Apple TV కోసం Shopcast

Shopcast అనేది Shopify Inc. ద్వారా రూపొందించబడిన ఒక ఉచిత Apple TV యాప్, ఇది టీవీని మీ Shopify స్టోర్ కోసం డాష్‌బోర్డ్‌గా మారుస్తుంది. మీ ఆఫీస్, స్టాక్‌రూమ్, రిటైల్ స్పేస్ లేదా టీమ్ రూమ్‌లోని టీవీలో మీ సేల్స్, ఆర్డర్‌లు, అగ్ర ఉత్పత్తులు, Shopify POS యాక్టివిటీ, ఇంకా మీ ఆర్డర్‌ల లొకేషన్‌లను ప్రదర్శించడానికి దీన్ని మీరు ఉపయోగించవచ్చు. తద్వారా Shopify అడ్మిన్‌ను తెరవకుండానే రోజంతా మీ వ్యాపార పనితీరును మీ సిబ్బంది గమనించవచ్చు.

Shopcast మీ స్టోర్ డేటాను ప్రదర్శిస్తుంది, కానీ మార్పులు చేయడానికి దీన్ని మీరు ఉపయోగించలేరు. మీరు మీ Shopify ఖాతాతో సైన్ ఇన్ అయి, ప్రదర్శించడానికి స్టోర్‌లను ఎంచుకున్న తర్వాత, డాష్‌బోర్డ్ వీక్షణల మధ్య నావిగేట్ చేయడానికి Apple TV రిమోట్‌ను ఉపయోగిస్తారు. మీరు మీ Shopify అడ్మిన్‌లో ఆర్డర్‌లు, ఉత్పత్తులు, సెట్టింగ్‌ల నిర్వహణను యథావిధిగా కొనసాగించవచ్చు.

మీరు Apple TV కోసం రూపొందించిన Shopcastను Shopify App Store నుండి కాకుండా, మీ Apple TVలో ఉన్న App Storeలోని Shopcast లిస్టింగ్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. Apple TVకి చెందిన Shopcast, ఇదే విధమైన పేరుతో ఉండే Shopify App Storeలోని యాప్‌లకు సంబంధించినది కాదు.

ఈ విభాగంలో