Chipper 2X BT కార్డ్ రీడర్‌ను సెటప్ చేయడం
Chipper 2X BT కార్డ్ రీడర్ అనేది, Shopify POSతో ప్రత్యక్షంగా ట్యాప్, చిప్ లేదా స్వైప్ పేమెంట్లను సురక్షితంగా ఆమోదించడానికి మిమ్మల్ని అనుమతించే వైర్లెస్ చెల్లింపు పరికరం. ఈ పేజీ మీ POS పరికరానికి Chipper 2X BT కార్డ్ రీడర్‌ను సెటప్ చేయడానికి, ఆన్ చేయడానికి, ఛార్జ్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి అవసరమైన దశలను అందిస్తుంది, కాబట్టి మీరు త్వరగా మరియు ధీమాగా చెల్లింపులను ఆమోదించడం ప్రారంభించవచ్చు.
ఈ పేజీలో
Chipper 2X BT కార్డ్ రీడర్‌ను ఆన్, ఆఫ్ చేయండి
Chipper 2X BT కార్డ్ రీడర్‌ను ఆన్ చేయడానికి, దాని పవర్ బటన్‌ను నొక్కి, వదిలిపెట్టండి. స్టేటస్ లైట్ ఇండికేటర్ ఆన్ అయిన తర్వాత, స్టేటస్ లైట్ బ్లూ రంగులోకి మారే వరకు వేచి ఉండండి. మీరు ఇప్పటికే మీ POS పరికరంతో రీడర్‌ను జత చేసి, కనెక్ట్ చేసి ఉన్నట్లయితే, అప్పుడు రీడర్ ఆటోమేటిక్‌గా పరికరానికి మళ్లీ కనెక్ట్ అవుతుంది.
30 సెకన్ల పాటు ఎలాంటి యాక్టివిటీ లేకపోతే, Chipper 2X BT కార్డ్ రీడర్ స్టాండ్‌బై మోడ్‌లోకి వెళుతుంది. స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నప్పుడు రీడర్ Shopify POSకు కనెక్ట్ అయి ఉంటుంది, మీరు మళ్లీ యాక్టివిటీని ప్రారంభించినప్పుడు ఆటోమేటిక్‌గా స్టాండ్‌బై మోడ్ నుండి బయటకు వస్తుంది. 10 గంటల పాటు ఎలాంటి యాక్టివిటీ లేకపోతే రీడర్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. రీడర్‌ను మాన్యువల్‌గా ఆఫ్ చేయడానికి, స్టేటస్ లైట్ ఆరిపోయే వరకు పవర్ బటన్‌ను నొక్కి పట్టి ఉంచండి. పవర్‌ను ఆదా చేయడం కోసం మీరు రీడర్‌ను ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు.
Chipper 2X BT కార్డ్ రీడర్‌ను ఛార్జ్ చేయండి
Chipper 2X BT కార్డ్ రీడర్‌తో పాటు అందించిన USB కేబుల్‌ను ఉపయోగించి మీరు దాన్ని ఛార్జ్ చేయవచ్చు. రీడర్‌ను ఛార్జ్ చేయడానికి, USB కనెక్టర్ చిన్న చివరను కార్డ్ రీడర్‌కు ప్లగ్ చేసి, ఆపై పెద్ద చివరను ఫోన్ ఛార్జర్ లేదా కంప్యూటర్‌కు ప్లగ్ చేయండి. 5V / 1A (5W) ఛార్జర్‌ను ఉపయోగించడం ఉత్తమ పద్ధతి.
Chipper 2X BT కార్డ్ రీడర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 3-4 గంటల సమయం పడుతుంది. రీడర్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత, దాని బ్యాటరీ ఒక వారం పాటు విక్రయాలు జరపడానికి సరిపోతుంది.
Chipper 2X BT బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు, స్టేటస్ లైట్ రెడ్ రంగులోకి మారుతుంది.
మీ Chipper 2X BT కార్డ్ రీడర్‌ను ఎలా కనెక్ట్ చేయాలో ఎంచుకోండి
మీరు కింద పేర్కొన్న మార్గాల్లో Chipper 2X BT కార్డ్ రీడర్‌ను కనెక్ట్ చేయవచ్చు:
| కనెక్షన్ రకం | పరిగణనలు |
|---|---|
| Shopify POS Hubతో USB | అత్యంత విశ్వసనీయమైన సెటప్ కోసం సిఫార్సు చేయబడింది. iPad మరియు Android పరికరాలకు అనుకూలంగా ఉంటుంది. |
| బ్లూటూత్ | iOS లేదా Android పరికరానికి అనుకూలంగా ఉంటుంది. రెండు పరికరాలు ఆన్ చేయబడి, రేంజ్లో ఉన్నప్పుడల్లా రీడర్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. |
| మైక్రో-USB కేబుల్ | iOS లేదా Android పరికరాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభ సెటప్ తర్వాత, మీరు కేబుల్ ప్లగ్ చేసినప్పుడు రీడర్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. |
Chipper 2X BT కార్డ్ రీడర్ని మీ POS పరికరానికి జత చేసి, కనెక్ట్ చేయండి
కార్డ్ రీడర్‌ను Shopify POSతో ఉపయోగించడానికి, మీరు మీ పరికరంతో Shopify POS సెట్టింగ్‌ల ద్వారా రీడర్‌ను జత చేయాలి. మీరు కింది మార్గాలలో Chipper 2X BTని కనెక్ట్ చేయవచ్చు:
- బ్లూటూత్‌తో iPad, iPhone లేదా Android పరికరానికి.
- ఒక మైక్రో-USB కేబుల్ ద్వారా Shopify POS Hub నుండి iPadకి.
- ఒక మైక్రో-USB కేబుల్‌తో Android పరికరానికి.
మీరు మీ రీడర్‌ను బ్లూటూత్‌కి కనెక్ట్ చేసినట్లయితే, అవి రెండూ ఆన్ చేయబడి, రేంజ్లో ఉన్నప్పుడల్లా రీడర్ ఆ పరికరానికి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది.
మీరు మీ రీడర్‌ను మైక్రో-USB కేబుల్‌తో కనెక్ట్ చేసినట్లయితే, మీరు దాన్ని ఒక్కసారి మాత్రమే Shopify POSలో మాన్యువల్‌గా సెటప్ చేయాల్సి ఉంటుంది. మీరు దీన్ని మొదటిసారి సెటప్ చేసిన తర్వాత, మీరు మైక్రో-USB కేబుల్‌ని కనెక్ట్ చేసినప్పుడు రీడర్ ఆటోమేటిక్‌గా Shopify POSకి కనెక్ట్ అవుతుంది.
దశలు:
బ్లూటూత్
- కార్డ్ రీడర్‌ను ఆన్ చేయడానికి, పవర్ బటన్‌ను నొక్కి వదలండి.
- Shopify POS యాప్ నుండి,
ని ట్యాప్ చేసి, ఆపై + హార్డ్‌వేర్‌ను జోడించండి అనే దాన్ని ట్యాప్ చేయండి.
- కార్డ్ రీడర్‌ను ట్యాప్ చేయండి.
- పరికర రకాన్ని ఎంచుకోండి పేజీలో, Chipper 2X BTని ట్యాప్ చేయండి.
- మీ కనెక్షన్ రకాన్ని ఎంచుకోండి పేజీలో, బ్లూటూత్‌ను ట్యాప్ చేయండి.
- రీడర్‌పై ఉన్న పవర్ బటన్‌ను నొక్కి వదలండి. కార్డ్ రీడర్ జత చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, LED స్టేటస్ లైట్ ఇండికేటర్ బ్లూ రంగులో మెరుస్తుంది.
- కార్డ్ రీడర్ అందుబాటులో ఉన్న కార్డ్ రీడర్లు కింద ప్రదర్శించబడినప్పుడు, కార్డ్ రీడర్ పేరు పక్కన ఉన్న కనెక్ట్ చేయండిని ట్యాప్ చేయండి.
మైక్రో-USB
మీరు POS టాబ్లెట్ స్టాండ్ (USB-C)ను ఉపయోగిస్తుంటే, మీ టాబ్లెట్ మోడల్ ఆధారంగా మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. సపోర్ట్ చేసే Android టాబ్లెట్ల గురించి మరింత తెలుసుకోవడానికి, Shopify POS Support on Androidను రివ్యూ చేయండి.
- కార్డ్ రీడర్‌ను ఆన్ చేయడానికి, పవర్ బటన్‌ను నొక్కి వదలండి.
- Shopify POS నుండి,
ని ట్యాప్ చేసి, ఆపై + హార్డ్‌వేర్‌ను జోడించండి అనే దాన్ని ట్యాప్ చేయండి.
- కార్డ్ రీడర్‌ను ట్యాప్ చేయండి.
- పరికర రకాన్ని ఎంచుకోండి పేజీలో, Chipper 2X BTని ట్యాప్ చేయండి.
- మీ కనెక్షన్ రకాన్ని ఎంచుకోండి పేజీలో, USBని ట్యాప్ చేయండి.
- కార్డ్ రీడర్ కుడి వైపున ఉన్న పోర్ట్‌కి మైక్రో-USB కేబుల్‌ని కనెక్ట్ చేయండి. మరొక చివరను POS పరికరానికి కనెక్ట్ చేయండి.
- మీరు రీడర్‌ను కనెక్ట్ చేయడం ఇదే మొదటిసారి అయితే, మీరు Shopify POSతో రీడర్‌ను కాన్ఫిగర్ చేయాలి:
- "Open Shopify POS to handle CHB#####" (CHB#####ను హ్యాండిల్ చేయడానికి Shopify POSను తెరవండి) అని చెబుతూ ఒక పాప్-అప్ విండో కనిపిస్తుంది. ఈ విండోలో, Always open Shopify POS when CHB##### is connected (CHB##### కనెక్ట్ అయినప్పుడు ఎల్లప్పుడూ Shopify POSను తెరవండి)ని ఎంచుకుని, ఆపై సరే (OK)ని ఎంచుకోండి.
- "Allow Shopify POS to handle CHB####" (CHB####ను హ్యాండిల్ చేయడానికి Shopify POSను అనుమతించండి) అని చెబుతూ రెండవ పాప్-అప్ విండో కనిపిస్తుంది. ఈ విండోలో, Always open Shopify POS when CHB##### is connected (CHB##### కనెక్ట్ అయినప్పుడు ఎల్లప్పుడూ Shopify POSను తెరవండి)ని ఎంచుకుని, ఆపై సరే (OK)ని ఎంచుకోండి.
- కనెక్ట్ చేయండి > పూర్తయిందిని ట్యాప్ చేయండి.
Shopify POS Hubను ఉపయోగించి Chipper 2X BT కార్డ్ రీడర్ని కనెక్ట్ చేయండి
అనుకూలమైన iPad లేదా Android పరికరానికి USB ద్వారా Chipper 2X BT కార్డ్ రీడర్ని కనెక్ట్ చేయడానికి Shopify POS Hubను ఉపయోగించండి.
దశలు:
మీరు మీ హార్డ్‌వేర్‌ను Shopify POS Hubకి కనెక్ట్ చేయడానికి ముందు, POS Hubను సెటప్ చేయండి:
- Shopify POS Hub పవర్ కార్డ్‌ని పవర్ సోర్స్‌కి ప్లగ్ చేయండి.
- Shopify POS Hubకి చెందిన USB-C లేదా Lightning కేబుల్‌ని మీ POS పరికరానికి కనెక్ట్ చేయండి.
- Shopify POS Hubకి చెందిన USB-C లేదా Lightning కేబుల్ మరొక చివరను Shopify POS Hub దిగువన ఉన్న టాబ్లెట్ పోర్ట్‌లోకి ప్లగ్ చేయండి. టాబ్లెట్ కేబుల్ కోసం Shopify POS Hubలోని మరే ఇతర USB-C పోర్ట్‌ను ఉపయోగించవద్దు.
- Shopify POSను తెరిచి ఉంచండి. మీరు Shopify POS Hubకి కనెక్ట్ చేసే మద్దతు ఉన్న USB హార్డ్‌వేర్, ఆటోమేటిక్‌గా Shopify POSకి జోడించబడుతుంది.
కార్డ్ రీడర్‌ను ఆన్ చేయడానికి, పవర్ బటన్‌ను నొక్కి వదలండి.
కార్డ్ రీడర్ కుడి వైపున ఉన్న పోర్ట్‌కి మైక్రో-USB కేబుల్‌ను కనెక్ట్ చేయండి, ఆపై మరొక చివరను Shopify POS Hubలోని USB పోర్ట్‌కి కనెక్ట్ చేయండి.
కొద్దిసేపటి తర్వాత, Shopify POS కార్డ్ రీడర్‌ను ఆటోమేటిక్‌గా జోడిస్తుంది. పరికరం ద్వారా ప్రాంప్ట్ చేయబడితే, కార్డ్ రీడర్ కనెక్షన్‌ను అనుమతించండి.
Shopify POSలో,
ఐకాన్ని ట్యాప్ చేసి, ఆపై కార్డ్ రీడర్ కనెక్ట్ అయ్యిందని నిర్ధారించండి.
మీ Chipper 2X BT కార్డ్ రీడర్ని Shopify POS Hub నుండి డిస్కనెక్ట్ చేయండి
మీరు మీ Chipper 2X BT కార్డ్ రీడర్ని ఇకపై Shopify POS Hubతో ఉపయోగించకూడదనుకుంటే, మీరు దాన్ని Shopify POS నుండి డిస్కనెక్ట్ చేయవచ్చు.
దశలు:
- Shopify POSలో,
ఐకాన్ని ట్యాప్ చేయండి.
- మీరు తీసివేయాలనుకుంటున్న పరికరాన్ని ట్యాప్ చేయండి.
- కార్డ్ రీడర్‌ను మర్చిపోండిని ట్యాప్ చేయండి.
- మీకు ఆ ఆప్షన్ కనిపించకపోతే, ముందుగా Shopify POS Hub నుండి పరికరం USB కేబుల్‌ను అన్‌ప్లగ్ చేసి, అది డిస్కనెక్ట్ చేయబడింది అని ప్రదర్శించే వరకు వేచి ఉండి, ఆపై మళ్లీ ప్రయత్నించండి.
బ్లూటూత్ మరియు USB కనెక్షన్ల మధ్య మారడం
మీరు బ్లూటూత్ మరియు USB కనెక్షన్లను మాన్యువల్‌గా సెటప్ చేసినట్లయితే, మీరు ఈ రెండు కనెక్షన్ రకాలను ఆటోమేటిక్‌గా మార్చవచ్చు. కార్డ్ రీడర్ మైక్రో-USB కేబుల్‌తో ప్లగ్ చేయబడినప్పుడు, కనెక్షన్ డీఫాల్ట్‌గా USB కనెక్షన్‌కి మారుతుంది. మీరు కార్డ్ రీడర్‌ను అన్‌ప్లగ్ చేసినప్పుడు, కనెక్షన్ బ్లూటూత్‌కి మారుతుంది.
కనెక్షన్ రకాల మధ్య మారుతున్నప్పుడు, మీ రీడర్ మళ్లీ కనెక్ట్ కావడానికి ముందు కొన్ని సెకన్ల పాటు డిస్కనెక్ట్ అవుతుంది. మీరు మెనూ బార్‌లోని కనెక్టివిటీ సింబల్‌ని ట్యాప్ చేయడం ద్వారా మీ Shopify POS యాప్‌లో కనెక్షన్ స్టేటస్‌ని చూడవచ్చు.
మీ POS పరికరం నుండి Chipper 2X BT కార్డ్ రీడర్ని అన్‌పెయిర్ చేయండి
మీరు Chipper 2X BT కార్డ్ రీడర్‌ను ఒకేసారి ఒక పరికరంతో మాత్రమే ఉపయోగించగలరు. మీరు కార్డ్ రీడర్‌ను మరొక పరికరంతో ఉపయోగించాలనుకుంటే, మీరు ముందుగా రీడర్‌ను దాని ప్రస్తుత పరికరం నుండి అన్‌పెయిర్ చేయాలి.
దశలు:
- Shopify POS నుండి,
ని ట్యాప్ చేయండి.
- మీ కనెక్ట్ చేయబడిన కార్డ్ రీడర్ పేరును ట్యాప్ చేయండి.
- కార్డ్ రీడర్‌ను మర్చిపోండిని ట్యాప్ చేయండి.
మీ Chipper 2X BT కార్డ్ రీడర్ బ్లూటూత్ ఉపయోగించి కనెక్ట్ చేయబడి ఉంటే, మీ పరికర బ్లూటూత్ సెట్టింగ్‌లకు వెళ్లి, ఇంతకుముందు కనెక్ట్ చేయబడిన పరికరాల లిస్ట్ నుండి రీడర్‌ను మర్చిపోండి.