QuickBooks డెస్క్‌టాప్ POS మైగ్రేషన్ ఎర్రర్లు, సాధారణ సమస్యల ట్రబుల్షూటింగ్
Shopifyకి QuickBooks డేటా ఫైల్‌లను అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఎర్రర్ ఎదురైతే, మీకు వచ్చిన ఎర్రర్ మెసేజ్‌ను రివ్యూ చేసి, కింది ట్రబుల్షూటింగ్ వనరులను చూడండి.
ఈ పేజీలో
డేటా ఫైల్ అప్లోడ్ ఎర్రర్ల ట్రబుల్షూటింగ్
మీరు Shopifyకి QuickBooks డేటా ఫైల్‌లను అప్లోడ్ చేస్తున్నప్పుడు, సమస్యను ఎలా పరిష్కరించాలో మార్గనిర్దేశం చేసే ఎర్రర్ నోటిఫికేషన్లు మీకు రావచ్చు.
ముందస్తు ఆవశ్యకతలు (ప్రీ-రిక్విజిట్స్) నెరవేరనందున ఫైల్‌ను అప్లోడ్ చేయడం సాధ్యం కాలేదు
మీకు Unable to upload file due to pre-requisites not being met (ముందస్తు ఆవశ్యకతలు నెరవేరనందున ఫైల్‌ను అప్లోడ్ చేయడం సాధ్యం కాలేదు) ఎర్రర్ వస్తే, ఈ కింది ఆవశ్యకతలు నెరవేరాయని నిర్ధారించుకోండి:
- మీరు మైగ్రేషన్ ఆవశ్యకతలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించండి
- మీరు సరైన ఫైల్ ఎక్స్‌టెన్షన్‌తో ఫైల్‌లను అప్లోడ్ చేస్తున్నారని నిర్ధారించుకోండి: .xlsx లేదా .xls
మీరు ఈ ఎర్రర్‌ను పరిష్కరించలేకపోతే, Shopify రిటైల్ మద్దతును సంప్రదించండి.
హెడర్లు లేనందున ఫైల్‌ను అప్లోడ్ చేయడం సాధ్యం కాలేదు
మీకు Unable to upload file due to missing headers (హెడర్లు లేనందున ఫైల్‌ను అప్లోడ్ చేయడం సాధ్యం కాలేదు) అనే ఎర్రర్ వస్తే, మీ డేటా ఫైల్లో కింది నిలువు వరుసలు ఉన్నాయో లేదో చెక్ చేయండి:
- ఇన్వెంటరీ (Inventory) డేటా ఫైల్: Item Number, Item Name, Item Description, Attribute, Size, Average Unit Cost, Regular Price. Vendor Name, Qty 1, QB ListID.
- కస్టమర్ (Customer) డేటా ఫైల్: Company, Last Name, First Name, Street, Street2, State, ZIP, Phone 1, EMail, QB ListID, City.
- వెండర్ (Vendor) డేటా ఫైల్: Company, Last Name, First Name, Street, Street2, City, State, ZIP, Phone 1, EMail, QB ListID.
సూచించిన నిలువు వరుసలు మీ అప్లోడ్ ఫైల్లో ఉన్నట్లయితే, Shopify రిటైల్ మద్దతును సంప్రదించండి.
సూచించిన నిలువు వరుసలు మీ అప్లోడ్ ఫైల్లో లేకపోతే, Intuit మద్దతును సంప్రదించండి.
లైన్ ఐటెమ్ ఎర్రర్ల ట్రబుల్షూటింగ్
డేటా మైగ్రేషన్ ప్రారంభించిన తర్వాత, మీకు Line item error (లైన్ ఐటెమ్ లోపం) నోటిఫికేషన్ కనిపించవచ్చు. అంటే, కొన్ని డేటా ఎంట్రీలలో మీరు సరిచేయాల్సిన సమస్య ఉందని అర్థం. డేటా విలువలను సరిచేయడానికి లేదా తొలగించడానికి ఎక్సెప్షన్ ఫైల్‌ను డౌన్లోడ్ చేసి, ఆపై మీ డేటా ఫైల్‌ను మళ్లీ అప్లోడ్ చేయవచ్చు.
సాధారణ లైన్ ఐటెమ్ ఎర్రర్లు, వాటిని ఎలా పరిష్కరించాలి అనే దానికి సంబంధించి మరింత తెలుసుకోవడానికి కింది పట్టికను రివ్యూ చేయండి:
| ఎర్రర్ కోడ్ | పరిష్కారం |
|---|---|
| Phone/Email has already been taken | కస్టమర్ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్‌ను సరిచేయండి లేదా తొలగించండి. |
| Phone/email is invalid | కస్టమర్ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్‌ను సరిచేయండి లేదా తొలగించండి. |
| The quantity couldn't be set because the location was deleted | మీ Shopify అడ్మిన్‌లో లొకేషన్ సరిగ్గా సెటప్ చేయబడిందని నిర్ధారించుకోండి. లొకేషన్ ఉంటే, కొత్త లొకేషన్‌ను సృష్టించి, లైన్‌ను ఈ కొత్త లొకేషన్‌కు సెట్ చేయండి. మినహాయింపు ఫైల్‌ను ఇన్వెంటరీ (Inventory) విభాగానికి మళ్లీ అప్లోడ్ చేయండి. |
| Cost per item must be greater than or equal to 0 | ప్రతి ఐటెమ్ ఖర్చుకు సంబంధించిన లైన్‌ను 0 కంటే ఎక్కువ లేదా సమానమైన విలువతో అప్డేట్ చేయండి. |
| Title can't be blank | ఉత్పత్తి శీర్షికను జోడించండి. |
| Reason not found while pushing data | Shopify రిటైల్ మద్దతును సంప్రదించండి. |
| Unknown Error, please contact support | Shopify రిటైల్ మద్దతును సంప్రదించండి. |
| Customer does not exist | Shopify రిటైల్ మద్దతును సంప్రదించండి. |
లైన్ ఐటెమ్ ఎర్రర్ల ట్రబుల్షూటింగ్
లైన్ ఐటెమ్ ఎర్రర్లను ట్రబుల్షూట్ చేయడానికి, మీరు నోటిఫికేషన్లో సూచించిన మినహాయింపు ఫైల్‌ను డౌన్లోడ్ చేయాలి, ఆపై డేటాను సరిచేసి, సేవ్ చేసి, ఆ మినహాయింపు ఫైల్‌ను QuickBooks డెస్క్‌టాప్ కనెక్టర్ యాప్‌కి అప్లోడ్ చేయాలి.
ఉదాహరణకు, మీకు phone or email already taken (ఫోన్ లేదా ఇమెయిల్ ఇప్పటికే తీసుకోబడింది) లేదా phone is invalid (ఫోన్ చెల్లదు) అనే నోటిఫికేషన్ వస్తే, అందించడానికి మీ వద్ద అప్డేట్ చేసిన ఫోన్ లేదా ఇమెయిల్ లేకపోతే, మీరు ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్‌ను తొలగించి, సేవ్ చేయవచ్చు. కస్టమర్‌ను Shopifyకి ఇగుమతి చేయడానికి, కస్టమర్ పేరు మాత్రమే అవసరం.
మీరు ఎర్రర్లు ఉన్న డేటా ఫైల్‌లను విస్మరించవచ్చు కూడా, కానీ ఆ డేటా Shopifyలోకి దిగుమతి చేయబడదు.
దశలు:
- Line item error నోటిఫికేషన్లో, ఎర్రర్లు ఉన్న ఫైల్‌ను బట్టి ఇన్వెంటరీ ఎర్రర్ ఫైల్‌ను డౌన్లోడ్ చేయండి (Download Inventory error file), కస్టమర్ల ఎర్రర్ ఫైల్‌ను డౌన్లోడ్ చేయండి (Download Customers error file) లేదా వెండర్ల ఎర్రర్ ఫైల్‌ను డౌన్లోడ్ చేయండి (Download Vendors error file) మీద క్లిక్ చేయండి.
- ఎర్రర్ ఫైల్‌ను తెరిచి, విఫలమవడానికి గల కారణం (Failed reason) నిలువు వరుసను రివ్యూ చేసి, ఆపై ఎర్రర్లను సరిచేయండి.
- QuickBooks డెస్క్‌టాప్ కనెక్టర్ యాప్‌కు వెళ్లి, డేటా ఫైల్‌ను మళ్లీ అప్లోడ్ చేయడానికి ఇన్వెంటరీ (Inventory), కస్టమర్లు (Customers) లేదా వెండర్లు (Vendors) వంటి సంబంధిత విభాగంలో డేటా ఫైల్‌ను జోడించండి (Add data file) మీద క్లిక్ చేయండి.
- ఆప్షనల్: మిస్సయిన డేటా ఉన్న ఫైల్‌ను మీరు స్కిప్ చేయాలనుకుంటే, అప్పుడు ఈ ఫైల్ని స్కిప్ చేయండి > అవును, మైగ్రేషన్‌ని కొనసాగించండిని క్లిక్ చేయండి. మీరు స్కిప్ చేసిన డేటా Shopifyకి ఇన్పోర్ట్ అవ్వదు.
సాధారణ సమస్యలను ట్రబుల్షూట్ చేయడం
కింది QuickBooks Desktop POS మైగ్రేషన్ మరియు ఇంటిగ్రేషన్ సాధారణ సమస్యలను, వాటిని ఎలా ట్రబుల్షూట్ చేయాలో రివ్యూ చేయండి:
మైగ్రేషన్ కోసం QuickBooks డేటా ఫైల్‌లను ఎక్స్పోర్ట్ చేయడం సాధ్యం కాలేదు
QuickBooks డేటా ఫైల్‌లను ఎలా ఎక్స్పోర్ట్ చేయాలనే దానిపై ఈ గైడ్‌ని రివ్యూ చేయండి. మీకు మరింత సహాయం కావాలంటే, అప్పుడు Intuit మద్దతుని సంప్రదించండి.
Stocky API కీ కనుగొనబడలేదు
మీరు మీ Shopify అడ్మిన్లోని Stocky యాప్ నుండి మీ Stocky API కీని పొందవచ్చు. మరింత సమాచారం కోసం, మీ Stocky API కీని పొందండిని చూడండి
Stocky API కీ తప్పుగా ఉంది
Stocky యాప్‌లో కొత్త API కీని జెనరేట్ చేయడానికి ట్రై చేయండి, ఆపై కొత్త కీతో మళ్లీ ట్రై చేయండి.
మైగ్రేట్ చేయడానికి ముందే ఇంటిగ్రేట్ చేయబడింది
మీరు మీ QuickBooks Desktop POS డేటాను Shopifyకి మైగ్రేట్ చేయడానికి ముందు మీ QuickBooks Desktop అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ను Shopifyతో ఇంటిగ్రేట్ చేసినట్లయితే, ముందుగా మీరు ఆ ప్రాసెస్‌ని రీసెట్ చేసి, మైగ్రేషన్‌ను పూర్తి చేయాలి. సహాయం కోసం Shopify రిటైల్ మద్దతుని సంప్రదించండి.
QuickBooks Desktop POS వెర్షన్ 19కి అప్డేట్ చేయడం సాధ్యం కాలేదు
మీరు ఉపయోగిస్తున్న QuickBooks Desktop POS వెర్షన్‌ను బట్టి, QuickBooks Desktop POS వెర్షన్ 19కి మీ అప్డేట్ పాత్ విభిన్నంగా ఉండవచ్చు. మరింత సమాచారం కోసం, మీ QuickBooks Desktop POSని వెర్షన్ 19కి అప్డేట్ చేయడంని చూడండి
QuickBooks Onlineని Shopifyతో ఇంటిగ్రేట్ చేయడం సాధ్యం కాలేదు
ఒకవేళ మీరు QuickBooks Desktop అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌కు బదులుగా QuickBooks Onlineని ఉపయోగిస్తుంటే, మీరు మీ QuickBooks డేటాను మైగ్రేట్ చేయవచ్చు, కానీ మీరు QuickBooks Desktop Connector యాప్‌ను ఉపయోగించి ఇంటిగ్రేట్ చేయలేరు. మీ Shopify POS డేటాను QuickBooks Onlineకి ఇంటిగ్రేట్ చేసి సింక్ చేయడానికి, మీరు Intuit వారి థర్డ్-పార్టీ QuickBooks Online యాప్‌ని ఉపయోగించవచ్చు.
ఉత్పత్తులు తప్పుగా లేదా సున్నా పరిమాణంతో ఇన్పోర్ట్ అయ్యాయి
QuickBooks Desktop POSలోని మీ ఉత్పత్తికి చెందిన సవరణల చరిత్ర సెక్షన్‌ను చెక్ చేయండి. ఒకవేళ యాప్ ద్వారా మీ ఉత్పత్తి రెండుసార్లు ఎడిట్ చేయబడితే, అప్పుడు మీ QuickBooks Desktop POS లొకేషన్లు ఒకే ఒక Shopify లొకేషన్‌కి మ్యాప్ చేయబడి ఉండవచ్చు. సహాయం కోసం Shopify రిటైల్ మద్దతుని సంప్రదించండి.
QuickBooks డేటా ఫైల్ల అప్‌లోడ్‌కు చాలా సమయం పడుతోంది
మైగ్రేషన్ పూర్తి కావడానికి ఒక గంట నుండి ఐదు గంటల వరకు సమయం పట్టవచ్చు. మీ QuickBooks POS సెటప్, మీరు మైగ్రేట్ చేస్తున్న డేటా పరిమాణం లేదా మీ లొకేషన్ల సంఖ్య వంటి అనేక అంశాలపై ఈ మైగ్రేషన్ సమయం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మైగ్రేషన్ పూర్తి కావడానికి సగటున 5.5 గంటల సమయం పడుతుంది. QuickBooks Desktop Connector యాప్ రోజుకు 50,000 లైన్ ఐటెమ్‌ల వరకు మైగ్రేట్ చేయగలదు. ఒకవేళ మైగ్రేషన్‌కు 5.5 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంటే, సహాయం కోసం Shopify రిటైల్ మద్దతుని సంప్రదించండి.