మీ ఉత్పత్తి లైనప్‌ను తాత్కాలికంగా మార్చడం
విక్రయించే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు ఎదురైనప్పుడు, పరిస్థితిలోని కొత్త అవసరాలకు, వాస్తవాలకు అనుగుణంగా మీ ఉత్పత్తి లైనప్‌ను మార్చుకోవడాన్ని పరిగణించండి.
ఈ పేజీలో
కొత్త అవసరాలను తీర్చండి
చాలా మంది వ్యక్తులు వారికి అలవాటైన పరిస్థితులలో కాకుండా చాలా భిన్నమైన పరిస్థితిలో ఉంటూ, కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కస్టమర్‌ల కొత్త అవసరాలకు అనుగుణంగా మీ ఉత్పత్తులను ఎలా మార్చుకోవచ్చో పరిశీలించండి:
- నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి లేదా వినోదాన్ని అందించడానికి మీ ఉత్పత్తుల్లో దేనినైనా మార్చుకోవచ్చా?
- అద్దెలు లేదా తక్కువ షిప్పింగ్ రేట్ల ద్వారా మీ ఉత్పత్తులకు యాక్సెస్‌ను చౌకగా చేయవచ్చా?
- కుటుంబ కార్యక్రమాల కోసం మీ ఉత్పత్తులను మార్చుకోవచ్చా లేదా పిల్లలకు వినోదాన్ని అందించగలవా?
- మీ ఉత్పత్తులను హోమ్ ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగించవచ్చా లేదా ఇంటి నుండి పని చేయడాన్ని మరింత ఆనందదాయకంగా మార్చవచ్చా?
- వ్యక్తుల మధ్య కనెక్షన్‌ని ఏర్పరచడానికి మీ ఉత్పత్తులను ఉపయోగించవచ్చా?
కొత్త అవసరాన్ని తీర్చడం లక్ష్యంగా చేసుకుని కొత్త ఉత్పత్తి లైనప్‌ను రూపొందించండి
కస్టమర్‌ల నుండి వచ్చే కొత్త అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఉండే సరికొత్త ఉత్పత్తులను సృష్టించడాన్ని పరిశీలించండి. మీ బిజినెస్‌కు దేనినైనా అనుకూలంగా మార్చుకోవచ్చో లేదో చెక్ చేయడానికి కింది ఉదాహరణలను రివ్యూ చేయండి:
- మీది బట్టల బిజినెస్ అయితే, మీరు ఇంట్లో ఉండే వ్యక్తుల కోసం కొత్త బట్టల లైనప్‌ను రూపొందించవచ్చు. ఉదాహరణకు, వీడియో మీటింగ్‌ల కోసం ప్రొఫెషనల్‌గా కనిపించాల్సిన, కానీ కంఫర్టబుల్‌గా ఉండాలనుకునే వ్యక్తుల కోసం కొత్త దుస్తుల లైనప్‌ను రూపొందించండి.
- మీది గార్డెన్ సెంటర్ అయితే, కింద పేర్కొన్న వాటిని లక్ష్యంగా చేసుకుని కొత్త ఉత్పత్తి లైనప్‌లను సృష్టించడాన్ని పరిశీలించండి:
- పిల్లలు పెంచడానికి లేదా మెయింటైన్ చేయడంలో సహాయం చేయడానికి అనువైన మొక్కలు
- హోమ్ ఆఫీస్‌లకు అనువైన, పెంపుడు జంతువులకు హాని చేయని మొక్కలు
- సులభంగా పెంచగలిగే మూలికలు లేదా కూరగాయల వంటి హోమ్ కిచెన్‌లో సహాయపడే మొక్కలు
- మీరు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉత్పత్తులను విక్రయిస్తుంటే, మీరు టూ-ఫర్-వన్ ప్రొడక్ట్ ఆఫర్‌ను అందించవచ్చు, దీని ద్వారా కస్టమర్‌లు రెండవ ఉత్పత్తిని అందుకోవడానికి స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడిని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, మీరు పజిల్స్ విక్రయిస్తుంటే, కస్టమర్ ఒకటి తమకోసం కొనుగోలు చేసి, మరొకటి స్నేహితుడికి పంపేలా చేయండి, దీనివల్ల వారిద్దరూ సరదాగా పోటీ పడుతూ పజిల్స్ సాధించవచ్చు.
మీ ఉత్పత్తులు లేదా సేవలను అద్దె ప్రాతిపదికన అందించండి
వీలైతే, మీ పరికరాలు లేదా ఉత్పత్తులలో కొన్నింటిని మీ కస్టమర్‌లకు అద్దెకు తీసుకోనివ్వండి. మీ బిజినెస్‌కు దేనినైనా అనుకూలంగా మార్చుకోవచ్చో లేదో చెక్ చేయడానికి కింది ఉదాహరణలను రివ్యూ చేయండి:
- మీరు లీజర్ వస్తువుల దుకాణ యజమాని అయితే, మీరు మీ పరికరాలలో కొన్నింటిని రోజువారీ, వారపు లేదా నెలవారీ ప్రాతిపదికన అద్దెకు ఇవ్వవచ్చు. ఉదాహరణకు, మీరు సైకిళ్లను విక్రయిస్తున్నట్లయితే, సరదా యాక్టివిటీలకు తాత్కాలికంగా ఎక్కువ సమయం ఉండి, కొత్త సైకిల్ కొనడానికి తగినన్ని డబ్బులు లేని వ్యక్తులకు మీరు సైకిళ్లను అద్దెకు ఇవ్వవచ్చు.
- ఒకవేళ మీది ఫర్నీచర్ స్టోర్ అయితే, కస్టమర్‌లు కొత్త ఫర్నీచర్‌ని ప్రయత్నించడానికి లేదా తాత్కాలికంగా కొత్త స్పేస్‌లను ఏర్పాటు చేసుకోవడానికి ఉత్పత్తులను అద్దెకు ఇచ్చే విషయాన్ని పరిశీలించండి. ఉదాహరణకు, మీరు ఆఫీస్ ఫర్నీచర్ విక్రయిస్తున్నట్లయితే, ఇంటి నుండి తాత్కాలికంగా పని చేయాల్సిన వారి కోసం హోమ్ ఆఫీస్ సెట్‌లను అద్దెకు ఇచ్చే విషయాన్ని పరిశీలించండి.
- ఒకవేళ మీది ఒక సేవ లాగా ప్రత్యేక ఉత్పత్తులకు యాక్సెస్ అందించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించే వ్యాపారం అయితే, మీరు ఉత్పత్తులను కస్టమర్‌లకు అద్దెకు ఇవ్వవచ్చు. ఉదాహరణకు, మీది ఒక బోర్డ్ గేమ్‌ల కేఫ్ అయితే, మీరు వ్యక్తులకు మీ బోర్డ్ గేమ్‌లను అద్దెకు ఇవ్వవచ్చు, అలాగే బోర్డ్ గేమ్ పికప్ లేదా డెలివరీ సమయంలో బేవరేజీలు లేదా ఆహారాన్ని కూడా అందించవచ్చు.
మీ ఉత్పత్తులలో కొన్నింటిని రూపొందించడానికి లేదా రీక్రియేట్ చేయడానికి కిట్‌లను ఆఫర్ చేయండి
కస్టమర్‌లు మీ ఉత్పత్తులలో కొన్నింటిని ఇంట్లో రీక్రియేట్ చేసుకునేలా ఉత్పత్తి కిట్‌లు మరియు ట్యుటోరియల్‌లను ఆఫర్ చేయండి. ఏవైనా మీ వ్యాపారానికి అనుకూలంగా ఉంటాయేమో చెక్ చేయడానికి కింది ఉదాహరణలను రివ్యూ చేయండి:
- మీరు రెస్టారెంట్ లేదా ఫుడ్ బిజినెస్ యజమాని అయితే, కస్టమర్‌లు మీ బ్రిక్-అండ్-మోర్టార్ లొకేషన్‌కు రాలేని పరిస్థితుల్లో వారు ఇంట్లోనే చేసుకోగలిగే ప్రత్యేకమైన డ్రింక్‌లు, డెజర్ట్‌లు, అపెటైజర్‌లు లేదా మెయిన్ కోర్స్‌ల కోసం మీరు ఉచిత లేదా చవకైన వంటకాలను అందించవచ్చు. ఉదాహరణకు, మీకు బాగా ప్రసిద్ధమైన పాస్తా వంటకం ఉన్నట్లయితే, ఇంట్లో ఆ వంటకాన్ని ఎలా తయారు చేయాలనే రెసిపీతో పాటు దానికి అవసరమైన పాస్తా సాస్‌ను మీరు డెలివరీ చేయవచ్చు, అలాగే పిల్లలు ఏ విధంగా సహాయపడగలరు అనే దానికి సంబంధించి ఆప్షనల్ దశలను కూడా అందించవచ్చు.
- ఒకవేళ మీరు ఆర్టిస్ట్ అయితే, కస్టమర్‌లు వీడియోలు లేదా దశలవారీ ట్యుటోరియల్‌ల ద్వారా వాళ్ల స్వంత కళాఖండాలను రూపొందించుకోవడానికి మీరు కిట్‌లను విక్రయించవచ్చు. ఉదాహరణకు, మీరు పెయింటింగ్‌లను విక్రయిస్తున్నట్లయితే, పెయింట్ ఉండే చిన్న కంటైనర్‌లు, ఒకటి లేదా రెండు పెయింట్‌బ్రెష్‌లు, అలాగే మీ శైలిలో ఏదైనా పెయింట్ చేయడానికి సంబంధించిన ఒక వీడియో ట్యుటోరియల్ ఉన్న కిట్‌ను విక్రయించండి.
- ప్రత్యేకమైన అనుభవాన్ని ఆఫర్ చేసే వ్యాపారం మీకు ఉన్నట్లయితే, వ్యక్తులు ఇంట్లోనే ఆ అనుభవాన్ని రీక్రియేట్ చేసుకోగలిగే కిట్‌ను మీరు విక్రయించవచ్చు. ఉదాహరణకు, మీరు మినీయేచర్ గోల్ఫ్ వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే, వ్యక్తులు ఇంట్లో ఏర్పాటు చేసుకోగలిగే కొన్ని కోర్స్‌లను డిజైన్ చేయండి, ఇంకా ఇండోర్ లేదా అవుట్‌డోర్ ఆటకు వీలుగా ఉండే సరదా అడ్డంకులు, చవకైన గోల్ఫ్ బాల్స్ మరియు చవకైన గోల్ఫ్ క్లబ్‌లతో ఒక కిట్‌ను విక్రయించండి.