రిటైల్ మార్కెట్‌లను సృష్టించడం మరియు నిర్వహించడం
మీరు రిటైల్ మార్కెట్‌లను ఉపయోగించడం గురించిన పరిగణనలను సమీక్షించిన తర్వాత, మీ మార్కెట్‌లను సెటప్ చేయడం ప్రారంభించవచ్చు.
మార్కెట్‌ను సృష్టించడం
కొనుగోలుదారుల ప్రత్యేక అవసరాల ఆధారంగా అనుకూలీకరించబడిన కస్టమర్‌ల సమూహమే మార్కెట్‌లు.
మీరు నిర్వహించే ప్రతి విక్రయాల ఛానెల్ మరియు భౌగోళిక లొకేషన్‌తో పాటు మీరు నిర్వహించే భౌతిక లొకేషన్‌ల రకాలు విడివిడి మార్కెట్‌లు కావచ్చు. ఒకే రకమైన ఉత్పత్తి మరియు ధరల వ్యూహాలను కలిగి ఉన్న స్టోర్‌ల సమూహాలు కూడా ఒక మార్కెట్ కిందకు రావచ్చు.
కొత్త మార్కెట్‌లను ఎలా సెటప్ చేయాలో తెలుసుకోవడానికి మార్కెట్‌లను నిర్వహించడం చూడండి. మీరు రిటైల్‌తో ఉపయోగించడానికి కొత్త మార్కెట్‌ను సృష్టించినప్పుడు, దీనిలో చేర్చబడినవి (Includes) విభాగంలో POS లొకేషన్(లు) ఎంచుకున్నారని నిర్ధారించుకోండి.
మార్కెట్‌లను సృష్టించిన తర్వాత వాటిని లిస్ట్ లేదా గ్రాఫ్ రూపంలో ఎలా చూడాలో తెలుసుకోవడానికి, మీ మార్కెట్‌లను సమీక్షించడం చూడండి.
రిటైల్ మార్కెట్‌ల కోసం కేటలాగ్‌లు
కేటలాగ్‌లను ఉపయోగించడం ద్వారా, మీరు ఉత్పత్తులను ఒక నిర్దిష్ట మార్కెట్‌తో అనుబంధించవచ్చు. దీని ద్వారా వివిధ కస్టమర్‌ల కోసం మీ ఉత్పత్తి ఆఫర్‌ల మధ్య వ్యత్యాసాన్ని చూపవచ్చు. రిటైల్ మార్కెట్‌లతో, మీ ఆన్‌లైన్ స్టోర్‌లో మరియు రిటైల్ స్టోర్‌లో ఒకే ఉత్పత్తిని విక్రయించినప్పుడు వేర్వేరు ధరలను సెటప్ చేయడానికి మీరు కేటలాగ్‌లను ఉపయోగించవచ్చు.
ఉదాహరణకు, కింది స్టోర్ కాన్సెప్ట్‌ల కోసం మీరు వేర్వేరు రిటైల్ మార్కెట్‌లు మరియు కేటలాగ్‌లను ఉపయోగించవచ్చు:
- తగ్గించిన ధరలు, అలాగే గత సీజన్‌కు చెందిన లేదా క్లియరెన్స్ ఇన్వెంటరీ ఉన్న ఒక అవుట్‌లెట్ మార్కెట్ మరియు కేటలాగ్.
- పూర్తి ధర ఉన్న ఉత్పత్తులు మరియు మీ పూర్తి ఉత్పత్తి శ్రేణి ఉన్న ఒక ఫ్లాగ్‌షిప్ మార్కెట్ మరియు కేటలాగ్.
- స్వల్ప-కాలిక లొకేషన్ కోసం క్యూరేట్ చేయబడిన ఎంపికలతో ఉండే ఒక పాప్-అప్ మార్కెట్ మరియు కేటలాగ్.
మీరు కింది విధాలుగా కూడా కేటలాగ్‌లను ఉపయోగించవచ్చు:
- ప్రాంతాల వారీగా మీ రిటైల్ లొకేషన్‌ల మధ్య వేర్వేరు ధర నిర్ణయాల లేదా ప్రచురణ నియమాలను సెట్ చేయండి. ఉదాహరణకు, కెనడాలో మే నెలలో, మరియు ఆస్ట్రేలియాలో డిసెంబర్ నెలలో వేసవి ఉత్పత్తులను ప్రచురించడానికి మీరు కేటలాగ్‌లను ఉపయోగించవచ్చు.
- వేర్వేరు రిటైల్ లొకేషన్‌ల కోసం వేర్వేరు ధరలను సెట్ చేయండి. ఉదాహరణకు, మీరు ఒక చొక్కాకు న్యూయార్క్ సిటీలో మరియు బోస్టన్‌లో వేర్వేరు ధరలను సెట్ చేయవచ్చు.
- నిర్దిష్ట లొకేషన్‌ల కోసం వేర్వేరు ఉత్పత్తుల జాబితాలను ప్రచురించండి. ఉదాహరణకు, మీరు క్లియరెన్స్ ఐటెమ్‌లను కేవలం అవుట్‌లెట్ లొకేషన్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేలా సెట్ చేయవచ్చు.
కేటలాగ్‌లను సృష్టించడం మరియు నిర్వహించడం గురించి మరింత తెలుసుకోవడానికి కేటలాగ్‌ను సృష్టించండి చూడండి.
మీ ఉత్పత్తి కేటలాగ్‌ల కోసం ధరలను మరియు ప్రచురణను ఎలా మునుజూపు చూడాలో తెలుసుకోవడానికి, ఉత్పత్తుల కోసం ఇలా చూడండి ఫీచర్‌ను ఉపయోగించడం చూడండి.