పిక్సెల్‌లను మైగ్రేట్ చేయడం

మీరు గతంలో మీ స్టోర్‌కు theme.liquid, checkout.liquid (Shopify Plus ప్లాన్‌లో మాత్రమే), మీ చెక్‌అవుట్ సెట్టింగ్‌లు లోని అదనపు స్క్రిప్ట్‌లు లాంటి లొకేషన్‌కు, లేదా ప్రాధాన్యతలు పేజీలో మాన్యువల్‌గా పిక్సెల్‌ను జోడించినట్లయితే, మీరు Shopify యాప్ పిక్సెల్ లేదా కస్టమ్ పిక్సెల్‌కు అనుకూలంగా ఉండేలా మీ పిక్సెల్‌లను మైగ్రేట్ చేయవచ్చు. మీ పాత పిక్సెల్‌లను మైగ్రేట్ చేయడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలివి:

  • చెక్‌అవుట్ ఈవెంట్‌లతో సహా, కస్టమర్ ఈవెంట్‌ల ట్రాకింగ్‌ను మరింత సులభంగా యాక్సెస్ చేయొచ్చు.
  • గోప్యతకు అనుగుణంగా ఉండటానికి అవసరమైన అంతర్నిర్మిత టూల్స్.
  • Shopify, అలాగే పిక్సెల్ ప్రొవైడర్‌ల ద్వారా నిరంతర నిర్వహణ ఇంకా మెరుగుదలలు ఉంటాయి.

Shopify పిక్సెల్ మేనేజర్ గురించి, అలాగే Shopify యాప్ పిక్సెల్‌లు లేదా కస్టమ్ పిక్సెల్‌లకు మైగ్రేట్ చేయడం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

మీ ప్రాధాన్యతల పేజీ నుండి Meta, Google పిక్సెల్‌లను మైగ్రేట్ చేయడం

తాజా పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్ (PCI DSS) భద్రతా ప్రమాణాలు, అలాగే నిబంధనలకు అనుగుణంగా ఉండటం కోసం మీ Shopify అడ్మిన్‌లోని Meta, Google ఎనలిటిక్స్ పిక్సెల్ మేనేజ్‌మెంట్ సెట్టింగ్‌లు అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. ఈ మార్పు వల్ల మీ వ్యాపారం, ఇంకా కస్టమర్ సమాచారం డేటా ఉల్లంఘనలు, మోసాల బారిన పడకుండా సురక్షితంగా ఉంటాయి. మీ స్టోర్ PCI DSS v4కు అనుగుణంగా ఉండేందుకు Shopify ఎలా సహాయపడుతుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

అత్యంత కచ్చితమైన ట్రాకింగ్, పనితీరు కోసం, కింది ఛానెల్‌లలో ఒకదానికి పిక్సెల్‌ను మైగ్రేట్ చేయండి:

  • మీ Meta పిక్సెల్‌ను Facebook & Instagram ఛానెల్‌కు మైగ్రేట్ చేయండి.
  • మీ Google ఎనలిటిక్స్ పిక్సెల్‌ను Google & YouTube ఛానెల్‌కు మైగ్రేట్ చేయండి.

Google & YouTube ఛానెల్ యాప్‌కు Google ఎనలిటిక్స్ పిక్సెల్‌ను మైగ్రేట్ చేయడం

మీరు మీ ట్యాగ్‌ను Google & YouTube ఛానెల్ యాప్‌కు తరలించకపోతే, మీ కొలతల్లో కొనసాగింపు కోసం అది కస్టమ్ పిక్సెల్‌గా మార్చబడి ఉండవచ్చు. దీని వల్ల Google ఎనలిటిక్స్‌లోని కొలత పనితీరు, ఫీచర్‌లు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా, మీరు కింది పరిణామాలను ఆశించవచ్చు:

  • ఈవెంట్ కొలత, ట్యాగ్ ప్రవర్తనలలో గల తేడాల వల్ల Google ఎనలిటిక్స్‌లో రిపోర్ట్ చేయబడే డేటా మారవచ్చు (లేదా కొన్నిసార్లు పోవచ్చు).
  • మెరుగైన కొలత, ఇంకా క్రాస్-డొమైన్ కొలత లాంటి Google ఎనలిటిక్స్ ముఖ్యమైన ఫీచర్‌లు సరిగ్గా పని చేయకపోవచ్చు.
  • ట్యాగ్ అసిస్టెంట్ పని చేయకపోవచ్చు లేదా మీ GA4 ట్యాగ్‌పై తప్పుగా రిపోర్ట్ చేయవచ్చు.
  • ట్యాగ్ డయాగ్నస్టిక్స్ మీ GA4 ట్యాగ్‌ను సరిగ్గా గుర్తించలేకపోవచ్చు లేదా మీకు పని చేయని ఫీచర్‌లను రికమెండ్ చేయవచ్చు.
  • మీరు గతంలో అదనపు Google ఎనలిటిక్స్ జావాస్క్రిప్ట్ (Javascript) విభాగానికి జోడించిన సెట్టింగ్‌లు తొలగించబడతాయి.
  • మీ Google ఎనలిటిక్స్ ట్యాగ్‌కు సంబంధించిన సమ్మతి ట్రీట్‌మెంట్ మారవచ్చు.

మీ theme.liquid, checkout.liquid లేదా అదనపు స్క్రిప్ట్‌ల నుండి పాత పిక్సెల్‌ను మైగ్రేట్ చేయండి

మీ theme.liquid, checkout.liquid లేదా అదనపు స్క్రిప్ట్‌ల నుండి పాత పిక్సెల్‌ను మైగ్రేట్ చేస్తున్నప్పుడు మీరు కిందివాటిలో ఏదైనా ఒకటి చేయవచ్చు:

కస్టమర్ ఈవెంట్‌లు నకిలీ కాకుండా లేదా మిస్ అవ్వకుండా నిరోధించడానికి, మీ స్టోర్‌కు అంతగా రద్దీ లేని సమయంలో పిక్సెల్‌లను మైగ్రేట్ చేయడం ఉత్తమం.

పిక్సెల్‌ను మైగ్రేట్ చేయడానికి సిద్ధమవడటం

మీ మైగ్రేషన్ వర్క్‌ఫ్లోను నిర్ణయించేటప్పుడు కింది అంశాలను పరిగణనలోకి తీసుకోండి:

  • మీరు ఏ కస్టమర్ ఈవెంట్‌లను కూడా కోల్పోకూడదు అనుకుంటే, మీ పాత పిక్సెల్‌ను తీసివేయడానికి ముందే కొత్త కస్టమ్ పిక్సెల్‌ను కనెక్ట్ చేయండి.
  • కస్టమర్ ఈవెంట్ ట్రాకింగ్ నకిలీ అవ్వడాన్ని నివారించాలనుకుంటే, మీ పాత పిక్సెల్‌ను తీసివేసిన తర్వాత మీ కొత్త కస్టమ్ పిక్సెల్‌ను కనెక్ట్ చేయండి.
  • పాత పిక్సెల్‌ను మైగ్రేట్ చేయడానికి, మీరు దాన్ని తీసివేయడానికి లేదా మార్చడానికి ముందు మీ పాత పిక్సెల్ కోడ్‌ను కనుక్కోవాలి. చాలా వరకు పిక్సెల్‌లు మీరు కనుగొనాల్సిన రెండు భాగాలను కలిగి ఉంటాయి:
    • ఒక బేస్ జావాస్క్రిప్ట్ (Javascript) SDK: జావాస్క్రిప్ట్ SDK అనేది సాధారణంగా మీ హెడర్‌లో ఉంచబడుతుంది, అలాగే దీన్ని మీ చెక్‌అవుట్ సెట్టింగ్‌లలోని theme.liquid, అదనపు స్క్రిప్ట్‌లు లోపల కనుగొనవచ్చు.
    • కస్టమర్ ఈవెంట్‌లను సేకరించడానికి పాత పిక్సెల్ కోడ్: మీరు సాధారణంగా మీ చెక్‌అవుట్ సెట్టింగ్‌లలోని మీ థీమ్ లిక్విడ్ ఫైల్స్‌, అదనపు స్క్రిప్ట్‌ల లో ఈ కోడ్‌ను కనుగొనవచ్చు. మీరు దేని గురించి వెతుకుతున్నారో మీకు తెలియడానికి, కస్టమర్ ఈవెంట్‌లు ఎలా ఉంటాయి అనే దాని గురించి థర్డ్-పార్టీ పిక్సెల్ ప్రొవైడర్ డాక్యుమెంటేషన్‌ను చూడండి. ఉదాహరణకు, Meta పిక్సెల్‌కు fbq() అని పిలువబడే పద్ధతి ఉంది, అలాగే Google పిక్సెల్‌లు తరచుగా gtag() లేదా dataLayer.push()ను ఉపయోగిస్తాయి.

యాప్ పిక్సెల్‌తో అనుకూలంగా ఉండేలా పాత పిక్సెల్‌ను మైగ్రేట్ చేయండి

కింది రెండు షరతులు వర్తిస్తే, మీరు పాత పిక్సెల్‌ను యాప్ పిక్సెల్‌తో అనుకూలంగా ఉండేలా మైగ్రేట్ చేయాలనుకోవచ్చు:

  • మీరు కస్టమర్ ఈవెంట్‌లను ఆటోమేటిక్‌గా సేకరించే Shopify యాప్ పిక్సెల్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే.
  • యాప్ పిక్సెల్ ద్వారా ట్రాక్ చేయబడని కస్టమ్ ఈవెంట్‌ల కోసం మీరు కొంత అదనపు కోడ్‌ను కూడా జోడించినట్లయితే.

ఈ సందర్భంలో, పాత పిక్సెల్‌ను మైగ్రేట్ చేయడానికి మీరు యాప్ డెవలపర్ సూచనలను తప్పక ఫాలో అవ్వాలి.

పాత పిక్సెల్‌ను కస్టమ్ పిక్సెల్‌కు మైగ్రేట్ చేయండి

కింది రెండు షరతులు వర్తిస్తే, మీరు పాత పిక్సెల్‌ను కస్టమ్ పిక్సెల్‌కి మైగ్రేట్ చేయాలనుకోవచ్చు:

  • మీరు ఎలాంటి Shopify యాప్ ఇన్‌స్టాల్ చేయకుండా, మీరు మ్యాన్యువల్‌గా కోడ్ వ్రాసిన, ఇంతకుముందు ఇన్‌స్టాల్ చేసిన పిక్సెల్ మీ వద్ద ఉంది.
  • మీ అవసరాలను తీర్చే Shopify యాప్ పిక్సెల్ ఏదీ లేదు.

మీరు మీ పాత పిక్సెల్ కోడ్‌ను తీసివేయడానికి ముందు లేదా తర్వాత మీ కొత్త కస్టమ్ పిక్సెల్‌ను కనెక్ట్ చేయవచ్చు.

దశలు:

  1. మీకు అవసరమైన స్టాండర్డ్, కస్టమ్ కస్టమర్ ఈవెంట్‌లకు సబ్‌స్క్రయిబ్ అయ్యేలా కస్టమ్ పిక్సెల్‌ను సృష్టించండి.
  2. మీ చెక్‌అవుట్ సెట్టింగ్‌లలోని మీ లిక్విడ్ ఫైల్‌లు లేదా అదనపు స్క్రిప్ట్‌ల నుండి ఇంతకుముందు జోడించిన ఏదైనా పిక్సెల్ కోడ్‌ను తీసివేయండి లేదా భర్తీ చేయండి. ఇందులో Javascript SDKని కలిగి ఉన్న, స్టాండర్డ్ ఈవెంట్‌లను సేకరించే లేదా స్టాండర్డ్ కాని ఈవెంట్‌లను సేకరించే పాత పిక్సెల్ కోడ్ ఉండవచ్చు.
  3. మీ స్టోర్‌కు మీ కస్టమ్ పిక్సెల్‌ను జోడించండి.
  4. మీ కస్టమ్ పిక్సెల్‌ను కనెక్ట్ చేయండి.

పాత పిక్సెల్ కోడ్‌ను తీసివేయడం లేదా భర్తీ చేయడం

మీ పాత పిక్సెల్ కోడ్‌ను కనుగొన్న తర్వాత, పిక్సెల్ ఏ రకమైన ఈవెంట్‌ను ట్రాక్ చేస్తోంది అనేదాని ఆధారంగా, మీరు దాన్ని తీసివేయాలి లేదా Shopifyకి చెందిన Shopify.analytics.publish() పద్ధతితో భర్తీ చేయాలి:

  • మీకు కనిపించే Javascript SDKల యొక్క అన్ని ఇన్‌స్టాన్స్‌లను మీరు తీసివేయవచ్చు.
  • ఒకవేళ పాత పిక్సెల్ స్టాండర్డ్ కస్టమర్ ఈవెంట్‌ను ట్రాక్ చేస్తుంటే, అలాగే మీరు జోడించాలనుకుంటున్న కస్టమ్ పిక్సెల్ లేదా యాప్ పిక్సెల్ ఆ స్టాండర్డ్ కస్టమర్ ఈవెంట్‌ను సేకరించడానికి మద్దతు ఇస్తే, మీరు దాని కోడ్‌ను తీసివేయాలి.
  • ఒకవేళ పాత పిక్సెల్ కస్టమ్ కస్టమర్ ఈవెంట్‌ను ట్రాక్ చేస్తుంటే, అలాగే మీరు జోడించాలనుకుంటున్న కస్టమ్ పిక్సెల్ లేదా యాప్ ఆ కస్టమ్ కస్టమర్ ఈవెంట్‌లను సేకరించడానికి మద్దతు ఇస్తే, మీరు దాని కోడ్‌ను భర్తీ చేయాలి.

స్టాండర్డ్ కాని కస్టమర్ ఈవెంట్‌ను ట్రాక్ చేసే పాత పిక్సెల్ కోడ్ ఉదాహరణ ఇక్కడ ఉంది:

<script>fbq("trackCustom", "my_custom_event");</script>

దీనితో భర్తీ చేయడానికి సమానమైన కోడ్ ఉదాహరణ ఇక్కడ ఉంది:

<script>Shopify.analytics.publish("my_custom_event");</script>

ఒకవేళ మీరు కస్టమ్ పిక్సెల్‌ను సృష్టిస్తుంటే, ఈ ఉదాహరణ లాగా కస్టమ్ ఈవెంట్‌కు సబ్‌స్క్రయిబ్ అయ్యే కోడ్‌ను మీరు చేర్చాలి:

analytics.subscribe("my_custom_event", event => {
  fbq("trackCustom", "my_custom_event");
});

మైగ్రేషన్ తర్వాత ట్రబుల్షూటింగ్

వెబ్ పిక్సెల్‌లకు మైగ్రేట్ చేసిన తర్వాత, మీ మునుపటి సెటప్‌తో పోలిస్తే ట్రాక్ చేసిన ఈవెంట్‌ల సంఖ్యలో తేడాలను మీరు గమనించవచ్చు. కొన్ని బాట్‌లు వెబ్ పిక్సెల్ శాండ్‌బాక్స్‌ను ట్రిగ్గర్ చేయవు కాబట్టి, ఈవెంట్ కౌంట్‌లలో సింగిల్-డిజిట్ శాతంలో తగ్గుదల సాధారణమే. మీకు పెద్ద వ్యత్యాసాలు కనిపిస్తుంటే, సాధ్యమయ్యే కారణాల కోసం ఈ విభాగాన్ని సమీక్షించండి.

వ్యత్యాసం ఎక్కడ ఉందో గుర్తించడంలో సహాయపడటానికి కింది చెక్‌లిస్ట్‌ను ఉపయోగించండి:

  • ఆశించిన ఈవెంట్‌లన్నీ ఫైర్ అవుతున్నాయని నిర్ధారించుకోండి.
  • మీ పాత, కొత్త సెటప్‌ల మధ్య ఇంప్లిమెంటేషన్ లాజిక్ ఒకే విధంగా ఉందో లేదో నిర్ధారించుకోండి.
  • ప్రతి ఈవెంట్ 1 సారి మాత్రమే ట్రాక్ చేయబడిందని నిర్ధారించుకోండి.
  • మీరు ఒకే ఎనలిటిక్స్ సర్వీస్ నుండి నంబర్‌లను పోల్చుతున్నారని నిర్ధారించుకోండి.
  • మీ గోప్యతా సెట్టింగ్‌లు మీ మునుపటి సెటప్‌తో సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి.
  • ఒకవేళ సమ్మతి అవసరమైతే, మీరు దానిని సేకరిస్తున్నారని నిర్ధారించుకోండి.

మీరు ఎదుర్కొంటున్న సమస్యను ఎంచుకోండి, ఆపై ట్రబుల్షూటింగ్ దశలను అనుసరించండి.

కొన్ని ఈవెంట్‌లు ఫైర్ అవ్వడం లేదు.

ఆశించిన ఈవెంట్‌లన్నీ ఫైర్ అవుతున్నాయో లేదో వెరిఫై చేయండి. ఈవెంట్ ఫైర్ కాకపోతే, దాన్ని ట్రాక్ చేయడం సాధ్యపడదు.

డీబగ్ చేయడానికి, మీ పిక్సెల్ కోడ్‌కు console.logని జోడించండి, అలాగే మీ బ్రౌజర్ డెవలపర్ టూల్స్‌లో మీ ఎనలిటిక్స్ భాగస్వామికి డేటా పంపబడుతోందో లేదో తనిఖీ చేయండి. ఈవెంట్‌లు ఫైర్ కాకపోతే, ఎర్రర్‌ల కోసం మీ పిక్సెల్ కోడ్‌ను సమీక్షించండి.

ఈవెంట్ నిర్వచనాలు లేదా లాజిక్ మారింది.

page_viewed లేదా checkout_started వంటి ఈవెంట్‌ల నిర్వచనం అనేది అమలును (implementations) బట్టి మారవచ్చు. ఉదాహరణకు, మీరు ఇంతకుముందు URL పాత్ మ్యాచింగ్‌ని ఉపయోగించి ఉత్పత్తి వీక్షణలను ట్రాక్ చేసి, ఇప్పుడు Shopify స్టాండర్డ్ ఈవెంట్‌లను ఉపయోగిస్తుంటే, ఫలితాలు వేరుగా ఉండవచ్చు.

మీ కొత్త ఇంప్లిమెంటేషన్, మీ పాతదాని లాగానే అదే లాజిక్‌ను ఉపయోగిస్తుందని నిర్ధారించుకోండి. ఇంప్లిమెంటేషన్ లాజిక్‌లో తేడా ఉంటే, ఈవెంట్ కౌంట్‌లలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు.

ఈవెంట్‌లు 1 సారి కంటే ఎక్కువసార్లు కౌంట్ చేయబడ్డాయి.

మైగ్రేట్ చేసేటప్పుడు వచ్చే ఒక సాధారణ సమస్య ఏమిటంటే, ఒకే ఈవెంట్‌ను 1 సారి కంటే ఎక్కువసార్లు ట్రాక్ చేయడం. మీ థీమ్ కోడ్, యాప్ లేదా మీ అడ్మిన్‌లోని కస్టమర్ ఈవెంట్‌లు విభాగం లాగా 1 కంటే ఎక్కువ స్థానాల్లో ఒకే ఈవెంట్ ట్రాక్ చేయబడవచ్చు. మీరు గతంలో అదనపు స్క్రిప్ట్‌లు లేదా checkout.liquid ద్వారా ట్రాకింగ్ కోడ్‌ని జోడించి ఉంటే, అక్కడ మిగిలిపోయిన ఏదైనా కోడ్ నకిలీ ట్రాకింగ్‌కు కారణం కావచ్చు.

నకిలీ ట్రాకింగ్ కోసం తనిఖీ చేయడానికి, మీ బ్రౌజర్ డెవలపర్ టూల్స్‌ను తెరిచి, ఒకే పేజీ లోడ్ లేదా ఈవెంట్ సమయంలో ఒకే ఎనలిటిక్స్ ఎండ్‌పాయింట్‌కు వెళ్లే బహుళ అభ్యర్థనల కోసం తనిఖీ చేయండి.

ఎనలిటిక్స్ సర్వీస్‌లలో నంబర్‌లు వేరుగా ఉంటాయి.

విభిన్న ఎనలిటిక్స్ సర్వీస్‌లు డేటాను విభిన్న మార్గాల్లో ప్రాసెస్ చేస్తాయి, ఫిల్టర్ చేస్తాయి. కొన్ని సర్వీస్‌లు అనుమానాస్పద బాట్ ట్రాఫిక్‌ను ఫిల్టర్ చేస్తాయి. మరికొన్ని తప్పిపోయిన డేటాను అంచనా వేస్తాయి. విభిన్న మార్గాల్లో డేటాను ప్రాసెస్ చేసే Google ఎనలిటిక్స్, GA4 మధ్య కూడా, వేర్వేరు సర్వీస్‌లలో ఈవెంట్ కౌంట్‌లను పోల్చవద్దు.

ఫలితాలను కచ్చితంగా పోల్చడానికి, ఒకే సర్వీస్ కోసం ప్రత్యేక అకౌంట్ లేదా పిక్సెల్‌ను సృష్టించి, దాన్ని సమాంతరంగా రన్ చేయండి.

గోప్యతా సెట్టింగ్‌లు ఈవెంట్‌లను బ్లాక్ చేస్తున్నాయి.

వెబ్ పిక్సెల్‌లు ఎల్లప్పుడూ మీ స్టోర్ గోప్యతా సెట్టింగ్‌లను గౌరవిస్తాయి. మీ మునుపటి పిక్సెల్ సెటప్ అలా చేయకపోయి ఉంటే, మైగ్రేట్ చేసిన తర్వాత మీరు తక్కువ సంఖ్యలో ట్రాక్ చేసిన ఈవెంట్‌లను చూడవచ్చు.

మీ Shopify అడ్మిన్ నుండి, సెట్టింగ్‌లు > కస్టమర్ గోప్యతకి వెళ్లి, మీ సెట్టింగ్‌లు మునుపటి కాన్ఫిగరేషన్‌తో సరిపోలుతున్నాయో లేదో నిర్ధారించుకోండి.

ఒక థర్డ్-పార్టీ సమ్మతి టూల్, Shopifyకి సింక్ కావడం లేదు.

ఒకవేళ కుక్కీ సమ్మతిని మేనేజ్ చేయడానికి మీరు థర్డ్-పార్టీ సమ్మతి టూల్‌ను ఉపయోగిస్తుంటే, ఎవరి సమ్మతి అయితే Shopifyకి సింక్ కాలేదో, ఆ కస్టమర్‌ల కోసం మీ వెబ్ పిక్సెల్‌లు ఫైర్ కాకపోవచ్చు. మీ సమ్మతి టూల్ Customer Privacy APIని ఉపయోగించనప్పుడు ఇలా జరగవచ్చు.

దీన్ని పరిష్కరించడానికి, Customer Privacy APIని ఉపయోగించి మీ సమ్మతి టూల్ సమ్మతి స్టేటస్‌ను Shopifyకి సింక్ చేస్తుందని నిర్ధారించుకోండి.