ఈవెంట్‌లను ముగించడం
Launchpad డాష్‌బోర్డ్ నుండి ముగింపు సమయం షెడ్యూల్ చేయబడిన వాటితో సహా, మీరు ఏ ఈవెంట్‌నైనా మాన్యువల్‌గా ఆపివేయవచ్చు. ఈవెంట్‌ను ముందుగానే ముగించడం ద్వారా, ఇన్వెంటరీలోని స్టాక్ అంతా అమ్ముడుపోవడం లేదా మీ మార్కెటింగ్ వ్యూహాన్ని సర్దుబాటు చేయడం వంటి మారుతున్న పరిస్థితులకు ప్రతిస్పందించడానికి మీకు వీలవుతుంది.
మీరు ఒక ఈవెంట్‌ను సృష్టించినప్పుడు, అది ముగిసే తేదీ, సమయాన్ని షెడ్యూల్ చేయవచ్చు. మీరు మీ ఈవెంట్‌కు ముగింపును షెడ్యూల్ చేస్తే, ఎంచుకున్న తేదీ, సమయానికి అది ఆటోమేటిక్‌గా ముగుస్తుంది. ఒకవేళ మీరు ముగింపు తేదీ, సమయాన్ని షెడ్యూల్ చేయకపోతే, మీరు తప్పనిసరిగా ఆ ఈవెంట్‌ను మాన్యువల్‌గా ఆపివేయాలి.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి యాప్‌లు > Launchpadకి వెళ్లండి.
మీరు ముగించాలనుకుంటున్న ఈవెంట్‌పై క్లిక్ చేయండి.
ఈవెంట్‌ను ముగించండిపై క్లిక్ చేసి, ఆపై సరే క్లిక్ చేయండి.
కింది మినహాయింపులతో మీ స్టోర్, ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందు ఏ స్థితిలో ఉందో, అదే స్థితికి తిరిగి మారుతుంది:
- మీ ఈవెంట్ విక్రయాల ఛానెల్‌లకు ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లయితే, ఈ ఉత్పత్తులు అలాగే అందుబాటులో ఉంటాయి.
- ఈవెంట్ ముగిసిన తర్వాత ఇన్వెంటరీలు సర్దుబాటు చేయబడవు.
- మీ ఈవెంట్ వ్యవధిలో మీరు వేరొక థీమ్‌ను ఉపయోగించడానికి ఎంచుకున్నట్లయితే, ఈవెంట్ ముగిసిన తర్వాత ఉపయోగించడానికి కూడా మీరు ఒక థీమ్‌ను ఎంచుకుని ఉంటారు. ఈవెంట్ ముగిసే సమయానికి, ఈ ఈవెంట్ తర్వాత ఉపయోగించే థీమ్ మీ స్టోర్‌కు వర్తింపజేయబడుతుంది.
ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో మరింత తెలుసుకోవడానికి, ఈవెంట్‌కి ముందు, ఈవెంట్ జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత జరిగే మార్పులు అనేదాన్ని చూడండి.