డ్రాప్‌షిప్పింగ్ ఫీచర్‌లు
డ్రాప్‌షిప్పింగ్ అనేది సెటప్ చేయడానికి సులభంగా ఉంటుంది మరియు ప్రారంభించడానికి ఎక్కువ ఖర్చు కానందున, ఇది వ్యాపారంలోకి ప్రవేశించడానికి ప్రారంభకులకు అనువైన మార్గంగా కొన్నిసార్లు పరిగణించబడుతుంది. అయినప్పటికీ, చాలా పెద్ద మరియు విజయవంతమైన వ్యాపారాలకు ఉత్పత్తులను సోర్స్ చేయడానికి డ్రాప్‌షిప్పింగ్ అనేది సాధారణంగా వినియోగించే పద్ధతి.
డ్రాప్‌షిప్పింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, అయితే సంభావ్య లోపాలు మరియు వాటిని ఎలా నివారించాలో తెలుసుకోవడం మీ వ్యాపారం విజయవంతం కావడానికి సహాయపడుతుంది. సరైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి మీరు డ్రాప్‌షిప్పింగ్ ఫీచర్‌లను తెలుసుకున్నారని నిర్ధారించుకోండి.
డ్రాప్‌షిప్పింగ్ ఫీచర్‌లు
| ఫీచర్ | ప్రయోజనాలు | లోపాలు |
|---|---|---|
| ప్రారంభించడం సులభం |
ప్రారంభించడానికి తక్కువ సమయం పడుతుంది మీకు గైడ్ చేయడానికి అనేక రిసోర్స్‌లు ఉన్నాయి |
మరింత పోటీ |
| తక్కువ స్టార్ట్-అప్ ఖర్చులు |
గిడ్డంగి, ఇన్వెంటరీ లేదా పరిశోధన ఖర్చులు ఉండవు మీ వ్యాపారాన్ని మార్కెట్ చేయడానికి మరియు ప్రమోట్ చేయడానికి మరిన్ని నిధులు అందుబాటులో ఉంటాయి |
మరింత పోటీ |
| విస్తృత శ్రేణి ఉత్పత్తులు |
మీరు ఏమి విక్రయించాలనుకుంటున్నారో కనుగొనడం సులభం మీరు అందించే ఉత్పత్తులను మార్చడం సులభం |
మీ వ్యాపారం కోసం ఒక ఫోకస్‌ను ఎంచుకోవడం కష్టం కావచ్చు |
| చేతిలో ఇన్వెంటరీ ఉండదు |
స్టోరేజీ లేదా గిడ్డంగి ఖర్చులు ఉండవు |
తక్కువ నాణ్యత నియంత్రణ బ్రాండింగ్‌పై తక్కువ నియంత్రణ |
| మీరే స్వయంగా ఉత్పత్తులను రవాణా చేయాల్సిన అవసరం లేదు |
ప్యాకేజింగ్ చేయడానికి లేదా లేబుల్‌లను ప్రింట్ చేయడానికి సమయం వెచ్చించాల్సిన పని లేదు |
బహుళ సరఫరాదారుల ఉత్పత్తులను కలిగి ఉన్న ఆర్డర్‌లు వేర్వేరు సమయాల్లో చేరుతాయి |
ప్రారంభించడం సులభం
డ్రాప్‌షిప్పింగ్ ఆకర్షణీయంగా ఉండటానికి ఒక కారణం ఏమిటంటే, దీనిని సెటప్ చేయడం సులభంగా ఉంటుంది. ప్రారంభంలో, మీరు ఉత్పత్తులను ఎంచుకుని, వాటిని ఎక్కడ విక్రయించాలి మరియు మార్కెట్ చేయాలో కనుగొనాలి, ఆపై ఆర్డర్ చేయడానికి కస్టమర్‌ను పొందాలి. మీరు ఒక సేల్ చేసిన తర్వాత, మిగతా పనులన్నీ మీ సరఫరాదారు చూసుకుంటారు.
డ్రాప్‌షిప్పింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడం సులభం కాబట్టి, పోటీ కూడా సులభంగా ఏర్పడుతుంది. వ్యాపారాలు తరచుగా అతి తక్కువ ధరను అందించడానికి పోటీ పడతాయి కాబట్టి ఎక్కువ పోటీ సాధారణంగా తక్కువ లాభాల మార్జిన్‌లకు దారితీస్తుంది.
మరింత సమాచారం కోసం, మీ ప్రయోజనానికి నిధులు సమకూర్చుకోండి చూడండి.
తక్కువ స్టార్ట్-అప్ ఖర్చులు
డ్రాప్‌షిప్పింగ్ వ్యాపార ప్రారంభ ఖర్చులు సాధారణంగా తక్కువగా ఉంటాయి. ఇన్వెంటరీ, వేర్‌హౌసింగ్, పరిశోధన మరియు అభివృద్ధి లేదా రిటైల్ స్థలానికి సంబంధించిన ఖర్చులు ఏవీ ఉండవు. ఇది మీ ప్రయత్నాలను మార్కెటింగ్ మరియు మీ కస్టమర్‌ల కోసం మంచి కొనుగోలు అనుభవాన్ని సృష్టించడంపై ఫోకస్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
తక్కువ స్టార్ట్-అప్ ఖర్చులు కూడా ఎక్కువ పోటీకి దారితీస్తాయి. మీకు ఎక్కువ పోటీ ఉన్నప్పుడు, మీరు తక్కువ ఆర్డర్‌లను స్వీకరిస్తారు మరియు పోటీలో నిలబడటానికి మీ ధరలను తరచుగా తగ్గించాల్సి ఉంటుంది.
మరింత సమాచారం కోసం, మీ ప్రయోజనానికి నిధులు సమకూర్చుకోండి చూడండి.
విస్తృత శ్రేణి ఉత్పత్తులు
డ్రాప్‌షిప్పింగ్ సేవలతో, మీ స్టోర్‌కు జోడించడానికి మీకు వేలాది ఉత్పత్తులకు యాక్సెస్ ఉంటుంది. మీరు విక్రయించడానికి ఎంచుకున్న ఉత్పత్తులను మీ ప్రొడక్ట్ లైన్ అని అంటారు. మీకు విస్తృత శ్రేణి ఉత్పత్తులకు యాక్సెస్ ఉన్నప్పుడు, ఏ సమయంలోనైనా మీ ప్రొడక్ట్ లైన్‌ను మార్చడం సులభం, ఇది మార్కెట్ ట్రెండ్‌లకు మరియు కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌కు త్వరగా ప్రతిస్పందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
అయితే, మీ ప్రొడక్ట్ లైన్‌కు చాలా విభిన్న ఉత్పత్తులను జోడించడం వల్ల మీ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. చాలా సందర్భాలలో, మీరు విక్రయించడానికి ఎంచుకునే ఉత్పత్తుల రకాలకు ఒక ఫోకస్ లేదా ఒక నిర్దిష్ట (niche) స్థానాన్ని కలిగి ఉండటం మంచిది.
మరింత సమాచారం కోసం, ఉత్పత్తులను తెలివిగా ఎంచుకోండి చూడండి.
చేతిలో ఇన్వెంటరీ ఉండదు
మీరు మీరే ఇన్వెంటరీని ఆర్డర్ చేసి, స్టాక్ చేయాల్సిన అవసరం లేనప్పుడు, మీరు గిడ్డంగి ఖర్చులను ఆదా చేసి, వెంటనే విక్రయించడం ప్రారంభించవచ్చు. మీరు గిడ్డంగులతో అకౌంట్‌లను సెటప్ చేయాల్సిన అవసరం లేదు లేదా మీ ఉత్పత్తులను ఎలా ప్యాకేజీ చేయాలో నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. సరఫరాదారులే మీ కోసం స్టోరింగ్, ప్యాకేజింగ్ అంతా చేస్తారు.
దీనిలో ప్రతికూలత ఏమిటంటే, మీ ఉత్పత్తుల నాణ్యత, ప్యాకేజింగ్ బ్రాండింగ్ లేదా ఆర్డర్ ప్రాసెసింగ్ వేగంపై మీకు ఎలాంటి నియంత్రణ ఉండదు. ఇవి సానుకూల సమీక్షలను పొందడానికి, కస్టమర్‌లు తిరిగి రావడానికి సహాయపడతాయి, ఇవి మీ వ్యాపారానికి చాలా ముఖ్యమైనవి.
మరింత సమాచారం కోసం, సరఫరాదారులను తెలివిగా ఎంచుకోండిని చూడండి.
ఉత్పత్తులను మీరే రవాణా చేయాల్సిన అవసరం లేదు
వ్యాపారాన్ని నిర్వహించడంలో షిప్పింగ్ అనేది సంక్లిష్టమైన భాగం కావచ్చు. ఉత్పత్తులను మీరే షిప్పింగ్ చేయడానికి బదులుగా సరఫరాదారుని ఉపయోగించడం ద్వారా, మీరు చాలా సమయాన్ని ఆదా చేయవచ్చు. మీ సరఫరాదారులు షిప్పింగ్ క్యారియర్‌లతో చర్చలు జరిపిన షిప్పింగ్ తగ్గింపుల నుండి కూడా మీరు ప్రయోజనం పొందవచ్చు.
అయితే, మీరు ఆదా చేసే సమయం, డబ్బులు పెద్ద ఆర్డర్‌లను హ్యాండిల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వృధా కావచ్చు. ఉదాహరణకు, మీరు వివిధ సరఫరాదారుల నుండి ఉత్పత్తులను కలిగి ఉన్న ఆర్డర్‌ను పొందినట్లయితే, మీరు ప్రతి ఉత్పత్తికి ప్రతి సరఫరాదారుకు షిప్పింగ్ ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఒకవేళ ఆ ఉత్పత్తులు మీ చేతిలో ఉన్నవి అయితే, మీరు వాటన్నింటినీ ఒకే బాక్స్‌లో ప్యాకేజీ చేసి కేవలం ఒక షిప్పింగ్ ఖర్చును మాత్రమే చెల్లించవచ్చు.
మరింత సమాచారం కోసం, ఉత్పత్తులను మీ స్వంత లొకేషన్‌కు ఆర్డర్ చేయండిని చూడండి.
ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోండి
డ్రాప్‌షిప్పింగ్ వ్యాపారాన్ని ప్రారంభించే ఎవరైనా ఈ ప్రయోజనాలను పొందుతారు, అయితే వాటిని మీరు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా నిర్ధారించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
మీ వ్యాపారాన్ని ముందుగానే లాంచ్ చేయండి
కస్టమర్‌లకు మీ వ్యాపారాన్ని చూపే ముందు అది పర్ఫెక్ట్‌గా ఉండేలా వేచి ఉండాలనుకోవడం సాధారణమే. అయితే, ఎంత త్వరగా మీరు వ్యాపారాన్ని సెటప్ చేయగలరు అనేది డ్రాప్‌షిప్పింగ్ ప్రధాన ప్రయోజనం.
మీరు కస్టమర్‌లకు మీ వ్యాపారాన్ని ఎంత త్వరగా చూపితే, అంత త్వరగా మీరు ఫీడ్‌బ్యాక్ పొందుతారు, మీ తప్పుల నుండి నేర్చుకుంటారు, మీ వ్యాపారాన్ని మరింత మెరుగుపరుచుకోగలరు. ఉదాహరణకు, మీరు ఉత్పత్తి కలెక్షన్‌లను, మీ ప్రధాన మెనూని సెటప్ చేయడానికి ఎక్కువ సమయం వెచ్చించవచ్చు, కానీ మీ కస్టమర్‌లు మీ ఉత్పత్తులను పూర్తిగా భిన్నమైన మార్గంలో బ్రౌజ్ చేస్తున్నారని మీరు కనుక్కుంటే వాటన్నింటినీ మళ్లీ చేయాల్సి వస్తుంది.
మీ కస్టమర్‌ల నుండి ఫీడ్‌బ్యాక్ లేకుండా మీ వ్యాపారానికి ఏది ఉత్తమమో తెలుసుకోవడం కష్టం. మీరు మీ వ్యాపారాన్ని ముందుగానే లాంచ్ చేస్తే, మీ కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌తో పాటు మీరు నేర్చుకున్న పాఠాలను దృష్టిలో ఉంచుకుని మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలరు.
మీ ప్రయోజనానికి నిధులు సమకూర్చండి
మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి తక్కువ ఖర్చు అవ్వడం అంటే, మీ పోటీదారుల కంటే మెరుగైన వ్యాపారాన్ని నిర్మించడానికి మీరు ఆదా చేసిన కొన్ని నిధులను ఉపయోగించవచ్చని అర్థం. "నా పోటీదారుల నుండి నన్ను విభిన్నంగా నిలబెట్టేది ఏమిటి?" అని మిమ్మల్ని మీరు అడగాల్సిన మంచి ప్రశ్న. దీని గురించి మీరు ఇంతకు ముందు ఆలోచించకపోతే సమాధానం చెప్పడం కష్టంగా ఉండవచ్చు, కానీ మీ పోటీదారుల కంటే ప్రయోజనం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి:
అదనపు కంటెంట్ - మీ కస్టమర్‌లకు అదనపు విలువను అందించేలా, మీ ఉత్పత్తుల గురించి బ్లాగ్ పోస్ట్‌లను మీరే సృష్టించవచ్చు లేదా ఒక కంటెంట్ క్రియేటర్‌కు చెల్లించి రాయించవచ్చు. వీటిలో మీ ఉత్పత్తులను ఎలా ఉపయోగించాలనే చిట్కాలు, మీ ఉత్పత్తుల సమీక్షలు లేదా మీ ఉత్పత్తుల కేటగిరీకి సంబంధించిన సాధారణ సమాచారం ఉండవచ్చు.
ఉదాహరణకు, మీరు కాఫీ మెషీన్‌లను విక్రయిస్తున్నట్లయితే, ప్రతి కాఫీ మెషీన్ గురించిన సమీక్షలు, అలాగే ఏ మెషీన్ ఏ రకమైన వ్యక్తికి సరైన మ్యాచ్‌గా ఉంటుందనేది మంచి బ్లాగ్ సిరీస్ కావచ్చు. విశ్వసనీయత, విలువ, పరిమాణం, గంటకు అది చేయగల కాఫీ కప్పుల సంఖ్య వంటి మీ స్వంత ప్రమాణాలను సృష్టించడం వలన, మీ కస్టమర్‌లు మీ వ్యాపారం నుండి కొనుగోలు చేయడంలో మరింత నమ్మకంగా ఉండటానికి సహాయపడుతుంది. ఒక యూనివర్సిటీ విద్యార్థికి త్వరగా ఎక్కువ కాఫీని చేయగల చౌకైన మెషీన్ కావాలి, అయితే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు తమ చిన్న ఆఫీసులో రోజును ప్రారంభించడానికి ఒక కప్పు అద్భుతమైన కాఫీ కావాలి.
సరఫరాదారులకు ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్ - పోటీ స్థాయిని తగ్గించుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, కేవలం కొన్ని వ్యాపారాలు మాత్రమే కొనుగోలు చేయగల సరఫరాదారులకు లేదా కొన్ని వ్యాపారాలు మాత్రమే విక్రయించగల ట్రేడ్‌మార్క్ చేయబడిన ఉత్పత్తులకు యాక్సెస్ పొందడం. వారు ఉత్పత్తులను కొనుగోలు చేయగల ఏకైక ప్రదేశాలలో మీది కూడా ఒకటి కాబట్టి తిరిగి వచ్చే కస్టమర్‌లను పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది.
ఉదాహరణకు, చిన్నదైనా నమ్మకమైన ఫాలోయింగ్ ఉన్న టీవీ షోకి సంబంధించిన కంటెంట్‌ని కలిగి ఉన్న ఉత్పత్తులను మీరు విక్రయించాలనుకుంటే, అందులో ఉన్న పాత్రలతో కూడిన ఉత్పత్తులను విక్రయించడానికి మీరు ఆ టీవీ షో నుండి లైసెన్స్‌ను పొందవచ్చు. ఈ లైసెన్స్‌ను పొందడం కష్టంగా ఉండవచ్చు, కానీ దీని అర్థం మీకు ఎక్కువ మంది పోటీదారులు ఉండరు, మార్కెట్‌పై మీకు ఎక్కువ నియంత్రణ ఉంటుంది.
గొప్ప కొనుగోలు అనుభవం - మీ పోటీ నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడానికి ఒక మంచి మార్గం మీ కస్టమర్‌లకు ఉత్తమ అనుభవాన్ని అందించడమే. కస్టమర్ మీ స్టోర్ నుండి తమకు కావాల్సిన వాటిని కనుగొనగలిగితే, మీ నుండి కొనుగోలు అనుభవాన్ని ఆస్వాదిస్తే, వారు మళ్లీ మీ నుండి కొనుగోలు చేయడానికి, తమ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
మిమ్మల్ని మీరు అడగాల్సిన కొన్ని మంచి ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి:
- కస్టమర్‌లు వెతుకుతున్న ఉత్పత్తులను కనుగొనడం సులభంగా ఉందా?
- వ్యాపారాన్ని సంప్రదించడం సులభమేనా?
- ఉత్పత్తి వివరాలు, ఉత్పత్తి సమీక్షలు, డెలివరీ సమయాలు, షిప్పింగ్ ఖర్చులు, స్టోర్ విధానాలను కనుగొనడం సులభంగా ఉందా?
- వివిధ రకాల చెల్లింపు ఎంపికలు అందుబాటులో ఉన్నాయా?
- ట్రాకింగ్ నంబర్ అందించబడిందా?
- అందించిన డెలివరీ సమయంలోనే ఉత్పత్తి చేరుకుంటుందా?
- కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా?
మార్కెటింగ్‌పై దృష్టి పెట్టండి
రెండు వ్యాపారాలు ఒకే విధమైన ఉత్పత్తులను విక్రయించవచ్చు, కానీ తమ ఉత్పత్తులను మార్కెట్ చేసే వ్యాపారం విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ వ్యాపారం యొక్క ఆన్‌లైన్ ఉనికిని నిర్మించిన తర్వాత, డ్రాప్‌షిప్పింగ్ వ్యాపారం మార్కెటింగ్‌పై దృష్టి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
మీ కస్టమర్‌లను కనుగొనడం కష్టం కావచ్చు, అందుకే సాధ్యమైనన్ని విభిన్న రకాల మార్కెటింగ్‌లను ప్రయత్నించడం ముఖ్యం. మీకు సహాయం చేయడానికి Shopify అనేక వనరులను అందిస్తుంది, అలాగే మీ కస్టమర్‌లను కనుగొనడంలో మీకు సహాయపడేలా Shopify App Storeలో అనేక యాప్‌లు రూపొందించబడ్డాయి:
ప్రతికూలతలను నివారించండి
డ్రాప్‌షిప్పింగ్‌లో కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, వాటిని చాలా వరకు నివారించవచ్చు. ఈ ప్రతికూలతలను నివారించడంలో సహాయపడే కింది వ్యూహాలను సమీక్షించండి.
ఉత్పత్తులను తెలివిగా ఎంచుకోండి
మీ ప్రొడక్ట్ లైన్ కోసం ఉత్పత్తులను ఎంచుకోవడం కష్టంగా ఉండవచ్చు, ఇది కొన్ని వ్యాపారాలు సాధ్యమైనన్ని విభిన్న ఉత్పత్తులను విక్రయించేలా చేస్తుంది. ఈ వ్యూహం పని చేయవచ్చు, కానీ చాలా సందర్భాల్లో ఇది సహాయం చేయడం కంటే వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది.
సాధ్యమయ్యే ప్రతి ఉత్పత్తిని విక్రయించడం చుట్టూ ఒక వ్యాపార బ్రాండ్‌ను నిర్మించడం కష్టం. ఎందుకంటే ఇంటర్నెట్‌లో ఇప్పటికే స్థాపించబడిన మార్కెట్‌ప్లేస్‌లు ఉన్నాయి, ఇక్కడ మీరు భారీ రకాల ఉత్పత్తులను కనుగొనవచ్చు, మీరు ప్రతి కస్టమర్ అంచనాలను అందుకోవడం అసంభవం.
అంతేకాకుండా, తమ యూజర్‌లకు మీ వ్యాపారాన్ని ఎప్పుడు చూపాలో ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్‌లు తెలుసుకోవడం కష్టం. ఏ థీమ్ లేదా వాటిని కనెక్ట్ చేసే కీవర్డ్ లేకుండా మీరు 100 విభిన్న ఉత్పత్తులను కలిగి ఉంటే, కస్టమర్‌లకు మీ వ్యాపారాన్ని ఎప్పుడు చూపాలో సెర్చ్ ఇంజిన్‌కు తెలియదు.
సెర్చ్‌కు సరిపోలే ఒకటి లేదా రెండు ఉత్పత్తులు మీ వద్ద ఉన్నప్పటికీ, మరొక వ్యాపారం వారి మొత్తం వ్యాపారాన్ని ఆ కీవర్డ్‌ల పైనే దృష్టి పెట్టవచ్చు, దీంతో వారి వ్యాపారం మీకంటే ముందే చూపబడుతుంది. మీరు దృష్టి పెట్టే మూడు లేదా నాలుగు కీవర్డ్‌లు మాత్రమే మీ వద్ద ఉంటే, మీ స్టోర్ దేనిని విక్రయిస్తుందో సెర్చ్ ఇంజిన్‌లకు ఖచ్చితంగా తెలుస్తుంది, ఎవరైనా ఆ కీవర్డ్‌లను సెర్చ్ చేసినప్పుడు మీ వ్యాపారాన్ని చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఉదాహరణకు, డార్మ్ రూమ్‌ని అలంకరించాల్సిన విద్యార్థుల కోసం మీ వద్ద విస్తృత శ్రేణి ఉత్పత్తులు ఉండవచ్చు. వారికి వంటగది పాత్రలు, సాధారణ ఫర్నీచర్, గోడ అలంకరణలు, అలాగే పాఠశాల సామాగ్రి అవసరం. ఈ రకమైన ఉత్పత్తుల కోసం చూస్తున్నప్పుడు ఏ కీవర్డ్‌లు ఎక్కువగా సెర్చ్ చేయబడ్డాయో చూడటానికి, మీరు అప్పుడు Google Trends వంటి ప్రసిద్ధ కీవర్డ్ టూల్‌ని ఉపయోగించవచ్చు.
సరఫరాదారులను తెలివిగా ఎంచుకోండి
మీ వ్యాపారంలో ఎక్కువ భాగాన్ని సరఫరాదారులు హ్యాండిల్ చేస్తారు. అంటే సరఫరాదారు నాణ్యత అనేది మీ స్వంత వ్యాపార నాణ్యతను ప్రభావితం చేస్తుందని అర్థం. చెడ్డ అనుభవానికి కారణం మీరు కాకుండా మీ సరఫరాదారు అయినప్పటికీ, కస్టమర్‌కు చెడ్డ అనుభవం కలిగితే వారు మీ వ్యాపారం నుండి మళ్లీ ఆర్డర్ చేసే అవకాశం ఉండదు.
సంభావ్య సరఫరాదారుల సమీక్షలను, వారి విధానాలను మీరు చదవాలి, అలాగే వారి నాణ్యతను అంచనా వేయడానికి వారితో మాట్లాడాలి. పేరున్న సరఫరాదారులతో పని చేయడం వలన మీరు మంచి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తారు, మీ ఆర్డర్‌లకు అదనపు బ్రాండింగ్ జోడించబడదు, మీ ఆర్డర్‌లు త్వరగా ప్రాసెస్ చేయబడతాయి.
ఉత్పత్తులను మీ స్వంత లొకేషన్‌కు ఆర్డర్ చేయండి
డ్రాప్‌షిప్పింగ్ ప్రయోజనాల్లో ఒకటి మీ సరఫరాదారు ఇన్వెంటరీని మేనేజ్ చేయడం అయినప్పటికీ, మీరు మీ స్వంత లొకేషన్‌కు కొన్ని ఉత్పత్తులను ఆర్డర్ చేయడాన్ని పరిగణించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి:
ఉత్పత్తుల నాణ్యతను మీరే స్వయంగా నిర్ధారించుకోండి: ఉత్పత్తి సమీక్షలు మీకు ఉత్పత్తి నాణ్యతను తెలిపే మంచి సూచికను అందిస్తాయి, కానీ మీరు స్వయంగా చూసే వరకు దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోలేరు. అలాగే, మీరు ఉత్పత్తి ప్యాకేజింగ్‌ను చూడవచ్చు మరియు సరఫరాదారు తమ స్వంత ప్రచార సామగ్రిని జోడించారో లేదో కూడా తెలుసుకోవచ్చు.
పెద్ద ఆర్డర్‌లను మీరే స్వయంగా షిప్పింగ్ చేయడం: ఒక కస్టమర్ అనేక మంది వేర్వేరు సరఫరాదారుల నుండి ఉత్పత్తులను ఆర్డర్ చేసిన సందర్భాల్లో, మీరు ప్రతి సరఫరాదారుకు ఒక షిప్పింగ్ రుసుమును చెల్లించాలి. మీ వద్ద ఇప్పటికే ఆ ఉత్పత్తులు ఉన్నట్లయితే, మీరు వాటన్నింటినీ ఒకే బాక్స్‌లో ఉంచి, ఉత్పత్తులను మీ కస్టమర్‌కు చేర్చడానికి కేవలం ఒక షిప్పింగ్ ఖర్చును మాత్రమే చెల్లించవచ్చు. ఒకవేళ మీరు ఈ పద్ధతిని ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీకు మీరే ఉత్పత్తులను ఆర్డర్ చేసుకునేటప్పుడు ఉచిత షిప్పింగ్ అందిస్తారేమో కనుక్కోవడానికి మీ సరఫరాదారుని సంప్రదించడం మంచి వ్యూహం.
మీ కస్టమర్ ఆర్డర్ ప్రాసెస్‌ను అనుభవించండి: కస్టమర్‌లు మీ స్టోర్ నుండి ఆర్డర్ చేసినప్పుడు వారు ఎటువంటి విధానాలను అనుభవిస్తారో మీరు చూడాలి. మీ సరఫరాదారులు ఎంత త్వరగా ఆర్డర్‌లను ప్రాసెస్ చేస్తారనేది అర్థం చేసుకోవడం ద్వారా, కస్టమర్‌లకు పంపే మీ ఆర్డర్ నోటిఫికేషన్ ఇమెయిల్‌లలో సరైన అంచనాలను సెట్ చేయడంలో సహాయపడుతుంది.
ఉదాహరణకు, మీ సరఫరాదారు ఆర్డర్‌ను ప్రాసెస్ చేయడానికి 4-6 రోజులు పడుతుందని మీరు గమనిస్తే, మీ ఆర్డర్ నిర్ధారణ ఇమెయిల్‌లలో 4-6 రోజుల్లో షిప్పింగ్ నిర్ధారణ ఇమెయిల్ వస్తుందని మీరు కస్టమర్‌లకు తెలియజేయవచ్చు. కస్టమర్‌లు మీ వ్యాపారం నుండి ఆర్డర్ చేస్తున్నప్పుడు నమ్మకంగా భావించేలా, మీరు ఎల్లప్పుడూ వారికి ఆర్డర్ గురించి తగినంత సమాచారాన్ని అందించాలి.