CSV ఫైల్‌ను తెరవండి లేదా ఎడిట్ చేయండి
ఈ విభాగం CSV ఫైళ్లను ఉపయోగించడంపై మీకు కొంత సాధారణ మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఉత్పత్తులతో CSV ఫైళ్లను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్పత్తుల దిగుమతి, ఎగుమతి చదవండి. ఇన్వెంటరీతో CSV ఫైళ్లను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోవడానికి, CSV ఫైల్‌తో ఇన్వెంటరీని ఎగుమతి లేదా దిగుమతి చేయడం చదవండి.
ఈ పేజీలో
CSV ఫైళ్లు
CSV అంటే కామా-సెపరేటెడ్ వ్యాల్యూస్ అని అర్థం, ఇది స్ప్రెడ్షీట్ల ఫైల్ ఆకృతి (.csv). ఉత్పత్తులు, కస్టమర్లు, ఇన్వెంటరీ, అడ్మిన్ అలాగే POS యూజర్లు, ఆర్డర్లు (ఎగుమతికి మాత్రమే) మరియు తగ్గింపులను (ఎగుమతికి మాత్రమే) దిగుమతి, ఎగుమతి చేయడానికి మీరు CSV ఫైళ్లను ఉపయోగించవచ్చు.
మీరు మరో ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి Shopifyకు మారుతున్నప్పుడు, కస్టమర్ ఖాతాల జాబితాను దిగుమతి చేయాల్సి వచ్చినప్పుడు లేదా స్ప్రెడ్‌షీట్‌ను ఉపయోగించి ఉత్పత్తులను అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు వంటి అనేక సందర్భాల్లో అవి ఉపయోగకరంగా ఉంటాయి.
CSV ఫైళ్లు మొదట్లో సంక్లిష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు వాటి ఫార్మాట్‌ను, అవి ఎలా పని చేస్తాయో అర్థం చేసుకున్న తర్వాత, వాటిని మీరు పలు రకాల టాస్క్‌ల కోసం ఉపయోగించాలనుకోవచ్చు.
మీ CSV ఫైళ్లు తప్పనిసరిగా UTF-8 ఎన్కోడింగ్ను ఉపయోగించాలి.
ఒక CSV ఫైల్లో, ప్రతి ఎంట్రీ స్ప్రెడ్షీట్లోని ఒక సెల్‌ను సూచిస్తుంది, ప్రతి లైన్ కొత్త అడ్డు వరుసను సూచిస్తుంది, అలాగే ప్రతి కామా ఒక ఎంట్రీ ఎక్కడ ముగుస్తుందో, మరొకటి ఎక్కడ ప్రారంభమవుతుందో సూచిస్తుంది.
ఉదాహరణకు, ఈ కస్టమర్ CSV ఫైల్లోని ఎంట్రీలు:

స్ప్రెడ్‌షీట్ ప్రోగ్రామ్‌లో ఈ విధంగా ప్రదర్శితం అవుతాయి:

Google Sheetsలోకి CSV ఫైళ్లను దిగుమతి చేయండి
మీరు మీ Shopify అడ్మిన్ నుండి CSV ఫైల్‌ను ఎగుమతి చేసినప్పుడు, అది మీ కంప్యూటర్ నేటివ్ టెక్స్ట్ ఎడిటర్లో .csv ఫైల్‌గా తెరవబడుతుంది. మీరు ప్రత్యామ్నాయ టెక్స్ట్ ఎడిటర్‌ను కూడా ఉపయోగించవచ్చు, కానీ దానికి బదులుగా మీ CSV ఫైళ్లను చూడటానికి, ఎడిట్ చేయడానికి మీరు స్ప్రెడ్‌షీట్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించమని సిఫార్సు చేయబడింది.
దశలు:
- మీ Google ఖాతాకు లాగిన్ అవ్వండి.
- Google Sheets పేజీలోని, Start a new spreadsheet (కొత్త స్ప్రెడ్‌షీట్‌ను ప్రారంభించండి) విభాగంలో Blank (ఖాళీ)పై క్లిక్ చేయండి.
- ఈ Untitled Spreadsheet (పేరులేని స్ప్రెడ్‌షీట్) పేజీ నుండి, ఇక్కడికి వెళ్లండి File (ఫైల్) > Import... (దిగుమతి...):

- మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న CSV ఫైల్‌ను కనుగొని, ఎంచుకోండి.
- Import file (ఫైల్‌ను దిగుమతి చేయండి) డైలాగ్‌లో, Import action (దిగుమతి చర్య), Separator character (సెపరేటర్ అక్షరం), అలాగే Convert text to numbers and dates (టెక్స్ట్‌ను సంఖ్యలు, తేదీలుగా మార్చండి) విభాగాల కింద మీకు ఇష్టమైన ఎంపికలను ఎంచుకోండి.
- Import (దిగుమతి) క్లిక్ చేయండి.
CSV ఫైల్ దిగుమతి అయిన తర్వాత, మీరు మీ CSVని ఎడిట్ చేయవచ్చు. మీ పని పూర్తయిన తర్వాత, మీరు దాన్ని Google Sheets నుండి .csv ఫైల్‌గా ఎగుమతి చేయవచ్చు.
Google Sheets ఉపయోగించి CSV ఫైల్‌లను ఎగుమతి చేయండి
Google Sheetsలో మీ CSV ఫైల్‌ను చూడటం లేదా ఎడిట్ చేయడం పూర్తయిన తర్వాత, మీరు దానిని .csv ఫైల్‌గా మీ కంప్యూటర్‌కి ఎగుమతి చేయవచ్చు. CSVని ఎగుమతి చేయడానికి, మీ CSV స్ప్రెడ్‌షీట్ పేజీ నుండి, File > Download > Comma-separated values (.csv, current sheet)కు వెళ్లండి. మీ CSV ఫైల్ మీ డౌన్లోడ్ల ఫోల్డర్‌కు ఎగుమతి అవుతుంది.
మీ CSV ఫైల్‌ను ఎడిట్ చేయడానికి టెక్స్ట్ ఎడిటర్‌ను ఉపయోగించండి
మీ వద్ద స్ప్రెడ్‌షీట్ ప్రోగ్రామ్ లేకపోతే, మీరు టెక్స్ట్ ఎడిటర్‌ను ఉపయోగించి CSV ఫైల్‌లను ఎడిట్ చేయవచ్చు.
చాలా కంప్యూటర్లలో CSV ఫైల్‌లను తెరవగల టెక్స్ట్ ఎడిటర్లు ఉంటాయి. మీ CSV ఫైల్‌ను ఎడిట్ చేయడానికి, డీబగ్ చేయడానికి మీరు Visual Studio Code లేదా Sublime Text వంటి ప్రోగ్రామ్‌ను కూడా ఉపయోగించవచ్చు.
టెక్స్ట్ ఎడిటర్లో మీరు మీ CSV ఫైల్‌ను ఫార్మాట్ చేసినప్పుడు, కింది విషయాలను గమనించండి:
- నిలువు వరుస హెడర్లు తప్పనిసరిగా కామాలతో వేరు చేయబడాలి (ఉదాహరణకు,
First Name,Last Name,Email,Company,Address1). - ట్యాగ్ల లిస్ట్ తప్పనిసరిగా కొటేషన్ మార్క్‌లలో ఉండాలి (ఉదాహరణకు,
"tag1,tag2,tag3"). - ట్యాగ్‌లకు కేస్ సెన్సిటివిటీ ఉండదు.
- వేర్వేరు రికార్డులు తప్పనిసరిగా లైన్ బ్రేక్‌ల ద్వారా వేరు చేయబడాలి.
అడ్వాన్స్డ్: షిప్పింగ్ అవసరమయ్యే అలాగే పన్ను విధించదగిన వేరియంట్లతో కూడిన CSV ఉత్పత్తి దిగుమతులు
మీరు పెద్ద సంఖ్యలో ఉత్పత్తుల సెట్టింగ్‌లను ఎడిట్ చేయాలనుకుంటే, మీరు బల్క్ అప్డేట్ చేయవచ్చు. దీని కోసం, అప్డేట్ చేయాల్సిన ఉత్పత్తులను .csv ఫైల్‌గా ఎగుమతి చేయండి, ఆపై పట్టికలో కనిపించే నిలువు వరుసలను ఎడిట్ చేయండి:
| షిప్పింగ్ అవసరం | ఒకవేళ వేరియంట్ అనేది భౌతికంగా ఉండే ఐటెమ్ అయితే TRUEకి సెట్ చేయండి. లేదంటే, FALSEకి సెట్ చేయండి లేదా ఖాళీగా వదిలివేయండి. |
|---|---|
| పన్ను వసూలు | వేరియంట్‌పై పన్ను విధించగలిగితే TRUEకి సెట్ చేయండి. లేదంటే, FALSEకి సెట్ చేయండి లేదా ఖాళీగా వదిలివేయండి. |
| బరువు విలువ (గ్రాములు) |
Variant Requires Shipping అనేది TRUEకి సెట్ చేయబడి ఉంటే, సున్నా-కాని విలువను ఎంటర్ చేయండి. Variant Requires Shipping అనేది FALSEకి సెట్ చేయబడినా లేదా ఖాళీగా ఉన్నా, దీనిని ఖాళీగా ఉంచండి లేదా సున్నాకు సెట్ చేయండి. |
మీ .csv ఫైల్‌ను ఎడిట్ చేయడం పూర్తయిన తర్వాత, దానిని మీ స్టోర్‌కు దిగుమతి చేయండి. ఒకే హ్యాండిల్ ఉన్న ప్రస్తుత ఉత్పత్తులు ఏవైనా ఉంటే వాటిని భర్తీ చేయండి (Replace any current products that have the same handle) ఆప్షన్‌ను తప్పకుండా చెక్ చేయండి.