మార్కెటింగ్ రిపోర్ట్‌లు
మీ మార్కెటింగ్ ఎంత ఎఫెక్టివ్‌గా ఉందో తనిఖీ చేయడానికి, మీ కన్వర్షన్‌ల గురించి తెలుసుకోవడానికి మీరు మార్కెటింగ్ రిపోర్ట్‌లను ఉపయోగించవచ్చు. ఆన్‌లైన్ స్టోర్ సందర్శకుడు చెల్లించే కస్టమర్‌గా మారినప్పుడు కన్వర్షన్ జరుగుతుంది.
కొనుగోలుదారులను మీ ఆన్‌లైన్ స్టోర్‌కు ఏది తీసుకువెళుతుందో, ఏది వారిని చెల్లించే కస్టమర్‌లుగా మారుస్తుందో అర్థం చేసుకోవడానికి మార్కెటింగ్ రిపోర్ట్‌లు మీకు సహాయపడతాయి. మీ ఆన్‌లైన్ స్టోర్‌తో కస్టమర్‌ల ఇంటరాక్షన్‌ల ఆధారంగా, మీ మార్కెటింగ్ ఛానెల్‌లలో ఏవి అత్యధిక సంఖ్యలో కస్టమర్‌లను, అత్యధిక విలువ గల కస్టమర్‌లను అందిస్తున్నాయో రిపోర్ట్‌లు వివరించగలవు.
రిపోర్ట్‌లు అన్ని ఆన్‌లైన్ స్టోర్ ఛానెల్ ఆర్డర్‌ల సమాచారాన్ని సారాంశంగా తెలియజేస్తాయి. ఒకే ఆర్డర్ గురించిన సందర్శన లేదా కన్వర్షన్ సమాచారం కోసం, కన్వర్షన్ ట్రాకింగ్ను రివ్యూ చేయండి.
ఈ పేజీలో
మీ మార్కెటింగ్ రిపోర్ట్‌లను వీక్షించండి
కేవలం మార్కెటింగ్ రిపోర్ట్‌లను మాత్రమే ప్రదర్శించడానికి మీరు మీ రిపోర్ట్‌ల లిస్ట్‌ను ఫిల్టర్ చేయవచ్చు.
దశలు:
డెస్క్‌టాప్
మీ Shopify అడ్మిన్ నుండి, అనలిటిక్స్ > రిపోర్ట్‌లకు వెళ్లండి.
కేటగిరీ ఫిల్టర్‌పై క్లిక్ చేయండి.
కేవలం మార్కెటింగ్ రిపోర్ట్‌లను ప్రదర్శించేందుకు ఫిల్టర్ చేయడానికి మార్కెటింగ్‌పై క్లిక్ చేయండి.
మొబైల్
Shopify యాప్ నుండి,
ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
అనలిటిక్స్ > రిపోర్ట్‌లును ట్యాప్ చేయండి.
ఫిల్టర్ ఐకాన్‌ను ట్యాప్ చేసి, ఆపై కేటగిరీని ట్యాప్ చేయండి.
కేవలం మార్కెటింగ్ రిపోర్ట్‌లను ప్రదర్శించేందుకు ఫిల్టర్ చేయడానికి మార్కెటింగ్‌ను ట్యాప్ చేయండి.
< దీని ద్వారా ఫిల్టర్ చేయండి లేదా ←ను ట్యాప్ చేసి, ఆపై ఫిల్టర్ చేసిన రిపోర్ట్‌ల లిస్ట్‌కు తిరిగి నావిగేట్ చేయడానికి Xను ట్యాప్ చేయండి.
Shopifyలో మీరు సృష్టించే క్యాంపెయిన్‌లపై మరిన్ని మార్కెటింగ్ ఇన్‌సైట్‌ల కోసం, Shopifyలో మార్కెటింగ్ పనితీరును చూడండి.
రిఫరర్‌లు, ఇంటరాక్షన్‌లు
కస్టమర్ మీ స్టోర్‌కు చేరుకోవడానికి ఉపయోగించే పద్ధతిని రిఫరర్ అని పిలుస్తారు. ఉదాహరణకు, రిఫరర్ అనేది ఒక సెర్చ్ కావచ్చు లేదా ఏదైనా ప్రకటన, ఇమెయిల్ లేదా వెబ్‌సైట్ లింక్ కూడా కావచ్చు. రిఫరర్‌ను తెలుసుకోవడం ద్వారా, కస్టమర్ ఉపయోగించిన రిఫరర్‌కు మీరు విక్రయాలను ఆపాదించవచ్చు. విక్రయాలను విశ్లేషించడానికి, ఆపాదించడానికి ఇది ఒక ప్రామాణిక మార్గం.
అయితే, కస్టమర్ బహుళ రిఫరర్‌ల ద్వారా మీ స్టోర్‌ను చాలాసార్లు సందర్శించవచ్చు, కాబట్టి రిఫరర్‌లు మొదటి ఇంటరాక్షన్ లేదా చివరి ఇంటరాక్షన్‌గా వర్గీకరించబడతాయి:
- మీ స్టోర్‌కు కస్టమర్‌ను పరిచయం చేసిన రిఫరర్ మొదటి ఇంటరాక్షన్ కింద వర్గీకరించబడుతుంది.
- ఆర్డర్ చేయడానికి ముందు కస్టమర్ ఉపయోగించిన రిఫరర్ చివరి ఇంటరాక్షన్ కింద వర్గీకరించబడుతుంది.
ఉదాహరణ: కస్టమర్ మొదటిసారిగా వారిని మీ స్టోర్‌కు తీసుకువెళ్లే Facebook ప్రకటనపై క్లిక్ చేసి, వారు వెంటనే మీ ఉత్పత్తులలో ఒకదాన్ని కొనుగోలు చేస్తారు. మొదటి ఇంటరాక్షన్, చివరి ఇంటరాక్షన్ రెండింటికీ Facebook రిఫరర్‌గా ఉంటుంది. విక్రయం చేసినందుకు గాను మీ ప్రకటనకు క్రెడిట్ ఇవ్వబడుతుంది.
ఉదాహరణ: ఒక కస్టమర్ తమకు కావాల్సిన ఉత్పత్తి కోసం Googleలో సెర్చ్ చేసి, మీ స్టోర్ లింక్‌ను కనుగొంటారు. వారు మీ ఇతర ఉత్పత్తులను బ్రౌజ్ చేయడానికి వారంలో అనేక సార్లు మీ స్టోర్‌ను సందర్శిస్తారు మరియు న్యూస్‌లెటర్ కోసం సైన్ అప్ చేస్తారు, కానీ వారు ఏమీ కొనుగోలు చేయరు. మరుసటి వారం, మీరు వారికి ఒక ఇమెయిల్ మార్కెటింగ్ ఆఫర్‌ను పంపుతారు. వారు ఆ ఇమెయిల్‌లోని లింక్‌ను క్లిక్ చేసి, ఆర్డర్ చేస్తారు. ఈ సేల్ అనేది లాస్ట్ ఇంటరాక్షన్ కన్వర్షన్. ఫస్ట్ ఇంటరాక్షన్ రిఫరర్ Google అయినప్పటికీ, ఈ సేల్‌కు కారణమైన రిఫరర్ ఇమెయిల్ సర్వీస్ అని క్రెడిట్ ఇవ్వబడుతుంది.
ఆర్డర్ చేసిన తర్వాత లేదా 30 రోజుల తర్వాత జరిగే ఇంటరాక్షన్‌లు
ఒక సందర్శకుడు ఒక సెషన్ జరిగిన 30 రోజులలోపు ఏమీ కొనుగోలు చేయకపోతే, ఫస్ట్ ఇంటరాక్షన్ రిఫరర్ ఆ తర్వాతి రిఫరర్ ఏదైతే దానికి రీసెట్ చేయబడుతుంది.
అదే విధంగా, సందర్శకుడు ఆర్డర్ చేస్తే, ఆ తర్వాతి ఆర్డర్‌కు తర్వాతి రిఫరర్ ఫస్ట్ ఇంటరాక్షన్‌గా పరిగణించబడుతుంది.
ఉదాహరణ: ఆగస్టు 1న మీ ఆన్‌లైన్ స్టోర్ URLను నేరుగా ఎంటర్ చేయడం ద్వారా కస్టమర్ మీ స్టోర్‌ను సందర్శిస్తారు. వారు స్టోర్‌ను పలుమార్లు మళ్లీ సందర్శిస్తారు, కానీ ఏదీ కొనుగోలు చేయరు. తర్వాత, సెప్టెంబర్ 15న (ఇది వారి మొదటి సెషన్ తర్వాత 30 రోజుల కంటే ఎక్కువ), వారు మీ స్టోర్ కోసం ఒక ప్రకటనను క్లిక్ చేసి, ఆర్డర్ చేస్తారు. ఈ కన్వర్షన్‌కు ఫస్ట్ మరియు లాస్ట్ ఇంటరాక్షన్ అనేది ఆ ప్రకటనే కానీ నేరుగా ఎంటర్ చేసిన URL కాదు.
రిపోర్ట్‌లలో అట్రిబ్యూషన్ మోడల్స్
మీ కస్టమర్‌లు ఇంటరాక్ట్ అయ్యే ఛానెల్‌లు, అలాగే మీ సేల్స్‌కు దోహదపడే ఛానెల్‌ల గురించిన సమాచారాన్ని పొందడానికి మీరు అట్రిబ్యూషన్ మోడల్స్‌ను ఉపయోగించవచ్చు. కస్టమర్ జర్నీలో కస్టమర్‌లు ఎప్పుడు, ఎక్కడ కన్వర్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవడానికి ఈ సమాచారం మీకు సహాయపడుతుంది.
మీ నివేదికలో స్థూల విక్రయాలు లాంటి విక్రయాల మెట్రిక్, మరియు మార్కెటింగ్ ఛానెల్ లాంటి మార్కెటింగ్ డైమెన్షన్ ఉన్నప్పుడు, నివేదికలోని కాన్ఫిగరేషన్ ప్యానెల్లో అదనపు అట్రిబ్యూషన్ మెనూ ప్రదర్శించబడుతుంది. మీ నివేదిక డేటాలో మీరు ఏ అట్రిబ్యూషన్ మోడల్‌లను చేర్చాలనుకుంటున్నారో ఎంచుకోవడానికి మీరు ఈ మెనూను ఉపయోగించవచ్చు. మెట్రిక్ మరియు డైమెన్షన్ షరతులు నెరవేరినప్పుడు, అప్రమేయంగా చివరి క్లిక్ మోడల్ ఎంచుకోబడుతుంది.
Shopify Analytics కింది అట్రిబ్యూషన్ మోడల్స్‌కు మద్దతు ఇస్తుంది:
| అట్రిబ్యూషన్ మోడల్ | మార్కెటింగ్ క్రెడిట్ కేటాయింపు నియమాలు | అట్రిబ్యూషన్ మోడల్‌ను ఉపయోగించడం |
|---|---|---|
| లాస్ట్ నాన్-డైరెక్ట్ క్లిక్ | డైరెక్ట్ సందర్శనలు మినహా, కొనుగోలు చేయడానికి ముందుగా కస్టమర్ ఇంటరాక్ట్ అయ్యే లాస్ట్ ఛానెల్‌కు అట్రిబ్యూషన్ క్రెడిట్‌లో 100% ఇస్తుంది. ఒకవేళ కస్టమర్ జర్నీలో కేవలం డైరెక్ట్ ట్రాఫిక్ మాత్రమే ఉంటే, దానికి ఆపాదించడానికి నాన్-డైరెక్ట్ మూలం ఏదీ లేనందున వారి ఆర్డర్ డైరెక్ట్‌గా ఆపాదించబడుతుంది. | మీ మార్కెటింగ్ యాక్టివిటీ డేటాను చూసేటప్పుడు ఇది డీఫాల్ట్ అట్రిబ్యూషన్ మోడల్, ఇది కన్వర్షన్‌ను ప్రభావితం చేసిన చివరి మార్కెటింగ్ ఛానెల్‌ను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. |
| లాస్ట్ క్లిక్ | డైరెక్ట్ సందర్శనలతో సహా, కస్టమర్ ఇంటరాక్ట్ అయ్యే లాస్ట్ ఛానెల్‌కు అట్రిబ్యూషన్ క్రెడిట్‌లో 100% ఇస్తుంది. | మీరు ట్రాఫిక్‌ను కస్టమర్‌లుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అలాగే కొనుగోలుపై అంతిమ ప్రభావాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ అట్రిబ్యూషన్ మోడల్ సహాయకరంగా ఉంటుంది. |
| ఫస్ట్ క్లిక్ | డైరెక్ట్ సందర్శనలతో సహా, కస్టమర్ ఇంటరాక్ట్ అయ్యే ఫస్ట్ ఛానెల్‌కు అట్రిబ్యూషన్ క్రెడిట్‌లో 100% ఇస్తుంది. | టాప్-ఆఫ్-ఫన్నెల్ ఆసక్తిని క్రియేట్ చేయడంలో ఏ ఛానెల్‌లు దోహదపడతాయో అర్థం చేసుకోవడానికి ఈ అట్రిబ్యూషన్ మోడల్ సహాయపడుతుంది. |
| ఏదైనా క్లిక్ | కన్వర్షన్‌కు దోహదపడిన అన్ని ఇంటరాక్షన్‌లను గుర్తిస్తూ, కస్టమర్‌లు క్లిక్ చేసిన ప్రతి ఛానెల్‌కు అట్రిబ్యూషన్ క్రెడిట్‌లో 100% ఇస్తుంది. | మీకు వచ్చిన ఆర్డర్‌ల కంటే ఈ అట్రిబ్యూషన్ మోడల్ ఎక్కువ క్రెడిట్‌ను కేటాయిస్తుంది కాబట్టి, ఒకే ఒక మార్కెటింగ్ ఛానెల్‌ను విశ్లేషించడానికి దీన్ని ఉపయోగించడం మంచిది. ప్రతి ఛానెల్ ద్వారా రిపోర్ట్ చేయబడిన అట్రిబ్యూషన్‌ను సరిపోల్చడానికి కూడా మీరు ఈ మోడల్‌ను ఉపయోగించవచ్చు. |
| లీనియర్ | డైరెక్ట్ సందర్శనలతో సహా, సేల్‌కు దోహదపడిన కస్టమర్ జర్నీలోని ప్రతి క్లిక్‌కు సమానమైన అట్రిబ్యూషన్ క్రెడిట్‌ను ఇస్తుంది. | ఈ అట్రిబ్యూషన్ మోడల్ బ్యాలెన్స్‌డ్ వీక్షణను అందిస్తుంది, అలాగే మరింత సంక్లిష్టమైన కస్టమర్ జర్నీలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. |
కింది డీఫాల్ట్ Shopify రిపోర్ట్‌లు ఆటోమేటిక్‌గా అట్రిబ్యూషన్ మోడల్స్‌ను సెట్ చేయడానికి ఆప్షన్‌ను కలిగి ఉంటాయి:
- మార్కెటింగ్ ఛానెల్ ఆధారంగా పనితీరు
- మార్కెటింగ్ ప్రచారం ఆధారంగా పనితీరు
కన్వర్షన్ రిపోర్ట్‌లలోని సాధారణ పదాలు
మార్కెటింగ్ రిపోర్ట్‌లు కింది పదాలను ఉపయోగిస్తాయి:
| పదం | నిర్వచనం |
|---|---|
| రిఫరర్ సోర్స్ | ఆర్డర్ చేసిన కస్టమర్ మీ ఆన్‌లైన్ స్టోర్‌ను ఎలా చేరుకున్నారో సూచిస్తుంది. సాధ్యమయ్యే విలువలు ఇవి:
|
| రిఫరర్ పేరు | Google, Facebook లేదా Pinterest లాంటి రిఫరర్ పేరు. డైరెక్ట్ సోర్స్‌ల కోసం, రిఫరర్‌ను కనుగొనలేకపోతే, ఆ పేరు N/A అని లిస్ట్ చేయబడుతుంది. కింది పరిస్థితులు లాంటి అనేక కారణాల వల్ల ఇది జరగవచ్చు:
|
| మార్కెటింగ్ ఛానెల్ | మీ ఆన్‌లైన్ స్టోర్ సందర్శనకు క్రెడిట్ ఇవ్వబడిన యాడ్ ఉత్పత్తి, మెసేజింగ్ టూల్ లేదా సైట్. మార్కెటింగ్ ఛానెల్ అనేది ట్రాఫిక్ రకంపై ఆధారపడి ఉంటుంది:
Shopify Messaging లేదా Klaviyo లాగా ఇమెయిల్ లేదా SMSను పంపిన టూల్‌ను గుర్తించగలిగినప్పుడు, ఆ సందేశం కోసం ఆ టూల్ మార్కెటింగ్ ఛానెల్ అవుతుంది. ప్రోగ్రామాటిక్ మరియు అఫిలియేట్ యాడ్‌లు అనేవి మీరు యాడ్ నెట్‌వర్క్ ద్వారా కొనుగోలు చేసినవి మరియు ఇతర సైట్‌లలో ప్రదర్శించబడే యాడ్‌లు. ఈ యాడ్‌లు ఎక్కడ ప్రదర్శించబడ్డాయి అనే దాని ఆధారంగా కాకుండా, మీరు వాటిని ఎక్కడ కొనుగోలు చేశారు అనే దానికి క్రెడిట్ చేయబడతాయి. సందర్శన కోసం ఎలాంటి మార్కెటింగ్ మూలాన్ని గుర్తించలేకపోతే, ఆ సందర్శన దాని రిఫరింగ్ ఛానెల్ కింద జాబితా చేయబడుతుంది. ఉదాహరణ: ఒక కస్టమర్ Instagramలో మీ Meta యాడ్‌పై క్లిక్ చేస్తారు. ఇక్కడ మార్కెటింగ్ ఛానెల్ Meta Ads. |
| మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ | Meta లేదా Google లాగా మార్కెటింగ్ ఛానెల్ స్వంతమైన ప్లాట్‌ఫామ్. ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన యాడ్ ఉత్పత్తులు మరియు ఛానెల్‌ల కలిపిన ఫలితాలను రివ్యూ చేయడానికి, మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించండి. ఉదాహరణకు, Meta Ads, Facebook మరియు Instagram అన్నీ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ Metaకు చెందినవి. మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ డైమెన్షన్ రిఫర్ చేస్తున్న ప్లాట్‌ఫామ్ డైమెన్షన్‌ను భర్తీ చేస్తుంది. |
| రిఫరింగ్ ఛానెల్ | Instagram, ఒక వార్తా సైట్ లేదా Gmail లాగా, మీ మార్కెటింగ్ ప్రదర్శించబడిన, సందర్శకుడు వచ్చిన సైట్ లేదా యాప్. కొన్ని SMS మరియు ఇమెయిల్ సందర్శనల విషయంలో సైట్ లేదా యాప్‌ను గుర్తించలేకపోతే, రిఫరింగ్ ఛానెల్ లింక్‌లోని UTM పారామితుల నుండి టూల్‌ను జాబితా చేయగలదు. మార్కెటింగ్ ఛానెల్ సందర్శనలు ఎక్కడ నుండి వచ్చాయి అనే దాని ఆధారంగా విశ్లేషించడానికి, మీరు రిఫరింగ్ ఛానెల్‌ను నివేదికకు జోడించవచ్చు. ఉదాహరణ: ఒక కస్టమర్ Gmailలో మీ Klaviyo ఇమెయిల్‌ను తెరిచి, ఆపై మీ స్టోర్ లింక్‌పై క్లిక్ చేస్తారు. ఇక్కడ మార్కెటింగ్ ఛానెల్ Klaviyo, మరియు రిఫరింగ్ ఛానెల్ Gmail. |
| సగటు ఆర్డర్ విలువ (ఫస్ట్ లేదా లాస్ట్ ఇంటరాక్షన్) | గిఫ్ట్ కార్డ్ మినహా కనీసం ఒక్క ఉత్పత్తినైనా కలిగి ఉన్న మొత్తం ఆర్డర్‌ల సంఖ్య ద్వారా భాగించబడిన, అన్ని ఆర్డర్‌ల సగటు విలువను (గిఫ్ట్ కార్డ్‌లు మినహాయించి) ప్రదర్శిస్తుంది. ఆర్డర్ విలువలో రిటర్న్‌లకు ముందు ఉన్న పన్నులు, షిప్పింగ్ మరియు తగ్గింపులు ఉంటాయి. కస్టమర్‌లు మీ స్టోర్‌లో ఎంత ఖర్చు చేయడానికి మొగ్గుచూపుతున్నారో తెలుసుకోవడానికి ఈ విలువ మీకు సహాయపడుతుంది, అలాగే మీ ప్రైసింగ్ పాలసీలను రూపొందించడంలో సహాయపడుతుంది. |
| ఆర్డర్‌లు (ఫస్ట్ లేదా లాస్ట్ ఇంటరాక్షన్) | ఇంటరాక్షన్ రకాన్ని బట్టి వచ్చిన ఆర్డర్‌ల సంఖ్యను ప్రదర్శిస్తుంది. |
రద్దు చేయబడిన, పెండింగ్ మరియు చెల్లించని ఆర్డర్‌లు రిపోర్ట్‌లలో చేర్చబడతాయి. టెస్ట్ ఆర్డర్‌లు మరియు తొలగించబడిన ఆర్డర్‌లు చేర్చబడవు.
మార్కెటింగ్ ఛానెల్ ఆధారంగా పనితీరు
మార్కెటింగ్ ఛానెల్ ఆధారంగా పనితీరు నివేదిక మీ ఆన్‌లైన్ స్టోర్‌కు వచ్చిన మొత్తం ట్రాఫిక్‌ను ఒకే నివేదికలో ప్రదర్శిస్తుంది.
మార్కెటింగ్ ఛానెల్ అనేది సందర్శనకు క్రెడిట్ చేయబడిన యాడ్ ఉత్పత్తి, మెసేజింగ్ టూల్ లేదా సైట్, ఉదాహరణకు Google Ads, Meta Ads, Klaviyo లేదా Instagram. మార్కెటింగ్ ఛానెల్, మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ మరియు రిఫరింగ్ ఛానెల్‌ల నిర్వచనాల కోసం, కన్వర్షన్ నివేదికలలో సాధారణ పదాలును చూడండి.
ఈ నివేదిక మీ ఫలితాలను మార్కెటింగ్ ఛానెల్ ఆధారంగా గ్రూప్ చేస్తుంది, ప్రతి ఛానెల్‌ను ట్రాఫిక్ రకం ఆధారంగా విభజిస్తుంది. ట్రాఫిక్ రకాలు పెయిడ్, ఆర్గానిక్, డైరెక్ట్, అట్రిబ్యూట్ చేయనివి మరియు గుర్తుతెలియనివి అని ఉంటాయి. రెండో నివేదికను తెరవకుండానే, ఒక ఛానెల్‌కు సంబంధించిన పెయిడ్, ఆర్గానిక్ పనితీరును పోల్చడానికి, ఛానెల్‌లను ఒకదానితో ఒకటి పోల్చడానికి మీరు ఈ నివేదికను ఉపయోగించవచ్చు.
ఈ నివేదిక కింది మెట్రిక్‌లను కలిగి ఉంటుంది:
- సెషన్‌లు, మొత్తం విక్రయాలు, ఆర్డర్‌లు, కన్వర్షన్ రేట్.
- యాడ్ ఖర్చు, యాడ్ వ్యయంపై రాబడి (ROAS), సముపార్జనకయ్యే ఖర్చు (CPA) మరియు కస్టమర్ సముపార్జన వ్యయం (CAC).
- ఇంప్రెషన్‌లు, క్లిక్‌లు, క్లిక్‌త్రూ రేట్ (CTR).
- సగటు ఆర్డర్ విలువ (AOV), మొదటిసారి వచ్చే కస్టమర్‌లు మరియు తిరిగి వచ్చే కస్టమర్‌లు.
డిఫాల్ట్‌గా, నివేదిక చివరి నాన్-డైరెక్ట్ క్లిక్ అట్రిబ్యూషన్ మోడల్‌ను ఉపయోగించి గత 30 రోజుల డేటాను ప్రదర్శిస్తుంది. మీరు తేదీ పరిధిని, అట్రిబ్యూషన్ మోడల్‌ను, ప్రదర్శించబడే నిలువు వరుసలను మార్చవచ్చు.
మీ Shopify అడ్మిన్‌లోని వృద్ధి > అట్రిబ్యూషన్ పేజీ, ఈ నివేదికతో పాటు మార్కెటింగ్ క్యాంపెయిన్ వారీగా పనితీరు నివేదికను సంక్షిప్తీకరిస్తుంది. మీరు అట్రిబ్యూషన్ పేజీ నుండి ఏదైనా నివేదికను తెరిచినప్పుడు, నివేదిక అదే తేదీ పరిధి, అట్రిబ్యూషన్ మోడల్ మరియు పేజీలో ఉన్న ట్రాఫిక్ రకాన్ని ఉపయోగిస్తుంది. మీరు దానికి బదులుగా అనలిటిక్స్ నుండి నివేదికను తెరిస్తే, నివేదిక దాని డిఫాల్ట్ సెట్టింగ్‌లను ఉపయోగిస్తుంది, కాబట్టి అందులోని నంబర్‌లు అట్రిబ్యూషన్ పేజీకి భిన్నంగా ఉండవచ్చు.
కాలక్రమేణా మార్కెటింగ్ ఛానెల్ డేటాను సరిపోల్చడం
సంవత్సరానికి సంవత్సరం లాగా, కాలక్రమేణా మార్కెటింగ్ ఫలితాలను సరిపోల్చడానికి, మార్కెటింగ్ ఛానెల్ డైమెన్షన్‌ను ఉపయోగించండి. సందర్శన కోసం యాడ్ ఉత్పత్తి లేదా మెసేజింగ్ టూల్ గుర్తించబడినప్పుడు, మార్కెటింగ్ ఛానెల్ అక్టోబర్ 18, 2026కి ముందు మరియు తర్వాత ఉన్న తేదీల కోసం అదే వర్గీకరణను ఉపయోగిస్తుంది. గుర్తించబడిన మార్కెటింగ్ మూలం లేని సందర్శనలు వాటి రిఫరింగ్ ఛానెల్ కింద జాబితా చేయబడతాయి, కాబట్టి ఈ అడ్డు వరుసలు ఆ తేదీలో మారవచ్చు. ఉదాహరణకు, తేదీకి ముందున్న Twitter అడ్డు వరుస ఆ తర్వాత X అడ్డు వరుసగా మారవచ్చు.
రిఫరింగ్ ఛానెల్, రిఫర్ చేస్తున్న మాధ్యమం మరియు ట్రాఫిక్ రకం అక్టోబర్ 18, 2026 నుండి అప్‌డేట్ చేసిన విలువలను ఉపయోగిస్తాయి. ఆ తేదీని కలిగి ఉన్న తేదీ పరిధి ఒకే రకమైన ట్రాఫిక్‌ను వేర్వేరు విలువల క్రింద జాబితా చేయగలదు:
- ఇమెయిల్ పంపిన టూల్‌కు బదులుగా, Gmail వంటి మెసేజ్‌ను ఓపెన్ చేసిన యాప్‌ను ఇమెయిల్ సందర్శనలు జాబితా చేయగలవు.
- కొన్ని రిఫరింగ్ ఛానెల్‌లు కొత్త పేర్లను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, Twitter ఇప్పుడు Xగా జాబితా చేయబడింది.
- రిఫరర్ మీ స్వంత ఆన్‌లైన్ స్టోర్ అయ్యే సందర్శనలు డైరెక్ట్ ట్రాఫిక్‌గా జాబితా చేయబడతాయి. Last non-direct click అట్రిబ్యూషన్ మోడల్ డైరెక్ట్ ట్రాఫిక్‌ను దాటవేస్తుంది కాబట్టి, ఆ మోడల్ కింద ఈ సందర్శనలు సేల్స్ క్రెడిట్‌ను పొందవు.
మీ మొత్తం విక్రయాలు మరియు ఆర్డర్‌లు ప్రభావితం కావు. మీరు ప్రచారాలులో ఆటో-మ్యాచ్ నియమాలను ఉపయోగిస్తే, కొత్త విలువలకు సరిపోలేలా మీ నియమాలను అప్‌డేట్ చేయండి.
రిఫరింగ్ ఛానెల్ వారీగా మార్కెటింగ్ ఛానెల్‌ను విభజించండి
ఒక మార్కెటింగ్ ఛానెల్ ఒకటి కంటే ఎక్కువ సైట్ లేదా యాప్ నుండి సందర్శనలను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, Meta Ads అడ్డువరుస Facebook మరియు Instagramలోని మీ ప్రకటనల నుండి సందర్శనలను కలిగి ఉంటుంది. మీ మార్కెటింగ్ ఎక్కడ ప్రదర్శించబడిందో తెలుసుకోవడానికి, మీరు మార్కెటింగ్ ఛానెల్ వారీగా పనితీరు రిపోర్ట్‌కు రిఫరింగ్ ఛానెల్ డైమెన్షన్‌ను జోడించవచ్చు. అప్పుడు ఈ రిపోర్ట్ ప్రతి రిఫరింగ్ ఛానెల్ కోసం ప్రతి మార్కెటింగ్ ఛానెల్‌ను ఒక అడ్డువరుసగా విభజిస్తుంది. ఈ రిపోర్ట్ వెర్షన్‌ను అట్టిపెట్టుకోవడానికి, దీన్ని కస్టమ్ రిపోర్ట్‌గా సేవ్ చేయండి.
యాడ్ వ్యయం, ఇంప్రెషన్‌లు మరియు క్లిక్‌లు వంటి ఎంగేజ్‌మెంట్ మెట్రిక్‌లను రిఫరింగ్ ఛానెల్‌తో కలపలేము. డైమెన్షన్‌ల మెనూలో రిఫరింగ్ ఛానెల్ అందుబాటులో లేకుంటే, వాటి ద్వారా లెక్కించబడే ROAS మరియు CPA లాంటి మెట్రిక్‌లతో పాటు రిపోర్ట్ నుండి ఎంగేజ్‌మెంట్ మెట్రిక్‌లను తీసివేయండి. మెట్రిక్‌లు మరియు డైమెన్షన్‌ల మధ్య సంబంధాల గురించి మరింత తెలుసుకోండి.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, అనలిటిక్స్ > రిపోర్ట్‌లకు వెళ్లండి.
మార్కెటింగ్ ఛానెల్ వారీగా పనితీరును క్లిక్ చేయండి.
కాన్ఫిగరేషన్ ప్యానెల్‌లో, డైమెన్షన్‌ల మెనూలోని ⊕ని క్లిక్ చేయండి.
డైమెన్షన్‌ను ఎంచుకోండి డ్రాప్-డౌన్ మెనులో, రిఫరింగ్ ఛానెల్‌ను ఎంచుకోండి.
వర్తింపజేయండి క్లిక్ చేయండి.
మార్కెటింగ్ ప్రచారం ఆధారంగా పనితీరు
మార్కెటింగ్ ప్రచారం ఆధారంగా పనితీరు నివేదిక మార్కెటింగ్ ఛానెల్ ఆధారంగా పనితీరు నివేదిక లాంటి మెట్రిక్‌లనే ఉపయోగిస్తుంది, ఇవి ముందుగా ప్రచారం ఆధారంగా గ్రూప్ చేయబడతాయి. ప్రతి ప్రచారం మార్కెటింగ్ ఛానెల్ ద్వారా, ఆ తర్వాత ట్రాఫిక్ రకం ద్వారా విభజించబడుతుంది. ఒక ప్రచారం ఒకటి కంటే ఎక్కువ ఛానెల్‌లలో నడుస్తుంటే, ఆ ప్రచారం దాని కింద ఉన్న ఒక్కో ఛానెల్‌తో సింగిల్ గ్రూప్‌గా ప్రదర్శించబడుతుంది, తద్వారా మీరు ప్రచారం యొక్క ఉమ్మడి ఫలితాలను రివ్యూ చేయవచ్చు.
ప్రచారానికి అనుబంధించబడని ట్రాఫిక్ ఈ నివేదికలో చేర్చబడదు. డైరెక్ట్ మరియు ఆర్గానిక్ ట్రాఫిక్ వాటి స్వంత అడ్డు వరుసలలో ప్రదర్శించబడతాయి.
ఒక మార్కెటింగ్ ఛానెల్ కోసం క్యాంపెయిన్‌లను వీక్షించండి
మార్కెటింగ్ క్యాంపెయిన్ ఆధారంగా పనితీరు నివేదిక ముందుగా మీ ఫలితాలను క్యాంపెయిన్ ఆధారంగా గ్రూప్ చేస్తుంది. ప్రతి మార్కెటింగ్ ఛానెల్ కోసం క్యాంపెయిన్‌లను రివ్యూ చేయడానికి, మీరు మార్కెటింగ్ ఛానెల్‌ను నివేదిక యొక్క ప్రాథమిక డైమెన్షన్‌గా సెట్ చేయవచ్చు. ఆ తర్వాత నివేదిక మీ ఫలితాలను మార్కెటింగ్ ఛానెల్ ఆధారంగా గ్రూప్ చేసి, ప్రతి ఛానెల్ క్యాంపెయిన్‌లను వాటి కింద చూపుతుంది. డైమెన్షన్‌ల క్రమం నివేదికను ఎలా గ్రూప్ చేస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
దశలు:
మీ Shopify అడ్మిన్ నుండి, అనలిటిక్స్ > రిపోర్ట్‌లకు వెళ్లండి.
మార్కెటింగ్ క్యాంపెయిన్ ఆధారంగా పనితీరుపై క్లిక్ చేయండి.
కాన్ఫిగరేషన్ ప్యానెల్ ప్రదర్శించబడకపోతే, కంట్రోల్స్‌పై క్లిక్ చేయండి.
మార్కెటింగ్ ఛానెల్‌ను ప్రాథమిక డైమెన్షన్‌గా సెట్ చేయడానికి, కాన్ఫిగరేషన్ ప్యానెల్ యొక్క డైమెన్షన్‌ల మెనూలో, మార్కెటింగ్ ఛానెల్ పక్కన ఉన్న
ఐకాన్‌పై క్లిక్ చేసి, డైమెన్షన్‌ను డైమెన్షన్‌ల లిస్ట్ పైభాగానికి లాగండి.
ఆప్షనల్: Meta Ads వంటి ఒక మార్కెటింగ్ ఛానెల్ కోసం మాత్రమే క్యాంపెయిన్‌లను ప్రదర్శించడానికి, ఫిల్టర్‌ల మెనూలో మార్కెటింగ్ ఛానెల్ ఫిల్టర్‌ను జోడించండి.
ఆప్షనల్: మీ కస్టమ్ నివేదికను సేవ్ చేయడానికి ఇలా సేవ్ చేయండిపై క్లిక్ చేయండి.
మార్కెటింగ్‌కు ఆపాదించబడిన సేల్స్
మార్కెటింగ్‌కు ఆపాదించబడిన సేల్స్ రిపోర్ట్‌లో ట్రాక్ చేయగల మార్కెటింగ్ ప్రయత్నాలకు ఆపాదించబడే సేల్స్ ఉంటాయి.
మీ మార్కెటింగ్‌కు ఆపాదించబడిన విక్రయాలు నివేదికలోని విక్రయాలు, మీ మార్కెటింగ్ ప్రయత్నాలకు నేరుగా ఆపాదించబడే ట్రాఫిక్ నుండి వచ్చినవి మాత్రమే. ఈ ప్రయత్నాలు Urchin Tracking Module (UTM) పారామితులను ఉపయోగించే క్యాంపెయిన్‌లు కావచ్చు. దీని కారణంగా, ఈ నివేదికలోని విక్రయాల మొత్తం, ఇతర నివేదికలలోని విక్రయాల గణాంకాలకు భిన్నంగా ఉండవచ్చు.
మీరు ఈ రిపోర్ట్‌ను తెరిచినప్పుడు, దాదాపు 1 నిమిషం అటూఇటూగా డేటా అప్‌డేట్ చేయబడి ఉంటుంది. కొత్త డేటాను ప్రదర్శించడానికి మీరు రిపోర్ట్‌ను మళ్లీ తెరవవచ్చు లేదా రీఫ్రెష్ చేయవచ్చు.
విక్రయాల నివేదికలు అనేక సాధారణ పదావళిని ఉపయోగిస్తాయి. ఈ నివేదిక కింది అదనపు పదావళిని ఉపయోగిస్తుంది:
| పదం | నిర్వచనం |
|---|---|
| UTM క్యాంపెయిన్ పేరు | వర్తిస్తే, మీరు దానిని సెటప్ చేసినప్పుడు అర్చిన్ ట్రాకింగ్ మాడ్యూల్ (Urchin Tracking Module - UTM) క్యాంపెయిన్‌కు ఇచ్చిన పేరు. |
| వర్తిస్తే, క్యాంపెయిన్ చేయడానికి ఉపయోగించిన మార్కెటింగ్ యాప్ ద్వారా సెట్ చేయబడిన విలువలు: | |
| మార్కెటింగ్ ఈవెంట్ రకం | క్యాంపెయిన్ ఫార్మాట్‌ను ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు, క్యాంపెయిన్ లక్ష్యం twitter అయితే, అప్పుడు మార్కెటింగ్ ఈవెంట్ రకం ప్రకటన లేదా పోస్ట్ అవుతుంది. క్యాంపెయిన్‌ను సెటప్ చేయడానికి మీరు Shopify App Store నుండి మార్కెటింగ్ యాప్‌ను ఉపయోగించకపోతే, అప్పుడు ఈ ఫీల్డ్ N/A అని చూపిస్తుంది. |
| మార్కెటింగ్ ఈవెంట్ లక్ష్యం | క్యాంపెయిన్ లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. కొన్ని ఉదాహరణ విలువలు email, facebook_messenger, మరియు twitter. క్యాంపెయిన్‌ను సెటప్ చేయడానికి మీరు Shopify App Store నుండి మార్కెటింగ్ యాప్‌ను ఉపయోగించకపోతే, అప్పుడు ఈ ఫీల్డ్ N/A అని చూపిస్తుంది. |
విక్రయాలు వర్సెస్ చెల్లింపులు
మీకు మరియు మీ కస్టమర్‌లకు మధ్య బదిలీ అయ్యే డబ్బును విక్రయాల నివేదికలు ట్రాక్ చేయవు. ఒక విక్రయం జరిగినప్పుడు, మీరు స్వీకరించిన డబ్బు మొత్తాన్ని కాకుండా, విక్రయంలో చేర్చబడిన వస్తువుల విలువను నివేదికలు చూపుతాయి. మీరు మీ చెల్లింపు పద్ధతులను ఎలా సెటప్ చేశారనే దాని ఆధారంగా, మీరు అసలు చెల్లింపును తర్వాతి తేదీలోపు అందుకోకపోవచ్చు.
అదేవిధంగా, మీరు ఒక రిటర్న్‌ను ప్రాసెస్ చేసినప్పుడు, మీరు స్వీకరిస్తున్న వస్తువుల విలువను నివేదికలు ప్రదర్శిస్తాయి, మీరు కస్టమర్‌కు జారీ చేస్తున్న డబ్బు మొత్తాన్ని కాదు.
విక్రయాల నివేదికలలో ఛార్జ్‌బ్యాక్‌లు చేర్చబడలేదు.
సెషన్‌లు మరియు సందర్శకులు
సెషన్‌ల సంఖ్య మరియు సందర్శకుల సంఖ్య కుక్కీలపై ఆధారపడి ఉంటుంది. కుక్కీలు అనేవి కొనుగోలుదారులు మీ ఆన్‌లైన్ స్టోర్‌ను సందర్శించినప్పుడు వారి డెస్క్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్ వంటి పరికరంలో నిల్వ చేయబడే చిన్న ఫైల్‌లు. ఒక కుక్కీ పరికరాన్ని (సందర్శకుడిని) గుర్తిస్తుంది. మరొక కుక్కీ సెషన్ వ్యవధిని ట్రాక్ చేస్తుంది.
30 నిమిషాల నిష్క్రియత తర్వాత సెషన్ ముగుస్తుంది. ఒకే సందర్శకుడు అనేక సెషన్‌లను కలిగి ఉండవచ్చు కాబట్టి, సాధారణంగా సందర్శకుల సంఖ్య కంటే సెషన్‌ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
ఉదాహరణ: ఒక కస్టమర్ మీ స్టోర్‌లో ఉత్పత్తులను 20 నిమిషాల పాటు వీక్షించి, 2 గంటల తర్వాత మరో 10 నిమిషాల కోసం మీ స్టోర్‌కి తిరిగి వస్తారు. ఇక్కడ 2 సెషన్‌లు మరియు 1 సందర్శకుడి గురించి నివేదించబడుతుంది. ఒకవేళ కొనుగోలుదారు దానికి బదులుగా మీ స్టోర్‌ని 5 నిమిషాల పాటు వీక్షించి, తర్వాత వెళ్లిపోయి 10 నిమిషాల తర్వాత తిరిగి వస్తే, 1 సెషన్ మరియు 1 సందర్శకుడి గురించి నివేదించబడుతుంది.
మీరు మీ ఆన్‌లైన్ స్టోర్‌ను వీక్షించినప్పుడు దాన్ని మీ అక్విజిషన్ నివేదికలలో ఒక సెషన్‌గా పరిగణించకుండా ఉండాలనుకుంటే, మీ డెస్క్‌టాప్ Shopify అడ్మిన్‌లో, కన్ను ఐకాన్‌పై క్లిక్ చేయండి. డెస్క్‌టాప్‌లో మీ ఆన్‌లైన్ స్టోర్‌ను వీక్షించే ఇతర పద్ధతులన్నీ మీ నివేదికలలో ఒక సెషన్‌గా లెక్కించబడతాయి.
మీరు ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్‌లోని Shopify యాప్ నుండి మీ ఆన్‌లైన్ స్టోర్‌ను వీక్షిస్తే, అది మీ అక్విజిషన్ నివేదికలలో ఒక సెషన్‌గా లెక్కించబడుతుంది.
అట్రిబ్యూషన్ మోడల్ వారీగా కన్వర్షన్
కింది డిఫాల్ట్ కన్వర్షన్ నివేదికలు నిలిపివేయబడ్డాయి:
- మొదటి ఇంటరాక్షన్ వారీగా కన్వర్షన్
- చివరి ఇంటరాక్షన్ వారీగా కన్వర్షన్
- అట్రిబ్యూషన్ మోడల్ పోలిక
అట్రిబ్యూషన్ మోడల్‌లను సరిపోల్చడానికి, మార్కెటింగ్ ఛానెల్ వారీగా పనితీరు నివేదిక వంటి, నివేదిక యొక్క కాన్ఫిగరేషన్ ప్యానెల్‌లోని అట్రిబ్యూషన్ మెనూ నుండి ఒకటి కంటే ఎక్కువ మోడల్‌లను ఎంచుకోండి. నివేదికలలోని అట్రిబ్యూషన్ మోడల్‌ల గురించి మరింత తెలుసుకోండి.