పాప్అప్ ఫారమ్ సెట్టింగ్‌లు

కింది సెట్టింగ్‌లు మీ పాప్అప్ ఫారమ్‌ల స్వరూపం, ప్రవర్తనను నిర్ధారిస్తాయి. పాప్అప్, ఇన్‌లైన్ ఫారమ్‌లు రెండింటికీ వర్తించే సెట్టింగ్‌లతో పాటు మీరు ఫారమ్‌ను సృష్టించినప్పుడు ఈ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయవచ్చు.

ఫారమ్ ప్రదర్శన సెట్టింగ్

ఫారమ్ మీ స్టోర్‌లో ఎలా ప్రదర్శించబడుతుందనేది ఫారమ్ ప్రదర్శన సెట్టింగ్ నిర్ధారిస్తుంది.

పాప్అప్ ఫారమ్‌ల కోసం ఫారమ్ ప్రదర్శన విభాగం సెట్టింగ్‌లు.
సెట్టింగ్వివరణ
ఫ్లోటింగ్మీ స్టోర్‌ఫ్రంట్‌లో ప్రదర్శించబడే ఫ్లోటింగ్ విభాగం వలె టీజర్‌ని, ఫారమ్‌ని ప్రదర్శిస్తుంది మరియు మీ స్టోర్‌లో ఫారమ్ పొజిషన్‌ను ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఓవర్‌లేమిగిలిన స్టోర్‌ఫ్రంట్‌కి వర్తించేలా ఓవర్‌లే రంగుతో, ఫారమ్‌ను పేజీ మధ్యలో ప్రదర్శిస్తుంది.

టీజర్ సెట్టింగ్‌లు

మీ ఫారమ్ కోసం టీజర్ ఎప్పుడు ప్రదర్శించబడాలో టీజర్ సెట్టింగ్‌లు నిర్ధారిస్తాయి. టీజర్ విభాగం అనేది మీ స్టోర్‌లో ప్రదర్శించబడే చిన్న పాప్-అప్. కస్టమర్ టీజర్‌పై క్లిక్ చేసినట్లయితే, ఫారమ్ తెరవబడుతుంది.

పాప్అప్ ఫారమ్‌ల కోసం టీజర్ విభాగం సెట్టింగ్‌లు.
సెట్టింగ్వివరణ
చూపించండికస్టమర్‌లకు టీజర్ విభాగం ఎప్పుడు చూపించబడాలో నిర్ధారిస్తుంది.
  • మొదట (ఫారమ్‌కి ముందు): ఫారమ్‌కి ముందు టీజర్ విభాగాన్ని ప్రదర్శిస్తుంది.
  • ముందుగా (ఫారమ్‌కు ముందు) అలాగే కస్టమర్ ఫారమ్‌ను మూసివేసినట్లైతే: ఫారమ్‌కు ముందు టీజర్ విభాగాన్ని ప్రదర్శిస్తుంది, అలాగే ఒకవేళ కస్టమర్ ఫారమ్‌ను మూసివేస్తే టీజర్‌ను ప్రదర్శిస్తుంది.
  • కస్టమర్ సబ్‌స్క్రయిబ్ చేయకుండానే ఫారమ్‌ను మూసివేస్తే: ఒకవేళ కస్టమర్ ఫారమ్‌ను పూర్తి చేయకుండానే మూసివేస్తే టీజర్ విభాగాన్ని ప్రదర్శిస్తుంది.
  • ఎప్పటికీ వద్దు: కస్టమర్లందరి నుండి టీజర్ విభాగాన్ని దాచిపెడుతుంది. కస్టమర్ ఫారమ్‌ను పూర్తి చేయకుండానే మూసివేస్తే, వారు దాన్ని మళ్లీ యాక్సెస్ చేయలేరు.
మీ స్టోర్‌లో ఉండే స్థానంమీ స్టోర్‌లో టీజర్ ఎక్కడ ప్రదర్శితం అవ్వాలో నిర్ణయిస్తుంది. (రొటేట్ చేయబడిన) ప్రదర్శన ఎంపికలు, టీజర్ విభాగాన్ని దాని పక్కన ప్రదర్శిస్తాయి.
శీర్షికటీజర్ విభాగంపై ప్రదర్శితమయ్యే వచనం.

శైలి సెట్టింగ్‌లు

శైలి సెట్టింగ్‌లు మీ ఫారమ్ ఆకృతిని నిర్ణయిస్తాయి. ఒకదానికొకటి సరిగ్గా కలవని, తగినంత కాంట్రాస్ట్ లేని లేదా చదవడానికి కష్టంగా ఉండే రంగులను ఎంచుకుంటే, హెచ్చరిక ప్రదర్శితమవుతుంది.

Forms ఎడిటర్‌లోని బ్రాండ్ రంగుల విభాగంలో, మీరు కలర్ పికర్‌ను ఉపయోగించి బ్రాండ్ రంగులుగా జోడించిన రంగులను కనుగొనవచ్చు మరియు వాటిని ఎంచుకోవచ్చు.

పాప్అప్ ఫారమ్‌ల కోసం శైలి విభాగం యొక్క సెట్టింగ్‌లు.
సెట్టింగ్వివరణ
రంగులుమీ బ్రాండ్ మరియు థీమ్‌కి సరిపోయేలా ఫారమ్ నేపథ్యం, వచనం, యాక్టివ్ ఫీల్డ్, బటన్ లేబుల్ అలాగే ఎర్రర్ మెసేజ్‌ల రంగును మార్చండి.
ఫారమ్ ఫీల్డ్‌లుతెలుపు లేదా పారదర్శకమైన రంగును ఎంచుకోండి.
టైపోగ్రఫీమీ శీర్షిక మరియు ప్రధాన వచనం కోసం మీరు ఉపయోగించాలనుకుంటున్న ఫాంట్‌ను ఎంచుకోండి.

చిత్రం సెట్టింగ్‌లు

చిత్రం సెట్టింగ్‌లు మీ ఫారమ్‌లో ఇమేజ్ ప్రదర్శితం అవ్వాలో లేదో నిర్ణయిస్తాయి, అలాగే ఇమేజ్ ప్లేస్‌మెంట్ మరియు ఆకృతిని ప్రభావితం చేస్తాయి.

పాప్అప్ ఫారమ్‌ల కోసం చిత్రం విభాగం యొక్క సెట్టింగ్‌లు.
సెట్టింగ్వివరణ
చిత్రం ఎంపికమీ ఫారమ్‌లో ఇమేజ్ ఎక్కడ ప్రదర్శితమవుతుంది.
చిత్రంమీరు నేపథ్య చిత్రం, ఎడమవైపున చిత్రం లేదా కుడివైపున చిత్రం ఎంచుకుంటే, ఈ ఫీల్డ్ ప్రదర్శించబడుతుంది. మీ పరికరం నుండి ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయడానికి చిత్రాన్ని జోడించండి అనే ఎంపికను క్లిక్ చేయండి.
స్కేల్మీరు మీ ఫారమ్‌కు చిత్రాన్ని జోడిస్తే ఈ ఫీల్డ్ ప్రదర్శితమవుతుంది. ఇమేజ్ ఎలా ప్రదర్శించబడాలో మీరు ఎంచుకోవచ్చు.
చిత్రం ఒపాసిటీమీరు నేపథ్య చిత్రం ఎంపికను ఎంచుకుంటే, ఈ ఫీల్డ్ ప్రదర్శితమవుతుంది. స్లయిడర్‌ని ఉపయోగించడం ద్వారా మీరు ఇమేజ్ ఒపాసిటీని ఎంచుకోవచ్చు. ఇది 100 వద్ద ఉంటే, మీరు అప్‌లోడ్ చేసిన ఇమేజ్ మాత్రమే ప్రదర్శించబడుతుంది. ఒపాసిటీని తగ్గిస్తే, రంగుల విభాగంలో ఉండే నేపథ్య రంగుతో ఆ ఇమేజ్ షేడ్ చేయబడుతుంది.

ప్రవర్తన సెట్టింగ్‌లు

మీ ఫారమ్ ఎప్పుడు, ఎక్కడ ప్రదర్శితం అవ్వాలో ప్రవర్తన సెట్టింగ్‌లు నిర్ణయిస్తాయి.

పాప్అప్ ఫారమ్‌ల కోసం ప్రవర్తన విభాగం యొక్క సెట్టింగ్‌లు.
సెట్టింగ్వివరణ
పరికరాలుఫారమ్ అన్ని పరికరాల్లో ప్రదర్శితం కావాలా, కేవలం డెస్క్‌టాప్ పరికరాల్లో మాత్రమేనా, లేదా కేవలం మొబైల్ పరికరాల్లో మాత్రమేనా అనేది ఎంచుకోండి.
పేజీలుఫారమ్ అన్ని పేజీల్లో ప్రదర్శితం అవ్వాలా లేదా కేవలం నిర్దిష్ట పేజీల రకాలలోనా అనేది ఎంచుకోండి. ఉదాహరణకు, మీరు ఫారమ్‌ను కేవలం కలెక్షన్ లేదా ఉత్పత్తి పేజీల్లో మాత్రమే ప్రదర్శించవచ్చు.
ట్రిగ్గర్ఫారమ్‌ను ఒకటి, రెండు లేదా మూడవ పేజీ వీక్షణలో తక్షణమే లేదా కొంత ఆలస్యం తర్వాత ప్రదర్శించబడేలా మీరు ఎంచుకోవచ్చు. ఈ విభాగంలో, మీరు సందర్శకులు పేజీ నుండి నిష్క్రమించడానికి ప్రయత్నించినప్పుడు ఫారమ్‌ను చూపండి (డెస్క్‌టాప్‌లో మాత్రమే)ని కూడా చెక్ చేయవచ్చు. ఈ చెక్‌బాక్స్ ఎంపిక చేయబడితే, సందర్శకులు తమ కర్సర్‌ను అడ్రస్ బార్ వైపుకు తీసుకెళ్లినప్పుడు ఫారమ్ ప్రదర్శితమవుతుంది.