3D మోడల్‌లను సృష్టించడానికి Shopify భాగస్వామిని నియమించుకోవడం
Shopify భాగస్వాములు అనేవారు, Shopify స్టోర్‌లను సృష్టించడం మరియు అప్‌డేట్ చేయడం గురించి విస్తృతమైన పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పరిశ్రమ నిపుణులు. మీ ఆన్‌లైన్ స్టోర్ కోసం 3D మోడల్‌లను సృష్టించడంలో సహాయం పొందడానికి, మీరు Shopify భాగస్వాములను నియమించుకోవచ్చు. Shopify భాగస్వామిని నియమించుకోవడం గురించి మరింత తెలుసుకోండి.
3D మోడల్‌లను సృష్టించడానికి Shopify భాగస్వామిని నియమించుకోండి
మీ ఉత్పత్తుల 3D మోడల్‌లను రూపొందించడంలో సహాయం పొందడానికి, మీరు Shopify భాగస్వామిని నియమించుకోవచ్చు. Shopify Partner Directoryలో, 3D మోడల్ సృష్టి సేవలను అందించే భాగస్వాములను బ్రౌజ్ చేసి, ఒక భాగస్వామిని ఎంచుకుని, వారిని సంప్రదించండి.
భాగస్వామి సంప్రదింపు ఫారమ్‌ను ఉపయోగించి, మీ ప్రాజెక్ట్ గురించిన వివరాలను అందించండి. ఒకవేళ మీరు ఇప్పుడే ఉత్పత్తి ఫోటోలు మరియు ఉత్పత్తి డైమెన్షన్‌లను అందించాలనుకుంటే, మీరు లింక్ చేసిన మార్గదర్శకాలను అనుసరించారని నిర్ధారించుకోండి.
మీరు భాగస్వామిని సంప్రదించినప్పుడు, మీరు Shopify భాగస్వామిని నియమించుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు కాదు. ఈ దశ కేవలం భాగస్వామికి అభ్యర్థనను సమర్పిస్తుంది, ఆ తర్వాత వారు మీ అభ్యర్థనను సమీక్షిస్తారు. ఒకవేళ భాగస్వామి మీతో పని చేయాలని నిర్ణయించుకుంటే, వారు తమ ఫీజుల గురించి, అలాగే మీరు కలిసి ఎలా పని చేయడం ప్రారంభించవచ్చనే దానికి సంబంధించిన మరింత సమాచారంతో మిమ్మల్ని సంప్రదిస్తారు.
మీ జాబ్ అభ్యర్థనలో భాగంగా మీరు ఇప్పటికే ఉత్పత్తి ఫోటోలను, అలాగే ఉత్పత్తి డైమెన్షన్‌లను అందించకపోతే, భాగస్వామి వాటిని మీ నుండి అభ్యర్థిస్తారు. ఫోటోలను, కొలతలను తీసుకునేటప్పుడు కింద ఉన్న నిర్దేశకాలను అనుసరించండి.
ఉత్పత్తి ఫోటోలు
ఫోటోలను ఉపయోగించి 3D మోడల్స్ సృష్టించబడతాయి. 3D మోడల్‌ను సృష్టించడానికి, Shopify భాగస్వామికి మీ ఉత్పత్తుల ఫోటోలు పలు కోణాల్లో కావాలి:

మీ ఉత్పత్తికి సంబంధించిన ఫోటోలను తీస్తున్నప్పుడు, ఈ మార్గదర్శకాలను అనుసరించండి:
- మీ ఉత్పత్తికి తగినంత వెలుతురు ఉండేలా చూసుకోండి.
- మీ పూర్తి ఉత్పత్తి ఫోకస్‌లో ఉండేలా చూసుకోండి.
- వీలైతే, సెల్‌ఫోన్ కెమెరాను ఉపయోగించవద్దు. ఫర్నిచర్ వంటి పెద్ద ఉత్పత్తుల కోసం, 50 mm లెన్స్ ఉన్న కెమెరాను ఉపయోగించండి. చిన్నదాని నుండి మధ్యస్థ పరిమాణంలో ఉన్న ఉత్పత్తుల కోసం, 70 mm లేదా 100 mm లెన్స్‌ను ఉపయోగించండి.
- ఏదైనా విలక్షణమైన వివరాలు లేదా ఆకృతులు ఉంటే వాటి కోసం అదనపు ఫోటోలను తీయండి.
- ఫోటో ఫైల్‌లకు
బ్లూ వేజ్ - టాప్లేదాబ్లూ వేజ్ - లెఫ్ట్వంటి స్పష్టమైన పేర్లను ఇవ్వండి, అలాగే వాటిని స్పష్టంగా లేబుల్ చేసిన ఫోల్డర్‌లో నిల్వ చేయండి.
ఉత్పత్తి డైమెన్షన్‌లు
ఖచ్చితమైన 3D మోడల్స్‌ను సృష్టించడానికి, Shopify భాగస్వామికి మీ ఉత్పత్తికి సంబంధించిన వివరణాత్మక కొలతలు అవసరం. కొలతలను అందిస్తున్నప్పుడు, ఈ మార్గదర్శకాలను అనుసరించండి:
- మీ ఉత్పత్తి యొక్క ప్రతి డైమెన్షన్‌ను స్పష్టమైన, సులభమైన పదాల్లో వివరించండి.
- కొలతలను
mmలలో అందించండి. - ఏ కొలతలు ఏ డైమెన్షన్‌లకు చెందినవో చూపించడానికి రేఖాచిత్రాన్ని చేర్చండి.
- మీ ఉత్పత్తికి సంబంధించి ఏవైనా సాంకేతిక డ్రాయింగ్‌లు లేదా CAD ఫైల్‌లు ఉన్నట్లయితే, వాటిని కూడా చేర్చండి.
3D మోడల్స్ తయారీకి ఉదాహరణ
నవోమి ఈ బ్లూ వేజ్‌ను విక్రయిస్తోంది:

ఆమె వేజ్‌కి సంబంధించిన 3D మోడల్‌ను రూపొందించగల Shopify భాగస్వామిని కనుగొనడానికి Shopify Partner Directoryని ఉపయోగిస్తుంది. 70 mm లెన్స్ ఉన్న కెమెరాతో తీసిన ఆరు నాణ్యమైన ఫోటోలను నవోమి భాగస్వామికి అందిస్తుంది:

నవోమి ఆ భాగస్వామికి దానికి సంబంధించిన ఉత్పత్తి డైమెన్షన్‌లను మిల్లీమీటర్లలో చూపే ఒక కొలతల రేఖాచిత్రాన్ని ఇస్తుంది:

- వేజ్ (1) పొడవు ____mm
- వేజ్ పైభాగం నుండి దాని మెడ భాగం అడుగు వరకు (2) ____mm ఉంటుంది
- మెడ భాగం అడుగు నుండి వేజ్ అడుగు వరకు (3) ____mm ఉంటుంది
- వేజ్ మూతి భాగపు వ్యాసం (4) ____mm ఉంటుంది
- మూతి పైభాగం వెడల్పు (5) ____mm ఉంటుంది
- మెడ భాగపు అడుగు వ్యాసం (6) ____mm ఉంటుంది
- వేజ్‌పై 8 షట్కోణ ముఖాలు ఉన్నాయి
- షట్కోణ ముఖాల పొడవు (8) ____mm ఉంటుంది
- షట్కోణ ముఖాల వెడల్పు (9) ____mm ఉంటుంది
- వేజ్ అత్యంత వెడల్పుగా ఉన్న భాగపు వ్యాసం (10) ____mm ఉంటుంది
- వేజ్ అడుగు భాగపు వ్యాసం (11) ____mm ఉంటుంది
- ఫోమ్ ఫీట్ వ్యాసం ____mm ఉంటుంది
బ్లూ వేజ్ 3D మోడల్‌ను రూపొందించడానికి Shopify భాగస్వామి ఈ ఫోటోలు, డైమెన్షన్‌లను ఉపయోగిస్తారు. ఆమె తన ఆన్‌లైన్ స్టోర్‌కు జోడించుకోవడానికి భాగస్వామి నవోమికి ఒక GLB ఫైల్‌ను పంపుతారు.
మీ 3D మోడల్స్ నాణ్యతను తనిఖీ చేయండి
Shopify భాగస్వామి మీకు 3D మోడల్‌ను అందించినప్పుడు, దాని నాణ్యత పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారో లేదో తనిఖీ చేయాలి. మోడల్‌ను మునుజూపు చూడటం కోసం భాగస్వామి మీకు సూచనలను అందించాలి.
అన్ని కోణాల నుండి మోడల్‌ను తనిఖీ చేయండి. మీ 3D మోడల్స్‌ను మునుజూపు చూడటానికి మీరు glTF Viewerను ఉపయోగించవచ్చు. మీ మోడల్‌ను సమీక్షిస్తున్నప్పుడు, కింది ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోండి:
- మీరు భాగస్వామికి అందించిన ఉత్పత్తికి సంబంధించిన సూచనా ఫోటోలకు మోడల్ ఆకారం సరిపోలిందా?
- మోడల్‌లోని అన్ని భాగాలు మిగిలిన వాటికి అనుపాతంలో ఉన్నాయా?
- మీరు ఆగ్మెంటెడ్ రియాలిటీలో మోడల్‌ను మునుజూపు చూడగలిగితే, మోడల్ స్కేల్ మిగిలిన దృశ్యంతో పోలిస్తే సరిగ్గా ప్రదర్శించబడుతోందా?
- ఉత్పత్తిని తయారు చేసిన మెటీరియల్‌తోనే మోడల్ తయారు చేయబడినట్లుగా కనిపిస్తోందా?
- మోడల్ మెటీరియల్స్ సాగదీసినట్లుగా, అస్పష్టంగా లేదా వక్రీకరించబడినట్లుగా ప్రదర్శించబడుతున్నాయా?
- మోడల్ మెటీరియల్స్ మరింత సహజంగా కనిపించేలా చేయడానికి గీతలు లేదా గీసుకుపోయిన గుర్తుల వంటి వివరాలు ఉన్నాయా?
- ఉత్పత్తిలోని భాగాలు పారదర్శకంగా, ప్రతిబింబించేలా లేదా కాంతిని వెదజల్లేలా ఉన్నట్లయితే, అవి సరిగ్గా ప్రదర్శించబడుతున్నాయా?
- అంచులన్నీ వాస్తవికంగా కనిపిస్తున్నాయా? వాటిలో ఏవైనా మరీ పదునుగా ఉండి, సున్నితంగా మార్చాల్సిన అవసరం ఉందా?
- లోగో లేదా కొంత వచనం వంటి ఏవైనా అలంకరణ వివరాలు ఉన్నట్లయితే, వాటిని చూడటం సులభంగా ఉందా?
- ఖాళీలు లేదా రంధ్రాలు ఉండకూడని చోట ఏవైనా ఉన్నాయా?
- 3D మోడల్ Shopify ప్లాట్‌ఫామ్ సాంకేతిక ఆవశ్యకతలకు అనుగుణంగా ఉందా?
- 3D మోడల్ అనేది తప్పనిసరిగా GLB ఫైల్ అయి ఉండాలి.
- GLB ఫైల్ దాదాపు 4 MB ఉండాలి.
- GLB ఫైల్ పరిమాణం 15 MB మించకూడదు.
Shopify భాగస్వామి నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం 3D మోడల్‌ను రూపొందించాలి. మీరు మోడల్‌ను మెరుగ్గా సమీక్షించడానికి వీలుగా ఆ ప్రమాణాల గురించి మరింత తెలుసుకోవడానికి, వ్యాపారుల కోసం 3D మోడల్స్ సృష్టించడంను చూడండి.
మోడల్ నాణ్యత అంతగా బాగాలేదని మీరు భావిస్తే, Shopify భాగస్వామిని సంప్రదించి అందులో ఏ సమస్య ఉందో వివరించండి.