షిప్పింగ్ చేయడానికైనా సగటు ఖర్చు $6.04 అవుతుంది.

స్టాండర్డ్ షిప్పింగ్ ఉపయోగించి బౌల్స్‌ని కెనడాకు షిప్పింగ్ చేయడానికి అయ్యే ఖర్చు:

  • 1 బౌల్ = $4
  • 2 బౌల్స్ = $5 ($4 + $1)
  • 3 గిన్నెలు = $6 ($4 + $1 + $1)
  • 1 గిన్నె మరియు 1 ప్లేట్ = $3.5 ($7 * .5)
  • 2 గిన్నెలు మరియు 1 ప్లేట్ = $6 ($9 * .66)
  • 3 గిన్నెలు మరియు 1 ప్లేట్ = $8.25 ($11 * .75)
  • 1 గిన్నె మరియు 1 మగ్ = $3.5 ($7 * .5)
  • 2 గిన్నెలు మరియు 1 మగ్ = $6 ($9 * .66)
  • 3 గిన్నెలు మరియు 1 మగ్ = $8.25 ($11 * .75)

ఎన్ని గిన్నెలను షిప్పింగ్ చేయడానికైనా అయ్యే సగటు ఖర్చు $5.55

స్టాండర్డ్ షిప్పింగ్ ఉపయోగించి కెనడాకు మగ్‌లను షిప్పింగ్ చేయడానికి అయ్యే ఖర్చు:

  • 1 మగ్ = $3
  • 2 మగ్‌లు = $4 ($3 + $1)
  • 3 మగ్‌లు = $5 ($3 + $1 + $1)
  • 1 మగ్ మరియు 1 ప్లేట్ = $3 ($6 * .5)
  • 2 మగ్‌లు మరియు 1 ప్లేట్ = $5.33 ($8 * .66)
  • 3 మగ్‌లు మరియు 1 ప్లేట్ = $7.50 ($10 * .75)
  • 1 మగ్ మరియు 1 గిన్నె = $3.5 ($7 * .5)
  • 2 మగ్‌లు మరియు 1 గిన్నె = $6 ($9 * .66)
  • 3 మగ్‌లు మరియు 1 గిన్నె = $8.25 ($11 * .75)

ఎన్ని మగ్‌లను షిప్పింగ్ చేయడానికైనా అయ్యే సగటు ఖర్చు $5.07

ఈ నంబర్‌ల ఆధారంగా, కెనడా కోసం ఆశించిన ప్రతి ఆర్డర్‌పై మీరు కింది లాభాలను పొందుతారు:

  • స్టాండర్డ్ షిప్పింగ్ ఉపయోగించి కెనడాకు 1 మగ్ చొప్పున 5 ఆర్డర్‌లు: $25.35 - $15 = $10.35 లాభం
  • స్టాండర్డ్ షిప్పింగ్ ఉపయోగించి కెనడాకు 2 గిన్నెల చొప్పున 2 ఆర్డర్‌లు: $11.10 - $10 = $1.10 లాభం
  • స్టాండర్డ్ షిప్పింగ్ ఉపయోగించి కెనడాకు 4 ప్లేట్‌లు మరియు 4 మగ్‌ల చొప్పున 4 ఆర్డర్‌లు: $44.44 - $72 = $27.56 నష్టం

ఒక్కో వస్తువు షిప్పింగ్‌ను సమర్థవంతంగా ఉపయోగించడానికి, బరువు లేదా ధరపై ఆధారపడిన అంచెల షిప్పింగ్ రేట్‌లను మీరు ప్రతి షిప్పింగ్ ప్రొఫైల్‌కు జోడించాల్సి ఉంటుంది.

ఒక్కో వస్తువు షిప్పింగ్ గురించిన మరిన్ని ఉదాహరణల కోసం, కంబైన్డ్ షిప్పింగ్ రేట్‌లును చూడండి.