ప్రీ-ఆర్డర్‌లను మేనేజ్ చేయడం
మీరు మీ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి సెటప్ చేసిన తర్వాత, ప్రీ-ఆర్డర్‌ల గురించి సమాచారాన్ని లేదా కస్టమర్ చెల్లింపు సమాచారాన్ని మేనేజ్ చేయడానికి మీరు మీ ఆర్డర్‌లలో సెర్చ్ చేయాల్సి రావచ్చు.
మీ కస్టమర్‌ల చెల్లింపు పద్ధతులను మేనేజ్ చేయండి
మీరు ప్రీ-ఆర్డర్ ఉత్పత్తులను విక్రయిస్తూ, విఫలమైన చెల్లింపు కారణంగా కస్టమర్ వారి చెల్లింపు సమాచారాన్ని అప్‌డేట్ చేయాల్సి వస్తే, మీరు Shopify అడ్మిన్‌లో మీ కస్టమర్ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయవచ్చు.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, కస్టమర్‌లు విభాగానికి వెళ్లండి.
కస్టమర్ పేరు మీద క్లిక్ చేయండి.
చెల్లింపు పద్ధతులు విభాగంలో, మరిన్ని చర్యలపై క్లిక్ చేయండి.
మీ కస్టమర్ తమ చెల్లింపు సమాచారాన్ని వాళ్లే అప్‌డేట్ చేయాలని మీరు కోరుకుంటే, కింది వాటిని చేయండి:
- కార్డ్‌ను అప్‌డేట్ చేయడానికి లింక్‌ను పంపండి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీరు ఇమెయిల్ పంపాలనుకునే ఇమెయిల్ అడ్రస్‌ను ఎంచుకోండి.
- ఇమెయిల్ పంపండి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
కొన్ని చెల్లింపు పద్ధతుల కోసం, మీరు మీ కస్టమర్ చెల్లింపు పద్ధతిని మాన్యువల్‌గా అప్‌డేట్ చేయాలనుకుంటే, కింది వాటిని చేయండి:
- కార్డ్‌ను రీప్లేస్ చేయండి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- క్రెడిట్ కార్డ్‌ను రీప్లేస్ చేయండి ఫారమ్‌ను పూరించండి.
- నిర్ధారించండి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీరు మీ కస్టమర్ చెల్లింపు పద్ధతిని తీసివేయాలనుకుంటే, కార్డ్‌ను తొలగించండి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
అదనపు భద్రత కోసం కస్టమర్‌లు తమ చెల్లింపు పద్ధతిని నిర్ధారించాల్సిందిగా అడగబడవచ్చు. మీ కస్టమర్ బ్యాంక్ తదుపరి బిల్లింగ్ ప్రయత్నాలను సవాలు చేయవచ్చు, అంటే మీ కస్టమర్ తమ కొనుగోలును, చెల్లింపు పద్ధతిని మాన్యువల్‌గా నిర్ధారించాలి.
ఒక ఆర్డర్ కోసం కస్టమర్ తమ చెల్లింపు పద్ధతిని నిర్ధారించాల్సి వస్తే, చెల్లింపును నిర్ధారించడానికి మీ స్టోర్ లింక్‌ను కలిగి ఉన్న ఇమెయిల్‌ను Shopify మీ కస్టమర్‌కు పంపుతుంది.
ప్రీ-ఆర్డర్‌లను మేనేజ్ చేయడం
మీరు ప్రీ-ఆర్డర్‌లను స్వీకరించిన తర్వాత, ప్రీ-ఆర్డర్‌ల గురించి సమాచారాన్ని లేదా చెల్లింపు సమాచారాన్ని మేనేజ్ చేయడానికి మీ ఆర్డర్‌లను సెర్చ్ చేయాల్సి రావచ్చు.
మీరు ఫుల్‌ఫిల్‌మెంట్ సమయాన్ని పొడిగించాలనుకుంటే, ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ను తిరిగి హోల్డ్‌లో పెట్టవచ్చు.
ఫుల్‌ఫిల్‌మెంట్‌ను పొడిగించండి
నెరవేర్చని ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్‌కు సిద్ధంగా లేకపోతే, మీరు దాన్ని హోల్డ్‌లో పెట్టవచ్చు. మీరు నెరవేర్చని ఆర్డర్‌ను హోల్డ్‌లో పెడితే, మీ కస్టమర్‌లకు వారి ప్రీ-ఆర్డర్ స్టేటస్ గురించి తెలియజేసినట్లు నిర్ధారించుకోండి.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లు విభాగానికి వెళ్లండి.
నెరవేర్చని ఆర్డర్‌పై క్లిక్ చేయండి.
నెరవేర్చబడని విభాగంలో,
మెనూపై క్లిక్ చేయండి.
ఫుల్‌ఫిల్‌మెంట్‌ను హోల్డ్‌లో ఉంచండి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీరు ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ గురించి మరింత తెలుసుకోవచ్చు.
చెల్లించని లేదా నెరవేర్చని మీ ప్రీ-ఆర్డర్‌లను ఫిల్టర్ చేయడం, సార్ట్ చేయడం
పూర్తిగా చెల్లించని లేదా నెరవేర్చని ప్రీ-ఆర్డర్‌లను చూడటానికి మీరు నెరవేర్చబడని లేదా చెల్లించనివి ట్యాబ్‌లతో ఆర్డర్‌లు పేజీని ఫిల్టర్ చేయవచ్చు.
ప్రీ-ఆర్డర్ ఉత్పత్తులు ఉన్న ఆర్డర్‌లను ఎడిట్ చేయడం
ప్రీ-ఆర్డర్ ఐటెమ్‌లు ఉన్న ఆర్డర్‌ను మీరు ఎడిట్ చేయవచ్చు. ఆర్డర్‌లోని ప్రీ-ఆర్డర్ ఉత్పత్తులను ఎడిట్ చేస్తున్నప్పుడు మీరు కింది చర్యలు చేయవచ్చు:
- ప్రీ-ఆర్డర్ ఐటెమ్ పరిమాణాన్ని పెంచండి
- ప్రీ-ఆర్డర్ ఐటెమ్ పరిమాణాన్ని తగ్గించండి
- ప్రీ-ఆర్డర్ ఐటెమ్‌కు తగ్గింపును జోడించండి
- ప్రీ-ఆర్డర్ ఐటెమ్ కోసం తగ్గింపును సర్దుబాటు చేయండి
- ప్రీ-ఆర్డర్ ఐటెమ్ నుండి తగ్గింపును తీసివేయండి
- ప్రీ-ఆర్డర్ ఉత్పత్తిని తీసివేయండి
- ఒకేసారి కొనుగోలు ఐటెమ్‌ను జోడించండి
ఒక ఆర్డర్‌ను ఎడిట్ చేస్తున్నప్పుడు మీరు కొత్త ప్రీ-ఆర్డర్ ఉత్పత్తిని జోడించలేరు.
చెల్లింపు గడువు తేదీని మార్చడం
ముందుగా వసూలు చేయడానికి మీరు వాయిదా వేసిన చెల్లింపులో చెల్లింపు గడువు తేదీని సవరించవచ్చు.
వాయిదా వేసిన చెల్లింపును ముందుగా వసూలు చేయండి
మీ ఉత్పత్తి ఆశించిన దానికంటే ముందే రవాణా చేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు నిర్ణీత సమయం కంటే ముందే మిగిలిన చెల్లింపును వసూలు చేయవచ్చు. మీరు కస్టమర్‌కు ఇన్‌వాయిస్ పంపవచ్చు లేదా కస్టమర్ నుండి ఛార్జీ వసూలు చేయడానికి వారి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయవచ్చు.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లు విభాగానికి వెళ్లండి.
మీరు ముందుగా చెల్లింపును వసూలు చేయాలనుకుంటున్న ఆర్డర్‌పై క్లిక్ చేయండి.
పాక్షికంగా చెల్లించినవి విభాగంలో, చెల్లింపును వసూలు చేయండి ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆపై నిల్వ చేయబడిన కార్డ్ నుండి ఛార్జ్ చేయడానికి క్లిక్ చేయండి.
ఇన్వెంటరీని రిజర్వ్ చేయడం
ప్రీ-ఆర్డర్ కోసం ఇన్వెంటరీ అనేది విక్రయం లేదా ఫుల్‌ఫిల్‌మెంట్ సమయంలో రిజర్వ్ చేయబడుతుంది. కొన్ని ప్రీ-ఆర్డర్ యాప్‌ల సెటప్‌లో మీకు ఇష్టమైన ఆప్షన్‌ను మీరు ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్ అందుబాటులో లేకపోతే, మరింత సమాచారం కోసం యాప్ డెవలపర్‌ను సంప్రదించండి.
ప్రీ-ఆర్డర్‌లను రద్దు చేయడం మరియు రీఫండ్ చేయడం
నెరవేర్చబడని, పాక్షికంగా చెల్లించిన ప్రీ-ఆర్డర్ ఆర్డర్‌ను మీరు రద్దు చేయవచ్చు. ఆర్డర్ నెరవేర్చబడితే, మీరు ఆర్డర్‌ను రద్దు చేయలేరు, కానీ నెరవేర్చబడిన ఐటెమ్‌ల కోసం మీరు పూర్తి మరియు పాక్షిక రీఫండ్‌లను జారీ చేయవచ్చు.
మీ కస్టమర్ ఆర్డర్‌ను రద్దు చేసినట్లయితే, మీరు అప్పటికీ ఆర్డర్‌ను మాన్యువల్‌గా రీఫండ్ చేయాల్సి రావచ్చు. ఇలా జరిగినప్పుడు ఆర్డర్‌పై సందేశం ప్రదర్శించబడుతుంది.
మీరు ఆర్డర్‌లు పేజీ నుండి ఆర్డర్‌ను రీఫండ్ చేసిన తర్వాత, మీరు మీ ప్రీ-ఆర్డర్ యాప్‌లో కూడా ఆర్డర్‌ను రద్దు చేయాల్సి రావచ్చు.