Chipper 2X BT కార్డ్ రీడర్ కోసం అవసరాలు

మీరు Chipper 2X BT కార్డ్ రీడర్‌ను ఉపయోగించడానికి ముందు, మీ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ అవసరాలను తీరుస్తున్నాయని నిర్ధారించుకోండి. ఈ అవసరాలను తీర్చడం ద్వారా Shopify POSతో నేరుగా చెల్లింపులను అంగీకరించేటప్పుడు సులభమైన సెటప్ మరియు అనుభవం నిర్ధారించబడుతుంది.

Chipper 2X BT కార్డ్ రీడర్ అవసరాలు

Chipper 2X BT కార్డ్ రీడర్‌ను ఉపయోగించడానికి, మీరు కింది అవసరాలను తీర్చాలి:

  • మీరు Shopify POS యాప్‌ను ఉపయోగించాలి.
  • మీ రిటైల్ స్టోర్ పేమెంట్ ప్రొవైడర్ Shopify Payments అయి ఉండాలి. టెస్ట్ మోడ్ ఆఫ్‌లో ఉండాలి.
  • మీ స్టోర్ తప్పనిసరిగా యునైటెడ్ స్టేట్స్‌లో ఉండాలి.
  • మీ భౌతిక రిటైల్ లొకేషన్‌లు యునైటెడ్ స్టేట్స్‌లో ఉండాలి.
  • మీరు USDలో విక్రయించాలి.
  • మీ స్టోర్ కరెన్సీ, మీ భౌతిక స్టోర్ ఉన్న లొకేషన్‌కు సంబంధించిన స్థానిక కరెన్సీకి సరిపోలాలి.
  • మీ పరికరానికి బ్లూటూత్ 4.0 లేదా అంతకంటే పై వెర్షన్ అవసరం.

Shopify POSకు సంబంధించి iOS, Android పరికరాల అనుకూలత ఆవశ్యకతలు

Shopify POS కేవలం iOS, Android పరికరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్‌లు లేదా Amazon Fire ట్యాబ్లెట్‌లకు అందుబాటులో లేదు.

కింది ఆవశ్యకతలకు అనుగుణంగా ఉండే పరికరాలతో Shopify POS పని చేస్తుంది:

Shopify POSతో పని చేసే iPhoneలు, iPadలు, Android పరికరాలు, POS Goల జాబితాతో పాటుగా, వాటికి అవసరమైన జనరేషన్‌లు, ఆపరేటింగ్ సిస్టమ్‌ల వివరాలు.
పరికరంవివరణ
iPadiPadOS 15.1 లేదా అంతకంటే పై వెర్షన్‌లో రన్ అవుతున్న 5వ జనరేషన్ లేదా అంతకంటే పై జనరేషన్
iPad Air iPadOS 15.1 లేదా అంతకంటే పై వెర్షన్‌లో రన్ అవుతున్న 2వ జనరేషన్ లేదా అంతకంటే పై జనరేషన్
iPad miniiPadOS 15.1 లేదా అంతకంటే పై వెర్షన్‌లో రన్ అవుతున్న 4వ జనరేషన్ లేదా అంతకంటే పై జనరేషన్
iPad ProiPadOS 15.1 లేదా అంతకంటే పై వెర్షన్‌లో రన్ అవుతున్న అన్ని iPad Pro మోడళ్లు
iPhoneiOS 15.1 లేదా అంతకంటే పై వెర్షన్‌లో రన్ అవుతున్న iPhone 7 లేదా అంతకంటే పై మోడళ్లు
POS GoShopify అందించిన తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో రన్ అవుతున్న POS Go
Androidయాక్టివేట్ చేయబడిన Google Play Services మరియు Google Mobile Servicesతో, అధికారిక Android వెర్షన్ 10.0 లేదా అంతకంటే పై వెర్షన్‌లో రన్ అవుతున్న ఫోన్ లేదా ట్యాబ్లెట్

Shopify POS ఇకపై iOS 14 లేదా అంతకంటే తక్కువ వెర్షన్‌లకు మద్దతు ఇవ్వదు. iOS పాత వెర్షన్‌లతో, మీరు యాప్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చు కానీ దాన్ని ఇకపై అప్‌డేట్ చేయలేరు. బగ్ పరిష్కారాలు, కొత్త ఫీచర్‌ల ప్రయోజనం పొందడానికి, మీరు మీ పరికరాన్ని iOS 15.1 లేదా అంతకంటే పై వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. అది సాధ్యం కాకపోతే, iOS 15.1 లేదా అంతకంటే పై వెర్షన్‌లో రన్ అవుతున్న వేరే పరికరంలో Shopify POSని ఉపయోగించడానికి మారండి.

iOS అనుమతి ఆవశ్యకతలు

మీరు మీ పరికరాన్ని iOS 15.1 లేదా అంతకంటే పై వెర్షన్‌కి అప్‌డేట్ చేసి, థర్డ్-పార్టీ Shopify యాప్‌లను ఉపయోగిస్తుంటే, మీరు మీ iOS సెట్టింగ్‌లలో క్రాస్-వెబ్‌సైట్ ట్రాకింగ్ (Cross-Website tracking)ను యాక్టివేట్ చేయాల్సి రావచ్చు. మీ Shopify అడ్మిన్‌లో మీరు ఇన్‌స్టాల్ చేసే థర్డ్-పార్టీ Shopify యాప్‌లు, Shopify Inbox, Shopify పాయింట్ ఆఫ్ సేల్ మరియు Shopify యాప్‌లో కనెక్ట్ అయి ఉండేలా క్రాస్-వెబ్‌సైట్ ట్రాకింగ్ అనుమతిస్తుంది.

క్రాస్-వెబ్‌సైట్ ట్రాకింగ్ (Cross-Website tracking)ను యాక్టివేట్ చేయడానికి, కింది దశలను పూర్తి చేయండి:

  1. మీ iOS పరికరంలో, సెట్టింగ్‌లు యాప్‌ను తెరవండి.
  2. Shopify, Shopify POS లేదా Shopify Inboxని ట్యాప్ చేయండి.
  3. క్రాస్-వెబ్‌సైట్ ట్రాకింగ్ అనుమతించు (Allow Cross-Website Tracking)ని యాక్టివేట్ చేయండి.