Facebook డేటా షేరింగ్
Meta వారి Facebook మరియు Instagramలోని డేటా షేరింగ్ సెట్టింగ్‌ల ద్వారా, మీ ఆన్లైన్ స్టోర్‌లో కస్టమర్ డేటా మరియు బ్రౌజింగ్ ప్రవర్తనను ఎలా సేకరించాలనే దాన్ని మీరు ఎంచుకోవచ్చు. Meta పిక్సెల్, Facebook Conversions API లాంటి డేటా షేరింగ్ టూల్స్, ఆర్డర్లను ట్రాక్ చేయడానికి, ఇతర ఈవెంట్ల నుండి డేటాను సేకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఇవి మీ స్టోర్ ట్రాఫిక్‌ను విశ్లేషించడంలో, డైనమిక్ ప్రకటనల ద్వారా ప్రకటన లక్ష్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
డేటా షేరింగ్ అనేది మీ ఇష్టం. కస్టమర్ డేటా క్యాంపెయిన్ పనితీరు, అలాగే విక్రయాల ట్రాకింగ్‌ను మెరుగుపరిచినప్పటికీ, ప్రతి ఒక్కరూ తమ డేటాను షేర్ చేయాలని కోరుకోరు. మీరు డేటాను ఎలా షేర్ చేస్తారనే విషయాన్ని మీ కస్టమర్లకు తెలియజేయడం, అలాగే ఏ రకమైన డేటాను లేదా ఎంత డేటాను షేర్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం ముఖ్యం. మీ కస్టమర్లకు ఈ సమాచారాన్ని అందించడానికి మీ గోప్యతా విధానం అప్డేట్గా ఉందని నిర్ధారించుకోండి.
ఈ పేజీలో
Meta వారి కస్టమర్ డేటా-షేరింగ్ లెవల్‌ను ఎంచుకోవడం
Meta వారి Facebook మరియు Instagram, మీ ఆన్లైన్ స్టోర్ అలాగే Facebook మధ్య డేటాను ఎలా సేకరించాలి, ఎలా షేర్ చేయాలి అనే దాన్ని ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. డేటా-షేరింగ్ సెట్టింగ్‌లలో మీరు ఎంచుకోవడానికి మూడు లెవల్స్ ఉంటాయి: స్టాండర్డ్, ఎన్హ్యాన్స్డ్ లేదా మాగ్జిమమ్.
మీరు Meta వారి Facebook మరియు Instagramను ఎప్పుడు ఇన్స్టాల్ చేసారు అనే దాని ఆధారంగా, కస్టమర్ డేటా-షేరింగ్ లెవల్స్ విభిన్న గోప్యతా సెట్టింగ్‌లను అందిస్తాయి.
మీరు స్టాండర్డ్‌ని ఎంచుకుంటే, Meta పిక్సెల్ మీ ఆన్లైన్ స్టోర్‌లోని కస్టమర్ బ్రౌజింగ్ ప్రవర్తన నుండి డేటాను సేకరిస్తుంది. బ్రౌజర్ ఆధారిత యాడ్ బ్లాకర్ ద్వారా, Meta పిక్సెల్ డేటాను షేర్ చేయకుండా నిరోధించవచ్చు.
మీరు మెరుగుపరిచిన (Enhanced) ఎంచుకుంటే, మీ స్టోర్ Facebookకి చెందిన Conversions APIతో పాటు Meta పిక్సెల్‌ను ఉపయోగిస్తుంది. Conversions API, కొనుగోలు ఈవెంట్‌ను Shopify మరియు Facebook సర్వర్ల మధ్య పంపుతుంది. సర్వర్ నుండి సర్వర్‌కు పంపబడే డేటాను బ్రౌజర్ ఆధారిత యాడ్ బ్లాకర్లు బ్లాక్ చేయలేవు. మెరుగుపరిచిన (Enhanced) సెట్టింగ్ Facebook నెట్‌వర్క్‌లోని యూజర్లతో మ్యాచ్ చేయడానికి మీ కస్టమర్ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తుంది. ఈ సెట్టింగ్‌ని ఉపయోగించి సేకరించిన సమాచారంలో మీ కస్టమర్ పేరు, లొకేషన్, ఇమెయిల్ అడ్రస్ మరియు ఫోన్ నంబర్‌తో పాటు, మీ ఆన్లైన్ స్టోర్‌లోని వారి బ్రౌజింగ్ ప్రవర్తన కూడా ఉంటుంది. మరింత సమాచారం కోసం, Conversions API గురించిన Facebook డాక్యుమెంటేషన్ని చూడండి.
మీరు గరిష్ఠం (Maximum) ఎంచుకుంటే, మీ స్టోర్ Facebookకి చెందిన Conversions API, Meta పిక్సెల్‌ను ఉపయోగిస్తుంది, ఇంకా ఇది Facebookకి చెందిన తాజా అడ్వర్టైజింగ్ టెక్నాలజీతో అప్డేట్ చేయబడుతుంది. Conversions API, కొనుగోలు ఈవెంట్‌ను Shopify మరియు Facebook సర్వర్ల మధ్య పంపుతుంది. సర్వర్ నుండి సర్వర్‌కు పంపబడే డేటాను బ్రౌజర్ ఆధారిత యాడ్ బ్లాకర్లు బ్లాక్ చేయలేవు. గరిష్ఠం (Maximum) సెట్టింగ్ Facebook నెట్‌వర్క్‌లోని యూజర్లతో మ్యాచ్ చేయడానికి మీ కస్టమర్ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తుంది. ఈ సెట్టింగ్‌ని ఉపయోగించి సేకరించిన సమాచారంలో మీ కస్టమర్ పేరు, లొకేషన్, ఇమెయిల్ అడ్రస్ మరియు ఫోన్ నంబర్‌తో పాటు, మీ ఆన్లైన్ స్టోర్‌లోని వారి బ్రౌజింగ్ ప్రవర్తన కూడా ఉంటుంది. మరింత సమాచారం కోసం, Conversions API గురించిన Facebook డాక్యుమెంటేషన్ని చూడండి.
Facebook డేటా షేరింగ్‌ని సెటప్ చేయండి
Facebook Shop మరియు Instagram Shoppingని సెటప్ చేస్తున్నప్పుడు మీరు కస్టమర్ డేటా షేరింగ్‌ని యాక్టివేట్ చేయవచ్చు. మీరు ఎప్పుడైనా Facebook and Instagram by Meta సెట్టింగ్‌లలో మీ Facebook కస్టమర్ డేటా షేరింగ్ సెట్టింగ్‌లను యాక్టివేట్ చేయవచ్చు లేదా మార్చవచ్చు.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, విక్రయ ఛానెల్‌లు > Facebook & Instagramకి వెళ్లండి.
సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
డేటా షేరింగ్ సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
కస్టమర్ డేటా షేరింగ్ విభాగంలో, కస్టమర్ డేటా షేరింగ్‌ను యాక్టివేట్ చేయండి.
స్థాయిని ఎంచుకోండి (CHOOSE LEVEL) విభాగంలో, మీరు యాక్టివేట్ చేయాలనుకుంటున్న కస్టమర్ డేటా షేరింగ్ స్థాయిని ఎంచుకోండి.
మీరు Meta పిక్సెల్‌ను కనెక్ట్ చేయకపోతే, కస్టమర్ డేటా షేరింగ్ కోసం మీరు ఉపయోగించాలనుకునే పిక్సెల్‌పై కనెక్ట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
కస్టమర్ డేటా-షేరింగ్ ఈవెంట్లు
మీరు Shopifyలో ఒక Meta పిక్సెల్‌ను జోడించిన తర్వాత, ఆ పిక్సెల్ మీ ఆన్లైన్ స్టోర్‌లోని నిర్దిష్ట ఈవెంట్లను ట్రాక్ చేస్తుంది, ఉదాహరణకు, కస్టమర్ ఏదైనా నిర్దిష్ట పేజీని చూసినప్పుడు ట్రాక్ చేస్తుంది. మీ స్టోర్‌తో కస్టమర్లు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారో తెలుసుకోవడానికి మీరు ఈ ఈవెంట్ల నుండి డేటాను ఉపయోగించవచ్చు. క్యాంపెయిన్లను క్రియేట్ చేయడానికి మరియు కన్వర్షన్లను ట్రాక్ చేయడానికి Meta పిక్సెల్ ఈవెంట్లను ఉపయోగించడం గురించి Facebook సహాయ కేంద్రంలో మరింత తెలుసుకోండి.
ఆర్డర్ విలువను ట్రాక్ చేసే ఈవెంట్లు ఆర్డర్ మొత్తం ధరను ఉపయోగిస్తాయి, ఇది సుంకాలు, పన్నులు మరియు తగ్గింపులతో సహా చెక్అవుట్లోని అన్ని ఐటెమ్‌ల ధరల మొత్తం.
Meta పిక్సెల్ ఈవెంట్లు
మీరు మీ ఆన్లైన్ స్టోర్‌కి Meta పిక్సెల్‌ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత, ఆ పిక్సెల్ కింది ఈవెంట్లను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తుంది.
| ఈవెంట్ పేరు | ఈవెంట్ వివరణ |
|---|---|
| PageView | సందర్శకుడు పేజీని వీక్షించినప్పుడు. |
| ViewContent | సందర్శకుడు ఉత్పత్తిని వీక్షించినప్పుడు. |
| Search | సందర్శకుడు సెర్చ్ చేసినప్పుడు. |
| AddToCart | సందర్శకుడు షాపింగ్ కార్ట్‌కి ఒక ఉత్పత్తిని జోడించినప్పుడు. |
| InitiateCheckout | సందర్శకుడు చెక్అవుట్ బటన్‌ను క్లిక్ చేసినప్పుడు. |
| AddPaymentInfo | సందర్శకుడు చెక్అవుట్లో చెల్లింపు సమాచారాన్ని నమోదు చేసినప్పుడు. |
| Purchase | సందర్శకుడు కొనుగోలును పూర్తి చేసి, చెక్అవుట్లో ధన్యవాదాల పేజీని చూసినప్పుడు. |
డేటా షేరింగ్ ఉత్తమ పద్ధతులు
మీ కస్టమర్ల వ్యక్తిగత సమాచారం ఎలా షేర్ చేయబడుతుందో మీరే నిర్ణయిస్తారు కాబట్టి, వారి వ్యక్తిగత సమాచారాన్ని మీరు ఎలా సేకరించి ప్రాసెస్ చేస్తారో వారికి అర్థమయ్యేలా చూసుకోవాలి. Facebookకి చెందిన Facebook వ్యాపార సాధనాల కోసం గోప్యత మరియు డేటా వినియోగ ఉత్తమ పద్ధతులను సమీక్షించడం మీ బాధ్యత, మరియు దీన్ని మరియు ఏదైనా ఇతర సంబంధిత సమాచారాన్ని మీ స్టోర్‌లోని గోప్యతా విధానంలో చేర్చాలి. గోప్యతా విధానాన్ని సృష్టించడంలో మీకు సహాయపడటానికి, మీరు Shopify గోప్యతా విధాన జనరేటర్‌ను ఉపయోగించవచ్చు.