Shopify Subscriptions యాప్, Shopify ధరల ప్లాన్‌ల మధ్య తేడాలను అర్థం చేసుకోవడం

Shopify ప్లాట్‌ఫారమ్‌లో "Shopify సబ్‌స్క్రిప్షన్" అనేది రెండు విభిన్నమైన కాన్సెప్ట్‌లను సూచిస్తుంది. మీరు సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఉత్పత్తులను నిర్వహించడానికి రూపొందించబడిన Shopify Subscriptions యాప్ గురించి చర్చిస్తున్నారా లేదా మీకు అందుబాటులో ఉన్న వివిధ స్థాయిల Shopify ఖాతాలకు సంబంధించిన Shopify ధరల ప్లాన్‌ల గురించి చర్చిస్తున్నారా అనేది స్పష్టంగా తెలుసుకోవడం ముఖ్యం.

Shopify Subscriptions యాప్

Shopify Subscriptions యాప్ నేరుగా మీ Shopify అడ్మిన్ నుండి ఉత్పత్తులను పునరావృత ప్రాతిపదికన విక్రయించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. తమ కస్టమర్‌లకు సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌లను లేదా రికరింగ్ బిల్లింగ్ ఆప్షన్‌లను అందించాలనుకునే వ్యాపారాలు ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. Shopify Subscriptions యాప్‌లోని ముఖ్య ఫీచర్‌లలో ఇవి ఉంటాయి:

  • సబ్‌స్క్రిప్షన్ నిర్వహణ: స్థిర లేదా కస్టమ్ బిల్లింగ్ వ్యవధులతో సబ్‌స్క్రిప్షన్ ఉత్పత్తులను సృష్టించడానికి, నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • కస్టమర్ పోర్టల్: తమ ఆర్డర్‌లను పాజ్ చేయడం, మళ్లీ ప్రారంభించడం లేదా రద్దు చేయడంతో పాటు తమ సబ్‌స్క్రిప్షన్‌లను నిర్వహించుకోవడానికి కస్టమర్‌లను అనుమతిస్తుంది.
  • డిస్కౌంట్ నిర్వహణ: శాతం లేదా స్థిర మొత్తం డిస్కౌంట్‌లతో సహా సబ్‌స్క్రిప్షన్ ఆర్డర్‌లకు డిస్కౌంట్‌లను వర్తింపజేసే సామర్థ్యాన్ని అందిస్తుంది.
  • విశ్లేషణలు, రిపోర్టింగ్: సబ్‌స్క్రిప్షన్ పనితీరుపై వివరణాత్మక విశ్లేషణలను అందిస్తుంది.

Shopify ధరల ప్లాన్‌లు

Shopify ధరల ప్లాన్‌లు అనేవి Shopify అందించే వివిధ స్థాయిల సర్వీస్ ఆఫర్‌లు, ఇవి మీకు అందుబాటులో ఉండే ఫీచర్‌ల శ్రేణిని అలాగే Shopify ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడానికి అయ్యే ఖర్చును నిర్ధారిస్తాయి. ముఖ్య ఫీచర్‌లలో ఇవి ఉంటాయి:

  • ప్లాన్ ఆప్షన్‌లు: Basic, Grow, Advanced ప్లాన్‌లు ఉంటాయి, వీటిలో ప్రతి ఒక్కటీ వివిధ వ్యాపారాల పరిమాణాలు, అవసరాలకు సరిపోయే విభిన్న ఫీచర్‌లను అందిస్తుంది.
  • నెలవారీ లేదా వార్షిక ధర: ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా ఛార్జీలు ఉంటాయి అలాగే నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన బిల్ చేయబడతాయి.
  • ప్లాన్ స్కేలబిలిటీ: మీరు మీ వ్యాపార అవసరాలను బట్టి మీ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ లేదా డౌన్‌గ్రేడ్ చేయవచ్చు.
  • చేర్చబడిన ఫీచర్‌లు: ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి, ఫీచర్‌లలో Shopify POS ఇంటిగ్రేషన్, వివరణాత్మక రిపోర్టింగ్ సామర్థ్యాలు చేర్చబడతాయి.

Shopify Subscriptions యాప్, Shopify ధరల ప్లాన్‌ల మధ్య పోలిక

Shopify Subscriptions యాప్, Shopify ధరల ప్లాన్‌ల పోలిక
ఫీచర్Shopify Subscriptions యాప్Shopify ధరల ప్లాన్‌లు
ప్రయోజనంరికరింగ్ ఉత్పత్తి విక్రయాలను నిర్వహిస్తుంది.Shopify ఫీచర్‌లు, టూల్స్ యాక్సెస్ స్థాయిని వివరిస్తుంది.
ప్రధాన దృష్టిసబ్‌స్క్రిప్షన్ ఉత్పత్తుల నిర్వహణ.ప్లాట్‌ఫారమ్ యాక్సెస్, వినియోగం.
యూజర్ ఇంటరాక్షన్కస్టమర్ సబ్‌స్క్రిప్షన్ మేనేజ్‌మెంట్ పోర్టల్.ప్లాన్ సెట్టింగ్‌లను ఎంచుకోవడం, నిర్వహించడం.
ధరసెటప్‌ను బట్టి అదనపు రుసుము వర్తించవచ్చు.ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి నెలవారీ లేదా వార్షిక స్థిరమైన ధర.
ఉద్దేశించిన ఆడియెన్స్సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఉత్పత్తులు కలిగిన వ్యాపారులు.Shopify ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించే ఏ వ్యాపారి అయినా.