POS Go ట్రబుల్షూటింగ్
మీకు మీ POS Go పరికరంతో సమస్యలు ఉన్నట్లయితే, పవర్, చెల్లింపు, PIN లేదా కనెక్టివిటీ సమస్యల వంటి సాధారణ సమస్యలను పరిష్కరించడంలో సహాయం కోసం ఈ పేజీలో ఉన్న ట్రబుల్షూటింగ్ దశలను ఉపయోగించండి. ఈ దశలు మీ సమస్యను పరిష్కరించకపోతే, తదుపరి సహాయం కోసం మీరు నేరుగా Shopify సపోర్ట్‌కి సమస్యను నివేదించవచ్చు.
ఈ పేజీలో
POS Go ఆన్ అవ్వడం లేదు
పరికరాన్ని మేల్కొలపడానికి లేదా ఆన్ చేయడానికి మీరు పవర్ బటన్‌ను నొక్కినప్పుడు మీ POS Go ప్రతిస్పందించకపోతే, బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయి ఉండవచ్చు. మీ పరికరం ఛార్జ్ అవ్వడానికి దాన్ని కొన్ని గంటల పాటు పవర్ సోర్స్‌కి ప్లగ్ చేసి ఉంచండి. సాధ్యమైనప్పుడు మీ POS Goతో వచ్చిన USB కేబుల్‌ను ఉపయోగించండి. స్క్రీన్కు కొద్దిగా పైన LED ఛార్జింగ్ ఇండికేటర్ వెలుగుతుంది. LED ఎరుపు రంగులో ఉన్నప్పుడు, బ్యాటరీ ఛార్జ్ చాలా తక్కువగా ఉందని, పరికరం ఛార్జ్ అవుతోందని అర్థం. ఇతర రంగులు బ్యాటరీ అత్యంత తక్కువగా లేదని, పరికరం ఛార్జ్ అవుతుందని లేదా పూర్తిగా ఛార్జ్ అయ్యిందని సూచిస్తాయి. ప్లగిన్ చేసిన తర్వాత LED లైట్ వెలగకపోతే అలాగే POS Go ఇప్పటికీ ప్రతిస్పందించకపోతే, వేరే ఛార్జర్‌ని ప్రయత్నించండి. మీకు ఇంకా ఎటువంటి ప్రతిస్పందన రాకపోతే, తదుపరి సహాయం కోసం సమస్యను నివేదించండి.
“రీడర్‌కి కనెక్ట్ చేయబడలేదు” ఎర్రర్ మెసేజ్
చెల్లింపు సమయంలో మీరు పవర్ బటన్‌ను నొక్కి, మీ పరికరాన్ని లాక్ చేసినట్లయితే, ఆపై మీరు పరికరాన్ని అన్‌లాక్ చేసిన తర్వాత, "రీడర్‌కి కనెక్ట్ చేయబడలేదు" అనే మెసేజ్‌తో ఒక ఎర్రర్ స్క్రీన్ ప్రదర్శించబడుతుంది. చెల్లింపు ఎంపికలకు వెనక్కి వెళ్లండి ట్యాప్ చేసి, ఆపై చెల్లింపు ప్రాసెస్‌ను పునఃప్రారంభించడానికి కోరుకున్న చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి.
చెల్లింపు సమయంలో తప్పు PIN ఎంట్రీ
ఒక కస్టమర్ PIN అవసరమైన కార్డ్‌ని ఉపయోగిస్తే, తప్పు PINని 3 సార్లు నమోదు చేయడం వల్ల మీ POS Go ప్రతిస్పందించకుండా పోవచ్చు. పరికరాన్ని రీస్టార్ట్ చేయడం అనేది సిఫార్సు చేయబడిన పరిష్కారం. పరికరాన్ని రీస్టార్ట్ చేయడానికి, పవర్ బటన్‌ను 2-3 సెకన్ల పాటు పట్టుకుని, ఆపై రీస్టార్ట్ చేయండి ట్యాప్ చేయండి. రీబూట్ చేసి, మీ సిబ్బంది PIN ఎంటర్ చేసిన తర్వాత, మీరు చెక్అవుట్ను పునఃప్రారంభించగలరు.
POS Goతో కనెక్టివిటీ సమస్యలు
మీ రిటైల్ హార్డ్‌వేర్, Shopify ఖాతా, బ్లూటూత్, అలాగే Wi-Fiతో POS Go కనెక్టివిటీ స్టేటస్‌ను ట్యాప్ చేయడం ద్వారా చెక్ చేయవచ్చు.
మీరు మీ Shopify అడ్మిన్‌లో చేసే మార్పు POSలో ప్రదర్శించబడకపోతే, సమస్యను పరిష్కరించడానికి మీరు మాన్యువల్‌గా మీ అడ్మిన్‌తో POSని రీసింక్ చేయవచ్చు.
POS Go ఛార్జింగ్ సమస్యలు
మీ POS Go ఛార్జ్ అవ్వకపోతే, నెమ్మదిగా ఛార్జ్ అవుతుంటే లేదా పవర్‌కు కనెక్ట్ చేయబడినప్పుడు బ్యాటరీని కోల్పోతే, ఛార్జర్, పరికరం మరియు డాక్‌ని విడివిడిగా ట్రబుల్షూట్ చేయండి.
మీ ఛార్జర్ కనీస స్పెసిఫికేషన్లలో ఒకదానికి అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి: 10W అవుట్‌పుట్‌తో 5V/2A, లేదా 18W అవుట్‌పుట్‌తో 9V/2A. ఛార్జర్ తప్పనిసరిగా కనీసం 2A కరెంట్‌ని సరఫరా చేయాలి. ఎక్కువ కరెంట్‌కు మద్దతు ఇచ్చే లేదా డ్యూయల్ 5V మరియు 9V లేబుల్ ఉన్న ఛార్జర్ కూడా POS Goను ఛార్జ్ చేయగలదు.
USB-C కేబుల్‌తో నేరుగా POS Goని ఛార్జ్ చేయడానికి వాల్ అడాప్టర్‌ని ఉపయోగించండి. ట్రబుల్షూటింగ్ సమయంలో కంప్యూటర్ USB పోర్ట్ నుండి POS Goని ఛార్జ్ చేయవద్దు, ఎందుకంటే కంప్యూటర్ తగినంత పవర్‌ను సరఫరా చేయకపోవచ్చు. మీరు POS Goను స్టాండ్అలోన్ పరికరంగా ఉపయోగిస్తుంటే, దానిని డాక్లో ఛార్జ్ చేయడానికి బదులుగా నేరుగా USB-C కేబుల్‌తో ఛార్జ్ చేయండి. POS Goను డాక్ చేసినప్పుడు, ఇది కస్టమర్ డిస్ప్లే మోడ్‌కి మారుతుంది.
కనీస ఛార్జర్ స్పెసిఫికేషన్లు ఉండి కూడా, 30-60 నిమిషాల తర్వాత కూడా POS Go ఛార్జ్ కాకపోతే, కింది ట్రబుల్షూటింగ్ దశలను ప్రయత్నించండి:
- వేరొక USB-C ఛార్జింగ్ కేబుల్‌ను ప్రయత్నించండి.
- వేరొక వాల్ అడాప్టర్‌ను ప్రయత్నించండి.
- వేరొక పవర్ అవుట్‌లెట్‌ను ప్రయత్నించండి.
- POS Goను నేరుగా USB-C కేబుల్‌తో కనీసం 1 గంట పాటు ఛార్జ్ చేసి, ఆపై దాన్ని మళ్లీ ఆన్ చేయడానికి ప్రయత్నించండి.
సమస్యను గుర్తించడంలో POS Go LED పవర్ ఇండికేటర్ సహాయపడుతుంది:
| ఇండికేటర్ | ఏం చేయాలి |
|---|---|
| ఎరుపు రంగు LED | బ్యాటరీ చాలా తక్కువగా ఉంది. POS Goను వాల్ అడాప్టర్‌కు కనీసం 1 గంట పాటు కనెక్ట్ చేసి ఉంచండి, ఆపై దాన్ని మళ్లీ ఆన్ చేయడానికి ప్రయత్నించండి. |
| ఎరుపు రంగు LEDతో ఫ్లాష్ అవుతున్న పసుపు రంగు బ్యాటరీ ఐకాన్ | బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయింది. POS Goను నేరుగా USB-C కేబుల్‌తో వాల్ అడాప్టర్‌కు కనీసం 1 గంట పాటు కనెక్ట్ చేసి ఉంచి, ఆ తర్వాత దాన్ని మళ్లీ ఆన్ చేయడానికి ప్రయత్నించండి. |
| అనేక కేబుళ్లు, వాల్ అడాప్టర్లు, అవుట్లెట్లను ప్రయత్నించిన తర్వాత కూడా LED వెలగకపోవడం | పరికరానికి పవర్ అందుతుండకపోవచ్చు. Shopify సపోర్ట్‌కు సమస్యను రిపోర్ట్ చేయండి. |
POS Terminal Dockతో POS Go ఛార్జింగ్ సమస్యలు
మీరు POS Goను POS Terminal Dockతో ఉపయోగిస్తుంటే, సమస్య డాక్దా లేక POS Goదా అని నిర్ధారించండి:
- POS Goను నేరుగా USB-C కేబుల్‌తో వాల్ అడాప్టర్‌కి కనెక్ట్ చేసినప్పుడు పూర్తిగా ఛార్జ్ అవుతుంటే, డాక్ నుండి పవర్ అందుతుండకపోవచ్చు. POS Go వెనుక భాగంలో, డాక్ లోపల ఉన్న ఛార్జింగ్ పిన్‌లకు ఏమైనా మురికి, చెత్త అంటుకుందేమో లేదా భౌతికంగా ఏదైనా డ్యామేజ్ ఉందేమో చెక్ చేయండి. ఒకవేళ పిన్లు శుభ్రంగా ఉండి, డ్యామేజ్ కాకపోతే, సమస్యను రిపోర్ట్ చేయండి.
- డాక్ నీలం రంగు ఛార్జింగ్ లైట్ ఆన్ అయినప్పటికీ, POS Go బ్యాటరీ శాతం తగ్గుతూనే ఉంటే, అప్పుడు సమస్యను రిపోర్ట్ చేయండి.
- POS Goను నేరుగా వాల్ అడాప్టర్‌కి అనేక USB-C కేబుళ్లతో కనెక్ట్ చేసినప్పుడు కూడా ఛార్జ్ కాకపోతే లేదా కొద్దిసేపు మాత్రమే ఛార్జ్ అవుతుంటే, POS Go బ్యాటరీ పాడవుతుండవచ్చు. Shopify సపోర్ట్‌కు సమస్యను రిపోర్ట్ చేయండి.
POS Go బ్యాటరీలు
అనేక ఎలక్ట్రానిక్స్ పరికరాల్లాగే, POS Go పరికరం కూడా లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తుంది. లిథియం-అయాన్ బ్యాటరీలన్నీ కాలక్రమేణా, వాడకం కొద్దీ సహజంగానే కొంత మేర ఉబ్బుతాయి. ఉబ్బిన బ్యాటరీ మీ పరికరం పనితీరుపై ప్రభావం చూపవచ్చు, కాబట్టి ఉబ్బిన బ్యాటరీని అలాగే ఉపయోగించడం, ఛార్జ్ చేయడం మంచిది కాదు. ఉబ్బినట్లు ఏవైనా సంకేతాలు ఉన్నాయేమో మీ POS Go పరికరాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి.
మీ బ్యాటరీ ఉబ్బినట్లయితే, దాని వినియోగాన్ని ఆపివేసి, మీ స్థానిక నిబంధనలకు అనుగుణంగా మీకు సమీపంలోని ఎలక్ట్రానిక్స్ రీసైక్లింగ్ సదుపాయంలో పరికరాన్ని రీసైకిల్ చేయండి.
POS Go, లిథియం-అయాన్ బ్యాటరీలకు సంబంధించిన హ్యాండ్లింగ్ మార్గదర్శకాలు
మీ POS Go, లిథియం-అయాన్ బ్యాటరీలను మంచి స్థితిలో ఉంచడానికి కింది ఉత్తమ పద్ధతులను పాటించండి:
- POS Goను చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయండి, అలాగే నేరుగా సూర్యకాంతి లేదా వేడి తగిలే ప్రదేశాలకు దూరంగా ఉంచండి.
- పరికరం లేదా బ్యాటరీని నలపడం, పడేయడం, విరగ్గొట్టడం లేదా బయటి వస్తువులతో గుచ్చడం లాంటివి చేయవద్దు.
- బ్యాటరీ ప్యాక్‌లు, సెల్‌లను విప్పవద్దు.
- POS Goలో బ్యాటరీని మార్చడానికి లేదా దాన్ని తీసివేయడానికి ప్రయత్నించవద్దు.
- బ్యాటరీ ఉపరితలంపై ఒత్తిడి తీసుకురావద్దు.
- బ్యాటరీని వంచవద్దు.
- బ్యాటరీని బయటకు తీయడానికి లేదా దానిపై ఎలాంటి పరికరాలను ఉపయోగించవద్దు.
నా బ్యాటరీ ఉబ్బిందో లేదో నేను ఎలా తెలుసుకోవాలి?
ఎప్పటికప్పుడు మీ బ్యాటరీని తనిఖీ చేస్తూ, అది ఉబ్బినట్లయితే మీ పరికరాన్ని మార్చడం ముఖ్యం. పరికరాన్ని పక్కవైపు నుండి చూసి మీ పరికరాన్ని తనిఖీ చేయవచ్చు. కార్డ్ స్వైప్ రీడర్ కింద ఉన్న కేస్ భాగం చదునుగా లేకుంటే, మీ పరికరం ఉబ్బినట్లు అర్థం. మీ పరికరం డాక్లో ఉంటే, తనిఖీ చేయడానికి దాన్ని డాక్ నుండి తీసివేయండి. స్వైప్ చేయడంలో ఇబ్బంది లేదా మీ పరికరం కేస్ పగుళ్లు రావడం లేదా ఉబ్బడం వంటివి కూడా మీకు ఉబ్బిన బ్యాటరీ ఉందనడానికి సంకేతాలు.
నా బ్యాటరీ ఉబ్బినట్లయితే నేను ఏమి చేయాలి?
మీ బ్యాటరీ ఉబ్బినట్లయితే, పరికరాన్ని ఛార్జ్ చేయడం, ఉపయోగించడం ఆపివేయండి. దయచేసి మీ స్థానిక నిబంధనలకు అనుగుణంగా మీకు సమీపంలోని ఎలక్ట్రానిక్స్ రీసైక్లింగ్ సదుపాయంలో పరికరాన్ని రీసైకిల్ చేయండి. సహాయం కోసం లేదా రీప్లేస్మెంట్ కోసం అభ్యర్థించడానికి మీరు Shopify సపోర్ట్‌ను సంప్రదించవచ్చు. Shopify సపోర్ట్‌ను సంప్రదించేటప్పుడు, WTH11తో ప్రారంభమయ్యే వెనుక ఉన్న సీరియల్ నంబర్‌తో పాటు, పక్క నుండి, వెనుక నుండి మీ పరికరం ఫోటోలను చేర్చండి.
Shopify సపోర్ట్‌కు రిపోర్ట్ పంపే ముందు తదుపరి ట్రబుల్షూటింగ్ చిట్కాలు
మీ కార్డ్ రీడర్ పని చేయకుంటే, Shopify సపోర్ట్‌కు రిపోర్ట్ పంపే ముందు మీరు ఈ దశలను రివ్యూ చేశారని నిర్ధారించుకోండి:
- చిప్ స్లాట్‌లోకి ఎప్పుడూ ఊదకండి, లాలాజల కణాలు చిప్ కాంటాక్ట్‌లను దెబ్బతీసే అవకాశం ఉంది.
- స్టిక్కీ నోట్ లేదా టేప్ వంటి జిగురు పదార్థాలను ఉపయోగించవద్దు, ఎందుకంటే ఇది వ్యర్థాలను సేకరించే అవశేషాలను వదిలివేస్తుంది.
- చిప్ స్లాట్ లోపల ఉన్న ఏవైనా వ్యర్థాలను తొలగించడానికి కంప్రెస్డ్ ఎయిర్ డబ్బాను ఉపయోగించండి.
- చిప్ స్లాట్‌లోని కాంటాక్ట్‌లను సున్నితంగా శుభ్రం చేయడానికి ఐసోప్రొపైల్ ఆల్కహాల్, సన్నని కాటన్ బడ్స్‌ను ఉపయోగించండి.
నా సమస్య ఇక్కడ కవర్ చేయబడలేదు
రీబూట్ చేస్తే సమస్య పరిష్కారం కాకపోతే, ఫ్యాక్టరీ రీసెట్‌ను ప్రయత్నించండి. ఫ్యాక్టరీ రీసెట్ తర్వాత, మీరు మళ్లీ సెటప్ ప్రాసెస్‌ను అనుసరించాలి.
రీబూట్ లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేసినా పరిష్కారం కాని సమస్యను మీరు ఎదుర్కొంటుంటే, సమస్యను రిపోర్ట్ చేయండి.
POS Goను ఫ్యాక్టరీ రీసెట్ చేయండి
పూర్తి ఫ్యాక్టరీ రీసెట్, పరికర సెటప్ పూర్తి కావడానికి సుమారు 30 నిమిషాలు పట్టవచ్చు.
POS Goను ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి, మీ పరికరం ఆన్‌లో ఉందని నిర్ధారించుకోండి, ఆపై పరికరంపై ఉన్న 3 బటన్లను (పవర్, లెఫ్ట్ స్కాన్, రైట్ స్కాన్) ఒకేసారి నొక్కి దాదాపు 5 సెకన్ల పాటు పట్టుకోండి. ‘ఫ్యాక్టరీ రీసెట్‌ను నిర్ధారించండి’ డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది.
సుమారు 14 సెకన్ల పాటు మొత్తం 3 బటన్లను పట్టుకోవడం ద్వారా పరికరం ఫ్యాక్టరీ రీసెట్ అయ్యేలా చేయవచ్చు.
మీరు మరిన్ని > సెట్టింగ్‌లు > పరికర సెట్టింగ్‌లు > ఫ్యాక్టరీ రీసెట్‌ను ట్యాప్ చేయడం ద్వారా కూడా POS Goను ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు.
మీరు పరికరాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత, మళ్లీ సెటప్ ప్రాసెస్‌ను అనుసరించండి. మీరు పరికరం Wi-Fi కనెక్షన్‌ని మళ్లీ కాన్ఫిగర్ చేయాలి, అప్డేట్లను డౌన్లోడ్ చేయాలి, మీ స్టోర్‌కి మళ్లీ లాగిన్ అవ్వాలి.
సమస్యలను రిపోర్ట్ చేయడం
మీరు మీ POS Goతో సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే లేదా పని చేసే స్థితికి తీసుకురావడానికి తరచూ రీబూట్ లేదా రీసెట్ చేయాల్సి వస్తుంటే, మీరు సమస్యను Shopify సపోర్ట్‌కు రిపోర్ట్ చేయవచ్చు.
దశలు:
- POS మెనూను తెరవడానికి మరిన్నిని ట్యాప్ చేసి, ఆపై మద్దతు > బగ్‌ని రిపోర్ట్ చేయండిని ట్యాప్ చేయండి.
- సమస్యకు సంబంధించి చిన్న వివరణను చేర్చి, ఆపై పంపండిని ట్యాప్ చేయండి. అదనపు సమాచారాన్ని సేకరించడానికి Shopify సపోర్ట్ మిమ్మల్ని సంప్రదించవచ్చు.
ఏదైనా కారణం చేత మీరు బగ్ రిపోర్ట్‌ను పంపలేకపోతే లేదా అత్యవసర సమస్య ఉంటే, మీ POS Goలో మరిన్ని > మద్దతు > సపోర్ట్‌ను సంప్రదించండిని ట్యాప్ చేయండి.