Shopify పాయింట్ ఆఫ్ సేల్ ప్రారంభించడం
మీరు మీ Shopify పాయింట్ ఆఫ్ సేల్ యాప్ (Shopify POS) ద్వారా విక్రయించడం ప్రారంభించే ముందు, మీరు ఒక అకౌంట్‌ను సృష్టించి, మీ వ్యాపారానికి బాగా సరిపోయే Shopify సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోవాలి. మీరు మీ స్టోర్‌ను సెటప్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మీకు అవసరమైన ఏ POS హార్డ్‌వేర్‌ను అయినా కొనుగోలు చేసి కనెక్ట్ చేయవచ్చు, అలాగే చెల్లింపులను ఆమోదించడానికి Shopify POSను సెటప్ చేయవచ్చు. మీరు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రతి Shopify సబ్స్క్రిప్షన్ ప్లాన్‌పై Shopify POS ప్రాథమిక ఫీచర్లను ఉపయోగించవచ్చు.
ఒకవేళ మీకు అదనపు రిటైల్ ఫీచర్లు కావాలంటే, మీరు Shopify POS Proను ఉపయోగించాల్సి ఉంటుంది.
మీ స్టోర్ EUలో ఉన్నట్లయితే, మీరు ప్రాంతీయ పాయింట్ ఆఫ్ సేల్ ఆవశ్యకతలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. స్వయంగా చేసే మీ విక్రయాలు కంప్లయింట్ (నిబంధనలకు అనుగుణంగా) అయ్యేలా ఎలా చూసుకోవాలో తెలుసుకోండి.