Stocky రిపోర్ట్ రకాలు
మీ స్టాక్ విలువ అలాగే రిటైల్ ధర గురించిన రోజువారీ స్నాప్‌షాట్‌ను Stocky రికార్డ్ చేయగలదు. చేతిలో ఉన్న స్టాక్ రిపోర్టింగ్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత, Stocky డేటాను సేకరించడం ప్రారంభిస్తుంది. మీ చేతిలో ఉన్న మొదటి స్టాక్ రికార్డ్‌ను ప్రదర్శించడానికి 24 గంటల వరకు సమయం పట్టవచ్చు.
ఈ పేజీలో
రిపోర్ట్‌ను యాక్సెస్ చేయండి
- మీ Shopify అడ్మిన్‌లో, యాప్‌లు > Stockyకి వెళ్లండి.
- రిపోర్ట్‌లు డ్రాప్-డౌన్ మెను నుండి, మీరు రన్ చేయాలనుకుంటున్న రిపోర్ట్‌ను క్లిక్ చేయండి.
Stocky రిపోర్ట్‌లు
Stockyలో మీరు కింది రిపోర్ట్‌లను చూడవచ్చు.
ABC విశ్లేషణ
మీరు ప్రతి ఉత్పత్తికి సంబంధించి ABC విశ్లేషణను చూడవచ్చు, ఇది గత 8 వారాల నుండి వాటి విక్రయాల చరిత్ర ఆధారంగా మీ ఉత్పత్తులను గ్రేడ్ చేస్తుంది.
అత్యధిక విక్రయాలు కలిగినవి
ఉత్పత్తి లేదా వేరియంట్ SKU ఆధారంగా అత్యధిక విక్రయాలు కలిగిన వాటి జాబితాను మీరు వీక్షించవచ్చు.
తక్కువ స్టాక్ ఉన్న రిపోర్ట్‌లు
వెండర్, ఉత్పత్తి లేదా వేరియంట్ SKU ఆధారంగా తక్కువ స్టాక్ ఉన్న రిపోర్ట్‌లను మీరు వీక్షించవచ్చు.
ఏ వెండర్‌ల వద్ద ఉన్న వేరియంట్‌లు తక్కువ స్టాక్‌ను కలిగి ఉన్నాయో, ఏ వేరియంట్‌ల స్టాక్ లేదు అలాగే అంచనా వేసిన రాబడి నష్టాన్ని తక్కువ స్టాక్ ఉన్న వెండర్‌లు రిపోర్ట్ ప్రదర్శిస్తుంది. మీరు వెండర్ నుండి ఆర్డర్ చేసి ఇప్పటికీ అందుకోని ప్రత్యేకమైన వేరియంట్‌లను కూడా ఇది ప్రదర్శిస్తుంది.
ఏయే ఉత్పత్తులకు తక్కువ స్టాక్ ఉంది, ఏయే ఉత్పత్తులకు స్టాక్ లేదు అలాగే వెండర్ నుండి ఏయే ఉత్పత్తులు ఆర్డర్‌లో లేవు అనేవి తక్కువ స్టాక్ ఉన్న ఉత్పత్తులు రిపోర్ట్ ప్రదర్శిస్తుంది. ఒకవేళ వేరియంట్‌కు స్టాక్ లేకపోతే, అప్పుడు ప్రతిరోజూ కోల్పోయిన అంచనా రాబడిని కూడా ఇది ప్రదర్శిస్తుంది.
తక్కువ స్టాక్ ఉన్న వేరియంట్‌లు రిపోర్ట్ అనేది అత్యంత వివరణాత్మకమైన తక్కువ స్టాక్ రిపోర్ట్. మీకు ఇంకా ఎన్ని రోజుల స్టాక్ మిగిలి ఉంది, ఏ అంచనా తేదీకి మీ ఇన్వెంటరీ అయిపోతుంది మరియు ఇన్వెంటరీని అందుకోవడానికి పట్టే సమయం ఆధారంగా ఎంత అంచనా తేదీకి మీరు మరిన్ని ఇన్వెంటరీలను రీఆర్డర్ చేయాలి వంటి వివరాలను ఇది ప్రదర్శిస్తుంది.
ఆర్డర్‌లు
ఆర్డర్‌లు రిపోర్ట్, నెల, వారం లేదా రోజు ఆధారంగా మీ ఆర్డర్‌ల గ్రాఫ్‌ను ప్రదర్శిస్తుంది. ఆర్డర్‌లు రిపోర్ట్ మీ ఆర్డర్‌ల జాబితాను కూడా ప్రదర్శిస్తుంది. వెండర్, ఉత్పత్తి లేదా వేరియంట్ వంటి నిర్దిష్ట ప్రమాణాలకు సరిపోలే ఆర్డర్‌లను వీక్షించడానికి మీరు ఫిల్టర్‌లను ఎడిట్ చేయవచ్చు.
ఉత్పత్తులు
ఉత్పత్తి రిపోర్ట్ అనేది, ప్రస్తుత ఇన్వెంటరీ మరియు విక్రయాల మొత్తం వంటి మీ ఉత్పత్తుల గురించిన వివరాలను ప్రదర్శిస్తుంది.
కొనుగోలు ఆర్డర్‌లు
కొనుగోలు ఆర్డర్‌లు రిపోర్ట్, చేరే గమ్యం, డెలివరీ స్టేటస్ అలాగే చెల్లింపు స్టేటస్ వంటి మీ ప్రతి కొనుగోలు ఆర్డర్‌ల గురించిన వివరాలను ప్రదర్శిస్తుంది. ఈ రిపోర్ట్‌లో ఇవి కూడా ఉంటాయి:
| స్టాక్ | రిపోర్ట్ సమయంలో స్టాక్‌లో ఉన్న ప్రస్తుత పరిమాణం. |
| ఆర్డర్ చేయబడినవి | బకాయి ఉన్న మరియు ఇంకా అందుకోని అన్ని కొనుగోలు ఆర్డర్‌లపై ప్రస్తుతం ఆర్డర్ చేయబడిన మొత్తం. ఈ వేరియంట్‌ను బకాయి ఉన్నట్లుగా చూపే బహుళ కొనుగోలు ఆర్డర్‌లు ఉంటే, ఆ కొనుగోలు ఆర్డర్‌లన్నింటిలో ఉన్న ఈ వేరియంట్ మొత్తాన్ని ఈ విలువ సూచిస్తుంది. |
| పరిమాణం | ఆ నిర్దిష్ట కొనుగోలు ఆర్డర్‌లపై ఆ వేరియంట్ కోసం మొదటగా ఆర్డర్ చేయబడిన పరిమాణం. ఈ సంఖ్య కొనుగోలు ఆర్డర్‌లకు ప్రత్యేకమైనది మరియు ఐటెమ్‌లు అందుకున్న కొద్దీ ఇది మారదు. |
సేల్ ఐటెమ్‌లు
సేల్స్ ఐటెమ్‌లు రిపోర్ట్, ఉత్పత్తి లేదా వేరియంట్ వారీగా మీ సేల్ ఐటెమ్‌లను ప్రదర్శిస్తుంది.
SKU/వేరియంట్
SKU/వేరియంట్ రిపోర్ట్ ప్రతి వేరియంట్‌కు సంబంధించిన యూనిట్ ధర, విక్రయ ధర అలాగే విక్రయాల సంఖ్యను ప్రదర్శిస్తుంది. ప్రతి వేరియంట్ గురించి మరింత వివరణాత్మకమైన విశ్లేషణను సృష్టించడానికి మీరు అదనపు నిలువు వరుసలను జోడించవచ్చు.
గణాంకాలు
గత 28 రోజులు మరియు గత 7 రోజులకు సంబంధించి సగటు ఆర్డర్ విలువ అలాగే రోజువారీ సగటు ఆర్డర్ మొత్తం వంటి స్టోర్ గణాంకాలను గణాంకాలు రిపోర్ట్ పోల్చి చూపుతుంది.
చేతిలో ఉన్న స్టాక్ రిపోర్ట్‌లు
చేతిలో ఉన్న మీ స్టాక్ గురించిన ప్రస్తుత లేదా గత రిపోర్ట్‌ను మీరు చూడవచ్చు.
చేతిలో ఉన్న ప్రస్తుత స్టాక్ అనేది మీ ఇన్వెంటరీకి సంబంధించిన ప్రస్తుత విలువను అలాగే దాని ధరను ప్రదర్శిస్తుంది.
ఒక తేదీ పరిధిలోని ప్రతి తేదీకి సంబంధించి కొనుగోలు ధర, విలువ లేదా పరిమాణం వంటి అన్ని ఇన్వెంటరీల నిర్దిష్ట మొత్తాన్ని అన్ని లొకేషన్‌ల కోసం చేతిలో ఉన్న గత స్టాక్ ప్రదర్శిస్తుంది. ఏదేని నిర్దిష్ట వెండర్ లేదా అన్ని వెండర్‌ల మొత్తాన్ని ఆధారం చేసుకోవడానికి మీరు రిపోర్ట్‌ను ఫిల్టర్ చేయవచ్చు.
సర్దుబాట్లు
తేదీ, కారణం మరియు దాన్ని చేసిన ఉద్యోగి వంటి ప్రతి స్టాక్ సర్దుబాటుకు సంబంధించిన వివరాలను సర్దుబాట్లు రిపోర్ట్ ప్రదర్శిస్తుంది.
బదిలీలు
స్టేటస్, మూలం మరియు గమ్యం అలాగే బదిలీకి గల కారణం వంటి ప్రతి స్టాక్ బదిలీ గురించిన వివరాలను బదిలీలు రిపోర్ట్ ప్రదర్శిస్తుంది.
లాభం
రిటర్న్‌లు, స్థూల విక్రయాలు అలాగే విక్రయించిన వస్తువుల ధర వంటి మీ స్టోర్ ఆర్థిక సంబంధిత సమాచారాన్ని లాభం రిపోర్ట్ ప్రదర్శిస్తుంది.
రిపోర్ట్ రకాలు
చేతిలో ఉన్న స్టాక్‌ను తెలిపే విభిన్న రకాల రిపోర్ట్‌లు అనేకం అందుబాటులో ఉన్నాయి.
మొత్తం ఖర్చు
స్టాక్‌లో ఉన్న మీ అన్ని వేరియంట్‌లలో ప్రతి వేరియంట్ పరిమాణాన్ని దాని కొనుగోలు ధరతో గుణించగా వచ్చిన విలువకు మొత్తం ఖర్చు సమానంగా ఉంటుంది. ఈ లెక్కింపు ప్రతికూల స్టాక్ స్థాయిలను కలిగి ఉన్న వేరియంట్‌లను మరియు దాచబడిన వేరియంట్‌లను మినహాయిస్తుంది.
మొత్తం రిటైల్
ప్రతి వేరియంట్ పరిమాణాన్ని దాని రిటైల్ ధరతో గుణించగా వచ్చిన విలువకు మొత్తం రిటైల్ సమానంగా ఉంటుంది. మీ స్టాక్‌నంతటినీ దాని ప్రస్తుత ధరకు విక్రయిస్తే, మీరు ఎంత సంపాదిస్తారో ఇది తెలియజేస్తుంది.
మొత్తం ఐటెమ్‌లు
మొత్తం ఐటెమ్‌లు అంటే మీ స్టోర్‌లో స్టాక్ ఉన్న మొత్తం ఐటెమ్‌ల సంఖ్య. ఉదాహరణకు, మీ వద్ద 10 ఎరుపు సాక్స్‌లు, 5 నీలం సాక్స్‌లు ఉంటే, మొత్తం ఐటెమ్‌ల సంఖ్య 15 అవుతుంది.
వెండర్ వారీగా చేతిలో ఉన్న స్టాక్
Stocky ప్రతి వెండర్ కోసం చేతిలో ఉన్న స్టాక్ రికార్డును ఉంచుతుంది. వెండర్ కోసం చేతిలో ఉన్న స్టాక్‌ను యాక్సెస్ చేయడానికి, చేతిలో ఉన్న స్టాక్ రిపోర్ట్ ఎగువన ఉన్న ఫారమ్‌ను ఉపయోగించండి. కొన్ని రిపోర్ట్‌లలో స్టాక్ Shopify ద్వారా ట్రాక్ చేయబడింది అని లిస్ట్ చేయబడి ఉండవచ్చు. Shopify ట్రాక్ చేసే ఐటెమ్‌ల వారీగా, చేతిలో ఉన్న స్టాక్ రిపోర్ట్‌లను విభజించడానికి ఇది ఒక మార్గం. డ్రాప్‌షిప్ చేయబడిన మీ ప్రొడక్ట్‌లను Shopify ట్రాక్ చేయకపోతే, ప్రతి రిపోర్ట్‌లోని Shopify ద్వారా ట్రాక్ చేయబడింది వెర్షన్‌ను ఎంచుకోవడం ద్వారా చేతిలో ఉన్న స్టాక్ రిపోర్ట్‌ల నుండి డ్రాప్‌షిప్ చేయబడిన స్టాక్‌ను మినహాయించవచ్చు.
Stockyలో రౌండింగ్
వేర్వేరు అకౌంటింగ్, ఇన్వెంటరీ నిర్వహణ సిస్టమ్‌లు రౌండింగ్‌ను వేర్వేరు మార్గాల్లో నిర్వహిస్తాయి. Stocky లైన్ ఐటెమ్ స్థాయిలో నంబర్‌లను రెండు దశాంశ స్థానాలకు రౌండ్ చేసి, ఆపై మొత్తాన్ని అందించడానికి లైన్ ఐటెమ్‌లను కలుపుతుంది. కలిపిన తర్వాత రౌండింగ్ చేసే ఇతర పద్ధతులతో పోల్చినప్పుడు ఇది స్వల్ప వ్యత్యాసాన్ని సృష్టించవచ్చు.
మీరు ఏవైనా నంబర్‌లను మాన్యువల్‌గా సర్దుబాటు చేయాలనుకుంటే, దాన్ని మీరు సర్దుబాట్లు ఫీల్డ్‌లో చేయవచ్చు. మీ సరఫరాదారు అకౌంటింగ్ సిస్టమ్ రౌండింగ్ కోసం వేరొక విధానాన్ని ఉపయోగిస్తే సర్దుబాట్లు అవసరం కావచ్చు.