మీ Shopify రిపోర్ట్‌లలో మెట్రిక్‌ల కోసం లక్ష్యాలను సెట్ చేయడం
నిర్దిష్ట వ్యాపార లక్ష్యాల దిశగా మీ పురోగతిని ట్రాక్ చేయడానికి మీ Shopify రిపోర్ట్‌లు, అలాగే అనలిటిక్స్‌లో మీరు కీలక మెట్రిక్‌ల కోసం లక్ష్యాలను సెట్ చేయవచ్చు. లక్ష్యాలు రాబడి లక్ష్యం లేదా సెషన్ బెంచ్‌మార్క్ వంటి స్పష్టమైన లక్ష్యాలను సెట్ చేసుకోవడానికి, కాలక్రమేణా మీ వాస్తవ పనితీరును పోల్చుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.
లక్ష్యం అనేది నిర్దిష్ట సమయ వ్యవధిలో నిర్దిష్ట మెట్రిక్ కోసం ఒక సంఖ్యాపరమైన లక్ష్యం. ఉదాహరణకు, మీరు మార్చి కోసం స్థూల విక్రయాలలో $50,000 USD లక్ష్యాన్ని లేదా సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి 500 ఆర్డర్‌లను సెట్ చేయవచ్చు.
ప్రతి లక్ష్యం కింది అంశాలను కలిగి ఉంటుంది:
- మెట్రిక్: స్థూల విక్రయాలు, ఆర్డర్‌లు లేదా కన్వర్షన్ రేట్ వంటి మీరు ట్రాక్ చేసే కొలమానం. విక్రయాల ఛానెల్ లేదా ఉత్పత్తి వంటి నిర్దిష్ట డైమెన్షన్‌కు మీ లక్ష్యాన్ని పరిమితం చేయడానికి మీరు ఐచ్ఛిక ఫిల్టర్‌ను కూడా చేర్చవచ్చు.
- లక్ష్యపు మొత్తం: మీరు చేరాలనుకుంటున్న $5000 USD లేదా 75% వంటి విలువ.
- సమయ వ్యవధి: వారం, నెల, త్రైమాసికం, సంవత్సరం లేదా అనుకూల పరిధి వంటి లక్ష్యం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అనే దాని ద్వారా నిర్వచించబడిన సమయ వ్యవధి.
మీరు లక్ష్యాన్ని సృష్టించినప్పుడు, ఒక టార్గెట్ గేజ్ పూర్తయిన శాతం, లక్ష్యపు విలువకు భిన్నంగా ప్రస్తుత విలువ, స్థితి, అలాగే మిగిలిన రోజులతో సహా మీ పురోగతిని ప్రదర్శిస్తుంది.
ఈ పేజీలో
Shopify రిపోర్ట్‌లలో లక్ష్యాలను ఉపయోగించడానికి పరిగణనలు
మీ Shopify రిపోర్ట్‌లు, అలాగే అనలిటిక్స్ కోసం మీరు లక్ష్యాలను సృష్టించడానికి ముందు, కింది పరిగణనలను రివ్యూ చేయండి:
- లక్ష్యాలు కేవలం స్థిర మొత్తాలకు మాత్రమే మద్దతు ఇస్తాయి. వృద్ధి రేట్లు, నిష్పత్తులు, అలాగే పేసింగ్‌కు మద్దతు లేదు.
- మీరు ప్రతి లక్ష్యానికి 1 ఫిల్టర్‌ను మాత్రమే జోడించగలరు.
- లక్ష్యాలు ఒక్కో స్టోర్‌కు సృష్టించబడతాయి, అలాగే ట్రాక్ చేయబడతాయి.
లక్ష్యాన్ని సృష్టించండి
స్క్రీన్ కుడి వైపు పైభాగంలో ఉన్న లక్ష్యాన్ని సృష్టించండి బటన్‌ను ఉపయోగించి మీ Shopify అడ్మిన్‌లోని అనలిటిక్స్ పేజీ నుండి మీరు మీ మొదటి లక్ష్యాన్ని సృష్టించవచ్చు.
లక్ష్యాన్ని సృష్టిస్తున్నప్పుడు, సృష్టించే ప్రాసెస్‌లో మీ అనలిటిక్స్ ఓవర్‌వ్యూ డ్యాష్‌బోర్డ్‌లో కార్డ్‌గా లక్ష్యాన్ని జోడించడాన్ని మీరు ఎంచుకోవచ్చు.
మీరు లక్ష్యాన్ని సృష్టించిన తర్వాత, లక్ష్య ప్రమాణాల ఆధారంగా లక్ష్యపు స్థితి డ్రాఫ్ట్ స్థితి నుండి దాని యాక్టివ్ స్థితికి అప్‌డేట్ అవుతుంది.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, అనలిటిక్స్కు వెళ్లండి.
మీరు ఇప్పటికే కనీసం 1 లక్ష్యాన్ని సేవ్ చేసి ఉంటే లక్ష్యాన్ని సృష్టించండి లేదా లక్ష్యాలను నిర్వహించండి > లక్ష్యాన్ని సృష్టించండిపై క్లిక్ చేయండి.
మెట్రిక్ మెనూలో, మీరు మీ లక్ష్యం కోసం ఉపయోగించాలనుకుంటున్న మెట్రిక్‌ను ఎంచుకోండి:
- మెనూపై క్లిక్ చేసి, సూచించిన మెట్రిక్‌ల నుండి ఎంచుకోండి లేదా కేటగిరీల వారీగా బ్రౌజ్ చేయండి.
- ఐచ్ఛికం: లక్ష్యాన్ని నిర్దిష్ట డైమెన్షన్‌కు పరిమితం చేయడానికి ఒక ఫిల్టర్‌ను జోడించడానికి,
పై క్లిక్ చేసి, ఆపై కేటగిరీ లేదా కీవర్డ్ ద్వారా ఒక ఫిల్టర్‌ను ఎంచుకోండి.
లక్ష్యపు మొత్తం ఫీల్డ్‌లో, $5000 USD లేదా 75% వంటి మీ లక్ష్యపు మొత్తాన్ని ఎంటర్ చేయండి. ఈ విలువ తప్పనిసరిగా సున్నా కంటే ఎక్కువ ఉండాలి.
సమయ వ్యవధి మెనూ నుండి, మీ లక్ష్యం కోసం ఒక సమయ వ్యవధిని ఎంచుకోండి. డిఫాల్ట్‌గా ప్రస్తుత నెల ఉంటుంది. మీరు కింది ఆప్షన్‌లలో ఒకదానిని ఎంచుకోవచ్చు:
- ముందుగా సెట్ చేసిన సమయ వ్యవధిని ఉపయోగించడానికి, వారాలు, నెలలు, త్రైమాసికాలు లేదా సంవత్సరాలపై క్లిక్ చేసి, ఆపై మీరు ఉపయోగించాలనుకుంటున్న వ్యవధిని ఎంచుకోండి.
- కస్టమ్ తేదీ పరిధిని ఉపయోగించడానికి, కస్టమ్పై క్లిక్ చేసి, గతంలోని లేదా భవిష్యత్తులోని గరిష్ఠంగా 2 సంవత్సరాల పరిధిని ఎంచుకోండి. ఆ తర్వాత, వర్తింపజేయండిపై క్లిక్ చేయండి.
ఆప్షనల్: మీ లక్ష్య ప్రమాణాల ఆధారంగా ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యే లక్ష్యం పేరు ఫీల్డ్‌ను ఎడిట్ చేయండి.
ప్రివ్యూ విభాగంలో, మీ తుది సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయండి:
- మీ ప్రస్తుత ప్రోగ్రెస్‌తో గేజ్లా కనిపించే లక్ష్యాన్ని రివ్యూ చేసి, అది ఊహించిన విధంగానే కనిపిస్తోందని నిర్ధారించండి.
- ఆప్షనల్: మీ Analytics ఓవర్‌వ్యూ డ్యాష్బోర్డ్కు లక్ష్యాన్ని ఒక కార్డ్‌గా జోడించడానికి, డ్యాష్బోర్డ్కు జోడించండి సెట్టింగ్‌ను యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయండి.
సేవ్ లేదా డ్యాష్‌బోర్డ్‌లో సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.
మీ Analytics ఓవర్‌వ్యూ డ్యాష్బోర్డ్కు ఒక లక్ష్యాన్ని జోడించండి
Analytics ఓవర్‌వ్యూ డ్యాష్బోర్డ్కు ఒక టార్గెట్ గేజ్ విజువలైజేషన్‌ను కలిగి ఉన్న కార్డ్‌ను జోడించడానికి, ఒక లక్ష్యం కోసం మీరు డ్యాష్‌బోర్డ్‌కు జోడించండి సెట్టింగ్‌ను యాక్టివేట్ చేయవచ్చు. మీ లక్ష్యం దిశగా మీ స్టోర్ ప్రోగ్రెస్‌ను ఒకే చూపులో ట్రాక్ చేసే పద్ధతిగా మీరు ఈ టార్గెట్ కార్డ్‌ను ఉపయోగించవచ్చు. ఈ కార్డ్ ఎల్లప్పుడూ లక్ష్యానికే చెందిన సమయ వ్యవధిని చూపుతుంది కాబట్టి, డ్యాష్‌బోర్డ్‌లోని ఈ టార్గెట్ కార్డ్‌కు డ్యాష్‌బోర్డ్ స్థాయి తేదీ పరిధి, అలాగే పోలిక మార్పుల నుండి మినహాయింపు ఉంటుంది. మీ Analytics ఓవర్‌వ్యూ డ్యాష్‌బోర్డ్‌ను కస్టమైజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
మీరు ఈ కింది వాటిలో ఏ విధంగానైనా ఈ సెట్టింగ్‌ను యాక్టివేట్ చేయవచ్చు:
- Analytics ఓవర్‌వ్యూ డ్యాష్‌బోర్డ్ నుండి కొత్త లక్ష్యాన్ని సృష్టిస్తున్నప్పుడు, డ్యాష్‌బోర్డ్‌కు జోడించండి సెట్టింగ్ అనేది డిఫాల్ట్‌గా యాక్టివ్‌గా ఉంటుంది.
- లక్ష్యాల లిస్ట్ నుండి కొత్త లక్ష్యాన్ని సృష్టిస్తున్నప్పుడు, లక్ష్యాన్ని సేవ్ చేసి, ఆపై డ్యాష్‌బోర్డ్‌కు జోడించండిపై క్లిక్ చేయండి.
- ఇప్పటికే ఉన్న లక్ష్యాన్ని ఎడిట్ చేస్తున్నప్పుడు, మీ మార్పులను సేవ్ చేసి, ఆపై మీ డ్యాష్‌బోర్డ్‌కు అప్‌డేట్ అయిన వెర్షన్‌ను ఒక కొత్త కార్డ్‌గా జోడించడానికి డ్యాష్‌బోర్డ్‌కు జోడించండిపై క్లిక్ చేయండి.
మీ Analytics ఓవర్‌వ్యూ డ్యాష్‌బోర్డ్‌కు మీరు ఒక లక్ష్యాన్ని జోడించినప్పుడు, కాన్ఫిగరేషన్ ప్యానెల్‌లో ప్రీలోడ్ అయిన లక్ష్య ప్రమాణాలతో డ్యాష్‌బోర్డ్ నుండి ఆటోమేటిక్‌గా జనరేట్ అయిన నివేదికను మీరు యాక్సెస్ చేయవచ్చు. నివేదిక అనేది లక్ష్యానికి సింక్ చేయబడలేదు, అంటే మీరు నివేదికలో చేసే మార్పులు, లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదా అప్‌డేట్ అవడానికి కారణం కావు.
మీ లక్ష్యం కోసం మెట్రిక్‌లు, అలాగే సమయ వ్యవధుల గురించిన మీ స్వంత డేటా విశ్లేషణను డెవలప్ చేయడానికి, మీరు ఈ టార్గెట్ నివేదికను ఒక పునాదిగా ఉపయోగించవచ్చు, ఆపై దీన్ని మీరు పూర్తిగా వేరొక నివేదికగా సేవ్ చేయవచ్చు. నివేదికలను కస్టమైజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
క్యూములేటివ్ వ్యూ ద్వారా లక్ష్య ప్రోగ్రెస్‌ను ప్రదర్శించండి
గేజ్ విజువలైజేషన్‌తో పాటుగా, ఒక సమయ ఆధారిత డైమెన్షన్‌తో కూడిన లైన్ లేదా బార్ విజువలైజేషన్‌లో క్యుములేటివ్ వ్యూను ఉపయోగించడం ద్వారా మీరు ఒక లక్ష్యం దిశగా సమయానుసారంగా మీ ప్రోగ్రెస్‌ను పోల్చవచ్చు. మీరు ప్రస్తుతం మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత దగ్గరగా ఉన్నారనేది మాత్రమే కాకుండా, మీరు మీ లక్ష్యాన్ని ఛేదించే వేగంతో ఉన్నారా లేదా అనేది అర్థం చేసుకోవడానికి ఈ వ్యూ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, 30 రోజుల వ్యవధిలో మొత్తం విక్రయాలలో మీ లక్ష్యం $3,000 USD సంపాదించడమే అయితే, ఈ వ్యవధి ప్రారంభంలో ఉండే $0 USD నుండి చివర్లో ఉండే $3,000 USD వరకు పేసింగ్ లైన్ అనేది రోజుకు $100 USD మేర పెరుగుతుంది. ఆ తర్వాత మీరు ఊహించిన క్యుములేటివ్ వేగానికి పైన లేదా దిగువన మీ క్యుములేటివ్ మొత్తం విక్రయాలు ఉన్నాయా లేదా అని ఒకే చూపులో మీరు రివ్యూ చేయవచ్చు.
లక్ష్యాలతో పోల్చే నివేదిక కోసం మీరు క్యుములేటివ్ వ్యూను ఉపయోగించినప్పుడు, విజువలైజేషన్ అనేది కింది వివరాలను ప్రదర్శిస్తుంది:
- మీ క్యుములేటివ్ వాస్తవ విలువల కోసం ఒక సాలిడ్ లైన్, ఇది ప్రతి రోజు ఫలితాలు జోడించబడే కొద్దీ సున్నా నుండి పెరుగుతుంది.
- సున్నా నుండి మీ లక్ష్య విలువ వరకు ఉండే ఒక చుక్కల గీత (డ్యాష్డ్ పేసింగ్ లైన్), వ్యవధి ముగిసే సమయానికి మీరు మీ లక్ష్యాన్ని ఛేదించడానికి కొనసాగించాల్సిన వేగాన్ని ఇది సూచిస్తుంది.
విజువలైజేషన్‌లలో క్యుములేటివ్ విలువలను చేర్చడం గురించి మరింత తెలుసుకోండి.
దశలు:
- మీ లక్ష్యం కోసం నివేదికను తెరవండి. మీరు లక్ష్యం వివరాల పేజీ నుండి నివేదికను వీక్షించండిపై క్లిక్ చేయవచ్చు లేదా మీ Analytics ఓవర్‌వ్యూ డ్యాష్‌బోర్డ్లోని ఒక టార్గెట్ కార్డ్ నుండి నివేదికను తెరవవచ్చు.
- విజువలైజేషన్‌లో క్యుములేటివ్ వ్యూను యాక్టివేట్ చేయడానికి, కింది చర్యలలో దేనినైనా చేయండి:
- పోలిక మెనూలో, లక్ష్యాలను ఎంచుకోండి.
- కాన్ఫిగరేషన్ ప్యానెల్‌లోని విజువలైజేషన్ విభాగంలో, క్యుములేటివ్ సెట్టింగ్‌ను యాక్టివేట్ చేయండి.
మీ లక్ష్యాలను మేనేజ్ చేయడం
మీరు కనీసం 1 లక్ష్యాన్ని సృష్టించిన తర్వాత, మీ Shopify అడ్మిన్‌లోని Analytics ఓవర్‌వ్యూ డ్యాష్‌బోర్డ్‌లో లక్ష్యాలను మేనేజ్ చేయండి మెనూ అందుబాటులో ఉంటుంది. లక్ష్యాల లిస్ట్‌ను తెరవడానికి లక్ష్యాలను మేనేజ్ చేయండి > లక్ష్యాలను వీక్షించండిపై క్లిక్ చేయండి, అక్కడ మీరు మీ లక్ష్యాలన్నింటినీ ఒకే లిస్ట్‌లో యాక్సెస్ చేయవచ్చు. ప్రతి లక్ష్యానికి సంబంధించిన పేరు, స్టేటస్, ప్రోగ్రెస్ బార్, ప్రస్తుత మొత్తం, లక్ష్యం మొత్తం, సమయ వ్యవధిని లక్ష్యాల లిస్ట్ ప్రదర్శిస్తుంది.
లక్ష్యాల లిస్ట్ నుండి, మీరు కింది చర్యలలో దేనినైనా చేయవచ్చు:
- ఎడిట్ మోడ్లో దేనినైనా తెరవడానికి ఏదైనా లక్ష్యంపై క్లిక్ చేయండి.
- కీవర్డ్‌ల ఆధారంగా మీ లక్ష్యాలను సెర్చ్ చేయండి.
- సార్ట్ చేసే ఆప్షన్‌లను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో సర్దుబాటు చేయడానికి ఏదైనా నిలువు వరుస పేరుపై క్లిక్ చేయండి.
- బహుళ లక్ష్యాలను ఎంచుకుని, వాటిని ఒకేసారి (బల్క్‌గా) తొలగించండి.
లక్ష్యాల స్టేటస్‌లు
మీ లక్ష్యాలు అనేవి లక్ష్య ప్రోగ్రెస్‌ను సూచించే వివిధ స్టేటస్‌లను కలిగి ఉంటాయి. వివిధ లక్ష్య స్టేటస్‌ల గురించి తెలుసుకోవడానికి కింది పట్టికను రివ్యూ చేయండి:
| లక్ష్యం స్టేటస్ | వివరణ |
|---|---|
| డ్రాఫ్ట్ | లక్ష్యం ప్రారంభించబడింది కానీ సేవ్ కాలేదు. లక్ష్యాన్ని సృష్టిస్తున్నప్పుడు మాత్రమే ఈ స్టేటస్ వర్తిస్తుంది. |
| ప్రోగ్రెస్‌లో ఉంది | లక్ష్యం వ్యవధిలో ఈ రోజు కూడా చేర్చబడుతుంది. ప్రోగ్రెస్ ట్రాక్ చేయబడుతోంది. |
| సాధించబడింది | సమయ వ్యవధి ముగిసినా ముగియకపోయినా, వాస్తవ విలువ లక్ష్యాన్ని చేరుకుంది లేదా అధిగమించింది. |
| సాధించబడలేదు | లక్ష్యం సమయ వ్యవధి ముగిసింది, అలాగే వాస్తవ విలువ లక్ష్యాన్ని చేరుకోలేదు. |
| రాబోయేవి | లక్ష్య వ్యవధి భవిష్యత్తులో ప్రారంభమవుతుంది. |
ఒక లక్ష్యాన్ని ఎడిట్ చేయండి
మీరు ఏదైనా లక్ష్యం కోసం పేరు, మొత్తం, సమయ వ్యవధి లేదా ఫిల్టర్‌లను మార్చవచ్చు. మీరు గత సమయ వ్యవధుల కోసం లక్ష్యాలను కూడా ఎడిట్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు.
లక్ష్యం వివరాల పేజీ నుండి, మీ అనలిటిక్స్ ఓవర్‌వ్యూ డ్యాష్‌బోర్డ్‌లో లక్ష్య గేజ్‌ను ఉంచడానికి మీరు డాష్‌బోర్డ్‌కు జోడించండిని కూడా క్లిక్ చేయవచ్చు. మీరు ఒక లక్ష్యాన్ని ఎడిట్ చేసి, మీ డాష్‌బోర్డ్‌లో ఆ లక్ష్యాన్ని సేవ్ చేసినట్లయితే, అప్‌డేట్ చేసిన లక్ష్య ప్రమాణాలను ప్రదర్శించడానికి, ఆ లక్ష్యాన్ని మీ డాష్‌బోర్డ్‌కు మాన్యువల్‌గా మళ్లీ జోడించాలి.
మీ మార్పులు ఇప్పటికే ఉన్న లక్ష్యం వలె అదే మెట్రిక్, సమయ వ్యవధి, మరియు ఫిల్టర్‌లతో నకిలీ లక్ష్యాన్ని సృష్టిస్తే, మీరు దేనిని మార్చాలి అనే దానిపై మార్గదర్శకత్వంతో ఎర్రర్ ప్రదర్శించబడుతుంది.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, అనలిటిక్స్కు వెళ్లండి.
లక్ష్యాలను మేనేజ్ చేయండి > లక్ష్యాలను వీక్షించండిని క్లిక్ చేయండి.
మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న లక్ష్యాన్ని క్లిక్ చేయండి.
లక్ష్యం పేరు, లక్ష్యం మొత్తం, సమయ వ్యవధి లేదా ఫిల్టర్‌లను మార్చండి.
సేవ్ చేయండిని క్లిక్ చేయండి.
ఆప్షనల్: అనలిటిక్స్ ఓవర్‌వ్యూ డ్యాష్‌బోర్డ్‌కు అప్‌డేట్ చేసిన లక్ష్యాన్ని మళ్లీ జోడించడానికి డాష్‌బోర్డ్‌కు జోడించండిని క్లిక్ చేయండి.
లక్ష్యాన్ని తొలగించండి
మీరు మీ Shopify అడ్మిన్ నుండి ఏ సమయంలోనైనా లక్ష్యాన్ని తొలగించవచ్చు. మీరు లక్ష్యాలను ఒక్కొక్కటిగా లేదా బల్క్‌లో తొలగించవచ్చు.
తొలగించిన లక్ష్యాలను రీస్టోర్ చేయడం సాధ్యపడదు. అదే లక్ష్యాన్ని మళ్లీ ఉపయోగించడానికి, మీరు కొత్తదాన్ని సృష్టించాలి.
దశలు:
ఒక్కో లక్ష్యాన్ని తొలగించండి
మీ Shopify అడ్మిన్ నుండి, అనలిటిక్స్కు వెళ్లండి.
లక్ష్యాలను మేనేజ్ చేయండి > లక్ష్యాలను వీక్షించండిని క్లిక్ చేయండి.
మీరు తొలగించాలనుకుంటున్న లక్ష్యాన్ని క్లిక్ చేయండి.
మరిన్ని చర్యలు > తొలగించండిని క్లిక్ చేయండి.
చర్యను నిర్ధారించడానికి, తొలగించండిని క్లిక్ చేయండి.
లక్ష్యాలను బల్క్‌గా తొలగించండి
మీ Shopify అడ్మిన్ నుండి, అనలిటిక్స్కు వెళ్లండి.
లక్ష్యాలను మేనేజ్ చేయండి > లక్ష్యాలను వీక్షించండిని క్లిక్ చేయండి.
మీరు తొలగించాలనుకుంటున్న లక్ష్యాలన్నింటినీ ఎంచుకోవడానికి చెక్‌బాక్స్‌లను ఉపయోగించండి.
తొలగించండిని క్లిక్ చేయండి.
బల్క్ యాక్షన్‌ను నిర్ధారించడానికి, తొలగించండిని క్లిక్ చేయండి.