Shopify Messaging ఇమెయిల్ ధర నిర్ణయం

Shopify Messaging అనేది Basic, Grow, Advanced, Plus ప్లాన్‌లలో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లలో ఉన్న స్టోర్‌లన్నింటికీ ప్రతి నెలా ప్రారంభంలో పంపడానికి 10,000 ఉచిత ఇమెయిల్‌లు ఉంటాయి. మీరు 10,000 ఇమెయిల్‌లను పంపిన తర్వాత, ఛార్జీలు వర్తిస్తాయి.

ఇమెయిల్ ధర నిర్ణయ నియమాలు

Shopify Messaging ఇమెయిల్ ఖర్చు కింది నియమాలను ఉపయోగించి లెక్కించబడుతుంది:

  • ఇమెయిల్ యాక్టివిటీని ఏ వ్యక్తిగత ఇమెయిల్ అడ్రస్‌లకు పంపారనే దాని ఆధారంగా ఇమెయిల్‌లు లెక్కించబడతాయి. ఉదాహరణకు, 800 మంది సబ్‌స్క్రైబర్‌లకు 1 ప్రమోషనల్ ఇమెయిల్‌ను పంపితే, అది 800 ఇమెయిల్‌లుగా లెక్కించబడుతుంది.
  • మీరు ఒక క్యాలెండర్ నెలలో పంపే అన్ని ఇమెయిల్ క్యాంపెయిన్‌ల అంతటా 10,000 ఉచిత ఇమెయిల్‌లు షేర్ చేయబడతాయి.
  • మీరు 10,000 ఉచిత ఇమెయిల్‌లకు మించి అదనపు ఇమెయిల్‌లను పంపవచ్చు, ఇందుకు 3,00,000 ఇమెయిల్‌ల వరకు ప్రతి 1,000 అదనపు ఇమెయిల్‌లకు $1 USD ఖర్చవుతుంది. మీరు 3,00,000 ఇమెయిల్‌లను చేరుకున్న తర్వాత, మీ ధర ప్రతి 1,000 అదనపు ఇమెయిల్‌లకు $0.65 USDగా ఉంటుంది. మీరు 7,50,000 ఇమెయిల్‌లను చేరుకున్న తర్వాత, మీ ధర ప్రతి 1,000 అదనపు ఇమెయిల్‌లకు $0.55 USDగా ఉంటుంది. అదనపు ఇమెయిల్‌ల ఖర్చు $0.005 USDకి చేరుకునే వరకు మీకు బిల్లు చేయబడదు.
  • Shopify Messaging ఇమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్‌లు క్యాలెండర్ నెలలో మీ 10,000 ఉచిత ఇమెయిల్‌లలో పరిగణించబడతాయి. అయితే, వదిలివేసిన చెక్‌అవుట్ ఇమెయిల్‌లు ఎల్లప్పుడూ ఉచితం మరియు నెలవారీ పరిమితిలో పరిగణించబడవు.
  • మీరు పంపే ఇమెయిల్‌లకు మాత్రమే మీ నుండి ఛార్జీ వసూలు చేయబడుతుంది.
  • ఉపయోగించని ఇమెయిల్‌లు తర్వాతి నెలకు క్యారీ ఫార్వార్డ్ అవ్వవు.

ఉదాహరణకు, మీరు అక్టోబర్‌లో ఒక్కో క్యాంపెయిన్‌కు 6,000 మంది సబ్‌స్క్రైబర్‌ల చొప్పున 2 ఇమెయిల్ క్యాంపెయిన్‌లను పంపితే, 12,000 ఇమెయిల్‌ల ఖర్చు కింది విధంగా ఉంటుంది:

  • 10,000 ఉచిత ఇమెయిల్‌లు
  • ప్రతి 1,000 ఇమెయిల్‌లకు $1 USD చొప్పున 2,000 ఇమెయిల్‌లకు అయ్యే ఛార్జీ, మొత్తం $2 USD

మీ Shopify బిల్లులో Shopify Messaging ఇమెయిల్ ఖర్చులను వీక్షించండి

ఏవైనా అదనపు ఇమెయిల్ ఖర్చులు గత నెల మీ Shopify బిల్లులో మార్కెటింగ్ ఇమెయిల్‌లుగా జోడించబడతాయి. ప్రతి ఇమెయిల్ యాక్టివిటీ ఖర్చుకు సంబంధించిన తదుపరి వివరాల కోసం, మీ Shopify అడ్మిన్‌లోని బిల్లింగ్ విభాగంలో ఉన్న వివరాలను వీక్షించండిపై క్లిక్ చేయండి.

నెలవారీ ఖర్చుల పరిమితిని సెట్ చేయడం

మీ మొత్తం Shopify Messaging ఖర్చులు మీరు సెట్ చేసిన మొత్తానికి చేరుకున్నప్పుడు ఇమెయిల్ నోటిఫికేషన్‌ను పొందడానికి, మీరు నెలవారీ ఖర్చుల పరిమితిని సెట్ చేయవచ్చు. ఇమెయిల్, SMS, WhatsAppలలో మీరు కలిపి చేసే ఖర్చుకు ఈ పరిమితి వర్తిస్తుంది.

మీరు మీ నెలవారీ ఖర్చుల అలర్ట్‌ను వీక్షించినప్పుడు, మీ ఖర్చులు ఛానెల్, సోర్స్ వారీగా విభజించి చూపబడతాయి, తద్వారా మీ నెలవారీ ఖర్చులు ఎక్కడ నుండి వచ్చాయో మీరు అర్థం చేసుకోవచ్చు.