వెండర్ సమాచారాన్ని నిర్వహించడం

వెండర్‌లు మీరు విక్రయించే ఉత్పత్తుల మూలాన్ని లేదా పంపిణీ స్థానాన్ని సూచిస్తారు. మీరు మీ ఉత్పత్తులన్నింటినీ మీరే తయారుచేసుకుంటే, మీరే ఏకైక వెండర్ అవుతారు. ఒకవేళ మీరు వివిధ మూలాల నుండి ఉత్పత్తులను విక్రయిస్తుంటే, వెండర్ సమాచారాన్ని నిర్వహించడం ద్వారా అది మీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఇన్వెంటరీ మూలాలను ట్రాక్ చేయడానికి, మీ మొత్తం విక్రయాల వ్యూహాన్ని ఆప్టిమైజ్ చేయడానికి సహాయపడుతుంది.

మీ ఉత్పత్తులకు సంబంధించి వెండర్ మీరైనా కావచ్చు లేదా మరొక వ్యాపారి అయినా కావచ్చు. ఉదాహరణకు, మీరు తేనెను విక్రయిస్తూ ఉండి, మీ స్వంత తేనె ఉత్పత్తులను చేతితో తయారుచేస్తుంటే, అన్ని ఐటెమ్‌లకు మీరే వెండర్‌గా వ్యవహరిస్తారు. ఒకవేళ మీరు బహుళ పొలాల నుండి తేనె ఇన్వెంటరీని తీసుకువస్తుంటే, మీరు తేనెను కొనుగోలు చేసే ప్రతి పొలం మీ సిస్టమ్‌లో ప్రత్యేకమైన వెండర్‌గా మారుతుంది.

ఉత్పత్తులను ఆర్గనైజ్ చేయడం, క్రమబద్ధీకరించడం, ఫిల్టర్ చేయడంతో పాటుగా వెండర్‌ల ఆధారంగా నివేదికలను రూపొందించడం లాంటి పనులను క్రమబద్ధీకరించడానికి మీరు మీ Shopify అడ్మిన్‌లో వెండర్ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. మీరు ప్రత్యేకంగా ఉత్పత్తుల తయారీని చూసుకున్నా లేదా వివిధ సరఫరాదారులతో కలిసి పనిచేసినా, వెండర్ వివరాలను ఆర్గనైజ్ చేయడం వల్ల అది మీ వ్యాపార కార్యకలాపాల గురించిన విలువైన ఇన్‌సైట్‌లను అందిస్తుంది.

వెండర్ సమాచారాన్ని నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు

Shopifyలో మీ ఉత్పత్తి డేటాను సాధ్యమైనంత వరకు పూర్తిగా, సమగ్రంగా ఉంచడంతో పాటుగా, వెండర్ సమాచారాన్ని జోడించడం వల్ల కింది ప్రయోజనాలు కూడా ఉంటాయి:

  • ఇన్వెంటరీ ట్రాకింగ్: నిర్దిష్ట ఉత్పత్తులకు వెండర్‌లను లింక్ చేయడం ద్వారా, ప్రతి ఐటెమ్‌ను ఏ వెండర్ సరఫరా చేస్తున్నారో మీరు ట్రాక్ చేయవచ్చు. జనాదరణ పొందిన ఇన్వెంటరీ ఐటెమ్‌లను రీస్టాక్ చేయడానికి, అలాగే సరఫరాదారులతో సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ సమాచారం అవసరం.
  • పనితీరు మూల్యాంకనం: ఉత్పత్తులకు వెండర్‌లను కేటాయించడం వలన విక్రయాల ట్రెండ్‌లను విశ్లేషించడానికి, ప్రతి వెండర్ పనితీరును అంచనా వేయడానికి వీలవుతుంది. ఉత్పత్తి విక్రయాల ఆధారంగా కమీషన్‌లు లేదా ప్రోత్సాహకాల గురించిన సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ డేటా మీకు సహాయపడుతుంది.

అడ్మిన్‌లో ఉత్పత్తి వెండర్‌లను ఉపయోగించడం

మీ Shopify అడ్మిన్‌లోని ప్రతి ఉత్పత్తి వివరాల పేజీలో గల ఉత్పత్తి ఆర్గనైజేషన్ విభాగంలో మీరు వెండర్‌లను సృష్టించవచ్చు, అలాగే వారిని ఉత్పత్తులకు కేటాయించవచ్చు. వెండర్ సమాచారాన్ని సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో చెప్పే ఉదాహరణలు కింద ఇవ్వబడ్డాయి:

  • వెండర్‌లను కేటాయించడం: ప్రతి ఉత్పత్తిని ఒక వెండర్‌కు కేటాయించవచ్చు. కొత్త ఉత్పత్తికి వెండర్‌ను కేటాయించనట్లయితే, అప్పుడు వెండర్ ఫీల్డ్ డిఫాల్ట్‌గా మీ స్టోర్ పేరును చూపిస్తుంది.
  • క్రమబద్ధీకరించడం మరియు ఫిల్టర్ చేయడం: ఉత్పత్తుల జాబితాను క్రమబద్ధీకరించడానికి, ఫిల్టర్ చేయడానికి, అలాగే వెండర్‌ల ఆధారంగా కస్టమ్ రిపోర్ట్‌లను రూపొందించడానికి మీరు ఉత్పత్తి వెండర్ విలువను ఉపయోగించవచ్చు.
  • కస్టమర్‌లకు వెండర్‌లను ప్రదర్శించడం: మీరు మీ ఉత్పత్తి పేజీలలో వెండర్ ఫీల్డ్‌ను ఒక టెక్స్ట్ బ్లాక్‌తో ప్రదర్శించవచ్చు, అది డైనమిక్ సోర్స్‌గా వెండర్ ఫీల్డ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది.

వెండర్ వారీగా ఉత్పత్తులను క్రమబద్ధీకరించండి

మీ Shopify అడ్మిన్ ఉత్పత్తుల జాబితాలోని ఉత్పత్తులను అక్షర క్రమం లేదా రివర్స్-అక్షర క్రమంలో ఆర్గనైజ్ చేయడానికి వెండర్ క్రమబద్ధీకరణ ఎంపికను ఉపయోగించి మీరు ఉత్పత్తుల జాబితాను క్రమబద్ధీకరించవచ్చు. ఈ క్రమబద్ధీకరణ ఫీచర్ అనేది మీ ఆన్‌లైన్ స్టోర్‌లోని ఉత్పత్తుల ప్రదర్శన క్రమాన్ని ప్రభావితం చేయదు. ఉత్పత్తుల కోసం వెతకడం, మీ ఉత్పత్తుల జాబితాను ఫిల్టర్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఉత్పత్తులుకి వెళ్లండి.

  2. వెండర్ నిలువు వరుస టైటిల్‌ను క్లిక్ చేయండి.

వెండర్ వారీగా ఉత్పత్తులను ఫిల్టర్ చేయండి

డిఫాల్ట్‌గా, మీ ఉత్పత్తులన్నీ ఉత్పత్తులు జాబితాలో ప్రదర్శించబడతాయి. మీ ఉత్పత్తుల జాబితాలో నిర్దిష్ట వెండర్‌తో అనుబంధించబడిన ఉత్పత్తులను మాత్రమే ప్రదర్శించడానికి మీరు ఉత్పత్తి వెండర్ ఫిల్టర్‌ను ఉపయోగించవచ్చు. ఉత్పత్తుల కోసం వెతకడం, మీ ఉత్పత్తుల జాబితాను ఫిల్టర్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఉత్పత్తులుకి వెళ్లండి.

  2. searchfilter ఐకాన్‌ను క్లిక్ చేయండి.

  3. ఉత్పత్తి వెండర్ మెనూను క్లిక్ చేయండి.

  4. మీరు లిస్ట్‌లో ప్రదర్శించాలనుకుంటున్న వెండర్‌లను ఎంచుకోండి.

  5. ఆప్షనల్: మీ వెండర్‌లను ఆల్ఫాబెటికల్ లేదా రివర్స్-ఆల్ఫాబెటికల్ క్రమంలో క్రమబద్ధీకరించడానికి, వెండర్ నిలువు వరుస టైటిల్‌పై క్లిక్ చేయండి.

  6. ఆప్షనల్: ఈ వీక్షణను సేవ్ చేయడానికి, సేవ్ చేసిన వీక్షణకు పేరును ఎంటర్ చేయడానికి ఇలా సేవ్ చేయండిని క్లిక్ చేసి, ఆపై వీక్షణను సేవ్ చేయండిని క్లిక్ చేయండి.

వెండర్ ఆధారంగా మీ రిపోర్ట్‌లను క్రమబద్ధీకరించండి, ఫిల్టర్ చేయండి

మీరు Shopify అడ్మిన్‌లో వెండర్ ఆధారంగా మీ రిపోర్ట్‌లను క్రమబద్ధీకరించవచ్చు, ఫిల్టర్ చేయవచ్చు. ప్రతి రకమైన రిపోర్ట్ ఉత్పత్తి-కేంద్రీకృత డేటాను ప్రదర్శించనందున, అన్ని రకాల రిపోర్ట్‌లు ఉత్పత్తి వెండర్‌ను అందుబాటులో ఉన్న ఫిల్టర్‌గా చేర్చవు. ఉదాహరణకు, ఎక్విజిషన్, బిహేవియర్ రిపోర్ట్‌లను వెండర్‌ల ఆధారంగా క్రమబద్ధీకరించలేము లేదా ఫిల్టర్ చేయలేము.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, అనలిటిక్స్ > రిపోర్ట్‌లుకు వెళ్లండి.

  2. మీరు వెండర్ ఆధారంగా ఫిల్టర్ చేయాలనుకుంటున్న రిపోర్ట్‌ను క్లిక్ చేయండి.

  3. నిలువు వరుసల ఐకాన్‌ను క్లిక్ చేసి, రిపోర్ట్‌లో దాన్ని నిలువు వరుసగా ప్రదర్శించడానికి ఉత్పత్తి వెండర్‌ను ఎంచుకోండి.

  4. ఆప్షనల్: ఆల్ఫాబెటికల్ లేదా రివర్స్-ఆల్ఫాబెటికల్ క్రమంలో వెండర్ ఆధారంగా మీ రిపోర్ట్ డేటాను క్రమబద్ధీకరించడానికి, ఉత్పత్తి వెండర్ నిలువు వరుస టైటిల్‌ను క్లిక్ చేయండి.

  5. ఆప్షనల్: వెండర్ ఆధారంగా మీ రిపోర్ట్ డేటాను ఫిల్టర్ చేయడానికి, ఫిల్టర్‌ల ఐకాన్‌ను క్లిక్ చేసి, ఆపై ఉత్పత్తి వెండర్‌ను ఫిల్టర్‌గా ఎంచుకోండి. ఒక నిర్దిష్ట వెండర్‌ను చేర్చడానికి లేదా మినహాయించడానికి ఫిల్టర్‌ను సర్దుబాటు చేసి, ఆపై ఫిల్టర్‌లను వర్తింపజేయండిని క్లిక్ చేయండి.

వెండర్‌లను బల్క్ ఎడిట్ చేయండి

ఇతర ఉత్పత్తి సమాచారం మాదిరిగానే, మీరు బల్క్ ఎడిటర్ లేదా CSV ఫైల్ ఉపయోగించి మీ ఉత్పత్తుల వెండర్ సమాచారాన్ని బల్క్‌లో ఎడిట్ చేయవచ్చు.

మీ ఆన్‌లైన్ స్టోర్‌లో ఉత్పత్తి వెండర్‌లను ప్రదర్శించడం

కస్టమర్‌లు మీరు విక్రయించే ఏదైనా నిర్దిష్ట వెండర్ లేదా బ్రాండ్ ఉత్పత్తుల కోసం వెతకాలనుకున్నప్పుడు, మీ ఆన్‌లైన్ స్టోర్‌లో ఉత్పత్తి వెండర్ సమాచారాన్ని ప్రదర్శించడం వారికి ఉపయోగకరంగా ఉంటుంది.

Shopify రూపొందించిన అన్ని థీమ్‌లలో, కింది విధాలుగా విభాగాలను లేదా బ్లాక్‌లను ఉపయోగించి మీరు వివిధ పేజీ టెంప్లేట్‌లలో వెండర్ సమాచారాన్ని ప్రదర్శించవచ్చు:

  • ఉత్పత్తుల గ్రిడ్‌లోని ప్రతి ఉత్పత్తికి వెండర్ సమాచారాన్ని ప్రదర్శించడానికి, ఫీచర్ చేయబడిన సేకరణ విభాగంలో, వెండర్‌ను చూపుని ఎంచుకోండి.
  • ఫీచర్ చేయబడిన ఉత్పత్తి విభాగంలో, టెక్స్ట్ బ్లాక్‌ని జోడించి, ఆపై డైనమిక్ సోర్స్‌ని కనెక్ట్ చేయి ఐకాన్‌ను క్లిక్ చేయండి. ఫీచర్ చేయబడిన ఉత్పత్తికి వెండర్‌ను డైనమిక్‌గా ప్రదర్శించడానికి వెండర్‌ను ఎంచుకోండి.

థర్డ్-పార్టీ థీమ్‌ల కోసం, మీరు మీ థీమ్ మద్దతు డాక్యుమెంటేషన్‌ను చూడాలి లేదా థీమ్ డెవలపర్‌ను సంప్రదించాలి. మీ థీమ్‌కు మద్దతును ఎక్కడ కనుగొనాలో అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

ఇతర Shopify ఫీచర్‌లలోని వెండర్‌లు

వెండర్ అనే పదం ఇతర Shopify ఫీచర్‌లలో ఉపయోగించబడుతుంది, అలాగే అది మీ ఉత్పత్తి వివరాలలోని వెండర్ ఫీల్డ్‌కు కచ్చితంగా సంబంధం కలిగి ఉండకపోవచ్చు. వెండర్‌లను సూచించే ఇతర కొన్ని Shopify ఫీచర్‌లలో ఇవి ఉన్నాయి:

  • Shopify Bill Pay: నిర్దిష్ట ప్రాంతాలలోని స్టోర్‌లు ఇన్‌వాయిస్‌లను నిల్వ చేయగలవు, అలాగే మీరు నేరుగా Shopify అడ్మిన్‌లో ఎవరి దగ్గరైతే ఇన్వెంటరీ లేదా సేవలను కొనుగోలు చేస్తారో ఆ వెండర్‌లకు చెల్లించగలవు. ఈ వెండర్‌లు మీ Shopify అడ్మిన్‌లోని మీ ఉత్పత్తుల లిస్ట్‌తో అనుబంధించబడరు. Shopify Bill Pay ద్వారా వెండర్‌లను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
  • Stocky: Shopify POS కోసం Stocky అనేది మీ Shopify అడ్మిన్ నుండి ఉత్పత్తి వెండర్‌లను ఆటోమేటిక్‌గా దిగుమతి చేస్తుంది, అయితే మీరు సరఫరాదారులు అని పిలవబడే మరింత వివరణాత్మక వెండర్ ప్రొఫైల్‌లను సృష్టించడానికి యాప్‌ను ఉపయోగించవచ్చు. ఉత్పత్తులకు బహుళ సరఫరాదారులను కేటాయించవచ్చు కాబట్టి, Stockyలో సరఫరాదారులను సృష్టించడం వలన మీ ఇన్వెంటరీపై మీకు మరింత నియంత్రణ లభిస్తుంది. Stockyలోని వెండర్‌లు, సరఫరాదారుల గురించి మరింత తెలుసుకోండి.
  • Shopify B2B: మీరు టోకు వ్యాపారి అయ్యి, మీ కస్టమర్‌లు వెండర్‌లైతే, మీరు వారిని కంపెనీల వలె సెటప్ చేయవచ్చు, అలాగే మీ ఉత్పత్తుల కోసం వారికి ప్రత్యేకమైన ధరల కేటలాగ్‌లను కేటాయించవచ్చు. Shopify B2B అనేది Basic, Grow, Advanced, అలాగే Plus ప్లాన్‌లలో అందుబాటులో ఉంది. B2B కంపెనీల గురించి మరింత తెలుసుకోండి.