సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లను నిర్వహించడం

మీరు మీ Shopify అడ్మిన్ నుండి పే-పర్-డెలివరీ ఆర్డర్‌లు మరియు ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లను నిర్వహించవచ్చు.

పే-పర్-డెలివరీ ఆర్డర్‌లకు, ఆర్డర్‌కు ఒకే సబ్‌స్క్రిప్షన్ ఐటెమ్ మాత్రమే ఉంటుంది. సాధారణ వ్యవధులలో, మీ సబ్‌స్క్రిప్షన్ యాప్ ద్వారా కొత్త పే-పర్-డెలివరీ ఆర్డర్‌లు సృష్టించబడతాయి మరియు మీ ఆర్డర్‌ల జాబితాలో ప్రదర్శించబడతాయి. పే-పర్-డెలివరీ ఆర్డర్‌లు సబ్‌స్క్రిప్షన్-కాని ఆర్డర్‌ల లాగానే నిర్వహించబడతాయి మరియు నెరవేర్చబడతాయి.

ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌ల కోసం ముందుగానే ఏకమొత్తంగా చెల్లించబడుతుంది, కానీ ఒక నిర్దిష్ట సమయం వరకు షెడ్యూల్ చేయబడిన బహుళ ఫుల్‌ఫిల్‌మెంట్‌లను కలిగి ఉంటాయి. ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లు ఫుల్‌ఫిల్‌మెంట్ తేదీ వచ్చేంత వరకు షెడ్యూల్ చేయబడింది (Scheduled) స్టేటస్‌ ఉన్న సింగిల్ ఆర్డర్‌గా ప్రదర్శించబడతాయి. ఫుల్‌ఫిల్‌మెంట్ తేదీని చేరుకున్నప్పుడు, ఆర్డర్ స్టేటస్ నెరవేర్చబడనిది (Unfulfilled)కి అప్‌డేట్ అవుతుంది, ఆ తర్వాత మీరు ఆర్డర్‌ను నెరవేర్చవచ్చు. ఆ తర్వాత మరలా తదుపరి ఫుల్‌ఫిల్‌మెంట్ తేదీ వచ్చేంత వరకు ఆర్డర్ స్టేటస్ షెడ్యూల్ చేయబడింది (Scheduled)కి తిరిగి మారుతుంది మరియు ఈ సర్కిల్ మళ్లీ ప్రారంభమవుతుంది. ఒక ఆర్డర్ షెడ్యూల్ చేయబడింది (Scheduled) స్టేటస్‌ను కలిగి ఉన్నప్పుడు, మీరు మీ ఆర్డర్‌ల పేజీలో ఆర్డర్‌ను ట్రాక్ చేయవచ్చు, కానీ ఎలాంటి చర్య తీసుకోనవసరం లేదు.

ఆర్డర్‌లో, మీరు ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌ల కోసమైన అన్ని ఐటెమ్‌లను సమీక్షించవచ్చు, అవి నెరవేర్చబడినవి, నెరవేర్చబడనివి మరియు షెడ్యూల్ చేయబడినవి అనే ఫుల్‌ఫిల్‌మెంట్ కార్డ్‌ల వారీగా క్రమబద్ధీకరించబడతాయి. ఆర్డర్‌కు సంబంధించిన తదుపరి షెడ్యూల్ చేయబడిన ఫుల్‌ఫిల్‌మెంట్, షెడ్యూల్ చేయబడిన ఫుల్‌ఫిల్‌మెంట్ కార్డ్‌లో జాబితా చేయబడుతుంది. షెడ్యూల్ చేయబడిన ఫుల్‌ఫిల్‌మెంట్‌లన్నింటినీ ప్రదర్శించడానికి అన్ని ఫుల్‌ఫిల్‌మెంట్‌లను వీక్షించండి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

మీ ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లను ఫిల్టర్ చేయడం మరియు క్రమబద్ధీకరించడం

మీరు తక్షణ చర్య అవసరం లేని రాబోయే ఫుల్‌ఫిల్‌మెంట్ పనిని ప్రదర్శించడానికి షెడ్యూల్ చేయబడింది (Scheduled) అనే ఫుల్‌ఫిల్‌మెంట్ స్టేటస్ వారీగా మీ ఆర్డర్‌ల పేజీని ఫిల్టర్ చేయవచ్చు.

నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లను ప్రదర్శించడానికి, మీ ఆర్డర్‌ల పేజీని నెరవేర్చబడనివి (Unfulfilled) స్టేటస్ వారీగా ఫిల్టర్ చేయండి. డిఫాల్ట్‌గా, ఆర్డర్‌ల పేజీ తేదీ వారీగా క్రమబద్ధీకరించబడుతుంది. అంటే నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లు మీ నెరవేర్చని ఆర్డర్‌ల జాబితాలో దిగువకు వెళ్లిపోవచ్చు. ఈ ఆర్డర్‌లను ప్రదర్శించడానికి, మీరు మీ ఆర్డర్‌ల పేజీని పాత తేదీల ఆధారంగా క్రమబద్ధీకరించవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లు విభాగానికి వెళ్లండి.

  2. సెర్చ్ఫిల్టర్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.

  3. ఫిల్టర్‌ను జోడించండి + ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

  4. ఫుల్‌ఫిల్‌మెంట్ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి, ఆ తర్వాత నెరవేర్చబడనివి అనే దాన్ని ఎంచుకోండి.

  5. క్రమబద్ధీకరించు (Sort) మెనూను తెరవడానికి ⇅పై క్లిక్ చేయండి.

  6. తేదీని మరియు ↑ పాత వాటి నుండి కొత్త వాటికి ఆప్షన్‌ను ఎంచుకోండి.

  7. ఐచ్ఛికం: ఈ ఆర్డర్ జాబితా వ్యూకు పేరు పెట్టడానికి మరియు దాన్ని సేవ్ చేయడానికి ఇలా సేవ్ చేయండి (Save as) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లను ఎడిట్ చేయడం

మీరు సబ్‌స్క్రిప్షన్ ఐటెమ్‌ను కలిగి ఉన్న ఆర్డర్‌ను ఎడిట్ చేయవచ్చు. ఆర్డర్‌ను ఎడిట్ చేయడం వలన సబ్‌స్క్రిప్షన్ కాంట్రాక్ట్ ఏమీ సవరించబడదు. భవిష్యత్తు ఫుల్‌ఫిల్‌మెంట్‌లన్నింటి కోసం సబ్‌స్క్రిప్షన్ కాంట్రాక్ట్‌ను అప్‌డేట్ చేయడానికి, మీ సబ్‌స్క్రిప్షన్ మేనేజ్‌మెంట్ అప్లికేషన్‌ను ఉపయోగించండి.

ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లను ఎడిట్ చేయడం

మీరు షెడ్యూల్ చేయబడిన ఫుల్‌ఫిల్‌మెంట్ ఐటెమ్‌లను కలిగి ఉన్న ఒక ఆర్డర్‌ను ఎడిట్ చేయవచ్చు. ఒక ఆర్డర్‌లో ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఉత్పత్తులను ఎడిట్ చేసేటప్పుడు మీరు కింది చర్యలను చేయవచ్చు:

ఒక ఆర్డర్‌లో ప్రీపెయిడ్ విక్రయ ప్రణాళిక ఉన్నట్లయితే, అప్పుడు మీరు ఆ ఆర్డర్‌ను డూప్లికేట్ చేయలేరు లేదా లైన్ ఐటెమ్ పరిమాణాలను ఎడిట్ చేయలేరు.

పే-పర్-డెలివరీ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లను ఎడిట్ చేయడం

మీరు పే-పర్-డెలివరీ సబ్‌స్క్రిప్షన్ ఐటెమ్‌లను కలిగి ఉన్న ఆర్డర్‌ను ఎడిట్ చేయవచ్చు. ఆర్డర్‌లో పే-పర్-డెలివరీ సబ్‌స్క్రిప్షన్ ఉత్పత్తులను ఎడిట్ చేసేటప్పుడు మీరు కింది చర్యలను చేయవచ్చు:

ఆర్డర్‌ను ఎడిట్ చేసేటప్పుడు మీరు కొత్త సబ్‌స్క్రిప్షన్ ఉత్పత్తిని జోడించలేరు. అలాగే మీరు సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌ను డూప్లికేట్ చేయలేరు.

ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లను రద్దు చేయడం మరియు రీఫండ్ చేయడం

ఇంకా నెరవేర్చబడని ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌ను మీరు రద్దు చేయవచ్చు. ఒకవేళ షెడ్యూల్ చేయబడిన ఏవైనా ఐటెమ్‌లు నెరవేర్చబడి ఉంటే, అప్పుడు మీరు ఆర్డర్‌ను రద్దు చేయలేరు, కానీ మీరు నెరవేర్చబడిన మరియు షెడ్యూల్ చేయబడిన ఐటెమ్‌ల కోసం పూర్తి మరియు పాక్షిక రీఫండ్‌లను జారీ చేయవచ్చు.

ఒకవేళ మీ కస్టమర్ ఆర్డర్‌ను రద్దు చేసినా కూడా, మీరు మాన్యువల్‌గా ఆర్డర్‌కు రీఫండ్ చేయాల్సి రావచ్చు. ఇలా జరిగినప్పుడు ఆర్డర్‌పై ఒక సందేశం ప్రదర్శించబడుతుంది.

మీరు ఆర్డర్‌ల పేజీ నుండి ఆర్డర్‌ను రీఫండ్ చేసినప్పుడు, మీరు మీ సబ్‌స్క్రిప్షన్ యాప్‌లో కూడా ఆర్డర్‌ను రద్దు చేయాల్సి రావచ్చు.

ఇన్వెంటరీని నిర్వహించడం

మీ సక్రియ సబ్‌స్క్రిప్షన్ కాంట్రాక్ట్‌లలో ఇన్వెంటరీని ట్రాక్ చేసే ఉత్పత్తులు ఉన్నట్లయితే, మరియు ఉత్పత్తులు ఓవర్‌సెల్కు సెట్ చేయబడనట్లయితే, అప్పుడు మీ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లలో సమస్యలను నివారించడానికి రాబోయే డెలివరీ సమయానికి మీ ఉత్పత్తులు స్టాక్‌లో ఉండేలా మీరు చూసుకోవాలి. ఇన్వెంటరీ ట్రాకింగ్ గురించి మరింత తెలుసుకోండి.

మీరు ఉచిత Shopify Subscriptions యాప్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, అప్పుడు మీరు ఇన్వెంటరీ సమస్యలు ఉన్న సబ్‌స్క్రిప్షన్ కాంట్రాక్ట్‌లను సమీక్షించవచ్చు మరియు నిర్వహించవచ్చు, అలాగే సరిపడా ఇన్వెంటరీ లేని సబ్‌స్క్రిప్షన్ కాంట్రాక్ట్‌ల కోసం బిల్లింగ్ ప్రయత్నాలను నిర్వహించవచ్చు.

ఇన్వెంటరీని రిజర్వ్ చేయడం

ఫుల్‌ఫిల్‌మెంట్ తేదీని చేరుకున్నప్పుడు, ప్రతి ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్ సైకిల్ కోసం ఇన్వెంటరీ రిజర్వ్ చేయబడుతుంది. ఆర్డర్ సృష్టించబడినప్పుడు మొత్తం సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్ కోసం ఇన్వెంటరీ రిజర్వ్ చేయబడదు. ఫుల్‌ఫిల్‌మెంట్ తేదీ కంటే ముందే షెడ్యూల్ చేయబడిన ఫుల్‌ఫిల్‌మెంట్ కోసం ఇన్వెంటరీని రిజర్వ్ చేయడానికి, మీరు షెడ్యూల్ చేయబడిన ఆర్డర్‌ను ముందుగానే నెరవేర్చవచ్చు.

సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లను నెరవేర్చడం

ఉత్పత్తి యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్ లొకేషన్ లేదా షిప్పింగ్ ప్రొఫైల్ ఆధారంగా, సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లపై ఫుల్‌ఫిల్‌మెంట్‌లు ఒకే ఆర్డర్‌లో విభజించబడవచ్చు.

ముందుగా చెల్లించిన సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌ను నెరవేర్చడం

షెడ్యూల్ చేసిన ఆర్డర్ దాని ఫుల్‌ఫిల్‌మెంట్ తేదీకి చేరుకున్నప్పుడు, ఆర్డర్ స్టేటస్ నెరవేర్చబడనికి అప్‌డేట్ అవుతుంది, ఇంకా మీరు ఆర్డర్‌ను నెరవేర్చవచ్చు.

ముందుగా చెల్లించిన సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌ను ముందుగానే నెరవేర్చడం

మీరు షెడ్యూల్ చేసిన ఫుల్‌ఫిల్‌మెంట్‌లను రీషెడ్యూల్ చేయలేరు, కానీ మీరు ఒక ఆర్డర్‌ను ముందుగానే నెరవేర్చడానికి ఎంచుకోవచ్చు.

దశలు:

  1. మీ Shopify అడ్మిన్ నుండి, ఆర్డర్‌లు విభాగానికి వెళ్లండి.

  2. మీరు ముందుగానే నెరవేర్చాలనుకుంటున్న ఆర్డర్‌ను ఎంచుకోండి.

  3. షెడ్యూల్ చేయబడినవి విభాగంలో, ముందుగానే నెరవేర్చండిని క్లిక్ చేయండి.

  4. ఆర్డర్ ఫుల్‌ఫిల్‌మెంట్ సమాచారాన్ని సమీక్షించి, ఆపై నెరవేర్చబడనిదిగా మార్క్ చేయండిని క్లిక్ చేయండి. ఆర్డర్ స్టేటస్ నెరవేర్చబడనికి అప్‌డేట్ చేయబడుతుంది, ఇంకా మీరు ఐటెమ్‌లను నెరవేర్చవచ్చు.

అధిక-రిస్క్ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లను మేనేజ్ చేయడం

ఒకవేళ ప్రారంభ సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్ అధిక-రిస్క్ గలదిగా ఫ్లాగ్ చేయబడితే, మీరు ఆర్డర్‌ను నెరవేర్చాలి లేదా రద్దు చేయాలి. అసలు ఆర్డర్ అధిక-రిస్క్ గలదిగా ఫ్లాగ్ చేయబడి, నెరవేర్చబడకుండా ఉంటే, తదుపరి సబ్‌స్క్రిప్షన్ పునరుద్ధరణలు విఫలమవుతాయి.

మీరు అధిక-రిస్క్ ఆర్డర్‌ను నెరవేర్చినప్పుడు, సబ్‌స్క్రిప్షన్ రిస్క్‌ను మీరు అంగీకరిస్తున్నారని సూచిస్తారు, ఇంకా భవిష్యత్ పునరుద్ధరణలు కొనసాగడానికి అనుమతించబడతాయి. ఒకవేళ మీరు అధిక-రిస్క్ ఆర్డర్‌ను నెరవేర్చకూడదని ఎంచుకుంటే, మీరు ఆ ఆర్డర్‌ను రద్దు చేయవచ్చు, ఇంకా రీఫండ్ చేయవచ్చు.

అధిక-రిస్క్ ఆర్డర్‌లను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోవడానికి, మోసాన్ని నిరోధించడం చూడండి.